Jump to content

నవ్యాంధ్రప్రదేశ్ లో డబ్బు లేదు కానీ


Guest Urban Legend

Recommended Posts

Guest Urban Legend

వార్‌ రూమ్‌లు.. యుద్ధ విమానంలో రాష్ట్ర విభజన బిల్లు... పార్లమెంట్‌ తలుపులు మూసి, టీవీలు ఆపి విభజనచేశారు... పొట్టకొట్టి పంపారు.. కట్టుబట్టలతో నెట్టారు... ఆస్తులు ఇవ్వలేదు.. అప్పులు నెత్తిన పెట్టారు.. మన పొట్ట కొట్టి బజారుల్లోకి నెట్టారు... కట్టుబట్టలతో మనల్ని బయటకు పంపించారు. ఆస్తులు వాళ్లకిచ్చారు. అప్పులు మన నెత్తి మీద రుద్దారు... 60ఏళ్లపాటు హైదరాబాద్‌ను అభివృద్ధిచేసుకుంటే... కట్టుబట్టలతో, నెత్తిమీద అప్పులతో బయటకు పంపారు. మీకు అండగా ఉంటామన్న మాట కూడా చెప్పకుండా విభజించారు. నిధులు లేవు. రాజధాని లేదు. ఎన్నో కష్టాలతో ప్రయాణం మొదలైంది... కానీ, దాన్ని తలచుకుంటూ కూర్చోలేదు. విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి.. డిపాజిట్లు లేకుండా చేశాం. ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాం, ముందుగా ఒక నాయకుడుని ఎన్నుకున్నాం...

andhra-17122017-2.jpg

ఆయన నాయకత్వం లో పురోగమించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆంధ్రుడు పైకి, ఏం పట్టనట్టు ఉంటారు, కానీ, వీళ్ళు వేసే ప్రతి అడుగు బలంగా భూభనోంతరాలు దద్దరిల్లేలా ఉంటుంది. రాజధాని కూడా లేకుండా, చేసినచోటే, ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించుకొంటున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద పెట్టుబడులు ఆకర్షించటంలో ప్రధమస్థానంలో ఉంది. విద్యుత్తు లో మొదటి స్థానంలో ఉంది. స్వఛ్ఛనగరాలలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది....ఇలా, ఒకటి కాదు, రెండు కాదు...అన్నిట్లో ప్రధమస్ధానమే లక్ష్యంగా దూసుకెళ్తుంది... కష్టాలలో ప్రయాణం మొదలైనా, మన ధైర్యం... "హమారా పాస్ బాబు హై" అంటూ ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం.. మా పిల్లల భవిష్యత్తుకు భయం లేదు, అది చంద్రబాబు చూసుకుంటాడు అని నిశ్చింతగా ఉన్నాం... ఆ ధైర్యమే, ఇవాళ హెల్మెట్ల మీద కూడా "నవ్యాంధ్రప్రదేశ్ లో డబ్బు లేదు కానీ కావాలిసినంత దమ్ము ఉంది.. ఆ దమ్ము పేరే చంద్రబాబు.." అని రాసుకుంటూ ధైర్యంగా తిరుగుతున్నారు...

కాని మనకు, సొంత రాష్ట్రం నుంచే మనకు శత్రువులు తయారు అయ్యారు. మన రాష్ట్రం బాగుపడుతుంది అంటే ఏడుపు... అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్తే ఏడుపు.... పలానా జిల్లాలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్తే సన్నాయినొక్కులు... పలానా ప్రాజెక్ట్ వస్తుంది అంటే నిట్టూర్పులు... పలానా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది అంటే ఎగతాళి... మీకు రాష్ట్రం ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి... వెనకటకి ఎవడో, చెరువు మీద అలిగి, ఎదో చెయ్యలేదు అంట... ప్రభుత్వం సక్రమంగా చేసే ప్రతి పనిని ఎగతాళి చేస్తే, నీ రాష్ట్రాన్ని, నీ ప్రాంతాన్ని, నీ జిల్లాని, నీ ఊరిని, నువ్వే ఎగతాళి చేస్తున్నట్టు, అనే చిన్న లాజిక్ మర్చిపోతున్నాం....ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు తెలుసుకోవాల్సింది, ఆంధ్రవాడికి జరిగింది అన్యాయం కాదు, అవమానం... ఆ గాయాలు నుంచి, ఇప్పుడు ఇప్పుడే బయటపడుతున్నాం... ఉన్మాదుల లాగా, మానుతున్న గాయాన్ని, మళ్లీ పెద్దది చెయ్యకండి.... తగిలన చోట, మళ్ళి కొడితే, చిన్న దెబ్బ అయినా, తట్టుకోలేని నొప్పి ఉంటుంది... మీ లాంటి సైకోలు ఎంత మంది ఉన్నా, నవ్యాంధ్ర భవిష్యత్తు తీర్చిదిద్దేది చంద్రబాబు మాత్రమే... మూడ్ అఫ్ ది స్టేట్ అర్ధం చేసుకుని, సైకోలులా కాకుండా, మనుషులుగా బ్రతకండి...

source http://www.amaravativoice.com/avnews/news/people-supporting-cbn

Link to comment
Share on other sites

Guest Urban Legend
37 minutes ago, Yaswanth526 said:

2 lakh crores appulu unnayi :sleep:

hyd outer ring road nd  metro appulu ap ki vesthey alagey avuthayi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...