Jump to content

CII Partenership summit-2018 Vizag


sonykongara

Recommended Posts

  • Replies 487
  • Created
  • Last Reply

Andhra Pradesh to sign over 281 MoUs worth Rs 2.56 lakh crore at CII Partnership Summit

HYDERABAD: Andhra Pradesh government, which claims to have attracted Rs 14.89 lakh crore of investments over last three and a half years since state bifurcation, is all set to sign at least 281 memoranda of understandings (MoUs), involving Rs 2.56 lakh crore of investments at the ensuing annual CII Partnership Summit scheduled to commence from February 24 at Visakhapatnam.

At a meeting of AP State Investment Promotion Board (AP SIPB) held in Amaravati on Thursday, the officials informed the chief minister N. Chandrababu Naidu that these proposed investment agreements to be signed next week would offer employment to at least 4.25 lakh persons.

The estimations were based on the interest evinced by corporates so far, weeks before the CII Partnership Summit to take off, the officials said.

The officials informed Naidu that the state across its 18 departments had attracted 1,817 projects with a combined committed investment of ?14.89 lakh crore to employ 33.28 lakh people over the last three and a half years. Out of these, 876 MoUs were signed in the Partnership Summits of 2016 (290) and 2017 (586).

The officials proposed a distinct institutional mechanism to track and monitor the investment procedures with a Special Advisory Task Force and an organizational structure.

As on Thursday evening, the official EODB website said that Andhra Pradesh was ranked number 1 even in the implementation of Business Reforms Action Plan (BRAP), having already secured top slot in World Bank’s Ease of Doing Business (EODB) rankings among the Indian states.

The chief minister Naidu has asked the officials to prepare a report to present at the ensuing Partnership Summit, which should include all the next generation reforms that the government proposes to implement. Further, he has also suggested holding a separate session at the Summit on Ease of Doing Business to find out best practices of corporates across the globe.

The sessions that were already finalised for the Summit revolve around the sectors such as automobile, tourism, aerospace & defense, textiles, renewable energy, food processing, medical equipment and electronics. The panel discussions will focus on identifying various ecosystems and policy frameworks, growth and investment potential of the state.

The chief minister has asked the officials to present various products of investors that the state had already attracted so far that include cars of South Korean automaker KIA Motors, mobile handsets of Foxconn and tyres of Apollo TyresBSE -4.16 %, among others. He has also advised the officials to prepare exhibits that reflect achievements, desires and potential of the state.

While the Vice President of India, M Venkaiah Naidu, will inaugurate the three-day CII Partnership Summit, several key union ministers will take part in various sessions.

The union ministers and top bureaucrats attending the Summit include Commerce Minister Suresh Prabhu, External Affairs Minister M.J. Akbar, Road Transport & Highways Minister Nitin Gadkari, Science & Technology Minister Harsh Vardhan, Electronics & Communications Minister Ravishankar Prasad, Civil Aviation Minister Ashok Gajapati Raju, Skill Development & Entrepreneurship Minister Dharmendra Pradhan, NITI Aayog Vice Chairman Rajiv Kumar and NITI Aayog CEO Amitabh Kant.

Link to comment
Share on other sites

పారిశ్రామికవేత్తలకు ఎర్ర తివాచీ
18-02-2018 02:57:18

ఈ నెల 24 నుంచి పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు
భాగస్వామ్య సదస్సుకు విశాఖ సర్వసన్నద్ధం
 సీఎం, మంత్రుల ప్రచారంతో తరలిరానున్న కంపెనీలు
అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన జరిగాక ముచ్చటగా మూడో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు నిర్వహణకు విశాఖ మహా నగరం సన్నద్ధమవుతోంది. ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సును విజయవంతంగా నిర్విహించేందుకు వీలుగా విశాఖలో ఆదివారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో సన్నాహక సమావేశం జరగనుంది. సదస్సులో పాల్గొనేందుకు అంగీకరించిన పలు దేశాల వాణిజ్య శాఖల మంత్రులు, పరిశ్రమల గురించి ఈ సమావేశంలో సమీక్షిస్తారు. 2016 జనవరిలో నిర్వహించిన సదస్సులో 4,65,000 కోట్ల రూపాయల మేర అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు లేవు. తాత్కాలిక సచివాలయమూ సిద్ధం కాలేదు. సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను హైదరాబాద్‌ నుంచే చేయాల్సి వచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆశించినట్లుగా రూ.4,65,000 కోట్ల మేర పెట్టుబడి ఒప్పందాలను చేసుకోగలిగింది.
 
రెండో ఏడాది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ఉత్సాహం చూపాయి. ఏకంగా రూ.10,00,000 కోట్ల మేర పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. మొదటి, రెండో దశ పెట్టుబడి ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి. మొదటి రెండు సదస్సులను నిర్వహించిన అనుభవంతో మూడో ఏడాది కూడా విశాఖలోనే సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు పారిశ్రామికవేత్తలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ స్విడ్జర్లాండ్‌, దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికా, సింగపూర్‌, దుబాయ్‌ దేశాల్లో పర్యటించారు. ఐటీశాఖ మంత్రి లోకేశ్‌ దావోస్‌, అమెరికాల్లో పర్యటించారు.
 
పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథరెడ్డి జర్మనీ, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనలు తుది దశకు చేరుకున్నాయి. దీంతో ఈ దఫా నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు పలు దేశ విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రపంచబ్యాంకు ఇస్తున్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో ఏపీ నంబర్‌వన్‌ స్థానంలో నిలవడం, పారిశ్రామిక అనుకూల వాతావరణం నెలకొనడంతో పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. సీఐఐ ఆధ్వర్యంలో ఈ నెల 24న విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో ఉదయం పది గంటలకు రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో ద్వైపాక్షిక, బృంద సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మూడో రోజు ప్రముఖ కంపెనీలతో సీఎం చంద్రబాబు ద్వైపాక్షి సమావేశాలు నిర్వహిస్తారు.
ప్రత్యేక ఆకర్షణగా కియ
24 నుంచి జరిగే సదస్సుకు దక్షిణ కొరియాకు చెందిన ‘కియ’ కార్ల కంపెనీ ప్రత్యేక ఆకర్షణ కానున్నది. భారీగా పెట్టుబడులు పెడుతున్న కియ.. అనంతపురం జిల్లాలో శరవేగంగా నిర్మాణ పనులు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22న కియ ప్లాంటు పనులను పరిశీలించనున్నారు. తమ కంపెనీ ఏర్పాటు విషయంలో ఏపీ పరిశ్రమల శాఖ ఉన్నతాధికార వర్గాలు అందించిన సహకారం గురించి దక్షిణ కొరియాలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కియ వివరించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆ కంపెనీలకు సూచిస్తోంది. కియ అనుబంధ సంస్థలు 18 వరకూ అనంతపురంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

Link to comment
Share on other sites

5

భళా! 
సాకారం దిశగా 5.31 లక్షల కోట్ల పెట్టుబడులు 
అవగాహన ఒప్పందాల్లో 65% ఫలవంతానికి అవకాశం 
ఈనాడు - విశాఖపట్నం 

ఆంధ్రప్రదేశ్‌లో భారీస్థాయిలో పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడులు రావడానికి, ఉపాధి అవకాశాలు పెరగానికి భాగస్వామ్య సదస్సులు ఊహించని విజయాన్ని అందిస్తున్నాయి. విశాఖపట్నం వేదికగా 2016, 2017 సంవత్సరాల్లో భాగస్వామ్య సదస్సులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య(సి.ఐ.ఐ.), కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహించింది. సులభతర వాణిజ్య నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో 
ఉండడం, విద్యుత్తు మిగులు రాష్ట్రంగా జాతీయస్థాయిలో గుర్తింపు సాధించడం, పారిశ్రామిక సంస్థల అనుమతులన్నీ ఏక గవాక్ష విధానంలో 29 రోజుల వ్యవధిలోనే మంజూరు చేస్తుండడం, క్షేత్రస్థాయిలో పరిశ్రమలకు కావాల్సిన మౌలికవసతులను భారీస్థాయిలో అభివృద్ధి చేయడం తదితర ఎన్నో పారిశ్రామిక అనుకూల పరిస్థితులున్న నేపథ్యంలో పలువురు పారిశ్రామికవేత్తలు భారీఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చారు.
* 2016లో కుదిరిన అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) 290. వీటి విలువ రూ.3,44,201 కోట్లు. 7,03,727 మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం. 
* 2017లో కుదిరిన అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) 586. విలువ రూ.7,65,994 కోట్లు. 14,96,513 మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం.
ఒప్పందాల అమలుకు ప్రత్యేక వ్యవస్థ 
కొత్త ఒప్పందాలకు, కుదుర్చుకున్నవాటిని అమల్లోకి తేవడానికి వీలుగా సింగపూర్‌ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి (ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌) ఏర్పాటు చేసింది. ఆటోమొబైల్‌, ఐ.టి., ఎలక్ట్రానిక్స్‌, ఫార్మా... ఇలా ఒక్కో రంగాన్ని ఒక్కో సెక్టార్‌గా విభజించి ఎప్పటికప్పుడు పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించడం, అవగాహన ఒప్పందాలు సాకారమయ్యేలా చర్యలు తీసుకోవటం ఈ బోర్డు ముఖ్య ఉద్దేశం. సంబంధిత మంత్రిత్వశాఖ ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శులు కూడా ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థలతో మాట్లాడుతూ అవి వేగంగా అమలయ్యేలా విస్తృతస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంవోయూ కుదిరినప్పటి నుంచి సదరు ప్రాజెక్టు సాకారమయ్యే వరకు ఉన్న ప్రక్రియలను 9దశలుగా విభజించారు. ‘ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రాకర్‌’ పేరుతో ప్రతిప్రాజెక్టు వేగంగా సాకారం కావడానికి జిల్లాస్థాయిలో కలెక్టర్‌, పరిశ్రమలశాఖ జీఎంలు ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు. పకడ్బందీగా చేపడుతున్న ఈ చర్యల ఫలితంగా ఇప్పటి వరకు 156 సంస్థలు రూ.88,074 కోట్ల పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. మరో 131 సంస్థలు నిర్మాణ పనులు ప్రారంభించడం, యంత్రాలు ఏర్పాటుచేస్తుండడం, ప్రయోగాత్మక ఉత్పత్తి చేస్తున్న దశల్లో ఉన్నాయి. ఆయా సంస్థలు పెట్టాల్సిన రూ.2,29,351 కోట్ల పెట్టుబడుల్లో అత్యధిక భాగాన్ని ఇప్పటికే పెట్టాయి. మరో 19 సంస్థలు అన్ని రకాల అనుమతులు పొంది నిర్మాణపనులకు శంకుస్థాపన చేసి రూ.13,490 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఫలితంగా ఆయా సంస్థలన్నింటిలో కలిపి మొత్తం రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడి రానుంది. ప్రభుత్వానికి సమగ్ర పథక నివేదిక (డి.పి.ఆర్‌.)లు సమర్పించి వివిధ అనుమతుల కోసం, భూముల కోసం ఎదురుచూస్తున్న సంస్థలు మరో 264 ఉన్నాయి. ఆయా అనుమతులు, కేటాయింపుల ప్రక్రియ పూర్తయితే ఈ సంస్థలన్నీ కలిపి రూ.2,00,987 కోట్లు పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా రూ.5,31,902 కోట్ల పెట్టుబడులు సాకారం అయ్యే పరిస్థితి ఉంది. ఈ మొత్తం.. రెండు భాగస్వామ్య సదస్సుల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న పెట్టుబడుల మొత్తంతో పోల్చితే సుమారు 48.91%. ఇక మొత్తం అవగాహన ఒప్పందాల్లో 65 శాతం సాకారం అయ్యే పరిస్థితులు నెలకొనడం విశేషం.

పరిశ్రమలకు అనుకూల పరిస్థితులున్నాయి 

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సులభతర వ్యాపార నిర్వహణలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కియా మోటార్స్‌ రూ.13,500 కోట్ల పెట్టుబడితో యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టింది. సియట్‌, ఫాక్స్‌కాన్‌, డన్‌లప్‌, అపోలో తదితర సంస్థలన్నీ ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇప్పటికే రూ.3.30 లక్షల కోట్లు పెట్టుబడులు రాగా, మరో రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులకు సంబంధించిన ప్రక్రియలు వేగంగా జరుగుతున్నాయి.
-జె.కృష్ణకిశోర్‌, సీఈవో, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి మండలి

Link to comment
Share on other sites

9 minutes ago, MVS said:

Local vallani protsa hinchatam ledu ani edustunara last ki... Free ga land teesukuni duppati kappukuni padukotanika.. Eelu vastanu ante evadana voddu anara.. 

no they do even better. land chetiki vacchina next day market value ki 2 times loan teeskuni aa dabbu vere speculations ki vaadukuntaru.

Link to comment
Share on other sites

రష్యా పెవిలియన్‌.. కియా కార్ల ప్రత్యేక ప్రదర్శన
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ భాగస్వామ్య సదస్సులో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి రాష్ట్రప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. గత రెండేళ్లుగా నిర్వహించిన సదస్సుల్లో ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని పథకాలు, నిర్మిస్తున్న ప్రాజెక్టులు, అనుసరిస్తున్న విధానాలపై సమగ్ర అవగాహన కలిగేలా ఏర్పాట్లు చేసేవారు. ఈ విభాగానికి ఆహూతుల నుంచి విశేష స్పందన లభించేది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా ఈసారి రష్యా పెవిలియన్‌ పేరిట ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పరిశ్రమలశాఖ జీఎం ఎ.రామలింగేశ్వరరాజు తెలిపారు. విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశం వెళ్లినప్పుడు అక్కడి దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలిసి భాగస్వామ్య సదస్సుకు రావాలని కోరారు. భారత్‌లోని ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలందరూ దీనికి హాజరవుతారని, రష్యా ఏ రంగంలో బలంగా ఉందో సదస్సులో వివిధ రూపాల్లో ప్రదర్శించగలిగితే భారతీయ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోడానికి అవకాశం ఉంటుందని సూచించారు. ఆ ప్రతిపాదన నచ్చడంతో రష్యా నుంచి ఆ దేశ ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నట్లు అధికారిక సమాచారం అందింది. దీంతో ప్రత్యేకంగా ఒక పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ కొరియా దేశానికి చెందిన కియా మోటార్స్‌ సంస్థ   తయారు చేసే కార్లను ప్రదర్శించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రాధాన్యం దక్కేలా... 
ఆంధ్రప్రదేశ్‌కు విదేశాల్లో అత్యధిక ప్రాధాన్యం, ప్రచారం లభించడానికి వీలుగా ప్రభుత్వం విదేశీ అతిథులకు, సంస్థలకు కొంత అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ ఏడాది 39 దేశాల ప్రతినిధులను ఆహ్వానించింది. 14 దేశాల వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రులు హాజరవుతుండడం విశేషం. దక్షిణకొరియా, జపాన్‌ దేశాలు ఏయే రంగాల్లో ముందంజలో ఉన్నాయి? సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగిస్తున్న తీరు ఎలా ఉంది? అక్కడి పారిశ్రామిక సంస్థలు ఏ విధంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి?  తదితర వివరాలన్నీ ఆహూతులకు తెలిసేలా ‘కంట్రీ సెషన్స్‌’ పేరుతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. ఆ రెండు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం, పెట్టబడులను ఆకర్షించడం లక్ష్యం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...