Jump to content

Balayya - Hindupur


Guest Urban Legend

Recommended Posts

Guest Urban Legend

#హిందూపురం ప్రజల మంచినీటి సరఫరా బృహత్తర పథకం శంకుస్థాపన కార్యక్రమంలో  శాసనసభ్యులు శ్రీ నందమూరి #బాలయ్య..

Jai #Balayya 

DSMon_RV4AA4tl1.jpg

DSMooe_VoAAVyji.jpg

 

Link to comment
Share on other sites

26 minutes ago, Urban Legend said:

#హిందూపురం ప్రజల మంచినీటి సరఫరా బృహత్తర పథకం శంకుస్థాపన కార్యక్రమంలో  శాసనసభ్యులు శ్రీ నందమూరి #బాలయ్య..

Jai #Balayya 

DSMon_RV4AA4tl1.jpg

DSMooe_VoAAVyji.jpg

 

Shilapalakala medha lo Simha gettup ee vesaru ga :dream:

Link to comment
Share on other sites

ఎన్టీఆర్‌ తనయుడిగా పుట్టడం నా అదృష్టం
బాలకృష్ణ
29brk138-bala.jpg

హిందూపురం: తెదేపా ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పర్యటనలో భాగంగా ఆయన 108 మంది రైతులకు ‘రైతు రథం’ పథకం ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, రూ.24వేల కోట్లతో రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత తెదేపాదే అన్నారు. హైదరాబాద్‌ తరహాలో విజయవాడలోనూ ఇండో క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం 15 ఎకరాల స్థలం కేటాయించిందన్నారు. రామారావు తనయుడిగా జన్మిచండం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలో విడుదల కానున్న ‘జై సింహా’ సినిమా అభిమానులను అలరిస్తుందన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 5 weeks later...
ఈ వేసవికి... ఆగాల్సిందే! 
వేగంగా పురం తాగునీటి పైప్‌లైన్‌ పనులు 
అయినా వెంటాడుతున్న అడ్డంకులు 
కీలకంగా నీటిశుద్ధి ప్లాంట్‌ నిర్మాణం 
పూర్తయ్యేందుకు మరో ఆరేడు నెలలు 
ఈనాడు-అనంతపురం, న్యూస్‌టుడే-హిందూపురం 
atp-top1a.jpg
‘‘హిందూపురం... అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది తాగునీటి ఎద్దడి. దశాబ్దాలుగా పురంలో జల ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఈ ఇక్కట్లను దూరం చేసేందుకు రూ.194 కోట్లతో గొల్లపల్లి జలాశయం నుంచి నీటిని అందించే ప్రాజెక్టును తెదేపా ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిని గడువు కంటే ముందే పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైతే ఈ వేసవికే పురానికి తాగునీరు ఇవ్వాలని ప్రజాప్రతినిధుల నుంచి అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయి. కానీ.. వాస్తవ పరిస్థితి చూస్తే ఈ వేసవికి జలభాగ్యం లేదని తేటతెల్లమవుతోంది.’’

హిందూపురంవాసులకు ఏడాది పొడవునా నీటి కష్టాలు అలవాటైపోయాయి. ఇక వేసవి వస్తే బిందెడు నీటికోసం హైరానా పడక తప్పదు. కొన్నేళ్ల కిందట పురం దప్పిక తీర్చేందుకు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారు. రూ.వందల కోట్లు వెచ్చించిన ఈ పథకం.. పుర ప్రజల దాహం తీర్చలేక చతికిలపడింది. ఈతరుణంలో గత ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ.. తాను గెలిస్తే పురం దాహార్తి తీరుస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో.. ఇక్కడి నీటిఎద్దడి తీర్చేడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే తరుణంలో హంద్రీనీవా పథకంలో భాగమైన మడకశిర బ్రాంచికాల్వలోని గొల్లపల్లి జలాశయం పూర్తికావడం, 2016 చివర్లో ఈ జలాశయానికి కృష్ణా జలాలు తీసుకొచ్చిన నేపథ్యంలో.. అక్కడి నుంచి హిందూపురానికి తాగునీటిని తీసుకెళ్లాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే బాలకృష్ణ దీనిపై ప్రత్యేక దృష్టిసారించి ఈ ప్రాజెక్ట్‌కు అమృత్‌ నిధులు మంజూరయ్యేలా చూశారు. అమృత్‌ నిధులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం, పురపాలిక నిధులు కలిపి.. మొత్తంగా గొల్లపల్లి జలాశయం నుంచి హిందూపురానికి తాగునీటిని అందించే ప్రాజెక్ట్‌కు రూ.194 కోట్లు మంజూరు చేసింది. 
పురానికి నీరు అందించే ఈ ప్రాజెక్ట్‌ పనులను కేఎల్‌ఎస్‌ఆర్‌ అనే గుత్తేదారు సంస్థ దక్కించుకుంది. 15 నెలల్లో ఈ పనులు పూర్తికావాల్సి ఉంది. గత ఏడాది అక్టోబరులో పనులు ఆరంభించారు. పెనుకొండ మండలంలోని గొల్లపల్లి జలాశయం నుంచి హిందూపురం వరకు 52 కి.మీ. మేర పైప్‌లైన్‌ నిర్మాణం, జలాశయం వద్ద ఇంటెక్‌వెల్‌ నిర్మాణం, అక్కడి నీరు శ్రీకృష్ణదేవరాయనగర్‌, వెంకటాపురం తండా వద్దకు పంపింగ్‌ చేసి, ఆపై హిందూపురానికి తీసుకెళ్తారు. ఈ నీరు హిందూపురం పట్టణంలోని కొట్నూరు వద్ద నిర్మించే నీటి శుద్ధి కేంద్రానికి (డబ్ల్యూటీపీ) చేరుతుంది. ఇక్కడ నీరు శుద్ధి చేసిన తర్వాత ముదిరెడ్డిపల్లి, ఇందిరమ్మ కాలనీల్లో ఉన్న నీటి ట్యాంకులు, మోతుకపల్లి వద్ద పంప్‌హౌస్‌కు నీటిని అందిస్తారు.

అవరోధాలు అధిగమిస్తూ... 
తొలుత పైప్‌లైన్‌ పనులకు సంబంధించి పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమ ప్రాంతం నుంచి సోమందేపల్లి వరకు 17 కి.మీ. మేర జాతీయ రహదారి పక్కనే పనులు చేయాల్సి ఉంది. ఇందుకు ఎన్‌హెచ్‌ఏఐకు అనుమతులు కోరగా, ఇటీవలే పనులు చేసేందుకు ప్రస్తుతానికి అనుమతులు వచ్చాయి. అలాగే గొల్లపల్లి జలాశయం నుంచి జాతీయ రహదారి-44లో ఉన్న గొల్లపల్లి క్రాస్‌ వరకు, ఇంకా సోమందేపల్లి నుంచి హిందూపురం వరకు రభశ రహదారి పక్కన పనులు చేసేందుకు ఆ శాఖ అనుమతులు కోరారు. వీటిలో పనులకు అనుమతులొచ్చాయి. ఇంకా ఈ పైప్‌లైన్‌ మూడు చోట్ల రైల్వే క్రాసింగ్‌లు దాటాల్సి ఉంది. మక్కాజిపల్లి, పెనుకొండ-పుట్టపర్తి, మలుగూరు రైల్వే క్రాసింగ్‌లు వద్ద పనులు చేపట్టాల్సి ఉంది. రైల్వే అనుమతులు కోరగా, ఇటీవలే రైల్వేశాఖ, జిల్లా అధికారులు సంయుక్తంగా పరిశీలన పూర్తిచేశారు. ఈ దస్త్రం రైల్వే శాఖ వద్దకు వెళ్లింది. త్వరలో అక్కడి  నుంచి అనుమతులు వస్తే ఆ పనులు చేయాలనే యోచనలో ఉన్నారు. అలాగే వెంటకాపురం తండా వద్ద దాదాపు 10 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉంది. ఈ దస్త్రం కూడా వేగంగా కదులుతోంది. అలాగే హిందూపురంలో పైప్‌లైన్‌ మార్గంలో భూసేకరణ పనులను పురపాలిక అధికారులు చూస్తున్నారు.

నీటి శుద్ధి కేంద్రం పూర్తయితేనే.. 
గొల్లపల్లి జలాశయంలో ఇంటెక్‌వెల్‌, 52 కి.మీ. పైప్‌లైన్‌ పూర్తయినా సరే కీలకమైన నీటి శుద్ధి కేంద్రం పనులు పూర్తయితేనే పురానికి నీరందుతుంది. పట్టణంలోని కొట్నూరు వద్ద ఈ నీటిశుద్ధి కేంద్రం పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పురపాలికకు చెందిన 3.5 ఎకరాల్లో ఈ పనులు చేపడుతుండగా, అక్కడే మరో 1.7 ఎకరాలు అదనంగా సేకరించనున్నారు. వాస్తవానికి నీటిశుద్ధి కేంద్రం పనులు పూర్తయి, శుద్ధి యంత్రాలు ఏర్పాటుకు కనీసం 9 నెలలు పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. గత అక్టోబరులో ఈ పనులు మొదలవగా కనీసం ఈ ఏడాది జులై నాటికి కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు మార్చినాటికే ఎలాగైనా పైప్‌లైన్‌ పనులు పూర్తిచేసి నీరివ్వాలని ఒత్తిళ్లు ఉండగా, పైప్‌లైన్‌ పూర్తయినా సరే నీటి శుద్ధి కేంద్రం పనులు అంత త్వరగా సాధ్యం కాదని తెలుస్తోంది. అంటే ఈ వేసవికి గొల్లపల్లి నుంచి నీరందే అవకాశాలు లేనట్టే అని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎప్పటికప్పుడు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి, అనుమతులు వచ్చేలా చూస్తున్నారు.

atp-top1b.jpg
మరో 30 ఏళ్ల అవసరాలు తీరేలా.. 
ప్రస్తుతం చేపట్టిన తాగునీటి పథకం హిందూపురానికి మరో 30 ఏళ్లపాటు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరాలను తీర్చనుంది. ప్రస్తుతం పట్టణ జనాబా 1.6 లక్షలుకాగా, 2048 నాటికి ఇది 2.70 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ రోజుకు 135 లీటర్లు చొప్పున నీరు అందించేందుకు వీలుగా, గొల్లపల్లి జలాశయం నుంచి ఈ పథకానికి 0.54 టీఎంసీల నీటిని కూడా కేటాయించారు. ప్రస్తుత జనాభాకు రోజుకు 18 మిలియన్‌ లీటర్లు (ఎంఎల్‌డీ) సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత పెరిగే జనాభాకు అనుగుణంగా 36 ఎంఎల్‌డీలు కూడా వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే 52 కి.మీ.కు అవసరమైన పైపులను తీసుకొచ్చారు. ఇందులో 17 కి.మీ. మేర పైపులు ఏర్పాటు చేశారు. గొల్లపల్లి జలాశయంలోని ఇంటెక్‌వెల్‌ పనులు కూడా శ్లాబ్‌ దశకు వచ్చాయి. మొత్తంగా అన్ని పనులు కలిపి 38 శాతం పూర్తయ్యాయి. అనుమతులు వచ్చిన మేరకు పనులు శరవేగంగా చేస్తున్నామనీ, గడువు కంటే ముందుగానే ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రజారోగ్యశాఖ కార్యనిర్వాహక ఇంజినీరు (ఈఈ) ప్రసాద్‌ ‘ఈనాడు’కు తెలిపారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే పురవాసుల చిరకాల స్వప్నం నెరవేరినట్లు అవుతుంది.
Link to comment
Share on other sites

  • 1 month later...

గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా..హిందూపురం నియోజకవర్గం చెరువులకు..నీటిని మల్లిస్తున్న..ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు

 

DYaoYRQXkAABxRz.jpg:large

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...