Jump to content

Google X Development Center in Vizag


sonykongara

Recommended Posts

ఏపీలో గూగుల్‌ ఎక్స్‌ సెంటర్‌..
15-12-2017 08:03:31
 
636489218165414288.jpg
అమెరికా: ఏపీలో గూగుల్‌ ఎక్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది. మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో డెవలప్‌మెంట్ సెంటర్‌ను గూగుల్ ఎక్స్ ప్రారంభించనుంది. అమెరికాలో మినహా గూగుల్ ఎక్స్ ఎక్కడా కార్యకలాపాలు ప్రారంభించలేదు. గూగుల్ ఎక్స్ మొదటిసారి ఇండియాలో అడుగుపెడుతోంది. త్వరలో విశాఖలో గూగుల్ ఎక్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఫైబర్‌గ్రిడ్‌తో ఒప్పందంలో భాగంగా ఏపీ 13 జిల్లాలో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్, (ఎఫ్సాక్) లింక్స్ గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనుంది. ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్‌తో అతి తక్కువ ధరకే గ్రామీణ ప్రాంతాలకు అత్యంత వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ రానున్నాయి.
Link to comment
Share on other sites

ఏపీకి గూగుల్‌ ఎక్స్‌ సెంటర్‌
మంత్రి లోకేశ్‌ నేతృత్వంలో కీలక ఒప్పందం
15brk65a.jpg

అమరావతి: ప్రతిష్ఠాత్మక గూగుల్‌ ఎక్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఆంధ్రప్రదేశ్‌కు తరలిరానుంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని గూగుల్‌ ఎక్స్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, గూగుల్‌ ఎక్స్‌ సంస్థ మధ్య ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకూ అమెరికాలో తప్ప ఏ ఇతర దేశంలోనూ కార్యకలాపాలు సాగించని గూగుల్‌ ఎక్స్‌.. తాజా ఒప్పందం ద్వారా తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు రావడం విశేషం. విశాఖ నగరంలో త్వరలోనే ఇది ఏర్పాటు కానుంది.

అమెరికా పర్యటనలతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో దిగ్గజ సంస్థ గూగుల్‌ ఎక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏపీ ఐటీ శాఖ అధికారులు, గూగుల్‌ ఎక్స్‌ సీఈఓ అస్టో టెల్లర్‌ మధ్య ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌కు సంబంధించి ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్‌ ఎక్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.

అధునాతన టెక్నాలజీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గూగుల్‌ ఎక్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకానుంది. ఫైబర్‌గ్రిడ్‌తో ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 2వేల ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ లింక్స్‌ను గూగుల్‌ ఎక్స్‌ ఏర్పాటు చేయనుంది. దీంతో ఫైబర్‌ కేబుల్‌ అవసరం లేకుండానే మొబైల్‌ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు కూడా అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానుంది. గూగుల్‌ ఎక్స్‌ రాకతో ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని లోకేశ్‌ అన్నారు.

Link to comment
Share on other sites

Google X signs MoU with Andhra govt; to set up research facility in Visakhapatnam

Andhra Pradesh IT Minister Nara Lokesh at Google X

Andhra Pradesh IT Minister Nara Lokesh at Google X , ANI Twitter

 

Share

  •  
  •  
  •  
  •  

Written By

Friday 15 December 2017 9:27 IST
 

Google X, the company’s ‘moonshot’ project, is all ready to set up a development centre in Andhra Pradesh’s Visakhapatnam, it was reported on Thursday.

An Memorandum of Understanding (MoU) was signed between the government of Andhra Pradesh and Google X in the company’s San Francisco office in the presence of state Information Technology minister Nara Lokesh, and Google X CEO Astro Teller.

“Our government is working with Google X towards multitude of development activities,” said Nara Lokesh, after sitting in the famous driverless car in San Francisco.

Google X in its website says its mission is ‘to invent and launch “moonshot” technologies that we hope could someday make the world a radically better place. We have a long way to go before we can fulfill this mission, so today it’s really an ambition.’

With Prime Minister Narendra Modi’s  Start-Up India initiative, a tie-up with Google X may be the right way forward.  The Government through this initiative aims to empower Startups to grow through innovation and design.

Earlier this year, Alphabet, which not only owns Google but also Google X, which is devoted to creating world-changing new technologies, said that it gave up on its internet drone project, called Titan, about a year ago.

Facebook, too, is continuing to develop an Aquila drone for beaming internet connection from the sky.

Link to comment
Share on other sites

విశాఖకు ప్రఖ్యాత గూగుల్‌ ఎక్స్‌
అమెరికా వెలుపల తొలి అభివృద్ధి కేంద్రం
మంత్రి లోకేశ్‌ పర్యటనలో ఒప్పందం
15ap-main3b.jpg
15ap-main3a.jpg

ఈనాడు, అమరావతి: అమెరికాకు చెందిన ప్రఖ్యాత గూగుల్‌ ఎక్స్‌ సంస్థ తొలిసారి ఆ దేశం బయట విశాఖపట్నంలో అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. చోదకుడు అవసరం లేని వేమో కార్లు, కేబుల్‌ వ్యవస్థ లేకుండా గాలి బుడగల ద్వారా ఇంట‌ర్‌నెట్‌ సదుపాయం కల్పించే పరిజ్ఞానాల్ని ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటనలో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఎక్స్‌ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సీఈవో ఆస్ట్రో టెల్లర్‌తో చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ అధికారులతో టెల్లర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడి వేమో కారులో లోకేశ్‌ పర్యటించారు. ‘‘ఈ సంస్థ రాకతో రాష్ట్రంలో సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఒప్పందంలో భాగంగా ఈ సంస్థ 2 వేల ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యునికేషన్‌ లింక్‌లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. ఫైబర్‌ కేబుల్‌ అవసరం లేకుండానే మొబైల్‌ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫైబర్‌గ్రిడ్‌ రెండో దశలో 59 వేల కిమీ భూగర్భ కేబుల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకొన్నాం. ఇందుకు గూగుల్‌ ఎక్స్‌ లింక్స్‌ వినియోగిస్తాం’’ అని లోకేశ్‌ చెప్పారు. తమ లింక్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కుగ్రామాలనూ అంతర్జాలంతో అనుసంధానం చేయబోతున్నామని ఆస్ట్రో టెల్లర్‌ తెలిపారు. అనంతరం లోకేశ్‌ బృందం.. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థ కార్యాలయాన్ని సందర్శించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడు అలోక్‌ సేథీ, సీనియర్‌ ఉపాధ్యక్షుడు జోయ్‌ బోరియోతో లోకేశ్‌ సమావేశమయ్యారు. విశాఖలో వచ్చే నెలలో తమ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హిటాచీ కంపెనీలో ముఖ్య కార్యనిర్వహణాధికారి ఓట్స్‌తోనూ లోకేశ్‌ సమావేశమయ్యారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

పరిశోధనల కేంద్రం గూగుల్‌ ఎక్స్‌ 
అబ్బురపరచే ఆలోచనలు 
దేశానికే మణిహారంలాంటి ప్రాజెక్టు 
విశాఖలో కొలువు దీరడానికి సన్నాహాలు 
ఈనాడు - విశాఖపట్నం
విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్స్‌ ఎక్స్‌ కేంద్రం వినూత్న ఆవిష్కరణలకు, విప్లవాత్మక పరిశోధనలకు నిలయంగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న గూగుల్స్‌ ఎక్స్‌ తొలిసారిగా అమెరికా వెలుపల భారత్‌లో అదీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో తమ కేంద్రం ఏర్పాటు చేయబోతోంది. విప్లవాత్మక పరిజ్ఞానాలను అందుబాటులోకి తేవాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ సంస్థ పరిశోధనలు చేస్తుంటుంది. ఇప్పటికే ఈ సంస్థ చేపట్టిన పలు పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  అత్యంత ఆసక్తికరమైన ఆయా పరిశోధనల వివరాలివి..

ప్రాజెక్ట్‌ లూన్‌..: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు ఎన్ని చర్యలు చేపట్టినా.. అంతర్జాల సదుపాయం అసాధ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్‌ ప్రాజెక్ట్‌ లూన్‌ పేరిట వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఆకాశంలోని భారీ బుడగల (బెలూన్ల) నుంచి అంతర్జాల సిగ్నళ్లను మారుమూల ప్రాంతాలకు సైతం పంపాలన్న లక్ష్యంతో 2013 నుంచి పరిశోధనలు చేస్తోంది. ఇవి చాలా వరకు విజయవంతమయ్యాయి. తద్వారా కొత్త పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చాయి. న్యూజిలాండ్‌లో బెలూన్‌ ద్వారా అంతర్జాల సదుపాయం కల్పించే సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రతి వంద కిలోమీటర్లకు ఒకటి చొప్పున బెలూన్‌ ఏర్పాటుచేసి దాని ద్వారా అంతర్జాల సదుపాయం లేని ప్రాంతమంటూ లేకుండా చేయడానికి గూగుల్‌ బృహత్తర ప్రాజెక్టు చేపట్టింది.
ప్రాజెక్ట్‌ మకాని..: పవన విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి భారీ గాలిమరలను ఏర్పాటు చేస్తారన్న విషయం తెలిసిందే. గూగుల్‌ సంస్థ ప్రాజెక్ట్‌ మకాని పేరిట గాలిపటాన్ని పోలివుండే ఒక యంత్రాన్ని అభివృద్ధి చేస్తోంది. సాధారణ గాలిమరలు నిర్ణీత దిశలో గాలి వస్తేనే పనిచేస్తాయి. ప్రాజెక్ట్‌ మకాని పేరిట అభివృద్ధి చేస్తున్న గాలిపటం యంత్రం ఆకాశంలో గాలి దిశకు అనుగుణంగా కదులుతూ గాలిని గ్రహిస్తుంది. ఫలితంగా ఆ యంత్రంలో ఉండే జనరేటర్లు తిరిగి విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
ప్రాజెక్ట్‌ వింగ్‌..: ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్‌ వాణిజ్యం భారీగా ఊపందుకున్న విషయం తెలిసిందే. తయారీ సంస్థ తన ఉత్పత్తిని నేరుగా కొనుగోలుదారుకు పంపుతుంటుంది. ఈ నేపథ్యంలో కొరియర్‌ సంస్థల ప్రాధాన్యం ఊహించనంతగా పెరిగింది. ఈ వ్యవస్థకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మానవ రహితంగా డ్రోన్ల ద్వారా ఉత్పత్తులను కొనుగోలుదారులకు అందించాలన్న ఆలోచనకు గూగుల్‌ శ్రీకారం చుట్టింది. 400 అడుగుల ఎత్తులో ప్రయాణించే ఆ డ్రోన్లను నియంత్రించే నియంత్రణ గదిని మానవరహితంగా ఉండేలా చర్యలు చేపట్టారు.
ప్రాజెక్ట్‌ ఫాగ్‌హోర్న్‌..: సముద్ర నీటి నుంచి వాహనాలు నడిపడానికి ఉపయోగించే ఇంధనాన్నితయారుచేసే ప్రయోగాలకు కూడా గూగుల్‌ శ్రీకారం చుట్టింది. ‘ప్రాజెక్ట్‌ ఫాగ్‌హోర్న్‌’ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్ర నీటిలో కలిసి ఉండే బొగ్గుపులుసు వాయువును వేరుచేసి ఆ నీటికి హైడ్రోకార్బన్లను కలిపి వాహహనాలకు ఉపయుక్తంగా ఉండే ఇంధనాన్ని సరఫరా చేయాలన్నది లక్ష్యం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...