Jump to content

YCP not contesting Kurnool MLC elections?


Vishal_Ntr

Recommended Posts

కర్నూలు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ 
25-12-2017 19:25:58

అమరావతి: కర్నూలు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. కర్నూలు జిల్లా నేతలతో సమావేశమైన టీడీపీ అధిష్టానం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్‌ పేరు ఖరారు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకున్నట్లు ప్రకటించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని వైసీపీ ఆరోపించింది. దీంతో ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై జరుగుతున్న చర్చల సందర్భంగా వైసీపీ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన తర్వాత శిల్పా చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. చక్రపాణిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...