Jump to content

2G SCAM Judgement on Thursday


AnnaGaru

Recommended Posts

  • Replies 87
  • Created
  • Last Reply

బ్రేకింగ్ : 2జీ కేసులో అంతా నిర్దేషులే ... కోర్టు సంచలన తీర్పు

 

21-12-2017 10:53:14
 
636494504031697633.jpg
చెన్నై: యూపీఏ హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్ట్రం కేసులో పాటియాలా ప్రత్యేక కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. డీఎంకే సీనియర్‌నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాలు పించలేకపోయిదంటూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఇటు కనిమొళి, రాజాలకు భారీ ఊరట కలగడంతో పాటు డీఎంకే పార్టీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కీలకమైన ఆర్కేనగర్ పోలింగ్ నేపథ్యంలో ఈ తీర్పు వెలువడటం డీఎంకేకు బలం చేకూరినట్టయింది. అటు మన్మోహన్ సారథ్యంలోని నాటి యూపీఏ ప్రభుత్వానికి కూడా నైతికబలం చేకూరినట్టయింది.
 
 
 
కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డీఎంకేకు చెందిన ఎ.రాజా టెలికంశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆయన 2జీ స్పెక్ట్రం కేటాయించడంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కంట్రోల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక దాఖలు చేసింది. ఈ అవినీతి కారణంగా ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు కాగ్‌ స్పష్టం చేసింది. దీనిపై సీబీఐ రెండు కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ ఒక కేసు నమోదు చేశాయి. స్వాన్‌ టెలికాం సంస్థకు 2జీ స్పెక్ట్రం కేటాయించినందుకు ప్రతిఫలంగా డీఎంకేకు సొంతమైన కలైంజర్‌ టీవీకి రూ.200 కోట్లు లంచం ముట్టజెప్పారని వచ్చిన ఆరోపణలను ఈ కేసులతో జత చేయగా, ఢిల్లీ సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ ఈ కేసులపై విచారణ జరిపారు. సీబీఐ దాఖలు చేసిన రెండు కేసులలో మొదటి కేసులో ఎ.రాజా, కనిమొళి, టెలికంశాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్ద్‌ బెహ్రా, ఎ.రాజా మాజీ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌కే సంతాలియా తదితర 14 మందిని నేరస్థులుగా చేర్చారు. రిలైన్స్‌ టెలికాం, స్వాన్‌ టెలికాం, యునిటెక్‌ వైర్‌లెస్‌ సంస్థలు విచారణకు హాజరై సాక్ష్యం చెప్పాయి. 2జీ స్పెక్ట్రం హక్కులను 122 మందికి కేటాయించడంలో ప్రభుత్వానికి రూ.30,984 కోట్ల ఆదాయానికి గండి పడిందని ఛార్జ్‌షీటులో నమోదు చేశారు. ఆరేళ్లకు పైగా సాగిన విచారణ గత ఏప్రిల్‌ 26న ముగిసింది. దీనితో డిసెంబర్‌ 21న తీర్పు వెలువరించనున్నట్టు ఢిల్లీ సీబీఐ కోర్టు డిసెంబర్‌ మొదటి వారంలో ప్రకటించింది. గురువారం తీర్పు సందర్భంగా కనిమొళి, రాజా సహా నిందుతులందరూ కోర్టుకు హాజరయ్యారు. తుది తీర్పులో వీరిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించడంతో కనిమొళి, రాజా సంతోషం వ్యక్తం చేశారు. డీఏంకే సంబరాలు జరుపుకొంటోంది.
Link to comment
Share on other sites

2జీ కుంభకోణంలో రాజా, కనిమొళి నిర్దోషులు 
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు 
21brk68a.jpg

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్టం కుంభకోణం కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి నిర్దోషులుగా తేలారు. ఈ మేరకు పాటియాలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందునే వారిని నిర్దోషులుగా తేల్చినట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం చోటుచేసుకుంది. ఆ సమయంలో డీఎంకేకు చెందిన ఎ. రాజా టెలికాం శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే ఆయన నేతృత్వంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) ఆరోపించింది. ఈ అవినీతి వల్ల ప్రభుత్వానికి రూ.1.76లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.

కాగ్‌ ఆరోపణలు చేయడంతో 2010లో ఎ. రాజాను అప్పటి ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టింది. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా 17 మంది నేతలు, కార్పొరేట్‌ సంస్థల అధికారులపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 2011లో రాజాను అరెస్టు చేశారు. ఏడాది పాటు జైల్లో ఉన్న రాజా ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

డీఎంకే సంబరాలు 
సీబీఐ కోర్టు తీర్పుపై డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ తీర్పుతో న్యాయం గెలిచిందని, ఇది తమిళనాడు ప్రజలందరికీ సంతోషకరమైన వార్తని డీఎంకే నేతలు అంటున్నారు.

Link to comment
Share on other sites

next coal 400k daani acquitt cheyandi

mee votlu seatla raajakeeyala kosam deshanni nasanam chesthunaruga.

rey siddipet lo monna oka rhythu thana bharya ni 25 years kodukuki,22 years kuthuriki visham ichhi chachipoyaru andaru

kevalam 6 lakshayala appu teerchaleka

meeru matram 176k cr ni oorikey ichesaru

etu potundi ee desham

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...