Jump to content

సీఎంను పిలవలేదు.. నేనెలా వెళ్తా..’


sonykongara

Recommended Posts

సీఎంను పిలవలేదు.. నేనెలా వెళ్తా..’
16-12-2017 16:59:15
 
636490403610531155.jpg
హైదరాబాద్: ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వానాన్ని తిరస్కరించారు. తెలుగు మహాసభలలో ప్రవచనాలు చెప్పమని తనను పిలిచారని.. కానీ తాను వెళ్లడం లేదని గరికపాటి స్పష్టం చేశారు. తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కనీసం ఆహ్వానించలేదన్న ఆయన.. ఆంధ్రాకు చెందిన వాడిగా తాను మహాసభలకు వెళ్లడం భావ్యం కాదని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

11 minutes ago, sonykongara said:
సీఎంను పిలవలేదు.. నేనెలా వెళ్తా..’
16-12-2017 16:59:15
 
636490403610531155.jpg
హైదరాబాద్: ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వానాన్ని తిరస్కరించారు. తెలుగు మహాసభలలో ప్రవచనాలు చెప్పమని తనను పిలిచారని.. కానీ తాను వెళ్లడం లేదని గరికపాటి స్పష్టం చేశారు. తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కనీసం ఆహ్వానించలేదన్న ఆయన.. ఆంధ్రాకు చెందిన వాడిగా తాను మహాసభలకు వెళ్లడం భావ్యం కాదని పేర్కొన్నారు.

mogadi laaga mataladedu

Link to comment
Share on other sites

శభాష్ గరికపాటి గారు... ఆంధ్రల ఆత్మ గౌరవం నిలబెట్టారు...

   
garikapati-16122017-1.jpg
share.png

ప్రపంచ తెలుగు మహాసభల పేరు మీద తెలంగాణా మహాసభలు నిర్వహిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని పిలవకుండా ఎలా అవమాన పరిచిందో అందరూ చూస్తూనే ఉన్నారు... ఎంత మంది అది తప్పు అని చెప్పినా, కెసిఆర్ మాత్రం చంద్రబాబుని పిలవలేదు... ఆంధ్రప్రదేశ్ లో స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ, పార్టీలకు అతీతతంగా, దీన్ని ఖండించారు.. ఇది ప్రతి ఆంధ్రుడికి జరిగిన అవమానంగా భావించారు... ఇలా ప్రతి ఆంధ్రుడు అవమానంగా భావిస్తూ ఉండగానే, తెలంగాణా ప్రభుత్వం మన రాష్ట్రానికి చెందిన, గరికపాటి నరసింహారావు గారిని ప్రవచనాలు చెప్పటానికి ఆహ్వానించింది... అయితే, ఆయన ప్రతి ఆంధ్రుడిలో ఉన్న భాదను వెళ్లగక్కారు... తెలంగాణా ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించారు...

 

garikapati 16122017 2

తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని నన్ను పిలిచారు బాగానే ఉంది, కానీ మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని కనీసం ఆహ్వానించని తెలుగు మహాసభలకు, ఆంధ్ర కు చెందిన వాడిగా నేను వెళ్లడం భావ్యం కాదని ఆ ఆహ్వానాన్ని సవినయంగా తిరస్కరిస్తున్నాను అని, తెలంగాణా ప్రభుత్వానికి చెప్పి, నిఖార్సైన ఆంధ్రోడు అనిపించుకున్నారు గరికపాటి నరసింహారావు గారు... గరికపాటి నరసింహారావు గారు తీసుకున్న నిర్ణయంతో ప్రతి ఆంధ్రుడు ఆయన్ని అభినందిస్తున్నారు...

garikapati 16122017 3

కెసిఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు అని చెప్పగానే, సరిహద్దులకు అతీతంగా తెలుగువారందరూ పాల్గొనేలా చేసి రాష్ట్రాలుగా విడిపోయినా.. జాతిగా, సాంస్కృతికంగా కలిసే ఉన్నాం అన్న స్పృహను కల్పిస్తారు అని అందరూ భావించారు... కాని ఇక్కడ జరిగింది వేరు... కనీసం పక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవకుండా, తెలుగు తల్లి పాట పాడకుండా, తెలుగు తల్లి విగ్రహం పెట్టకుండా, తెలుగు భాషకు సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని కనీసం గౌరవించకుండా, తీవ్ర అవమానాలు గురించేస్తూ, తెలుగు మహాసభల పేరు మీద తెలంగాణా మహాసభలు నిర్వహిస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి, ఒక ఆంధ్రుడిగా గరికపాటి నరసింహారావు గారు చేసిన పనికి, మేము పడుతున్న ఆవేదనకు శభాష్ అనకుండా ఉండలేము... ఇప్పుడు మాకు తెలుగు మహా సభలు సమావేశాలు అవసరం కన్నా, తెలుగు తల్లి ఆత్మ గౌరవం ముఖ్యం... మీకు పాదాభివందనం చేస్తున్నాం గరికపాటి నరసింహారావు గారు...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...