Jump to content

NTR Anna canteens


sonykongara

Recommended Posts

  • Replies 559
  • Created
  • Last Reply
3 hours ago, Raaz@NBK said:

Viralam ichina andharu telisina Valle.. Relatives kuda vunnaru.. :shakehands:

Rashtram lo prabhutvaniki annitilo anda danda gaa untu.. Prabhutvaniki cheyootanistunna maa Zamindaar gaari Parampara ..... Vardillaaali

Link to comment
Share on other sites

అన్న క్యాంటీన్లపై ప్రజల స్పందన ఇది..!
28-07-2018 07:34:53
 
636683600936468637.jpg
  • అన్నార్తులకు అన్నపూర్ణ
  • నగరంలో అందుబాటులో మూడు అన్న క్యాంటీన్లు
  • త్వరలో మరో ఐదు ప్రారంభం
  • మొత్తం 15 క్యాంటీన్లు ప్రారంభించాలన్నది లక్ష్యం
  • రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ
  • పూటకు 600 మందికిపైగా భోజనం
 
విజయవాడ: ప్లేట్‌ ఇడ్లీ తినాలంటే రూ.20 చేతిలో ఉండాలి. రెండు పూటలా భోజనం చేయాలంటే కనీసం రూ.100 ఉండాలి. నగరంలో ఏ సాధారణ హోటల్‌కి వెళ్లినా ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు జేబులో రూ.15 ఉంటే చాలు. ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనం చేసేయొచ్చు. ఇదంతా అన్న క్యాంటీన్‌ల చలవే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లు నగరంలోని పేద వర్గాలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. పూటకు 300 ప్లేట్ల లక్ష్యంతో ప్రారంభమైన క్యాంటీన్లు ప్రస్తుతం 600 మందికిపైగా భోజనం అందిస్తున్నాయి.
 
 
 
మరిన్ని క్యాంటీన్లు అవసరం
నగరంలో 15 అన్న క్యాంటీన్ల రూపకల్పనకు ప్రణాళికలు రచించగా.. ఆ సంఖ్యను 25కు పెంచాలని ప్రభుత్వానికి శాసనసభ్యులు విజ్ఞప్తులు చేస్తున్నారు. తొలుత నగరంలోని విద్యాధరపురంలో, ధర్నా చౌక్‌ సమీపంలో, వారధి వద్ద క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. మరో ఐదు క్యాంటీన్లను ఆగస్టు 15లోగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయా క్యాంటీన్లలో పూటకు 300 మందికి ఆహారాన్ని అందించాలని అధికారులు తొలుత భావించారు. అయితే పెరుగుతున్న డిమాండ్‌ రీత్యా ఒక్కో క్యాంటీన్‌ నుంచి అల్పాహారానికి 400 - 500 ప్లేట్లు, మధ్యాహ్నం భోజనానికి 600 - 800, రాత్రి వేళ 400-500 ప్లేట్ల ఆహారాన్ని నిర్వాహకులు అందిస్తున్నారు.
 
విద్యాధరపురం క్యాంటీన్‌కు అపూర్వ స్పందన
విద్యాధరపురంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ ప్రారంభం నాటి నుంచి నేటి వరకు రోజు రోజుకూ వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తారు. పచ్చడి ముద్దలతో కడుపు నింపుకునే కార్మికులకు అల్పాహారం చేయ్యటం కుదరదు. వారికి వచ్చే కాస్త ఆదాయంతో రెండుపూటలా భోజనం చేయడం కష్టమే. అటువంటి వారికి అన్న క్యాంటీన్‌ వరంగా మారింది. అలాగే ఆర్టీసీ కార్మికులు, చిరువ్యాపారులు, భవన కార్మికులు, ఆటో కార్మికులు, నగరానికి వివిధ పనులపై వచ్చిన వారంతా అన్న క్యాంటీన్లను ఆశ్రయించి కడుపు నింపుకుంటున్నారు.
 
ధర్నాచౌక్‌ క్యాంటీన్‌కూ ఫుల్‌ డిమాండ్‌
గాంధీనగర్‌ ధర్నా చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌కు పేద వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రోజువారీ పనులకు వచ్చే వారు, చాలీచాలని జీతాలతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న యువకులు అన్న క్యాంటీన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ టోకెన్లు అందక నిత్యం 50 నుంచి 100 మంది వరకు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
 
10 రోజుల్లో మరి కొన్ని క్యాంటీన్లు
కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు హైస్కూల్‌ వద్ద, వన్‌టౌన్‌లోని గాంధీజీ మహిళా కళాశాల వద్ద, సింగ్‌నగర్లోని అమెరికన్‌ హాస్పిటల్‌ వద్ద, బుడమేరు వాగుకు దగ్గరలోని అయోధ్య నగర్‌ ప్రధాన రహదారిపైన, కృష్ణలంకలోని నేతాజీ వంతెన పక్కన త్వరలో అన్న క్యాంటీన్లను ప్రారంభించడానికి అధికారులు ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నారు.
 
 
నోరూరించే మెనూ!
క్యాంటీన్లలోని మెనూలో కొద్ది పాటి మార్పులను తీసుకొచ్చారు. అల్పాహారంలో కారప్పొడి లేదా చెట్నీతో పాటు సాంబారు కచ్చితంగా అందిస్తున్నారు. అలాగే వారంలో ఏదో ఒక రోజు సాధారణ భోజనంతో పాటు ఒక కప్పు బిర్యానీ రైస్‌ లేదా కేసరి, హల్వా అందిస్తున్నారు.
 
 
అల్పాహారం
సోమవారం- ఇడ్లీ+పూరీ (రెండు టోకెన్లు)
మంగళవారం- ఇడ్లీ+ఉప్మా (సాంబారు, బూందీ)
బుధవారం- ఇడ్లీ+పొంగల్‌ (సాంబారు, బూందీ)
గురువారం- ఇడ్లీ+పూరీ (రెండు టోకెన్లు)
శుక్రవారం- ఇడ్లీ+ఉప్మా (సాంబారు, బూందీ)
శనివారం- ఇడ్లీ+పొంగల్‌ (సాంబారు, బూందీ)
 
భోజనం
అన్నం- (వంద గ్రాములు)
పప్పు లేదా సాంబారు- (120 గ్రాములు)
కూర- (వంద గ్రాములు)
పచ్చడి- (15గ్రాములు)
పెరుగు- (75 గ్రాములు)
 
 
ఆదరణ పెరుగుతోంది
రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఉదయం 300 మంది వరకు టిఫిన్‌ చేస్తున్నారు. 50 మంది వరకు తిరిగి వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్న భోజనానికి కూడా ఆదరణ ఎక్కువగా ఉంది. రాత్రి కొంచెం తగ్గుతున్నారు. అనుకున్న లక్ష్యానికి దాటి వస్తున్నారు. కొందరు మూడు పూటలా వస్తున్నారు. ఐటమ్స్‌ సుచిగా శుభ్రంగా ఉండటంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాం.
-ఎ.గిరిధర్‌, అన్న క్యాంటీన్‌ ఇన్‌చార్జి
 
 
ఫుడ్‌ ఐటమ్స్‌ బాగుంటున్నాయి
నరసారావుపేట మా స్వగ్రామం. సేల్స్‌మేన్‌ ఉద్యోగం చేస్తున్నా. కేదారేశ్వరపేటలో రూం తీసుకుని ఉంటున్నా. ప్రతి రోజూ అల్పాహారం, భోజనానికి రూ.100కు పైనే ఖర్చు అయ్యేది. ఒక్కో రోజు రాత్రి పూట భోజనం చేయకుండా ఉండేవాడ్ని. అన్న క్యాంటీన్‌ పెట్టినాక ప్రతి రోజూ ఉదయం టిఫిన్‌, రాత్రి భోజనం చేస్తున్నా.
-జోసఫ్‌, సేల్స్‌మేన్‌
 
 
బాపట్ల నుంచి వచ్చాం
బాపట్ల నుంచి పనిమీద విజయవాడ వచ్చాం. ఉదయాన్నే రైలు దిగి టిఫిన్‌ తినేందుకు క్యాంటీన్‌కు వచ్చాం. ఇద్దరం బయట టిఫిన్‌ తిని, కాఫీ తాగాలంటే వంద రూపాయలు అవుతుంది. అందుకే ఇక్కడ టిఫిన్‌ చేస్తున్నాం.
-బాబు, మేరీ దంపతులు.
 
 
టిఫిన్‌ బాగుంది
నేను ఉండేది రామవరప్పాడు. బీసెంట్‌ రోడ్డులో బిల్డింగ్‌ పనికి వచ్చాను. ఇటు పనికి వచ్చినప్పుడు టిఫిన్‌, భోజనం ఇక్కడే చేస్తున్నా. ఐటమ్స్‌ చాలా బాగుంటున్నాయి. రోజువారీ కూలీ పనిచేసుకునే నాలాంటి వాళ్ళకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
-సింహాచలం, టాపీ మేస్త్రి
 
 
పేదల ఆకలి తీరుస్తున్నారు
పేదల ఆకలిని అన్న క్యాంటీన్‌ తీరుస్తోంది. కూలీ పనులు చేసుకునే మేము ప్రతి రోజూ రూ.20, 30 పెట్టి అల్పాహారం చేయ్యలేం. అన్న క్యాంటీన్‌ ద్వారా రూ.5కే రుచికరమైన అల్పాహారం తిని పనికి వెళుతున్నాము.
-జి.సరస్వతి, భవానీపురం
 
 
అన్నార్తులకు ఎంతో ఉపయోగం
ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్‌లో అనార్తుల కడుపు నింపుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం వలన ప్రజల్లో ప్రభుత్వం చిరస్ధాయిగా నిలిచిపోతుంది. ఆహార పదార్ధాలు చాలా బాగున్నాయి.
- రాంబాబు, నూజివీడు
Link to comment
Share on other sites

S V Mohan Reddy @SVMohanReddy 13m13 minutes ago

 
 

మా కర్నూలు నియోజకవర్గ పరిధిలో 5 అన్న క్యాంటీన్స్ కి అప్రూవల్ వచ్చింది. ఇప్పటికే, ఒక క్యాంటీన్ ఉల్చాల రోడ్డులో ప్రారంభించడం పూర్తయింది. రానున్న 10 రోజుల్లో మరో 3 చోట్ల ప్రారంభించబోతున్నాము! ఈ రోజు పాతబస్టాండ్ లో పనులు పర్యవేక్షించాను!

Link to comment
Share on other sites

I just watched a few more videos on YouTube.

Everybody who had the food are appreciating the quality and quantity of the food. 5 Rs ku water bottle kuda radu...Tea kuda kashtam....alaantidi nanyamaina breakfast, Lunch and Dinner peduthunnaru ani cheptunnaru.

Students are very happy on this program as their monthly expenses are reduced due to this.

There are some poor people who are going back as the food is getting over. And this is mainly due to the fact that above middle class and middle class people are also coming to eat and causing the food shortage. Some poor person clearly said that some people are coming by scooters, bikes and etc and eating the food. 

So, 5 Rs food nu poor people ku vadilipettali other people who can afford hotels and home food.

Link to comment
Share on other sites

అన్న’దాతా.. సుఖీభవ
11-08-2018 02:35:51
 
636695517508689969.jpg
  •  దాదాపు 100కు చేరుతున్న క్యాంటీన్లు
  •  ప్రతి పట్టణంలో ఏర్పాటుకు నిర్ణయం
అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ‘‘ఇంతకుముందు ఒక పూట భోజనం చేయాలంటేనే రూ.60 అయ్యేది. ఇప్పుడు ఆ భారం తప్పింది’’.. విజయవాడ వాసి రామనాథం మాట ఇది! ‘‘ఒకప్పుడు వ్యవసాయ కూలీగా ఉండేవాడిని. క్రమంగా సత్తువ తగ్గడంతో పనిచేయలేని పరిస్థితికి వచ్చాను. అన్నానికి ఇబ్బందిగా ఉండి పస్తులున్న రోజులున్నాయి. ఇప్పుడు ఆ బాధ తప్పింది’’.. భీమానాయక్‌ అనే వృద్ధుడిలో కనిపించిన సంతృపి ఇది! ‘‘ఒకప్పుడు మధ్యాహ్నం భోజనం తెచ్చుకోకుంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఆ చింత పోయింది’’.. శ్రీనివాసరావు అనే చిరుద్యోగి వ్యాఖ్య ఇది! ఇలా.. కార్మికులు, వివిధ వృత్తుల పనివారు, పలు పనులపై పట్టణాలకు వచ్చేవారు, పేదవాళ్లలో అన్న క్యాంటీన్ల పట్ల అంతులేని అభిమానం వ్యక్తం అవుతోంది.
 
గత నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభించారు. నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 20 లక్షల మంది ఈ క్యాంటీన్లలో భోజనాలు చేశారు. మంచి రుచి, శుచి, శుభ్రతతోపాటు గౌరవంగా భోజనం పెడుతూ.. ఈ క్యాంటీన్లు అందరి మనసుల్ని దోచుకున్నాయి. ప్రస్తుతం ఉన్న 63 క్యాంటీన్లలోనూ కలిపి రోజుకు సగటున సుమారు 65-70వేల మంది అల్పాహారం, భోజనం చేశారు. త్వరలోనే అన్న క్యాంటీన్ల సంఖ్య 100కు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత 50 వేల జనాభా ఉన్న పట్టణాల్లో క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించినా... ఈ పథకానికి వచ్చిన స్పందనతో ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటుచేయాలని చంద్రబాబు ఆదేశించారు. రెండో దశలో 75 పట్టణాల్లో మరో 103 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
రుచి...శుచి..గౌరవం..
ఒక్కో అన్న క్యాంటీన్‌లో రోజుకు 300-350మందికి అల్పాహారం, భోజనం అందించాలని తొలుత నిర్ణయించారు. అయితే అంతకుమించి ప్రజలు వస్తుండడంతో ఈ నెలరోజుల్లో సగటున 500 మందికి భోజనం పెట్టగలిగారు. రుచి, శుచి ఉండడం, హోటళ్లకు మించిన ఆహ్లాదకర వాతావరణం ఉండడంతో గౌరవప్రదంగా ఇక్కడ భోజనం చేస్తున్నారు. సామర్థ్యానికి మించి వస్తున్నా... దాదాపుగా అందరికీ భోజనం అందిస్తున్నారు. సామాన్యులకు అందించే భోజనం నాణ్యత, రుచి, శుచి ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. క్యాంటీన్ల పర్యవేక్షణను రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తున్నారు. అన్న క్యాంటీన్ల వద్ద ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూస్తున్నారు. క్యాంటీన్ల నిర్మాణం కూడా ఆధునికంగా చేశారు. భోజనం కోసం వచ్చేవారికి ఎలక్ర్టానిక్‌ టోకెన్‌ విధానం అమలు చేస్తున్నారు. క్వాంటీన్లలో సర్వైలెన్స్‌ కెమెరాలు ఏర్పాటుచేశారు.
 
ఖర్చుకు వెరవకుండా..
అన్న క్యాంటీన్లకు నిధులు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్నవాటితో పాటు కొత్తగా ప్రారంభించేవి కలిపి మొత్తం 203 క్యాంటీన్లు అవుతాయి. వీటి నిర్వహణకు ఏటా రూ.130కోట్లు ఖర్చవుతాయి. ప్రభుత్వం వీటికి అవసరమైన నిధులు కేటాయిస్తూనే, దాతలను ప్రోత్సహిస్తోంది. ప్రతి మున్సిపాలిటీలోనూ వీటి నిర్వహణకు ధన, వస్తు రూపంలో విరాళం ఇవ్వడం, అదే సమయంలో పలువురు ముఖ్యమంత్రిని నేరుగా కలిసి అందించడం చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపి ఒక వ్యక్తికి అయ్యే ఖర్చు రూ.73. ఇందులో లబ్ధిదారుడు పూటకు ఐదు రూపాయల చొప్పున రూ.15భరిస్తాడు. మిగిలిన రూ.58ప్రభుత్వమే చెల్లిస్తుంది.
 
మొత్తం మూడు జోన్లుగా విభజించి ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ఉభయగోదావరి జిల్లాల వరకు ఒక జోన్‌, కృష్ణా నుంచి నెల్లూరు వరకు ఒక జోన్‌, రాయలసీమ జిల్లాలను ఒక జోన్‌గా విభజించారు. ఒక్కో జోన్‌లో తప్పనిసరిగా ఐదు పెద్ద వంటశాలలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం అక్షయపాత్ర సంస్థకు ఈ భోజనం తయారుచేసే బాధ్యతలను అప్పగించారు. అన్న క్యాంటీన్లలో ఉదయం 7.30నుంచి 10గంటల వరకు అల్పాహారం అందిస్తున్నారు. ఇడ్లీ, పూరి, ఉప్మా.. ఇలా రోజుకు ఒక రకం పెడుతున్నారు. మధ్యాహ్నం 12.30నుంచి మూడు గంటల వరకు భోజనం అందిస్తున్నారు. అన్నం, కూర, పప్పు, సాంబార్‌, పెరుగు పచ్చడి ఇందులో ఇస్తున్నారు. పచ్చడి అన్నం, పొంగల్‌ అన్నం మార్చి మార్చి అందిస్తున్నారు.
Link to comment
Share on other sites

అన్న క్యాంటీన్‌లో టీడీపీ ప్రజాప్రతినిధులు
11-08-2018 11:16:37
 
636695829972307826.jpg
విజయవాడ: పేరుకు పరిశీలనగా కనిపించినా.. రుచి తెలుసుకోవాలన్న తృష్ణే అక్కడికి తీసుకెళ్లింది. అందరితో కలిసి తినాలన్న కోరిక కలిసి వచ్చింది. ఇంకేముంది అందరూ కలిసి ఒకేసారి అన్న క్యాంటీన్‌ వైపునకు అడుగేశారు. 13వ తేదీన జరగబోతున్న కౌన్సిల్‌ సమావేశ ఎజెండా సమావేశంలో చర్చకు రాబోతున్న అంశాలపై విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) భవనంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న కార్పొరేటర్లు ఆ సమావేశం అనంతరం అన్న క్యాంటీన్‌కు వెళ్లి భోజనం చేశారు. నగరంలోని అలంకార్‌ థియేటర్‌ వద్ద గల అన్న క్యాంటీన్‌కు వెళ్లిన కార్పొరేటర్లు అక్కడే మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు.
 
మేయర్‌ కోనేరు శ్రీధర్‌తో సహా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌, ఫ్లోర్‌ లీడర్‌ గుండారపు హరిబాబు, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, అల్లు జయలక్ష్మి, కంచర్ల నాగవెంకట శేషారాణి, గండూరి మహేశ్‌, యేదుపాటి రామయ్య, వీరంకి కృష్ణకుమారి, పిన్నంరాజు త్రిమూర్తి రాజు, ఉమ్మడి వెంకటేశ్వరరావు తదితరులు అన్న క్యాంటీన్‌ రుచులను ఆస్వాదించారు. తన డివిజన్‌కు వచ్చిన ఇతర ప్రజాప్రతినిధు లకు స్థానిక డివిజన్‌ కార్పొరేటర్‌ ముప్పా వెంకటేశ్వరరావు క్యాంటీన్‌ వంటకాలను వడ్డించి అతిథి సత్కారం అందించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...