Jump to content

AP & Orissa - BJP endukila.


Kiriti

Recommended Posts

సాలూరు రూరల్‌, విజయనగరం, జనవరి 12: ఒడిశా-ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కొఠియా గ్రామాల వివాదాల తేనె తుట్టె మళ్లీ కదిలింది. ఈనెల 9న కొఠియా గ్రూప్‌ గ్రామాల పరిధిలోని గంజాయిభద్రలో ఏపీ ప్రభుత్వం జన్మభూమి నిర్వహణపై ఒడిశా ప్రభుత్వం మండి పడుతోంది. ఈ గ్రామాల విషయమై కోర్టుకు వెళ్లనున్నట్టు ఒడిశా రెవిన్యూశాఖ మంత్రి మహేశ్వర మహంతి ప్రకటించారు. అయితే... ఆయన ప్రకటన ఏపీ అధికారులను కొంత అయోమయంలోకి నెట్టింది. కోర్టులో ఒడిశా ఓటమి చెందనదే ఆయన చెప్పినట్టు పత్రికల్లో రావడంతో ఏపీ అధికారులు మరోసారి కేసు విషయమై పరిశీలన చేయాల్సి వచ్చింది. కొఠియా గ్రూప్‌ గ్రామాలపై సుప్రీం కోర్టులో 1967 నుంచి కేసు నడుస్తోంది. సుప్రీం కోర్టు స్టేటస్‌కో సైతం జారీ చేసింది. 2014లో ఇరు రాష్ట్రాలు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే కోర్టు ఈ సూచన చేసిన తర్వాత ఇరురాష్ట్రాలు చర్చించిన దాఖలాల్లేవు.
 
కాగా.. ఈ సూచన రాకముందు నుంచి ఇరు రాష్ట్రాలు కొఠియా గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఒడిశా మరింత ముం దుకు అడుగేసి నేరేళ్లవలస, దొరలతాడివలస వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. ఏపీ నుంచి విజయనగరం జిల్లా కలెక్టర్‌ తొలిసారిగా కొఠియాలో పర్యటించి జన్మభూమి కార్యక్రమం నిర్వ హించడంతో ఒడిశాలో అధికార బీజేడీపై బీజేపీ ధ్వజ మెత్తింది. అలాగే ఒడిశా మీడియా సైతం జన్మభూమి జరగడంపై అక్కడి అధికారులపై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో రెవిన్యూశాఖ మంత్రి మహేశ్వర మహంతి ఏపీ నిర్వహించిన కార్యక్రమంపై కోరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ అనుపమ సాహుతో సమీక్షించారు. అనంతరం కోర్టుకు వెళ్లతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికారులు సైతం ఈ ప్రకటనపై దృష్టి సారించారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend
48 minutes ago, MVS said:

Aalavi siggu saram leni bratukulu... Ekkada edi dorukutunda mantalu esi padi  peeku tindamana ani chuse rakalu 

 

Link to comment
Share on other sites

2014లో ఇరు రాష్ట్రాలు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. :sleep: 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...