Jump to content

NTR Anna canteens


sonykongara

Recommended Posts

  • Replies 559
  • Created
  • Last Reply
విశాఖలో తింటే...వెలగపూడిలో తెలుస్తుంది 
అన్న క్యాంటీన్లు రాజధానితో అనుసంధానం 
ఫొటో మెట్రిక్‌ ద్వారా టోకెన్లు జారీ 
vsp-sty2a.jpg

విశాఖ: అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ప్రభుత్వం.. దాని నిర్వహణను కూడా సమర్ధంగా ఉండలా ప్రయత్నిస్తోంది. దీనికి ఆధునిక సాయం తీసుకుంటోంది. ఏ క్యాంటీన్‌లో ఎంతమంది తింటున్నారు? ఎలాంటి వారు ఆహారం తీసుకుంటున్నారు? నిర్వహణ ఎలా ఉంది? ఏ సమయంలో రద్దీ ఉంటోంది? అసలు ఇక్కడకు వచ్చి కడుపు నింపుకుంటున్నది ఎవరు? అనే సమాచారం నేరుగా పురపాలకశాఖ అధికారులే పర్యవేక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఫొటోమెట్రిక్‌ ద్వారా టోకెన్లు జారీ, సి.సి. కెమెరాలను  ఏర్పాటు చేశారు. ఈ విధానం మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.

కెమెరాలో ఫొటో తీసిన తర్వాత టోకెన్‌.. 
అల్పాహారం, భోజనం కోసం డబ్బులు చెల్లించగానే టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఎంతమంది టోకెన్లు తీసుకుంటుంది? ఎంతమందికి జారీచేశారనే సమాచారాన్ని పక్కాగా తెలుసుకునేందుకు ఫొటోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. క్యూలైనులో వచ్చిన వ్యక్తి ముఖచిత్రాన్ని కెమెరా ద్వారా ఫోటో తీసిన తర్వాత సిబ్బంది టోకెన్లు జారీ చేస్తారు. ఇలా ఒక సారి ఫొటో తీయగానే జారీచేసిన టోకెన్‌ క్షణాల్లో సి.ఎం. డ్యాష్‌బోర్డులో నిక్షిప్తమవుతుంది. దీంతో ఏ క్యాంటీన్‌లో ఎంతమంది ఆహారాన్ని స్వీకరిస్తున్నారో తెలుస్తుంది. టోకెన్ల లెక్క ఆధారంగా మిగిలిన ఆహారపదార్థాల వివరాలు తెలుస్తాయి. రోజుకు ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు టోకెన్లు తీసుకునే సదుపాయం ఉంది.

ఆహారం వేడి వేడిగా... 
రోజుకు గరిష్టంగా 300 మందికి అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలను అందించాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం ఆహారాన్ని తయారుచేసి వడ్డిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో అనూహ్యస్పందన నెలకుంటోంది. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వస్తున్నారు. ఈ నేపథ్యంలో వడ్డించే ఆహారం వేడి వేడిగా ఉండేలా అత్యాధునిక హాట్‌బాక్సుల్లో భద్రపరుస్తున్నారు. ఒక్కో బాక్సులో 60 మందికి వచ్చేలా పదార్థాలు ఉంచుతున్నారు. వచ్చిన వారికి వేడి వేడిగా అందిస్తున్నారు.

రద్దీ అంచనాకు సి.సి. కెమెరాలు... 
ఏ సమయాల్లో జనం వస్తున్నారో లెక్క కట్టి, ఆయా క్యాంటీన్‌లకు కేటాయించిన దాని కంటే 50 నుంచి 100 మందికి సరిపడా అదనంగా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే క్యాంటీన్‌ రద్దీని నిరంతరం గమనించేందుకు ఇక్కడ సి.సి. కెమెరాలను సైతం అమర్చారు. ఈ సి.సి. కెమెరాలను కూడా నేరుగా సి.ఎం. డ్యాష్‌బోర్డుకు అనుసంధానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీటి నిర్వహణ అమరావతి నుంచి నేరుగా పర్యవేక్షించే అవకాశాలున్నాయి. అందుబాటులో ఉండే ఆహార పదార్థాల వివరాలను తెలియజేసేందుకు డిస్‌ప్లే బోర్డులను కూడా ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు.

తడి, పొడి చెత్త వేర్వేరుగా... 
వచ్చే వ్యర్థాల్లో తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి ఇవ్వాల్సిందే. ఇందుకోసం ప్రజారోగ్య విభాగం సిబ్బంది తడి, పొడి చెత్తల కోసం డబ్బాలను కేటాయించారు. ఎక్కువగా తడి వ్యర్థాలే వస్తున్నందున రెండు డబ్బాలు తడిచెత్తకు, ఒక డబ్బా పొడికి కేటాయించారు. ఆవరణలో వీటిని ఉంచి, క్యాంటీన్‌ ద్వారా వచ్చే వ్యర్థాలు సిబ్బంది డబ్బాల్లో వేస్తారు. తడి, పొడి చెత్తను జీవీఎంసీ సిబ్బంది వచ్చి ఇక్కడ నుంచి సేకరిస్తారు. తడి, పొడి చెత్తలను సేకరించేందుకు క్యాంటీన్‌ నిర్వాహకుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు.

అందుబాటులో సురక్షిత మంచినీరు... 
అన్న క్యాంటీన్‌ ద్వారా ఆహారం తీసుకున్న వారికి రక్షిత మంచినీటిను అందిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత బయటకు వస్తే అక్కడ ఆర్‌.ఒ.ప్లాంట్‌ను అందుబాటులో ఉంచారు. మోటారు నుంచి వచ్చే నీటిని శుద్ధిచేసి, నేరుగా సరఫరా చేయనున్నారు. ఇక్కడకు వచ్చే వారందరికి సరిపడా రక్షిత మంచినీటిను నిత్యం అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ప్లాంట్‌ను తరచూ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

Link to comment
Share on other sites

‘అన్న’దాతల కోసం ప్రత్యేక కార్యాచరణ 
  విరాళాల సేకరణకు ప్రతిపాదనలు 
  ముఖ్యమంత్రి దృష్టికి  అధికారుల నివేదిక 
ఈనాడు - అమరాతి

న్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళాల సేకరణ కోసం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. దాతల నుంచి విరాళాలు ఎలా సేకరించాలి? ఇందుకోసం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలతో రూపొందించిన నివేదికను బుధవారం రాత్రి సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ నెల 11న రాష్ట్రంలోని 25 పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో ప్రారంభించిన 60 అన్న క్యాంటీన్లకు ప్రజల నుంచి చక్కని స్పందన లభిస్తోంది. దీంతో వచ్చే నెల 15లోగా మిగతా 143 క్యాంటీన్లను కూడా ప్రారంభించేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. క్యాంటీన్ల ప్రారంభ సందర్భంగా వీటి నిర్వహణకు విరాళాలిచ్చి దాతలు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రి పరిశీలనకు పెట్టింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాలి.

దాతలకు గుర్తింపు ఇలా 
* దాతల పేర్లు   క్యాంటీన్లలో  అందరికీ  కనిపించేలా బోర్డులు 
* ముఖ్యమంత్రి, పురపాలక మంత్రి నుంచి ప్రశంసా పత్రం 
*తితిదే, ఇతర దేవాలయాల నుంచి అక్షింతలు, కుంకుమ 
* రూ.50 లక్షలకుపైగా విరాళాన్ని అందించే దాతలను అభినందిస్తూ ముఖ్యమంత్రి ట్వీట్‌

విరాళాల సేకరణ విధానం 
* ఆన్‌లైన్‌ చెల్లింపులు 
* పేటీఎం 
* క్యాంటీన్లలో హుండీల రూపంలో 
* ముగ్గురు సభ్యులతో ఇళ్లకు వెళ్లి విరాళాల సేకరణ 
* క్రికెట్‌ పోటీలు, మ్యూజికల్‌ ప్రదర్శనపై వచ్చేవి...

19ap-state5a.jpg

విరాళాల సమీకరణకు ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సిన చర్యలు 
* అన్న  క్యాంటీన్లను పబ్లిక్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌గా ఏర్పాటు 
* ఇన్ఫోసిస్‌ ట్రస్ట్‌ సీఈవో సుధామూర్తి తరహా వారిని సభ్యులుగా చేర్చడం 
* ప్రవాస భారతీయుల సంఘ సభ్యులతో సలహా మండలి 
* విరాళాలకు ఆదాయ పన్ను (12ఏ, 80జీ) మినహాయింపు కోసం దరఖాస్తు చేయడం 
* అన్నక్యాంటీన్ల కోసం ప్రత్యేకంగావెబ్‌సైట్‌ రూపకల్పన 
* మరింత ప్రాచుర్యం పొందేలా ప్రత్యేకంగా ఒక ల్యాండ్‌ ఫోను ఏర్పాటు 
* విరాళాల సేకరణకు ముగ్గురు సభ్యులతో కమిటీ 
* క్యాంటీన్ల మార్కెటింగ్‌ కోసం నైపుణ్యం గల మరో ఐదుగురితో కమిటీ 
* ముగ్గురు సభ్యులతో డోనర్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు రాష్ట్రంలో ప్రారంభించిన 60 క్యాంటీన్లలో ఈ నెల 11 నుంచి 17 వరకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన ప్రజల సంఖ్య..

అల్పాహారం: 1,03,020 
మధ్యాహ్న భోజనం:  1,72,150 
రాత్రి:            1,05,600

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

 

This brings tears to my eyes ... remarkable ... 

there are going to be times in our lives ... where we take chances and lose ... and look to feed ourselves with dignity ... 

I hope I never have to use this program ... If I do, I hope its there to feed me.

In the mean time ... I will do what I can to support it ... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...