Jump to content

KC chekuri post on IPS officer


APDevFreak

Recommended Posts

KC Chekuri
11 hrs · 
 

ఒకే నేల - రెండు భిన్న ధోరణులు

నిన్న సాయంత్రం అమరావతి సెక్రటేరియట్లో ఒక సెక్షన్ ఆఫీసర్‌గారితో పిచ్చాపాటీ మాట్లాడుతున్నా. శుక్రవారం సాయంత్రం ఐదుగంటల సమయంలో పని ముగించుకుని ఆవిడ తన పిల్లల దగ్గరికి హైదరాబాద్ వెళ్ళడానికి విజయవాడ ఏపీఎస్సార్టీసీ బస్‌స్టాండ్‌కి బయల్దేరుతున్నారు. ఇప్పుడు బస్సులు దొరుకుతాయా మేడమ్ మీకు అంటే బోలెడన్ని బస్సులుంటాయండీ "మనవి", "వాళ్ళవి" కూడా. వాళ్ళవి (TSRTC) అందుబాటులో ఉన్నా, మనవి వచ్చేవరకు వెయిట్ చేసి మన బస్సులే ఎక్కుతాం, మన రూపాయి మనకే ఉండాలి, పోగొట్టుకున్నది చాలు అన్నారు. చేతులెత్తి దండం పెట్టా.

అంతకు ముందు రోజు సాయంత్రం రాష్త్రపతిగారు వచ్చి వెళ్ళిపోయాక, సి.ఎం గారిని కలవడం కోసం ఆయన పేషీలో వెయిట్ చేస్తున్నాం. అక్కడ ఐదారుమంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎన్నారై పారిశ్రామికవేత్తలు, ఒక అత్యున్నత స్థాయి పోలీస్ అధికారి ఉన్నారు. ఆయనది వేరే ఉత్తరాది రాష్ట్రం. ఎందుకో తెలియదుగానీ మహా నిస్పృహలో ఉన్నారు. ఒక పావుగంటపాటు "ఇక్కడేముంది బూడిద అమరావతిలో, నవ్యాంధ్రలో, మనది వ్యవసాయదేశం,ఇక్కడ ఎలాంటి పంటలు పండుతాయో తెలుసా, ఇక్కడ రాజధాని కడతారా, కర్నూలు అయితే హైదరాబాదుకి దగ్గరగా బాగుండేది , ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం ఎక్కడుంది అసలు ?" అని బాహాటంగా సి.ఎం ఆఫీసులోనే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఆ పెదవి విరుపు మాటలు హేళనగా మాట్లాడుతుంటే అందరూ ఇబ్బందిగా వింటున్నారు. ఆ వ్యతిరేకతని చూసి ఇక ఉండబట్టలేక నేను అడ్డం పడ్డా ఆయనకి. మీ ప్రాబ్లెం ఏంటి సర్ అని. అప్పుడే ఎదురుగా టీవీలో పార్లమెంటులో హైకోర్టు విభజన మీద సుజనా చౌదరిగారి ప్రసంగం వస్తోంది. "ఇక్కడ 33,000 ఎకరాల్లో వరి పండుద్దని ఏ తలకు మాసినవాడు చెప్పాడు సర్ మీకు ? ముఖ్యమంత్రి బస్‌లో కూచుని, అందులోనే రాత్రుళ్ళు పడుకుని రాష్ట్రాన్ని పాలించుకోవాల్సిన దుస్థితి. ఇదిగో మనం చూస్తున్న ఆ పార్లమెంటులోనే తలుపులు మూసి మా గొంతు కోశారు. పైగా, ఆస్తులు పంచండ్రా, మావి మాకు ఇవ్వండ్రా అంటే న్యాయశాఖామంత్రి ఉచిత సలహాలిస్తున్నాడు రెండు రాష్ట్రాలూ కలిసి మాట్లాడుకోమని. ఇక చాలు. మాకు హైదరాబాదుకి దూరమూ వద్దు, దగ్గరా వద్దు. ఉన్నదాన్నే కిందపడో మీదపడో బాగు చేసుకుంటాం, అమరావతీనగర రాజధాని కట్టుకుంటాం, కనీసం మా ముందు తరాలకి న్యాయం జరుగుద్ది" అన్నా.

నామా నాగేశ్వర రావు గారు, దివి శివరాంగారు లాంటి పెద్దలు వారిస్తున్నారు వదిలేయ్ కేసీ అని. "నేను ముప్పయేళ్ళు ఈ రాష్ట్రంలో సర్వీస్ చేశా. అనేక జిల్లాలకి ఎస్పీగా చేశా. నాకంటే ఎక్కువ తెలుసా నీకు" అన్నారు ఆ అధికారి ఉక్రోషంగా. నేను పకపకా నవ్వా. "నలభయేళ్ళ క్రితం, మీరు ఇక్కడికి రాకముందే నేను ఈ గడ్డ మీద పుట్టా. నా అయ్య చేకూరి రామయ్య, తాత కోటయ్య, ముత్తాత పేరయ్య, ముది ముత్తాత నారయ్య, నాకు తెలిసిన ఐదారు తరాల నా కుటుంబం ఈ నేలమీదే పుట్టింది. నా ఇంటిపేరున్న వంశం ఐదువందల ఏళ్ళనుండి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లిఖితంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ నేల గురించి మీకు ఎక్కువ తెలుసా, నాకు ఎక్కువ తెలుసా" అని అడిగా. అబ్బో, నీ పిల్లలు వస్తారా ఇక్కడికి అన్నారు ఆయన వెటకారంగా. "రావచ్చు, రాకపోవచ్చు సర్. ఫ్యూచర్ జనరేషన్స్ అంటే కేవలం మీ పిల్లలు, నా బిడ్డలే కాదు. ఇక్కడ పుట్టే ప్రతి బిడ్డా ఫ్యూచర్ జనరేషనే. మీరు మహా అంటే రెండేళ్ళలో రిటైర్ అయిపోతారు, తర్వాత మీ రాష్ట్రానికో, హైదరాబాదుకో వెళ్ళి సెటిలవుతారు సర్, కానీ మాకు ఈ మట్టితో ఉండే అనుబంధం ఎన్ని తరాలకీ పోదు" అని చెప్పి ముగించా.

నవ్యాంధ్రపట్ల ప్రేమతో, తపనతో కష్టపడుతున్న ఇతర రాష్ట్రాల అధికారులు, మన అధికారులు, ఉద్యోగులు చాలామంది ఉన్నారు. ఇలాంటివాళ్ళు కూడా ఉన్నారు.

Link to comment
Share on other sites

17 minutes ago, Hello26 said:

Ilanti IAS/IPS lu multiple numbers lo vunnaru in AP Government. Ilanti vallu commitment tho work chesthene mana state bagu padedi

This old blood should go. The Young officers are very enthusiastic to work with CBN and the freedom they enjoy makes the old ones to be haters.

I also observed for some reason the retiree's and people aged above 60 hates CBN, I guess the way CBN working in his age makes them acidic.

Link to comment
Share on other sites

1 minute ago, LuvNTR said:

anduke anedi...aa capital buildings ki kanisam foundation veyyadam start chesthe ilanti nispruhalu apanammakalu vigigi povadam modalu avuthayi...aa ips maadire chala mandi lo same feeling undi. 

AP gurinchi feel vunnavallu kavali.. vision carry cheyadaniki...let these old guys go away..

Link to comment
Share on other sites

42 minutes ago, LuvNTR said:

anduke anedi...aa capital buildings ki kanisam foundation veyyadam start chesthe ilanti nispruhalu apanammakalu vigigi povadam modalu avuthayi...aa ips maadire chala mandi lo same feeling undi. 

avi apanammakalu kaavu ... self interests, avi eppatiki povu. Capital construct ayina, one of the best capitals ayina kuda ... they'll always be talking nonsense ... always trying to undermine ... its in their financial and personal interest.

Link to comment
Share on other sites

3 minutes ago, minion said:

avi apanammakalu kaavu ... self interests, avi eppatiki povu. Capital construct ayina, one of the best capitals ayina kuda ... they'll always be talking nonsense ... always trying to undermine ... its in their financial and personal interest.

 

Link to comment
Share on other sites

43 minutes ago, Jeevgorantla said:

AP gurinchi feel vunnavallu kavali.. vision carry cheyadaniki...let these old guys go away..

Perfect. Hopefully CBN puts together an admin team that is honest in carrying his vision and state's best interests.

Every administrative officer in my family/friends circle comes around with such strong political motives, its surprising to see how they think. They completely forgot that they are public servants and their job is to execute policy decisions of whoever is in charge of the government. Most of them feel like THEY ARE the policy makers.

This hierarchy and administrative staffs stranglehold needs to be broken.

 

Link to comment
Share on other sites

2 hours ago, minion said:

avi apanammakalu kaavu ... self interests, avi eppatiki povu. Capital construct ayina, one of the best capitals ayina kuda ... they'll always be talking nonsense ... always trying to undermine ... its in their financial and personal interest.

Agree minion sir....I hate these ias, ips and govt. employees...Eppudu self interests and personal gains financially anthe....bhajana gallu. they don't care their duty or future generations or common public....CBN garu vellani asalu daggariki kuda raaneyakudadu...ayana twaraga foundations anna modalu petti konni photos tv lo thipputha unte common public ki full happiness untadi...votes miss avvavu next elections lo.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...