Jump to content

Recommended Posts

  • Replies 351
  • Created
  • Last Reply
  • 2 weeks later...
రెరా అమలులో రాష్ట్రం ముందంజ
13-10-2018 08:25:18
 
  • దక్షిణాది రాష్ట్రాల వర్క్‌ షాప్‌లో కేంద్ర మంత్రి హరదీప్‌ పూరి ప్రశంస
అమరావతి(ఆంధ్రజ్యోతి) : స్థిరాస్తి (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టం (రెరా)-2016ను అమలులో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హరదీప్‌ ఎస్‌.పూరి ప్రశం సించారు. ఈ చట్టం పార్లమెంట్‌ ఆమోదం పొంది, రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థల ప్రతినిధులు, ఇతర భాగస్వాములతో చెన్నైలో శుక్రవారం జరిగిన ఒక రోజు వర్క్‌ షాప్‌లో ఆయన పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో స్థిరాస్తి చట్టం అమలును సమీక్షించి, భవిష్యత్తు మార్గదర్శనం చేయడం దీని లక్ష్యం.
 
ఈ వర్క్‌షాప్‌లో పూరి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో స్థిరాస్తి చట్టం అమ లుకు పూర్తిస్థాయి నియంత్రణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్నారు. దేశ ఆర్థికాభ్యున్నతికి కీలకమైన రియాల్టీ రంగంలో పారద ర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొం దించేందుకు రూపొందించిన రెరా చట్టం వల్ల వినియోగదారుల హక్కుల పరిరక్షణ సాధ్యమవడమే కాకుండా మొత్తంగా స్థిరాస్తి రంగం వృద్ధి చెందు తుందని చెప్పారు. రాష్ట్రాల స్థాయిలో ఎక్కడన్నా రెరా చట్టం స్ఫూర్తిని నీరు గార్చేందుకు గనుక ప్రయత్నాలు జరుగు తున్నట్లయితే కేంద్రం గట్టిగా అడు ్డకుంటుందన్నారు.
 
కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అందరికీ ఇళ్లు’ను బాగా అమలు పరుస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రగామిగా ఉందని ‘హడ్కో’ సీఎండీ ఎం.రవికాంత్‌ చెప్పారు. ఈ వర్క్‌ షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చూపుతున్న చొరవ మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమన్నారు.
 
ఈ కార్యశాలలో భాగంగా ‘రెరా చట్టం- బహుముఖ ప్రయోజనాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఏపీ రెరా ఛైర్మన్‌ రామనాథ్‌ వెలమాటి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో స్థిరాస్తి చట్టం పకడ్బందీ అమలుకు తీము తీసుకుంటున్న చర్యలను వివరించారు. స్థిరాస్తి రంగపు దీర్ఘకాలిక, సుస్థిరాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం రూపొం దించిన ప్రణాళికల గురించి తెలిపారు. కేవలం నియంత్రణతో సరిపెట్టకుండా భవన నిర్మాణాల్లో నాణ్యత పెంచేందుకు సింగపూర్‌కు చెందిన బీసీఏ, నీతి ఆయోగ్‌కు చెందిన సీఐడీసీ సంస్థలతో శిక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. నిర్మాణదారులకు టోకు ధరలకే నాణ్యమైన వస్తుసామగ్రిని అందిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఏపీ కన్‌స్ట్రక్షన్‌ సిటీ గురించి వివరించారు. ఈ వర్క్‌ షాప్‌లో ఏపీ రెరా సభ్యులు ముళ్లపూడి రేణుక, చందు సాంబశివరావు, విశ్వనాథ్‌ శిష్టా కూడా పాల్గొని, స్థిరాస్తి చట్టం అమలుపై వివిధ రాష్ట్రాల అధికారులు, ప్రతినిధులతో చర్చించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
టీబీ చికిత్సలో ఏపీ బెస్ట్‌
03-11-2018 03:36:48
 
636768130096649062.jpg
  • ఆరోగ్యశాఖకు జాతీయ స్థాయి అవార్డులు
అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న వివిధ ప్రజారోగ్య పరిరక్షణ పథకాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. టీబీతో పాటు ఎయిడ్స్‌ రోగులకు అందిస్తున్న సేవలను కొనియాడుతూ కేంద్ర ఆరోగ్యశాఖ, నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌.. ఏపీ ఆరోగ్యశాఖకు వివిధ అవార్డులు ప్రకటించింది. కేంద్ర ఆరోగ్యశాఖ అసోంలో గురువారం నిర్వహించిన జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా ప్రజారోగ్యం సంరక్షణలో ఉత్తమ, సృజతనాత్మక పద్ధతులను అనుసరిస్తున్న రాష్ట్రాలను ఎంపిక చేసింది. టీబీ నివారణలో ఏపీ ప్రభుత్వం ఉత్తమ పద్ధతులను అనుసరిస్తుండటంతో జాతీయ స్థాయిలో ఉత్తమ రాష్ట్రంగా అవార్డుకి ఎంపిక చేసింది. ఈ అవార్డును కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చేతుల మీదగా రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం అందుకొన్నారు.
 
అలాగే తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధి సక్రమించకుండా ఉత్తమ పద్ధతులను అమలు చేస్తున్న ఏపీకి కేంద్రం ప్రోత్సాహక బహుమతి ప్రకటించింది. ఉత్తమ పద్ధతుల్లో హెచ్‌ఐవీ రోగులకు చికిత్స అందిస్తున్న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది. ఇంటిగ్రేటేడ్‌ కౌన్సిలింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ సెంటర్లలో క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ను అమలు చేసినందుకు కూడా నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఏపీ ప్రభుత్వానికి ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను అందించింది.
Link to comment
Share on other sites

Accounting to about 15% of total fruit production in India, AP has emerged out to be a leading State yet again followed by Uttar Pradesh and Maharashtra. With about 14 Million MT of produce for the year 2017-18, Andhra Pradesh has reaped remarkable results in Horticulture by embracing the emerging farming techniques in micro-irrigation.

https://pbs.twimg.com/media/DraCtDFVsAIsnu6.jpg

Link to comment
Share on other sites

Prices are falling in Andhra, rising fastest in Assam

 

October retail inflation eased to 3.3%, much below the market’s consensus forecast at 3.7%, due to low food inflation and a likely minuscule take-off through higher ‘Minimum Support Price’ set by the government. Numbers across states show a wide disparity, with Andhra Pradesh having an inflation rate of -1.07% and Assam 6.03%.

Link to comment
Share on other sites

Prices are falling in Andhra, rising fastest in Assam

Prices are falling in Andhra, rising fastest in Assam
October retail inflation eased to 3.3%, much below the market’s consensus forecast at 3.7%, due to low food inflation and a likely minuscule take-offthrough higher ‘Minimum Support Price’ set by the government. Numbers across states show a wide disparity, with Andhra Pradesh having an inflation rate of -1.07% and Assam 6.03%. Here's a look:
1-01
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...