Jump to content

ట్రాన్‌స్ట్రాయ్‌పై దివాలా పిటిషన్‌.


Kiriti

Recommended Posts

  • ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన కెనరా బ్యాంకు.
  • ఇక పోలవరం కాంక్రీటు పనులు కష్టమే!
  • ట్రాన్‌స్ట్రాయ్‌పై దివాలా పిటిషన్‌.
అమరావతి (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరందించాలన్న లక్ష్యంతో చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌పై కెనరా బ్యాంకు.. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆ సంస్థ దివాలా తీసినట్లుగా ప్రకటించాలని, కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని కోరింది. దీంతో ట్రాన్‌స్ట్రాయ్‌ భవితవ్యంతోపాటు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్‌ కూడా డోలాయమానంలో పడింది. ట్రాన్‌స్ట్రాయ్‌ తమకు రూ.725 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని.. ఈ నెల 22 నాటికి రూ.489 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకు గ్యారంటీ కింద రూ.379 కోట్లే ఉంచిందని కెనరా బ్యాంకు పేర్కొంది.
 
కెనరా బ్యాంకు తరపున బ్యాంకు అధికారి పి కోటేశ్వరరావు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ట్రైబ్యునల్‌ త్వరలోనే ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియ ప్రారంభించనుంది. ఇందులోభాగంగా ట్రాన్‌స్ట్రాయ్‌ను దివాలా సంస్థగా ప్రకటిస్తే ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న కాంట్రాక్టు సంస్థకు మున్ముందు బ్యాంకుల నుంచి పరపతి పుట్టే అవకాశమే ఉండదు. అప్పుడు పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ వంటి సంక్లిష్టమైన, అతిముఖ్యమైన కాంక్రీట్‌ పనులు ముందుకు సాగవు. ఇదే జరిగితే 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరివ్వాలని, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు. ఈ పరిస్థితిని ముందే గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులకు టెండర్లు పిలిచి కొత్త సంస్థకు పనులు అప్పగించాలని భావించారు. టెండర్లను కూడా పిలిచారు. అయితే ఈ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించడంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయిం ది. తాము టెండర్లను ఎందుకు పిలవాల్సి వచ్చిం దో వివరించేందుకు ముఖ్యమంత్రి బృందం ఇటీవల ఢిల్లీలో జలనవరుల మంత్రి నితిన్‌ గడ్కరీనీ కలిసిన సంగతి తెలిసిందే. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ఆర్థికంగా చితికిపోయిందని, కాంక్రీటు పనుల్లో కొంత భాగం కొత్త సంస్థకు అప్పగించాలని గడ్కరీకి ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేశారు.
 
అయితే ట్రాన్‌స్ట్రాయ్‌కు మరో రెండు నెలలు గడువిద్దామని కేంద్ర మంత్రి చెప్పారు. గోదావరికి వరదలు వచ్చేలోపే స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు పూర్తిచేయాలని.. లేదంటే ఒక నీటి సంవత్సరం నష్టపోతామని చంద్రబాబు ఎంత చెప్పినా కేంద్రం వినిపించుకోలేదు. దక్షిణ కొరియా పర్యటన సమయంలోనూ గడ్కరీతో ముఖ్యమంత్రి ఈ అంశంపై ఫోన్లో మాట్లాడారు. అయితే గడ్కరీ తన వాదనకే కట్టుబడ్డారు. కాకుంటే గత సమావేశానికి, ఈ సమావేశానికి మధ్య నెల రోజులు గడిచిపోవడంతో గతంలో పేర్కొన్న రెండు నెలల గడువును నెల రోజులకు కుదించారు.
Link to comment
Share on other sites

Late అయినా పర్లేదు, trans ని తీసి dobbandi yedava nasa, cheyyalenodiki అసలు evaricharu, company పేరు vintene fake consultancy ల vundi, veedenduku తీసుకున్నాడు, starting lone lnt ki ichi vunte konchem bills late అయినా Cbn tho long bonding వల్ల works continue chesevallu.... 

Link to comment
Share on other sites

Start a civil company by state govt

Use govt civil engineers and if needed give some employee notification for civil engineers

State govt company ki full works ni badili chesi natlu transroy ni ok cheyinchali

Spillway ni each block ki oka employee ni pettali till crust gates pette varuku

same strategy for all works

cooling plants ni penchali it will boost the cement works

machinery ni state govt mobilize cheyali

Ila cheste tappa nothing possible to complete works in time

 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...