Jump to content

AP new DGP ga Malakondaiah ?


sonykongara

Recommended Posts

డీజీపీగా మాలకొండయ్య? 
నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు 
31న పదవీ విరమణ చేయనున్న సాంబశివరావు 

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగాఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ఎం.మాలకొండయ్య నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ ఎన్‌.సాంబశివరావు ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో మాలకొండయ్యను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి  సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి.
1985 బ్యాచ్‌కు చెందిన మాలకొండయ్య స్వస్థలం ప్రకాశం జిల్లా. ఆయన న్యాయశాస్త్ర, వ్యవసాయ విద్య పట్టభద్రుడు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి క్రిమినాలజీలో డాక్టరేట్‌ పట్టా పొందారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యూయేట్‌ డిప్లమో చదివారు. పాఠశాల విద్యను ప్రకాశం జిల్లాలోనే పూర్తి చేసుకున్న మాలకొండయ్య కళాశాల విద్యను గుంటూరులో అభ్యసించారు. ఐపీఎస్‌కు ఎంపిక కాక ముందు కొన్నాళ్ల పాటు బ్యాంకు ఉద్యోగిగా సేవలందించారు.
తూర్పుగోదావరి, వరంగల్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఏఎస్పీ, అదనపు ఎస్పీ, ఎస్పీ హోదాల్లో సేవలందించారు. గుంటూరు, ఏలూరు రేంజిల్లో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ట్రాన్స్‌కో సీఎండీగా, సీఐఎస్‌ఎఫ్‌లోనూ సేవలందించారు. ఏపీ పోలీసు నియామక మండలి ఛైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా, ఏసీబీ డీజీగా బాధ్యతలు నిర్వహించిన ఆయన...గతేడాది నవంబరు నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, సౌమ్యుడని పేరుంది. ఏపీ పోలీసు అకాడమీలో గెజిటెడ్‌ అధికారుల కోసం సరికొత్త శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను కేంద్ర హోంమంత్రి నుంచి పురస్కారం పొందారు. 2018 జూన్‌ మాసాంతంలో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

Link to comment
Share on other sites

On 12/27/2017 at 1:12 AM, sonykongara said:

Ayana vaddu annadu bro

 reliable sources said Sambasiva Rao could be given a posting in the Capital Region Development Authority (CRDA) or made as chief commissioner of AP State Information Commission

Link to comment
Share on other sites

4 hours ago, Siddhugwotham said:

Mannava Malakondaiah from Prakasam district. He is Kamma not SC/ST.

Malakonda is goddess in Prakasam district. People believe her and parents put her name to their children.

Malakonda ante goddess kaadu.... Malyadri Lashmi Narasimha swamy temple unde konda..... malakonda swamy ani pilusthaaru....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...