Jump to content

CII Partenership summit-2018 Vizag


sonykongara

Recommended Posts

  • Replies 487
  • Created
  • Last Reply

ర్తలు
త్వరలో భాగస్వామ్య సదస్సు, సీఎం సమీక్ష
26-12-2017 20:47:34

అమరావతి: ఫిబ్రవరిలో విశాఖ పార్టనర్‌షిప్ సమ్మిట్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని తెలిపారు. సదస్సు ప్రారంభానికి ముందుగా ఢిల్లీలో కర్టెన్‌రైజర్ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. జనవరి 10 నుంచి 15 మధ్య కర్టెన్‌రైజర్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో 20 నుంచి 30 దేశాల రాయబారులు, హైకమిషనర్లు పాల్గొనే అవకాశముందని అధికారులకు చంద్రబాబు తెలిపారు.

Link to comment
Share on other sites

భాగస్వామ్య సదస్సు 
విశాఖ వేదికగా నిర్వహణ 
తిరుపతిలో ఎంఎస్‌ఎంఈ సదస్సు 
సీఎం చంద్రబాబు సమీక్ష
ఈనాడు, అమరావతి: భాగస్వామ్య సదస్సు-2018ని రెండు నెలల్లో ఫిబ్రవరి 24నుంచి 26వ తేదీ వరకూ విశాఖపట్నంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకంటే ముందు జనవరి 10-15వ తేదీల మధ్య దిల్లీలో దీనిపై నాంది (కర్టెన్‌రైజర్‌) కార్యక్రమం నిర్వహించనున్నారు. 20 నుంచి 30 దేశాల రాయబారులు, హైకమిషనర్లు ఇందులో పాల్గొంటారు. ‘ఛార్మింగ్‌ ఇండియాస్‌ గ్లోబల్‌ ఇంటిగ్రేషన్‌ స్ట్రాటజీ’ అనే భావన(థీమ్‌)తో ఈ సదస్సు జరపనున్నారు. సదస్సుపై ప్రచారానికి సింగపూర్‌, జపాన్‌, కొరియా, యూకే, జర్మనీ, అమెరికా, నార్వే, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో రోడ్డుషోలు ఏర్పాటు చేయనున్నారు. సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో తిరుపతిలో ఎంఎస్‌ఎంఈ సదస్సు నిర్వహించనున్నారు. వీటి ఏర్పాట్లపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఐటీ, ఎలక్ట్రానిక్‌ రంగాలతో పాటు హార్డ్‌వేర్‌ రంగాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అంతకంటే ఫలవంతంగా సదస్సు నిర్వహించాలని సూచించారు. జనవరి 18, 19వ తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల మంత్రి అమర్‌నాథరెడ్డి సమావేశం వివరాలను విలేకరులకు తెలిపారు.
భాగస్వామ్య సదస్సులో దేశ, రాష్ట్ర విభాగాల్లో పరిశ్రమలపై చర్చలు, సులభతర వాణిజ్య విధానాలు, సీఈవోలతో సీఎం సమావేశం, ఒప్పందాలు ఉంటాయి.
గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు-వాటి అమలు: 
* మొత్తం ప్రాజెక్టులు: 1900 
* రావాల్సిన పెట్టుబడులు: రూ.13.47 లక్షల కోట్లు 
*  ఉపాధి: 29.86 లక్షల మందికి 
* కార్యరూపం దాల్చిన ప్రాజెక్టులు: 927 
* వచ్చిన పెట్టుబడులు: రూ.3.65 లక్షల కోట్లు 
* లభించిన ఉపాధి: 7.72 లక్షల మందికి 
* జనవరిలో సీఎం దావోస్‌ పర్యటన: జనవరి 21 నుంచి 5 రోజుల పాటు సీఎం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

CII summit to showcaseAP’s investment potential

CM-led task force to oversee arrangements for the third edition

The CII Partnership Summit being held in Visakhapatnam next month, the third edition post-bifurcation in Andhra Pradesh, will highlight investment opportunities in logistics, food processing industries and tourism.

The prestigious event is being held in association with the Department of Industrial Policy and Promotion, the Government of India and the Andhra Pradesh government.

Unlike last year, the summit will be for three days this time. The event is being held from February 24 to 26 in view of scheduled participation of a high-level team from A.P. led by Chief Minister N. Chandrababu Naidu in the annual meeting of the World Economic Forum at Davos during the month-end.

Registration process

“We have started the registration process. The response is quite encouraging. We are expecting partnership with the governments and top industrialists from South Korea, Japan and Germany. Negotiations are going on,” a senior official of CII connected with arrangements for the summit told The Hindu.

While the first edition of the summit saw 328 MoUs signed envisaging an investment of ₹4.67 lakh crore, the second edition had attracted 665 MoUs with proposed investment of ₹10.54 lakh crore.

“The plethora of investment of opportunities in Sunrise A.P mainly in industrial and tourism clusters as well as food parks proposed in Amaravati, Visakhapatnam, Vijayawada, Tirupati and Nellore will come up for B2B meetings at the summit,” AP Chambers of Commerce and Industry Federation State president G. Sambasiva Rao said.

As part of efforts to outline the roadmap, CII will showcase the priority areas to facilitate and attract investments, promoting networking by bringing the stakeholders and create novel business models.

While the first day will begin with a discussion on charting new India and global integration strategy and a plenary session on Sunrise A.P, the second day will have deliberations on reform calculus.

The last day will see interaction with spiritual transformation leaders.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

బడా కంపెనీలకే ప్రాధాన్యం!
30-01-2018 02:50:50
విశాఖ భాగస్వామ్య సదస్సు సన్నాహక భేటీలో నిర్ణయం
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): విశాఖ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో.. భారీ పెట్టుబడులు, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చి వాటితోనే అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 24 నుంచి 26 దాకా మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరగనున్న మూడో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుపై సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌ సోమవారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి.. భారీ, మెగా పరిశ్రమలకు మాత్రమే పారిశ్రామిక భాగస్వామ్య సదస్పులో ప్రాధాన్యమివ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా, జపాన్‌ ఆసక్తి చూపుతున్నందున ఆ దేశాల కోసం ప్రత్యేక లాంజ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు

Link to comment
Share on other sites

భాగస్వామ్య సదస్సుకు 2వేల మంది విదేశీ ప్రతినిధులు
విశాఖపట్నం, న్యూస్‌టుడే: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారంతో ఈనెల 24 నుంచి మూడురోజుల పాటు విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ జిల్లా అధికారులకు సూచించారు. శనివారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుంచి 2వేల మంది వరకూ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు.

Link to comment
Share on other sites

ఎమిరేట్స్‌ వస్తోంది 
వైమానిక రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు 
ఏపీఈడీబీతో అవగాహన ఒప్పందం 
ఎమిరేట్స్‌ ఛైర్మన్‌ మక్దూమ్‌తో చంద్రబాబు భేటీ 
పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా సీఎం దుబాయి పర్యటన 
భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం 
సామర్లకోటలో భారీ రైస్‌మిల్లు ఏర్పాటుకు ఫీనిక్స్‌ సంసిద్ధత 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటు చేస్తాం: షరాఫ్‌ గ్రూపు 

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైమానికరంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు దుబాయికి చెందిన ఎమిరేట్స్‌ గ్రూపు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఎమిరేట్స్‌ గ్రూపునకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి సంస్థ(ఏపీఈడీబీ)కి మధ్య గురువారం కీలక అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. దీంతో రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల వరకూ పెట్టుబడులు వచ్చే అవకాశముంది.
అమరావతి సర్వీసుకు సిద్ధంగా ఉన్నాం 
ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు, ఈ నెలాఖరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు దుబాయికి చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖుల్ని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం దుబాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ అండ్‌ గ్రూప్‌, దుబాయి నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌(డి నాటా) ఛైర్మన్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మక్దూమ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల్ని సరళీకృతం చేస్తే అమరావతితో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని మక్దూమ్‌ తెలిపారు. ఎంఓయూపై మక్దూమ్‌, ఏపీఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్‌ సంతకాలు చేశారు.
విమానాల తయారీ కేంద్రాల ఏర్పాటు.. 
ఈ ఒప్పందం ప్రకారం విమానాల తయారీ, విమానాల ఇంటీరియర్‌, డ్యూరబుల్స్‌ తయారీ కేంద్రాలను ఎమిరేట్స్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తుంది. వైమానిక శిక్షణకు అకాడెమీని నెలకొల్పుతుంది. విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్‌(ఎంఆర్‌ఆర్‌) సదుపాయం ఏర్పాటు చేస్తుంది. ఎమిరేట్స్‌ గ్రూపు, ఏపీఈడీబీ కలసి వర్కింగ్‌ గ్రూపులు ఏర్పాటు చేస్తాయి. ఏరోస్పేస్‌ రంగంలో మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించడం, వాటిలో ‘ఎమిరేట్స్‌’ పెట్టుబడులకుగల అవకాశాల్ని ఈ గ్రూపులు పరిశీలిస్తాయి. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో వైమానిక రంగానికి సంబంధించిన నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపులోను ఎమిరేట్స్‌, ఏపీఈడీబీ కలసి పనిచేస్తాయి.
మాతో కలసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయండి 
విమానయానరంగంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి సంయుక్త భాగస్వామ్య (జాయింట్‌ వెంచర్‌) సంస్థను ఏర్పాటు చేయాలని మక్దూమ్‌ను చంద్రబాబు కోరారు. అమరావతిని సందర్శించాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణలో భాగస్వామ్యం తీసుకోవాలని కోరారు.
దుబాయి హోటళ్లలో లక్ష గదులు 
‘‘విమానాలు ప్రయాణికుల్ని చేరవేస్తాయి. ఆయా గమ్యస్థానాల్లో ప్రయాణికులకు అవసరమైన వసతులూ ఉండాలి. ముఖ్యంగా ప్రయాణికులు సేదతీరేందుకు తగిన వసతి, షాపింగ్‌ మాల్స్‌, సమావేశ మందిరాలు ఉండాలి. పర్యాటకాభివృద్ధి అనేది ఎక్కడైనా కీలకం’’ అని మక్దూమ్‌ పేర్కొన్నారు. దుబాయి హోటళ్లలో లక్షకుపైగా గదులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో యూఏఈలో భారత రాయబారి నవదీప్‌ సూరి కూడా పాల్గొన్నారు. ఎమిరేట్స్‌ సంస్థకు చెందిన నెట్‌వర్క్‌ కంట్రోల్‌ సెంటర్‌ను చంద్రబాబు బృందం తిలకించింది.
ఏరోసిటీ ఏర్పాటుకు దుబాయి ఏరోస్పేస్‌ ఆసక్తి 
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ స్థాయి ఏరోసిటీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నామని, సౌదీ అరేబియా ఫైనాన్షియర్స్‌తో కలసి పనిచేస్తున్నామని దుబాయి ఏరో స్పేస్‌ డైరెక్టర్‌, దుబాయి ఎయిర్‌పోర్టు ఫ్రీ జోన్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌, దుబాయి సిలికాన్‌ ఒయాసిస్‌ అథారిటీ (డీఎస్‌ఓఏ) వైస్‌ఛైర్మన్‌ మహమ్మద్‌ అహ్మద్‌ అల్‌ ఝరూనీ తెలిపారు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరవుతామని ఆయన పేర్కొన్నారు. అప్పటికి స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని ఝరూనీకి ముఖ్యమంత్రి సూచించారు.

అవసరమైన భూమి కోసం చూస్తున్నాం 
భారత ప్రభుత్వం ఆహార శుద్ధి రంగానికి సంబంధించి సరైన విధానం ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని షరాఫ్‌ గ్రూపు ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రితో షరాఫ్‌ గ్రూపు వైస్‌ఛైర్మన్‌ షరాఫుద్దీన్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌ షరాఫ్‌ తదితరులు సమావేశమయ్యారు. 
ముఖ్యమంత్రితో దుబాయిలో పర్యటించిన బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర, జి.సాయిప్రసాద్‌, అజయ్‌జైన్‌, జాస్తి కృష్ణకిశోర్‌ తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. 
రాష్ట్రప్రభుత్వ చొరవకు ప్రశంసలు
తాము ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌తో పాటు, ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించిన లాజిస్టిక్స్‌పైనా దృష్టి సారించామని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు కల్పించాలని షరాఫ్‌ ముఖ్యమంత్రిని కోరారు. ఆహారశుద్ధి పరిశ్రమలకు సంబంధించిన ఎలాంటి అనుమతులైనా వేగంగా ఇస్తామని, తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవను షరాఫ్‌ ప్రశంసించారు. త్వరలో తమ సంస్థ ఓ ఉన్నతస్థాయి బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తుందని, దుబాయిలో తమ సంస్థ ఆధ్వర్యంలో జరిగే వ్యాపారవేత్తల సదస్సుకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని ఆయన ఆహ్వానించారు.

3 లక్షల టన్నుల సామర్థ్యంతో రైస్‌ మిల్లు 
ప్రపంచంలోనే అతి పెద్ద రైస్‌ మిల్లు రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ‘మెగా ఇంటిగ్రేటెడ్‌ రైస్‌మిల్‌ ప్రాజెక్టు’ చేపట్టేందుకు ఫీనిక్స్‌ గ్రూపు సంస్థ ముందుకు వచ్చింది. ఏప్రిల్‌ నుంచి పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ సంస్థ ఛైర్మన్‌, సీఈఓ గౌరవ్‌ ధావన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగంలో చేపడుతున్న వినూత్న విధానాల్ని ధావన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. అనంతపురం జిల్లాలో వేరుసెనగ సాగు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని, ‘పీనట్‌ బటర్‌’ తయారీ యూనిట్‌ నెలకాల్పొలని కోరారు.
రెండు లక్షల టన్నులు విదేశాలకు.. 
సామర్లకోటలో నెలకొల్పే రైస్‌ మిల్లు ప్రాజెక్టు వార్షిక సామర్థ్యం 3 లక్షల మెట్రిక్‌ టన్నులు. దీనిలో లక్ష మెట్రిక్‌ టన్నులు దేశీయ మార్కెట్‌లో వినియోగించాలని, మిగతా 2 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి చేయాలన్నది ఫీనిక్స్‌ సంస్థ ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు వల్ల 200 నుంచి 400 మందికి ఉద్యోగాలు వస్తా

Link to comment
Share on other sites

ఏర్పాటు చేయండి 
ఓ పారిశ్రామిక సెజ్‌ను కూడా పెట్టండి 
డీపీ వరల్డ్‌ ఛైర్మన్‌ను కోరిన చంద్రబాబు 

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కనీసం మూడు చోట్ల లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేయాలని, ఓ పారిశ్రామిక సెజ్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని దుబాయికి చెందిన ప్రముఖ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ డీపీ వరల్డ్‌ ఛైర్మన్‌ సుల్తాన్‌ బిన్‌ సులేయామ్‌ను సీఎం చంద్రబాబు కోరారు. ఒకరోజు దుబాయి పర్యటనలో భాగంగా గురువారం వీరిరువురు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తన ప్రతిపాదనపైన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్నారు. విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాల్ని పరిశీలించేందుకు, పరస్పర సహకారానికి డీపీ వరల్డ్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో ఒక కార్యబృందం ఏర్పాటైంది. దీనిలో డీపీ వరల్డ్‌ సీఈఓ యువరాజ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఇంధన, మౌలిక సదుపాయాలశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ఉంటారు. ఏపీలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు వెంటనే ఒక బృందాన్ని పంపిస్తామని సులేయామ్‌ తెలిపారు. భారత్‌లోని నౌకాశ్రయాలకు వస్తు సరఫరాలో ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకుల్ని ముందుగా తొలగించాలని, లాజిస్టిక్స్‌, పారిశ్రామిక పార్కులను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన సీఎంతో వ్యాఖ్యానించారు. ఈ భేటీలో డీపీ వరల్డ్‌ గ్రూపు డిప్యూటీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి రాజ్‌జిత్‌సింగ్‌ వాలియా, కార్పొరేట్‌ ఫైనాన్స్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఉపాధ్యక్షుడు గౌరవ్‌ ఖన్నా పాల్గొన్నారు.
పెట్టుబడులకు ప్రతిపాదనలు..ఆహ్వానాలు 
* ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు గాను భూమిని కేటాయించాలని డిక్షన్‌ టెక్నాలజీస్‌ ఛైర్మన్‌ సునీల్‌ వచ్‌నానీ సీఎం చంద్రబాబును కోరారు. తిరుపతిలో 2 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన కర్మాగారం సిద్ధంగా ఉందని ఆయన సీఎంతో చెప్పారు. ప్రస్తుతం తిరుపతిలోని తమ సంస్థలో 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఈ సంఖ్యను రెండు వేలకు పెంచుతామన్నారు. డిక్సన్‌ సంస్థ ప్రతిపాదనలపై స్పందించిన సీఎం వారికి కావాల్సిన సహకారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
* దుబాయ్‌కు చెందిన స్టీల్‌ తయారీ, ఇంజినీరింగ్‌ సంస్థ కొనరెస్‌ సీఈవో భరత్‌ భాటియాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
* ప్రముఖ ఐవోటీ సంస్థ సిగఫోక్స్‌ సీఈవో ఫసీ అక్తర్‌ను చంద్రబాబు కలిశారు. ఫ్రెంచ్‌కు చెందిన ఈ సంస్థ తక్కువ విద్యుత్తు వినియోగంతో కూడిన ఐవోటీ పరికరాల తయారీలో పేరుగాంచింది. ఫసి అక్తర్‌తో జరిగిన భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ ‘‘మేం ఐవోటీని పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నాం. మీరు ఏపీని సందర్శించి మా రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా ఐవోటీ పరికరాలను తయారు చేయండి. పూర్తి ఆకృతులు, తయారీ ప్రతిపాదనలతో వస్తే వాటిని పరిశీలిస్తాం’’ అన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 300 మిలియన్‌ డాలర్ల నిధిని తాము ఏర్పాటు చేస్తున్నామని కాఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
విశాఖపట్నం కన్వెన్షన్‌ సెంటర్‌ ఆకృతులు సిద్ధం 
విశాఖపట్నంలో లులూ గ్రూపు ఏర్పాటు చేస్తున్న కన్వెన్షన్‌ సెంటర్‌కు సంబంధించిన నిర్మాణ ఆకృతులు సిద్ధమయ్యాయి. వీటిని దుబాయ్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఆ సంస్థ ప్రతినిధులు చూపించారు.
పెట్టుబడులు పెట్టండి... భరోసా నాది! 
మీరు పెట్టుబడులు తీసుకురండి...అనుమతులు వ్యవస్థాపన అంశాలకు నేను భరోసాగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయిలోని పారిశ్రామికవేత్తలతో పేర్కొన్నారు.  ఏపీ పారిశ్రామిక రాజధాని విశాఖపట్నంలో ఈ నెల 24, 25, 26వ తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సుకు మీరు తప్పక రావాలని ఆహ్వానించారు. యూఏఈ బిజినెస్‌ లీడర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ‘‘ఏపీలో అవకాశాలు-ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాటామంతీ’’ అనే ఇతివృత్తంతో గురువారం దుబాయ్‌లో ఏర్పాటైన రోడ్‌ షోలో పాల్గొన్నారు. గల్ఫ్‌లో స్థిరపడిన భారతీయ సంతతి వాణిజ్యవేత్తలనుద్దేశించి మాట్లాడుతూ జన్మభూమిని మాత్రం మర్చిపోవద్దన్నారు. భారత్‌ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ప్రతి పారిశ్రామికవేత్త, ప్రతి వాణిజ్యవేత్త ఒక యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలనేది తన స్వప్నమని అన్నారు. ‘‘భవిష్యత్తు దార్శనికతతో రాష్ట్రాభివృద్ధికి 2022, 2029, 2050 వరకూ స్పష్టమైన లక్ష్యాలు ఏర్పరుచుకుని ముందుకు సాగుతున్నాను. వ్యాపార అనుకూల వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్నాం. లీ క్వాన్‌ యీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ వారి సహకారం తీసుకుంటున్నాం. ఏపీలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నాం. పెట్టుబడులు పెట్టేవారికి కావాల్సిన అన్ని అనుమతులు, వసతులు వెంటనే కల్పిస్తాం’’అని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

సఫలానికి 10 కమిటీలు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖపట్నం వేదికగా ఈ నెల 24 నుంచి జరిగే 24వ భాగస్వామ్య సదస్సు-2018 విజయవంతమయ్యేందుకు కమిటీలను నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు రూ.2 కోట్ల నిధులనూ విడుదల చేసింది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతిపాదనల మేరకు ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టీరింగ్‌ కమిటీతోపాటు మొత్తం పది కమిటీలను నియమించింది. స్టీరింగ్‌ కమిటీలో ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరించగా.. వివిధ శాఖలకు చెందిన 8 మంది మంత్రులు సభ్యులుగా ఉంటారు. సీఐఐ డీజీ కో-ఛైర్మన్‌గా, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. వర్కింగ్‌ కమిటీలో ఆర్థికమంత్రి ఛైర్మన్‌గా, పరిశ్రమల శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా, సీఐఐ దక్షిణ ప్రాంత డిప్యూటీ ఛైర్మన్‌ కో-ఛైర్మన్‌గా ఉంటారు. ప్రొటోకాల్‌, వసతి, రవాణ కమిటీలో సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శి ఛైర్మన్‌గా, విశాఖ కలెక్టర్‌ కన్వీనర్‌గా ఉంటారు. భద్రతా, వాహనాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో శాంతి భద్రతల అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఛైర్మన్‌గా, విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. నగర అందాలను పర్యవేక్షించే కమిటీలో మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిని ఛైర్మన్‌గా, జీవీఎంసీ కమిషనర్‌ను కన్వీనర్‌గా నియమించారు. కల్చరల్‌ కమిటీకి పర్యాటకశాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా.. మీడియా, పబ్లిసిటీ కమిటీకి సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ ఛైర్మన్‌గా ఉంటారు. పెట్టుబడుల ప్రచార కమిటీలో సీఎం ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా, ఏపీ ఆర్థికాభివృద్ధి సంస్థ సీఈవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వ్యాపార భాగస్వామ్య, అభివృద్ధి కమిటీలో సీఎం ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా, పరిశ్రమల శాఖ కమిషనర్‌ కన్వీనర్‌గా ఉంటారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...