Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

Recommended Posts

పచ్చదనానికి జేజేలు!
26-06-2018 01:54:30
 
  • ఏపీ గ్రీన్‌ అవార్డ్స్‌ ప్రకటించిన ఏపీజీ అండ్‌ బీసీ
అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న స్థానిక, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులను గుర్తించి, వారిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ‘ఏపీ గ్రీన్‌ అవార్డ్స్‌-2017’ ప్రకటించింది. ఇకనుంచి ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తామని ఆ సంస్థ ఎండీ ఎన్‌.చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
 
స్థానిక సంస్థలు: మున్సిపల్‌ కార్పొరేషన్లలో గ్రేటర్‌ విశాఖపట్నం, విజయవాడ నగర పాలక సంస్థ ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందాయి. మున్సిపాలిటీల్లో తాడిపత్రి, పుంగనూరు, బొబ్బిలి తొలి 3 అవార్డులు సాధించాయి. గ్రామ పంచాయతీల్లో (జనరల్‌ గ్రీనింగ్‌) నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం, విశాఖ జిల్లా కొథాలి, ప్రకాశం జిల్లా భొట్లగూడూరుకు వరుసగా 1, 2, 3 స్థానాలు దక్కగా, స్పెషల్‌ జ్యూరీ అవార్డును చిత్తూరు జిల్లాలో అరగొండ, గ్రామ పంచాయతీల్లో(డ్వామా గ్రీనింగ్‌) ప్రకాశం జిల్లాలోని గురవాజిపేట, కృష్ణాజిల్లాలోని వడ్లమాను, ప్రకాశం జిల్లాలోని కంభాలపాడు ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలు సాధించాయి.
 
పబ్లిక్‌ పార్కులు: విశాఖపట్నంలోని ఉడా సెంట్రల్‌ పార్క్‌, కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శంకరవనం, కర్నూలు జిల్లా ఆత్మకూరులోని డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ స్మృతివనం ప్రథమ స్థానాల్లో నిలిచాయి.
 
పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థలు: ప్రభుత్వ పరిశ్రమల్లో విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌, ప్రైవేట్‌ పరిశ్రమల్లో తిరుపతి వద్ద కరకంబాడిలోని అమర్‌రాజా బ్యాటరీస్‌, ప్రభుత్వ కార్పొరేట్‌ సంస్థల్లో తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థల్లో విజయనగరం జిల్లా భోగాపురంలోని సన్‌రే గ్రీన్‌స్పే్‌స, ప్రభుత్వ సంస్థల్లో విజయవాడలోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలకు ప్రథమ స్థానాలు దక్కాయి.
 
ఇతర విభాగాల్లో...: ప్రభుత్వ పాఠశాలల్లో సింహాచలంలోని ఎంజేపీఏపీబీసీడబ్ల్యూపీ స్కూల్‌, ప్రైవేట్‌ స్కూళ్లలో విజయవాడలోని డాక్టర్‌ కేకేఆర్‌ హ్యాపీవ్యాలీ స్కూల్‌, ప్రభుత్వ కళాశాలల్లో పశ్చిమ గోదావరి జిల్లా వీఆర్‌గూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ కాలేజ్‌, ప్రైవేట్‌ కాలేజీల్లో నెల్లూరు జిల్లా చింతమరెడ్డిపాలెంలో నారాయణ వైద్యకళాశాల, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో శ్రీ యోగి వేమన యూనివర్సిటీ, ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజయనగరం ప్రభుత్వాస్పత్రి, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో విశాఖపట్నంలోని ఎల్వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రథమ అవార్డులు లభించాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో గుంటూరులోని రైల్‌వికాస్‌ భవన్‌, ప్రైవేట్‌ ఆఫీసుల్లో గుంటూరులోని ఐటీసీ అగ్రిబిజినెస్‌ డివిజన్‌లకు అగ్రస్థానం దక్కింది. ఇండివిడ్యువల్‌ హోం గార్డెన్స్‌(పబ్లిక్‌) విభాగంలో విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌లోని చైర్మన్‌ క్వార్టర్‌, ఇండివిడ్యువల్‌ హోం గార్డెన్స్‌ (ప్రైవేట్‌)లో పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లిలోని నంద్యాల సత్యనారాయణ, అపార్ట్‌మెంట్లు-గేటెడ్‌ కమ్యూనిటీల్లో గుంటూరు జిల్లా నంబూరులోని రెయిన్‌ ట్రీ పార్క్‌, టెర్రస్‌ గార్డెన్స్‌లో విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని చారుమతికి ప్రథమ బహుమతులు లభించాయి. వ్యక్తుల్లో కృష్ణా జిల్లా నందిగామకు చెందిన శాఖమూరు వంశీధర్‌, ఎన్జీవోల్లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ఉమర్‌ అలీషా రూరల్‌ డెవల్‌పమెంట్‌ ట్రస్ట్‌కు ప్రథమ అవార్డులు లభించాయి. ఏపీ అటవీశాఖ పర్యవేక్షణలో అనంతపురంలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను హెరిటేజ్‌ ట్రీల విభాగంలోను, ఇదే శాఖ పరిధిలో కడప జిల్లా రైల్వే కోడూరులో ఉన్న ఎర్రచందనం ప్లాంటేషన్‌, 1863లకు ట్రీ గ్రోవ్స్‌ విభాగంలోను ప్రథమ స్థానాలు దక్కాయి.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×