Jump to content

EENADU Review


Ramesh39

Recommended Posts

ఎలా ఉందంటే: ఇది బాలకృష్ణ నటించిన మరో మాస్‌, కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. సాధారణంగా బాలకృష్ణ సినిమా హెవీ యాక్షన్‌ డోస్‌తో ప్రారంభం అవుతుంది. ఒక పాటతోనో.. ఫైట్‌తోనే ఆయన పరిచయ సన్నివేశం ఉంటుంది. అయితే ఇందులో మాత్రం కాస్త భిన్నంగా సాగింది. ఓ చంటి బాబుతో కథానాయకుడిని పరిచయం చేశారు. దీంతో సినిమా ఎలా సాగుతుందో ప్రేక్షకుడు ఓ అంచనాకి వచ్చేస్తాడు. అయితే దర్శకుడు తెలివిగా బాలయ్య అభిమానులకు ఏం కావాలో అవి ఇస్తూ, అక్కడక్కడా సెంటిమెంట్‌ను జొప్పిస్తూ, మధ్యలో కథ చెబుతూ నడిపించాడు. తొలి అర్ధభాగం కుంభకోణం నేపథ్యంలో సాగుతుంది. అభిమానులను ఆకట్టుకునేలా ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దారు. పురోహితుల గొప్పతనం గురించి చెప్పే సన్నివేశంలో బాలకృష్ణ మార్కు డైలాగ్‌లు నటన, ఆకట్టుకుంటాయి. డైలాగ్‌లు పలకడంలో బాలకృష్ణకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఈ సన్నివేశం మరోసారి నిరూపిస్తుంది. విశ్రాంతికి ముందు వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను మాస్‌కు నచ్చేలా రామ్‌లక్ష్మణ్‌ తెరకెక్కించారు. అయితే బ్రహ్మానందం ఎపిసోడ్‌లు కాస్త సుదీర్ఘంగా సాగినట్లు అనిపిస్తాయి. నయనతార ఎంట్రీతో కథ మరో మలుపు తిరుగుతుంది.

ద్వితీయార్ధం ఫ్లాష్‌బ్యాక్‌పైనే ఆధారపడ్డాడు దర్శకుడు. నయనతారతో బాలకృష్ణ ప్రేమ సన్నివేశాలు, ప్రకాష్‌రాజ్‌తో సెంటిమెంట్‌ సన్నివేశాలు బాగున్నాయి. అయితే ఆయా సన్నివేశాలకు ఇంకాస్త కత్తెర వేస్తే బాగుండేది. పతాక సన్నివేశాలను విభిన్నంగా తీర్చిదిద్దారు. సెంటిమెంట్‌ను పండించటంలో దర్శకుడు సఫలమయ్యాడు. బాలకృష్ణ ఒక స్వచ్ఛమైన ప్రేమికుడిగా చూపించడంలో విజయవంతమయ్యాడు. అలా ఇది బాలకృష్ణకు ఒక కొత్తరకం సినిమా అనే చెప్పాలి. ఒక ప్రేమికుడి త్యాగంగా ‘జైసింహా’ను అభివర్ణించవచ్చు.

 

బలాలు 
+ బాలకృష్ణ 
+ నయనతార 
+ సెంటిమెంట్‌ సన్నివేశాలు 
+ యాక్షన్‌ ఎపిసోడ్‌లు

చివరిగా: ‘జైసింహా’ సెంటిమెంట్‌ సింహం 
 

Link to comment
Share on other sites

ఎవరెలా చేశారంటే: బాలకృష్ణ పాత్ర రెండు కోణాల్లో ఉంటుంది. ‘నరసింహనాయుడు’, ‘సమర సింహారెడ్డి’ చిత్రాల్లో కథానాయకుడి పాత్ర శాంతంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో విశ్వరూపం చూపిస్తాడు. అదే ఫార్ములాను దర్శకుడు అనుసరించాడు. ఆ రెండు కోణాల్లో బాలకృష్ణ నటన ఆకట్టుకుంటుంది. ‘అమ్మకుట్టి’ పాటలో బాలయ్య స్టెప్పులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఫ్యాన్స్‌ను అలరించడానికి తనవంతు కృషి చేశారు బాలకృష్ణ. కథానాయికలు ముగ్గురు ఉన్నా, ప్రాధాన్యం అంతా నయనతారదే. ఎప్పటిలాగే పద్ధతిగా కనిపించింది. నటాషా దోషి గ్లామర్‌ ఒలికిస్తే.. హరిప్రియ మంగ పాత్రలో కాస్త అల్లరి చేసింది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందానికి పూర్తి నిడివి ఉన్న పాత్ర దక్కింది. అయితే దర్శకుడు ఆయన నుంచి సరైన వినోదాన్ని రాబట్టలేకపోయారు. విలన్‌ గ్యాంగ్‌ కాస్త పెద్దదిగా ఉంది. వాళ్లు తమ పాత్రలను సమర్థంగా పోషించారు. చిరంతన్‌ భట్‌ పాటల్లో ‘అమ్మకుట్టి’ మాస్‌ను అలరిస్తుంది. మిగిలినవి మెలోడీ ప్రధానంగా సాగుతాయి. నేపథ్య సంగీతంపై మరింత దృష్టి పెడితే బాగుండేది. దర్శకుడు పాత కథనే మళ్లీ ఎంచుకున్నాడు. చిన్న బాబు పాత్ర లేకపోతే సినిమా రొటీన్‌గా ఉండేది. రత్నం డైలాగ్‌లు అలరిస్తాయి. బాలకృష్ణ మాడ్యులేషన్‌కు తగ్గటుగా డైలాగ్‌లు రాశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. దుబాయ్‌ సన్నివేశాలను అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Link to comment
Share on other sites

ANDHRAJYOTHY
 
బాల‌కృష్ణ సంక్రాంతి రేసులో ఉన్నాడ‌నే వార్త రాగానే అభిమానుల్లో ఎక్క‌డ‌లేని సంద‌డి మొద‌ల‌వుతుంది. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న సంక్రాంతి సీజ‌న్‌ని మిస్ చేసుకోకుండా వ‌స్తున్నారు. స్టార్ హీరోల‌ను చ‌క్క‌గా డీల్ చేస్తార‌నే పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో ఈ సారి ఆయ‌న న‌టించిన చిత్రం `జై సింహా`కి విడుద‌ల‌కు ముందే క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్‌కు త‌గ్గ‌ట్టే బాల‌య్య ప‌డ్డ క‌ష్టం స్క్రీన్ మీద క‌నిపిస్తోంది. అమ్ముకుట్టి పాట‌లో ఆయ‌న వేసిన స్టెప్పులు, ఎమోష‌న‌ల్ సీన్స్, ఫైట్స్, అక్క‌డ‌క్క‌డా చెప్పే పంచ్ డైలాగులు, ఫ్యామిలీ సీన్స్..ఆక‌ట్టుకున్నాయి. త‌నదైన మార్కును ప‌క్క‌న‌పెట్టి, త‌న సొంత ఊరికి దూరంగా ఉంటూ బాల‌కృష్ణ సినిమా చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు. కానీ క‌థ క‌న్విన్సింగ్‌గా ఉంది. ముగ్గురు హీరోయిన్ల‌ను కేవ‌లం గ్లామ‌ర్ కోసం వాడుకోలేదు ద‌ర్శ‌కుడు. ప్ర‌తి ఒక్క‌రి పాత్ర‌నూ క‌థ‌లో చాలా చ‌క్క‌గా చొప్పించారు ఎం.ర‌త్నం. ఆయ‌న క‌థ‌, మాట‌లు మెప్పించాయి.
 
            అయితే `చంద్ర‌ముఖి`లో వ‌డివేలుకు ఉన్న అనుమానాన్ని ఇక్క‌డ బ్ర‌హ్మానందానికి పెట్టారు. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` చిత్రంలో అంజ‌లికి ఉన్న కంగారును ఇందులో హ‌రిప్రియ పాత్ర‌కు పెట్టారు. ప్రేమించింది ఒక‌రిని, పెళ్లి చేసుకుంది మ‌రొక‌రిని అన్న‌ప్పుడు `క్ష‌త్రియ‌పుత్రుడు`తో స‌హా ప‌లు సినిమాలు గుర్తొస్తాయి. అయితే అవ‌న్నీ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఎలా ఉంద‌ని ఆలోచించ‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాతే. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కుడు లీన‌మ‌వుతాడ‌న్న‌ది నిజం. రోడ్డు రోకోల‌ను గురించి చెప్పే స‌న్నివేశం, పూజారుల అర్హ‌త‌ల‌ను, వారి ప‌విత్ర‌త‌ను వివ‌రించే సీనూ మెప్పిస్తాయి. `సింహా` సినిమా బాల‌కృష్ణ‌కు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. తాజాగా అదే పేరుతో ఆయ‌న జై సింహా అని ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడికి న‌ర‌సింహ అనే పేరు క‌లిసొచ్చింది.
 
         ర‌జ‌నీకాంత్‌తో ఆయ‌న తెర‌కెక్కించిన `ప‌డ‌య‌ప్పా`ను ఇక్క‌డ `న‌ర‌సింహ` పేరుతో విడుద‌ల చేశారు. `జై సింహా`లో బాల‌కృష్ణ‌ పేరు న‌ర‌సింహ‌. బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార క‌లిసి న‌టించిన `శ్రీరామ‌రాజ్యం`, `సింహా` రెండూ విజ‌య‌వంత‌మైన‌వే. తాజాగా `జై సింహా` కూడా వీరి కాంబినేష‌న్‌లో మ‌రో విజ‌యాన్ని చేకూర్చింది.
చివ‌ర‌గా...సంక్రాంతి సింహం ఈ `జైసింహా`
రేటింగ్ : 3/5
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...