Jump to content

bifurcation daridralu


Guest Urban Legend

Recommended Posts

Guest Urban Legend
ఎక్కడి జబ్బుకు అక్కడే వైద్యం! 
హైదరాబాద్‌లో చెల్లుబాటుకాని ఎన్టీఆర్‌ వైద్యసేవలు 
ఆంధ్రప్రదేశ్‌లో అమలుకాని తెలంగాణ ఆరోగ్యశ్రీ పథకం 
ఉద్యోగం, ఉపాధి కోసం ఇరు రాష్ట్రాల్లోనూ నివాసం 
ఎక్కడ పనిచేస్తున్నా సొంత రాష్ట్రాల్లోనే ఆరోగ్య కార్డులు 
అత్యవసర పరిస్థితి ఏర్పడితే దిక్కుతోచని పరిస్థితి 
ఫలితంగా రెండు రాష్ట్రాల్లోనూ నష్టపోతున్న నిరుపేదలు 
ఈనాడు - హైదరాబాద్‌, అమరావతి 
త శనివారం రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కారు ప్రమాద దుర్ఘటనలో గాయపడిన అనూష(19) రాజమండ్రి అమ్మాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో పిన్ని, బాబాయిల వద్దే పెరిగింది. పేద కుటుంబంలో పెరిగిన అనూష హైదరాబాద్‌కు ఉద్యోగాన్వేషణకు వచ్చి ఇక్కడ ప్రమాదం పాలైంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పిస్తే.. అక్కడ ‘ఎన్టీఆర్‌ వైద్యసేవ’ పథకం వర్తించదన్నారు. గత్యంతరం లేక చికిత్స పూర్తికాకముందే అప్పటి వరకూ అయిన బిల్లు కట్టేసి తమ ఊరుకు తీసుకెళ్లారు పిన్ని, బాబాయి. కూరగాయలమ్మితే వచ్చిన కొద్దిసాటి సొమ్మును ఇలా ‘ప్రైవేటు’ పాలు చేయాల్సి వచ్చింది.

* హైదరాబాద్‌లో ఓ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఇంట్లో పనిచేయడానికి ఏలూరుకు చెందిన ఒక మహిళ (55)ను కుదుర్చుకున్నారు. ఇటీవల ఛాతీలో నొప్పిగా రావడంతో బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అత్యవసరంగా స్టెంట్‌ వేయాలన్నారు. అంత ఖర్చు భరించే శక్తి ఆ మహిళకు లేదు. ఆమెకు ‘ఎన్టీఆర్‌ వైద్యసేవ కార్డు’ ఉండడంతో.. హుటాహుటిన విజయవాడకు తరలించి అక్కడ యాంజియోప్లాస్టీ చేశారు. అదృష్టవశాత్తు కోలుకుంది కాని తరలింపులో జరగకూడదనిది జరిగితే..?

హైదరాబాద్‌లో పనిచేస్తున్నా లేదంటే ఇక్కడికి చుట్టపుచూపుగా వచ్చిన ఏపీకి చెందిన పేద ప్రజలకు అనుకోని పరిస్థితుల్లో అత్యవసర వైద్యం అవసరమైతే క్లిష్టపరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలోని ఆసుపత్రుల్లో ‘ఎన్టీఆర్‌ వైద్యసేవ’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజలు చిరుద్యోగాల కోసమో.. ఇతర పనుల రీత్యా కర్నూలు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఉంటున్నవారికీ అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించాల్సి వస్తే.. ఆరోగ్యశ్రీ పథకం అక్కడి ఆసుపత్రుల్లో పనిచేయడంలేదు. ఏపీ ఆసుపత్రుల్లో తెలంగాణ సర్కారూ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపేయడంతో బాధితులు పొరుగు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల లబ్ధిదారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. డబ్బులేని కారణంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే సమయంలో.. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే సమయంలో.. దూరాభారం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాదులోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు భవన నిర్మాణ కూలీలుగా, ఆటోడ్రైవర్లుగా, రక్షకభటులుగా, అపార్టుమెంట్ల వద్ద వాచ్‌మెన్‌లుగా పనిచేస్తుండగా.. వీరిలో అత్యధికులకు ఏపీలో ఎన్టీఆర్‌ వైద్యసేవ కార్డులున్నాయి. అలాగే తెలంగాణ ఏర్పడిన అనంతరం కూడా విజయవాడ, గుంటూరుల్లోని బట్టల దుకాణాల్లో, ప్రైవేటు సంస్థల్లో చిరుద్యోగులుగా పనిచేస్తున్న తెలంగాణవారూ ఉన్నారు. వీరికీ, వీరి తల్లిదండ్రులకూ వారి సొంత రాష్ట్రాల్లో ఉచిత వైద్యసేవల సౌకర్యం లభిస్తోంది.

ఏపీ కొన్నింటికే అనుమతి 
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదులో ఉద్యోగులు, పింఛనుదారులకు మినహా తెల్లరేషన్‌కార్డుదారులు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో మాత్రమే ఉచిత వైద్య సేవలు పొందాలని ఏపీ ప్రభుత్వం గత జులైలో ఉత్తర్వులు జారీచేసింది. మెడికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ అంకాలజీ, రేడియేషన్‌ అంకాలజీ, 18 సంవత్సరాలలోపు చిన్నారులకు కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ శస్త్రచికిత్సలకు మాత్రమే హైదరాబాదులోని ఆసుపత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం కింద చికిత్సలు చేయించుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వ వైద్యంలో ఉత్తమ సేవలందిస్తున్న నిమ్స్‌ సహా అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకూ మిగిలిన చికిత్సలను రద్దుచేసింది. ఉద్యోగులు, పింఛనుదారులకు మినహాయింపు ఇచ్చి.. అత్యధిక సంఖ్యలో ఉండే తెల్లరేషన్‌కార్డుదారులకు హైదరాబాద్‌లో చికిత్సలకు అవకాశమివ్వకపోవడం విమర్శలకు దారితీసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వమూ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీలోని ఆసుపత్రులకు రద్దుచేసింది. తెలంగాణలోని ఉద్యోగుల ఆరోగ్య పథకం కూడా ఏపీలో అమలవడంలేదు. ఈ పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల్లోనూ వేర్వేరు కారణాలతో పనిచేస్తున్న నిరుపేదలు, చిరుద్యోగులు తమకు, తమ కుటుంబ సభ్యులకూ ఉచిత చికిత్స పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అత్యవసర పరిస్థితుల్నీ పట్టించుకోరా? 
* ఏ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఆ రాష్ట్ర పరిధిలోని ఆసుపత్రులకే వర్తింపజేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయాలను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నా.. కనీసం అత్యవసర పరిస్థితుల్లోనైనా ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకాలు కింద ఉచిత చికిత్స లభించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
* గుండెపోటు, రోడ్డు ప్రమాదాల వంటి సందర్భాల్లో మొదటి గంట సమయం అత్యంత కీలకమైనది. వైద్యుల పరిభాషలో దీనిని ‘గోల్డెన్‌ అవర్‌’ అంటారు. వీలైనంత తొందరగా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయగలిగితే చాలావరకుప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు చెబుతుంటారు. కాని తెలుగురాష్ట్రాల నిర్ణయం వలన బాధితులను అక్కడి నుంచి ఇక్కడికో, ఇక్కడి నుంచి అక్కడికో తరలించేలోపు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. 
* తీవ్రమైన గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, తీవ్ర ప్రమాదాల వంటి అత్యవసర సందర్భాల్లో అయినా ఈ నిబంధనకు మినహాయింపు ఇస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend
21 minutes ago, KaNTRhi said:

Andhrabaadis enti... GHMC lo votes esi mari TRS ni gelipincharu gaa... TRS govt ivva leda veellaki Arogya sri cards??

avi settlers, settled here from years having properties etc 

 

Link to comment
Share on other sites

రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదులో ఉద్యోగులు, పింఛనుదారులకు మినహా తెల్లరేషన్‌కార్డుదారులు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో మాత్రమే ఉచిత వైద్య సేవలు పొందాలని ఏపీ ప్రభుత్వం గత జులైలో ఉత్తర్వులు జారీచేసింది.

AP should stop accepting pensioners and Govt employee cards in Hyderabad. Let them take that states benefits. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...