Jump to content

NTR Anna canteens


sonykongara

Recommended Posts

  • Replies 559
  • Created
  • Last Reply
వంద అన్న క్యాంటిన్లు సిద్ధం!
తొలి విడతగా వంద చోట్ల ప్రారంభం
నెలాఖరులోగా అందుబాటులోకి వచ్చే అవకాశం
నిత్యం ఒక్కోచోటా  900 మందికి ఆహారం
30ap-main8a.jpg

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో తొలి విడతగా వంద ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభించేలా, మిగతావి దశల వారీగా అన్ని పట్టణాల్లోనూ ఏర్పాటయ్యేలా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. నిరుపేదల ఆకలి తీర్చేందుకు 50వేల జనాభా పైబడిన పట్టణాల్లో 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదాని నిర్మాణానికి రూ.36 లక్షలు చొప్పున సర్కారు కేటాయించి ఆహార సరఫరా ఒప్పందాన్ని ఒక సంస్థకు ఖరారు చేసిన విషయం తెలిసిందే. స్థలాల కొరతతో అన్నిచోట్లా ఒకేసారి పనులు మొదలుపెట్టడం సాధ్యం కాలేదు. అందుబాటులోవున్న వంద చోట్ల ప్రారంభించిన పనులు చివరి దశకు చేరుకున్నాయి. నెలాఖరులోగా వీటిని తెరపైకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే విజయవాడ, గుంటూరులోని రెండు క్యాంటీన్లలో అధికారులు ‘ట్రయిల్‌ రన్‌’ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

వారంలో ఆరు రోజులపాటు..
కొత్తగా ప్రారంభించే వంద క్యాంటీన్లు వారంలో ఆరు రోజులపాటు తెరిచి ఆదివారం మూసివేయనున్నారు. అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి కలిపి రూ.15 వసూలు చేస్తారు. పూటకు రూ.5 ధర నిర్ణయించి ఒక్కో క్యాంటీన్‌లో రోజూ మూడు పూటలా కలిపి 900 మందికి ఆహారాన్ని అందించనున్నారు. అల్పాహారం 300 మందికి, మధ్యాహ్న భోజనం 360, రాత్రి భోజనం 240 మందికి అందిస్తారు. ప్రారంభించాక పేదల హాజరు, అవసరాన్ని బట్టి పెంచనున్నారు.

వారంలో ఆరు రోజులపాటు క్యాంటీన్లలో అందించే అల్పాహారం వివరాలు
* సోమవారం  ఇడ్లీతోపాటు చట్నీ/పొడి, సాంబారు లేదా పూరితో పాటు కుర్మా
* మంగళవారం ఇడ్లీతోపాటు చట్నీ/పొడి, సాంబారు లేదా ఉప్మాతో పాటు చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్‌
* బుధవారం   ఇడ్లీతోపాటు చట్నీ/పొడి, సాంబారు లేదా పొంగల్‌తో పాటు చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్‌
* గురువారం   ఇడ్లీతోపాటు చట్నీ/పొడి, సాంబారు లేదా పూరితో పాటు కుర్మా
* శుక్రవారం    ఇడ్లీతోపాటు చట్నీ/పొడి, సాంబారు లేదా ఉప్మాతో పాటు చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్‌
* శనివారం    ఇడ్లీతోపాటు చట్నీ/పొడి, సాంబారు లేదా పొంగల్‌తో పాటు చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్‌
* అల్పాహారంలో ప్లేటుకు మూడు ఇడ్లీ/పూరి ఇస్తారు. ఉప్మా/పొంగల్‌ 200గ్రాములు., చెట్నీ/పొడి 15గ్రా., సాంబారు 150గ్రా., మిక్చర్‌ 25 గ్రాములు ఉటుంది.
* మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నంతోపాటు కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి ఇస్తారు.
* మధ్యాహ్న/రాత్రి భోజనంలో అన్నం 400 గ్రాములు, కూర 100 గ్రాములు, పప్పు/సాంబారు 120 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు ఉంటుంది.
* అల్పాహారం ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
* మధ్యాహ్న భోజనం 12.30 నుంచి 3 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
* రాత్రి భోజనం 7.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది.

30ap-main8b.jpgబడ్జెట్‌లో రూ.200 కోట్ల కేటాయింపు
రాష్ట్రంలోని 71 పట్టణ ప్రాంతాల్లో 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించింది. ప్రస్తుతానికి వంద సిద్ధం చేసినా మిగతావీ దశలవారీగా ప్రారంభిస్తాం. ఒక్కొక్కరి నుంచి మూడు పూటలా కలిపి రూ.15 వసూలు చేస్తున్నా రూ.73 వరకు ఖర్చవుతుందని అంచనా వేశాం. ఒక్కొక్కరిపై ప్రభుత్వం రాయితీగా రూ.58 చొప్పున భరించనుంది. అన్ని సౌకర్యాలతో అద్భుతంగా క్యాంటీన్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం.
-డా.కన్నబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ సంచాలకులు
Link to comment
Share on other sites

Dega Retweeted
 

GVMC has been setting-up 'Anna Canteens' in all Zones. The food is available in these Canteens at highly subsidised & nominal prices. Free trial run started in one of such canteen near Regional eye hospital, @GVMC_OFFICIAL , zone-II. Beneficials appreciating @ncbn afforts.

DhpfUhSUEAE7cGL.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...