Jump to content

జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. వెన్నుంటే ఉంటా!


Govindu

Recommended Posts

https://www.manamnews.com/content/comedian-raghu-open-talk-about-jr-ntr-entry-politics-4242

 

Comedian Raghu, Open talk, Jr NTR entry politicsహైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియదు గానీ.. ఆయన రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఎన్టీఆర్ వెన్నుంటే ఉంటాడట. అతనే కమెడియన్ రఘు.  తెలుగు వెండితెరపై విభిన్నమైన పాత్రలను చేస్తూ కమెడియన్‌గా రాణిస్తూ తెలుగు సినీపరిశ్రమ‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రఘు.. ఎన్టీఆర్‌పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా ఓ మీడియాతో రఘు మాట్లాడుతూ తన సినీప్రయాణంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌పై మీకు ప్రత్యేకమైన అభిమానం ఉందికదా? అని ప్రశ్నించగా.. అవును అని సమాధానమిచ్చారు. అలాగే ఒకవేళ ఎన్టీఆర్ భవిష్యుత్తులో పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆయనతోపాటే వెళతారా.. లేదా? అని ప్రశ్నించగా రఘు టక్కుమని సమాధానమిచ్చాడు.

Comedian Raghu, Open talk, Jr NTR entry politicsఇంతకీ రఘు ఏమన్నాడంటే.. ‘ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడమనేది జరిగితే.. తప్పకుండా తన పక్కన నిలబడటానికి ఏ రోజూ కూడా వెనుకాడను. నా చిన్నతనం నుంచి పెద్ద ఎన్టీఆర్‌నే చూస్తూ పెరిగినవాడిని. అప్పటినుంచి ఆయనన్నా.. ఎన్టీఆర్ సినిమాలన్నా ఎంతో పిచ్చి. నా జీవితంలో నేను సినిమాల్లోకి వస్తాననుకోలేదు. అనుకోకుండానే సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాను. అందులోనూ నా తొలి సినిమా.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఆది’తోనే కావడం నా అదృష్టం. ఆ చిత్రం నుంచి ఎన్టీఆర్‌తో నా అనుబంధం మొదలైంది. అలా 15 ఏళ్లుగా ఆ రిలేషన్ షిప్ కొనసాగుతూనే ఉంది. అలాంటి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా నేను కూడా ఆయనతోనే ఉంటాను. ఆ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు’అంటూ కుండబద్దలు కొట్టేశాడు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...