Jump to content

Nene kanuka road midha ki vaste


katti

Recommended Posts

పవన్ కల్యాన్ అభిమానులకు, కత్తి మహేష్‌కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలంటే కత్తి మహేషే ఒక మెట్టు దిగివచ్చి, పవన్ కల్యాణ్ ఫొటోకి సారీ చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేయడంతో మరోసారి కత్తి మహేష్ తనదైన తరహాలో స్పందించాడు.
 
‘‘నేను అల్రెడీ ఒక మెట్టు దిగాను. వాస్తవానికి నేను పవన్ కల్యాన్ వచ్చి సారీ చెప్పాలి అనే దాని నుండి, ఆయన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేయమనే స్థాయికి దిగాను. నేను పవన్ కల్యాణ్‌ని పర్సనల్‌గా ఎప్పుడూ అబ్యూజ్ చేయలేదు. పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం మొదటి రోజు నుంచి నామీద వ్యక్తిగత దాడే చేశారు. పచ్చి బూతులు తిడుతున్నారు. నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా అభిప్రాయాన్ని బయటికి చెప్పడానికి కానీ, నా ప్రతి కదలిక మీద, మా ఇంటి వారి వరకు వెళ్లి కామెంట్స్ చేస్తున్నారు వీళ్లు. దీనిని దాడి కాదంటారా? ఇప్పుడు నన్ను మెట్టు దిగమంటారా? ఎందుకు దిగాలి నేను మెట్టు? ఇలాంటి అభిమానులు, కార్యకర్తలు ఉంటే.. ఆ పార్టీ నాశనం అవడానికి, ఆ హీరో నాశనం అవడానికి కార్యకర్తలే కారకులవుతున్నారు. అంతకుమించి ఇంకేమీ లేదు.
 
నేను క్లియర్‌గా చెప్పాను. ఒక ట్వీట్ చేస్తే చాలు, ఇంత వరకు వచ్చేది కాదు అని. కానీ వీళ్లు.. నీ ఫ్యామిలీ ఇలాంటిది, నీవు ఇలాంటి వాడివి.. అంటున్నారు. ఇదేనా సంయమనం పాటించే విధానం. నా మీద ఇన్ని రోజులుగా జరుగుతున్న దాడికి సెలైంట్‌గానే ఉన్నాను కదా? మర్యాద కాపాడాను కదా? మరి వీరేం చేస్తున్నారు? వాళ్ల హీరో మర్యాదని మంటగలుపుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్లు ఏమంటున్నారు.. నేను పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుని సారీ చెప్పాలంట. అతనికి కూడా కాదు. అతని ఫొటోకి క్షమాపణలు చెబితే పోనిస్తారట. ఏంటి బెదిరిస్తున్నారా? ప్రజాస్వామ్యంలో హక్కుల్ని కాలరాస్తున్నారా? ఒకవేళ నేనే కనుక రోడ్డు మీదకి దిగితే.. నా వైపు ప్రజాస్వామిక సంఘాలు ఉంటాయి, దళిత సంఘాలు ఉంటాయి, బీసీ సంఘాలు, మైనారిటీ సంఘాలు ఉంటాయి. పవన్ కల్యాణ్ అప్పుడు రావాల్సి వస్తుంది నా కాళ్ల దగ్గరికి. జాగ్రత్తగా ఉండండి.. అనవసరంగా మీరు విషయాన్ని పెద్దది చేసుకుంటూ వెళ్లకండి. మీకే నష్టం జరుగుతుంది.. అంటూ కత్తి మహేష్ అల్టిమేటం జారీ చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...