Jump to content

చంద్రబాబు అవమానించారు: స్పీకర్‌కు ఎంపీ అవినాశ్ ఫిర్యాదు


koushik_k

Recommended Posts

న్యూఢిల్లీ: పులివెందులలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు తనను అవమానించారంటూ కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 
 
 
 
బుధవారం పులివెందుల జన్మభూమి సభలో ఏం జరిగిందంటే!
 
‘రాజకీయం చేస్తే ఎవరి మాటా వినను. చాలా గట్టిగా ఉంటా.. మా మీటింగ్‌లోకి వచ్చి నీవేదో గొప్పలు చెప్పదలచుకుంటే ఎవరూ పట్టించుకోరు. గౌరవం నేర్చుకోండి.. గౌరవంగా మాట్లాడండి’ అని సీఎం చంద్రబాబు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిపై సీరియస్‌ అయ్యారు. బుధవారం పులివెందుల జన్మభూమి సభలో అవినాశ్‌.. సీఎంను అడిగి మైకు తీసుకుని మాట్లాడారు. ‘కొద్దిగంటల క్రితమే సీఎం సీబీఆర్‌-గండికోట ఎత్తిపోతల పనులు ప్రారంభించారు. ఆ పథకాన్ని రూ.1300 కోట్లతో ప్రతిపాదించిన మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఆయన శంకుస్థాపన చేసి రూ.1100 కోట్లు ఖర్చుచేశారు. 85 శాతం పనులను పూర్తిచేశారు.’ అని కొనసాగిస్తుండగా.. చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. ఉండవయ్యా అన్నా ఎంపీ వినిపించుకోకపోవడంతో చంద్రబాబు ఆయన్ను సమీపించారు. ఇంతలో వేదికపై ఉన్నవారు కూడా ఆయన వద్దకు వచ్చారు. ఒక్క నిమిషం వినవయ్యా అని అంటూ ఉండగానే ఓ కార్యకర్త అవినాశ్‌ చేతిలో మైకు లాగే ప్రయత్నంచేశారు. వారిని కూడా చంద్రబాబు వారించి.. ‘గౌరవంగా ఉండాలి. ఎవరిని పొగడుకోవాలో, ఎవరిని పొగడకూడదో మీ మీటింగులు మీకుంటాయి. ఇక్కడ గవర్నమెంట్‌ మీటింగ్‌. మేమేం చేశామో మేం చెప్పుకోలేదు. ఎవరు బాగా చేశారు.. ఎవరు బాగచేయలేదు.. ఇవన్నీ అవసరం లేదు. మేమే అన్నీ చేశాం అని చెప్పుకోవాలనుకోవడం కరెక్టు కాదు. ఈ రోజు నీళ్లిచ్చామంటే అది నేనిచ్చానయ్యా.. ఆ విషయం కూడా నేను చెప్పుకోలేదు. గౌరవంగా ఉంటే బాగుంటుంది. నా మీటింగ్‌లోకి వచ్చి నీవేదో గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు.. ఏమైనా ఉంటే మాట్లాడు..’ అని అవినాశ్‌తో అన్నారు. ఈలోగా కలెక్టరు అవినాశ్‌ పట్టుకున్న మైకు వైరు లాగేశారు. తర్వాత అక్కడున్న వారు ఏదో మాట్లాడబోతే ముఖ్యమంత్రి అంగీకరించలేదు. ‘ఇంతటితో వదిలేయండయ్యా.. ఎవరూ మాట్లాడవద్దు. ఈ మీటింగ్‌ను రాజకీయ వేదికను చేసుకోవడం సరికాదు. మీటింగ్‌ను రాజకీయం చేస్తే ఎవరి మాటా వినను. చాలా గట్టిగా ఉంటా’ అని స్పష్టం చేశారు. దీంతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది.
 
 
చంద్రబాబుపై కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంపై దుమారం రేగుతోంది.
Link to comment
Share on other sites

Ikkada maatlaadatam chetanavuddi kodakaa koteswarravaa.... parliament lo eppudaina Mic pattina paapaana poyinaavaa ani okka AP minister eee daridrudini adagadu.  Norlu leni pasiguddulu.... lokam teleeni amaayakulu paapam mana TDP naayakulu.  Assembly lo CM choostu vuntaadani.... poteelu padi maree Jagan meeda padathaaru.  Bayata maatlaadandarraa ante... yedeee... assalu point..ye dorakadu.  Yento TDP ni cadre..ye defend chesukovaalsina paristhiti kaani.... naayakulu daddammalu.

Link to comment
Share on other sites

20 minutes ago, Npower said:

Ikkada maatlaadatam chetanavuddi kodakaa koteswarravaa.... parliament lo eppudaina Mic pattina paapaana poyinaavaa ani okka AP minister eee daridrudini adagadu.  Norlu leni pasiguddulu.... lokam teleeni amaayakulu paapam mana TDP naayakulu.  Assembly lo CM choostu vuntaadani.... poteelu padi maree Jagan meeda padathaaru.  Bayata maatlaadandarraa ante... yedeee... assalu point..ye dorakadu.  Yento TDP ni cadre..ye defend chesukovaalsina paristhiti kaani.... naayakulu daddammalu.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...