Jump to content

Thank You Gadkari


Jaitra

Recommended Posts

Same old promises...

ఒక్క నెలే గడువు
14-12-2017 02:15:35
 
636488145399941554.jpg
  • పోలవరం కాంట్రాక్టర్‌కు ఆఖరి అవకాశం
  • కాంక్రీట్‌ పనులు లక్ష్యం ప్రకారం జరగాలి
  • లేదంటే... కొత్త కాంట్రాక్టరుకు అవకాశం
  • గడ్కరీతో సీఎం భేటీలో కీలక నిర్ణయాలు
  • పెరిగిన వ్యయం భరించేందుకు ఓకే!
  • డీపీఆర్‌ పంపితే పరిశీలిస్తామన్న కేంద్రం
  • 2 రోజుల్లో పోలవరం అథారిటీకి సీఈవో
  • కేంద్రం స్పందనపై ముఖ్యమంత్రి హర్షం
న్యూఢిల్లీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పోలవరం కాంక్రీటు పనులను లక్ష్యం ప్రకారం పూర్తి చేయడానికి ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌కి ‘చివరి అవకాశం’ లభించింది. నెల రోజుల్లోపు పనులు నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోలేకపోతే... మరొకరికి అప్పగించేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయించాయి. అంతేకాదు... పోలవరం ప్రాజెక్టు అంచనాలో పెరిగిన వ్యయాన్ని భరించడంపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కేంద్రం సానుకూలంగా ఆలకించింది. పెరిగిన వ్యయంతో 8 రోజుల్లో సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌ ) పంపిస్తే కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. అంతేకాదు... పోలవరం అథారిటీకి రెండు రోజుల్లో సీఈవోను నియమిస్తామని తెలిపింది.
 
 
బుధవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు గంటలపాటు జరిపిన చర్చల్లో ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ అనంతరం నితిన్‌ గడ్కరీ, చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘2019లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మా బాధ్యత. ఏపీ ప్రజల ఆకాంక్ష కూడా ఇదే. ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకం’’ అని గడ్కరీ తెలిపారు. ఇప్పటికే కేంద్రం రూ. 13వేల కోట్ల మేరకు విడుదల చేసిందని చెప్పారు. బిల్లులను తాము ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని, ఇంకా ఏవైనా మిగిలి ఉంటే త్వరలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ‘‘కాంట్రాక్టు సంస్థ సరిగా పనులు చేయనందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలిచింది.
 
 
ప్రస్తుత కాంట్రాక్టరుకు ఒక్క అవకాశం ఇచ్చాం. గడువులోపు పనులు చేయలేకపోతే... ఆ పనిని మరొకరికి అప్పగిస్తాం’’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు ఈ విషయంలో ఎంత ఆందోళనతో ఉన్నారో... తాను కూడా అంతే ఆందోళనతో ఉన్నానని గడ్కరీ తెలిపారు. ఒక రాజకీయ నాయకుడుగా కాకుండా ఒక శ్రేయోభిలాషిగా, సోదరుడిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను చేపట్టానని చెప్పారు. తమ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులున్నా తానే స్వయంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
 
 
‘‘రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేకుండా పోలవరం పూర్తి చేస్తాం. సాంకేతికంగా, ఆర్థికంగా సహకరిస్తాం. ఇది చాలా సున్నితమైన, ప్రజల భావోద్వేగాలతో కూడిన సమస్య అని నాకు తెలుసు. పరిహారం ఖర్చు పెరగడంపై మా విభాగం అధికారులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులతో చర్చించారు. డీపీఆర్‌ను సవరించి పంపితే ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చించి అవసరమైన నిధులు విడుదల చేస్తాం’’ అని గడ్కరీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్‌ ఇంజనీరింగ్‌ పనులను 2018 వరకు పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించామని చెప్పారు.
 
 
సంతోషంగా ఉంది: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టులో ఎదురవుతున్న సమస్యలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో, సంబంధిత అధికారులతో ఇంత వివరంగా చర్చించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎగువ కాఫర్‌ డామ్‌, అప్‌ స్ర్టీమ్‌ కాఫర్‌ డామ్‌లకు అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. గేట్‌ పనులు సజావుగా సాగుతున్నాయని చెప్పారు. ప్రధానంగా 38 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేరకు జరగాల్సిన కాంక్రీట్‌ పనులు అంత వేగంగా సాగడం లేదని అన్నారు.
 
 
2014 జూన్‌ వరకు తమ వాటాగా 5,135 కోట్లు ఖర్చు పెట్టామని... భారత ప్రభుత్వం 7500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రు. 4500 కోట్ల వరకు విడుదల చేసిందని చెప్పారు. 3217 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను సమర్పించామని, వారు అడిగిన సందేహాలను కూడా తీరుస్తామన్నారు.
 
తాను ఇప్పటికే 21సార్లు ప్రాజెక్టును సందర్శించానని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరులమంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్‌, ఏపీ జలవనరుల విభాగం కార్యదర్శి శశిభూషణ్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. మధ్యలో ట్రాన్స్‌టాయ్‌ కంపెనీ సీఈవో చెరుకూరి శ్రీఽధర్‌ను పిలిచి పనుల పురోగతిపై సమీక్షించారు.
 
 
Link to comment
Share on other sites

2 hours ago, Jaitra said:

Today's news reporting seemed very positive.

 

report attukoni randi antaaru... akkadikelithe emi response vundadhu... malla cbn ... aggressive gaa vuntee... tooch... memu support chestham antaaru... same routine biscuits

Link to comment
Share on other sites

25 minutes ago, NatuGadu said:

report attukoni randi antaaru... akkadikelithe emi response vundadhu... malla cbn ... aggressive gaa vuntee... tooch... memu support chestham antaaru... same routine biscuits

Chuddam 1 month time ichaadu gaa contractor ki.

Link to comment
Share on other sites

Guest Urban Legend

eedu ittagey contractor ki last chance ani 4 last chances ichi gammon india vaadini inka peekaledhu ..years nunchi aagipoyindhi vijayawada ring road work

eedini nammukuntey anthey

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...