Jump to content

Better to merge TTDP into TRS - Motkupalli Narasimhulu....


KING007

Recommended Posts

టీఆర్‌ఎస్‌ వైపు మోత్కుపల్లి చూపు?
19-01-2018 02:30:21
 
636519273730863034.jpg
  • కీలక మంత్రితో కలిసి గుట్టుగా ప్రయత్నాలు
  • కేసీఆర్‌ నుంచి సానుకూల సంకేతాలు!
యాదాద్రి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎ్‌సలో చేరబోతున్నారా? ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నుంచి ఆయనకు గ్రీన్‌సిగ్నల్‌ లభించిందా? అంటే.. అవుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ టీడీపీని టీఆర్‌ఎ్‌సలో విలీనం చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకాలం నుంచి.. నిన్న మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌పై, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన మోత్కుపల్లి.. ఒకేసారి తన పంథాను మార్చుకుని అధికార పార్టీకి సానుకూలంగా వ్యాఖ్యలు చేయడం వెనుక తన రాజకీయ భవిష్యత్తుకు గట్టి హామీ లభించడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోత్కుపల్లి చేరికతో అధికార టీఆర్‌ఎ్‌సకు రాష్ట్రంలో బలమైన మాదిగ సామాజికవర్గంలో పట్టు లభిస్తుందని, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నేపథ్యంలో మందకృష్ణమాదిగ ఆందోళనలకు చెక్‌ పెట్టే ఎత్తుగడలో భాగమే ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తనను గవర్నర్‌గా పంపిస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరకపోవడం, కనీసం రాజ్యసభ సభ్యత్వమైనా కల్పించాలన్న ఆయన అభ్యర్థనకు సానుకూల స్పందన రాకపోవడంతో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో విద్యార్థిగా రాజకీయ అరంగేట్రం చేసి.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన మోత్కుపల్లి మూడున్నర దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో తన ఉనికిని చాటుతున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కొంత కాలంగా రాజకీయ భవిష్యత్తు కోసం ఎటువైపు పయనించాలనే ఆలోచనలో పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తన అనుచరవర్గంతో, టీడీపీ ముఖ్య నాయకులతో ఈ మేరకు పలు దఫాలు సమాలోచనలు సాగించారు. తెలుగుదేశం పార్టీలో తన వ్యతిరేక వర్గీయుడైన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరడంతో.. మోత్కుపల్లిపై అధికార టీఆర్‌ఎ్‌సలోనే చేరాలని అనుచరవర్గం నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడంతోపాటు తాను టీఆర్‌ఎ్‌సలో చేరడానికి గుట్టుగా ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసి.. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో కీలక మంత్రిగా కొనసాగుతున్న ఒక మంత్రితోపాటు.. కేసీఆర్‌ వ్యక్తిగత సహాయకుడితో మోత్కుపల్లి మంతనాలు సాగించినట్లు, సీఎం కేసీఆర్‌ సంసిద్ధత కోసం గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అరెస్టుతో మాదిగ సామాజికవర్గంలో అధికార టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దానికి చెక్‌ పెట్టడానికి అదే సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడు అవసరమని సీఎం కేసీఆర్‌ భావించి.. మోత్కుపల్లి చేరికకు సానుకూలత వ్యక్తం చేసినట్లు.. రాజ్యసభలో అవకాశంపై హామీ వచ్చినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

athaniki elagu inko id undi ga lovemystate ani. andulo nundi post vesi unte bavundedi. :D

Varni nenu chala days nunchi vedamu anukuna rendu id lu okate ani.. Thanks for confirming 

Link to comment
Share on other sites

:blink:Ikkada unnodu evadu telangana lo unnodu kadu 80% hyd thappa.. akkada perigina vallu comment chesthe thanni tharimestharu verbal abuse chesi paiga inka edo Alternate id anta lol ..  identity unnodni kanuka na name tho id create cheskonna unlike u guys . vyakthi aradhana blah blah naku set kadu oka limit minchi.  maku party e ultimate supreme politics lo.  

content unte debate ki randi leda side avvandi anthe.. na meda time waste vaddu. 

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

:blink:Ikkada unnodu evadu telangana lo unnodu kadu 80% hyd thappa.. akkada perigina vallu comment chesthe thanni tharimestharu verbal abuse chesi paiga inka edo Alternate id anta lol ..  identity unnodni kanuka na name tho id create cheskonna unlike u guys . vyakthi aradhana blah blah naku set kadu oka limit minchi.  maku party e ultimate supreme politics lo.  

content unte debate ki randi leda side avvandi anthe.. na meda time waste vaddu. 

మాములుగా చిన్న పిల్లలు అల్లరి చూస్తే ముద్దు అన్పిస్తుంది కాని అదేంటో నీ అల్లరి చూస్తే చిరాకు తెప్పిస్తోంది...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...