Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

Recommended Posts

అవార్డుల ఘనకీర్తి

 

రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ అవార్డుల పంట
4 ఏళ్లలో 667 సొంతం
పాలనకు, సంస్కరణలకు దక్కిన గౌరవం

13ap-main9a_1.jpg

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. రాజధాని నుంచి రెవెన్యూ లోటు దాకా అన్నీ కష్టాలే.. మొత్తం కొత్తగా మొదలు పెట్టాల్సిందే. కార్యాలయాల ఏర్పాటు నుంచి నివాసాల నిర్మాణాల కోసం వేల కోట్ల పెట్టుబడులను సమకూర్చుకోవాల్సి వచ్చింది. కరెంటు కోతలను తట్టుకుని నిలబడాల్సి వచ్చింది. తుపాన్లనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా పట్టు వదలలేదు. ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్ట్రం ముందుకు సాగింది. క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయిదాకా అందరూ కష్టపడ్డారు. ఫలితాలను చూపించారు. అవార్డులను కొల్లగొట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి 4 ఏళ్లలో ఏకంగా 667 అవార్డులను సాధించారు. ఇదీ నవ యువ ఆంధ్రప్రదేశ్‌ ఘనత.

ఎందుకొచ్చాయంటే...

* ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో చేపట్టిన సంస్కరణలు.
* వివిధ పథకాలను పౌరులకు చేర్చేందుకు ప్రవేశపెట్టిన నూతన విధానాలు.
* పౌర సేవల్ని సులభతరం చేయడం.
* ప్రభుత్వ సేవలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం.
* నాణ్యమైన సేవల కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటించడం.
* పాలనాపరంగా నిర్దేశించుకున్న లక్ష్యాల్ని గడువులోగా పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు.

13ap-main9c.jpg

ముఖ్యమైనవి

* విద్యుత్తు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉందని 2016లో ప్రపంచ బ్యాంకు అవార్డు.
* దశాబ్దకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 100శాతం విద్యుదీకరణ కోసం తీసుకున్న చర్యలకు ఐపీపీఏఐ- 2015.
* పింఛన్ల పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసినందుకు, జాతీయ పింఛను పథకంలో విధానపరమైన చిక్కులు, సమస్యలను పరిష్కరించినందుకు నేషనల్‌ బెస్ట్‌ పెన్షన్‌ సిస్టమ్‌ బేస్డ్‌ స్టేట్‌.
* గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ వైద్య సేవలు అందించడంలో దేశంలోనే అత్యుత్తమ విధానాలు పాటించినందుకు 2017, 2018లో స్కోచ్‌ గోల్డెన్‌.
* పాస్‌పోర్టు దరఖాస్తుదారుల పోలీసు విచారణను 2017-18లో సగటున 8 రోజుల వ్యవధిలో పూర్తి చేసినందుకు కేంద్ర విదేశాంగశాఖ నుంచి రాష్ట్ర నిఘా విభాగానికి ద్వితీయ ఉత్తమ పరిశీలనగా ప్రశంస.
* లక్ష మంది అవయవదానానికి అంగీకరించేలా చేసినందుకు మెప్మాకు ఇండియా బుక్‌ ఆఫ్‌ అవార్డ్సులో చోటు.
* పోలవరం ప్రాజెక్టుకు సీబీఐపీ-2018 అవార్డు.
* టైటిల్‌ డీడ్‌, పట్టాదారు పాస్‌ పుస్తకాలు 15 నిమిషాల్లోనే అందించినందుకు 2017లో స్కోచ్‌.
* 2017లో ఇ-పంట కార్యక్రమానికి పీయం పురస్కారం.
* అమరావతి కోసం 33వేల ఎకరాల భూ సమీకరణ చేసినందుకు నేషనల్‌ ఎక్సలెన్సీ-2017
* కేంద్ర పర్యాటకశాఖ నుంచి 2015-16లో సమగ్ర పర్యాటక అభివృద్ధి ప్రశంస.
* భూగర్భ జలమట్టాల గుర్తింపు, వాతావరణ మార్పుల్ని పసిగట్టి ప్రకృతి విపత్తుల గురించి ముందే హెచ్చరించడంలో ఆర్టీజీఎస్‌కు హిటాచీ పీపుల్స్‌ అవార్డు.

ap-main_1.jpg

 

Share this post


Link to post
Share on other sites
గ్రామీణ ‘ఉపాధి’లో ఏపీ టాప్‌
15-01-2019 03:23:40
 
636831194206435366.jpg
  • ఇప్పటికే రూ.7411 కోట్లు వినియోగం
  • మరో 2500 కోట్లు రాబట్టే దిశగా అడుగులు
అమరావతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలకు సైతం సాధ్యంకాని విధంగా అనేక విజయాలను ఏపీ తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఉపాధి హామీలోని ‘అనుసంధానం’ ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచింది. విభజనతో కష్టాల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉపాధి హామీ పథకం తప్ప మరో మార్గం లేదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ గుర్తించారు.
 
ఈ క్రమంలో రూ.10వేల కోట్ల పనులను లక్ష్యంగా నిర్దేశించారు. అధునాతన టెక్నాలజీ వినియోగంతో లక్ష్య సాధన మరింత సులభం అవుతుందని భావించిన లోకేశ్‌... ఆ మార్గాలను అధికారులకు సూచించారు. దీంతో, ఇతర రాష్ట్రాల రికార్డులన్నీ బ్రేక్‌ చేస్తూ ఇప్పటి వరకూ రూ.7,411 కోట్లను ఏపీ వినియోగించుకుంది. ఇందులో రూ.4023 కోట్లు వేతనాలు కాగా... మిగిలినవి మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద ఖర్చు చేశారు. అయితే, వేతనాల చెల్లింపులో ఏపీ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోంది. ప్రస్తుతం వేతనాల రూపంలో ఏపీకి రూ.450 కోట్లు రావాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది.
 
 
అంతేకాదు... పెండింగ్‌లో ఉన్న నిధులను ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లించి, ఆ తర్వాత కేంద్రం నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా లోకేశ్‌ బాధ్యతలు స్వీకరించాక లక్ష్యాలు సాధించడమే కాకుండా సరికొత్త రికార్డులు నెలకొల్పారు. ఇప్పటి వరకూ రూ.26వేల కోట్ల వ్యయం చేసి 97.22 కోట్ల పనిదినాలు కల్పించగలిగారు. రాష్ట్రంలోని 26.88 లక్షల కుటుంబాలకు వందరోజుల పని కల్పించి ఈ పథకం ఊతంగా గ్రామీణాభివృద్ధి సాధించగలిగారు. మంత్రి లోకేశ్‌ దిశానిర్దేశం, ఉన్నతాధికారుల ప్రణాళికలతో గ్రామీణాభివృద్ధి శాఖ 2018 సంవత్సంలో వివిధ విభాగాల్లో 12 అవార్డులను దక్కించుకుంది.
 
2018-19లో వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్యలోనూ, పంట సంజీవని కుంటల తవ్వకంలోనూ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలోనూ, అనుసంధానం, మెటీరియల్‌ వ్యయంలోనూ ఏపీ ప్రథమస్థానంలో నిలిచింది. కంపోస్ట్‌ గుంతలు, రోడ్డుకిరువైపులా మొక్కల పెంపకం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం వంటివి చేపట్టింది. ఈ మొత్తం వ్యయంలో ఏపీ రెండోస్థానంలో నిలిచింది. అంతేకాదు.. 2017-18 సంవత్సరానికి 7 అంశాల్లో మొదటి స్థానంలో, నాలుగు అంశాల్లో ద్వితీయస్థానంలో ఏపీ నిలిచింది.

Share this post


Link to post
Share on other sites

Bihar top state in terms of GDP growth in FY18: Crisil report

Bihar has topped the list by clocking 11.3 percent GSDP growth in fiscal 2018

Bihar has been ranked the top state in terms of GSDP (Gross State Domestic Product) growth in financial year 2017-18, according to a reportby Crisil.

The state has topped the list by clocking 11.3 percent GSDP growth in fiscal 2018. It was ranked at eighth spot in fiscal 2017 with 9.9 percent GSDP growth.

The second spot has been secured by Andhra Pradesh, whose GSDP growth in FY18 jumped to 11.2 percent. Gujarat listed third with growth of 11.1 percent.

 

“In fiscal 2018, Bihar, Andhra Pradesh, and Gujarat were top rankers in terms of GSDP growth among the 17 non-special states considered in our analysis,” the report said. It added, “Jharkhand, Kerala and Punjab were at the bottom.”

Madhya Pradesh, which was the top state in GSDP growth in FY17 (14 percent), dropped in fiscal 2018 to 7.3 percent. “Madhya Pradesh, which was among the top three earlier, slid in fiscal 2018, due to slowdown in GSDP growth and slippage on fiscal deficit,” the Crisil report said.

The report further highlighted that 12 out of 17 states saw faster growth in fiscal 2018 compared with the previous 5 years. However, the growth did not translate into job creation, as GSDP expansion has come in from sectors which are less job-intensive.

The report, which came in the immediate backdrop of a report by the independent think-tank Centre for Monitoring Indian Economy which said as many as 1.1 crore jobs were lost in 2018 alone, stated, "Growth has not quite been conducive to job creation in a majority of the states.”

It noted that growth was not equitable, as the chasm on per capital income between low-income states and high income states widened over the last five years.

Most states were found to have veered off the targets under the fiscal responsibility and budget management act, the report said, adding because of the pressure on fiscal deficit for the Centre, the states have become the engines of government spending, accounting for a bulk 65 percent of the total money spent.

Share this post


Link to post
Share on other sites

ఆడవారి ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశలో ఎక్కువ మరుగుదొడ్లు నిర్మించి మన జిల్లా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది.

https://pbs.twimg.com/media/Dx1xfGXU0AAYyb3.jpg

https://pbs.twimg.com/media/Dx1x14aVAAAxEbm.jpg

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×