Jump to content

Fathima ఫాతిమాపై కేంద్రం అడ్డుపుల్ల?


sonykongara

Recommended Posts

ఫాతిమాపై కేంద్రం అడ్డుపుల్ల?
12-12-2017 05:25:30
 
  • రాష్ట్ర ప్రతిపాదనలు తోసిపుచ్చినట్లు సమాచారం
  • న్యాయ సలహా తీసుకోవాలని ఏపీ నిర్ణయం
  • నీట్‌ శిక్షణకు విద్యార్థులు ‘నో’
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): కడప జిల్లాకు చెందిన ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్ధుల విషయంపై కేంద్రం అడ్డుపుల్లలు వేస్తోంది. సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కేంద్రం మరోసారి తన వైఖరికే కట్టుబడ్డట్టు తెలుస్తోంది. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సోమవారం రాష్ట్ర అధికారులను చర్చలకు ఆహ్వానించింది. దీంతో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, అకడమిక్‌ డీఎంఈ డాక్టర్‌ బాబ్జీ, ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అప్పారావు ఢిల్లీ వెళ్లారు.
 
 
కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు సెక్రటరీ సంజీవ్‌కుమార్‌, ఎంసీఐ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 3 అంశాలను అఫిడవిట్‌ రూపంలో కేంద్రానికి సమర్పించారు. అఫిడవిట్‌లో వచ్చే ఏడాది ఈ 100 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించాలని, లేదంటే వీరిని స్పెషల్‌ బ్యాచ్‌ గుర్తించి వచ్చే ఏడాది సీట్లు కేటాయించాలని పొందుపరిచారు.
 
లేదంటే ఈ ఏడాది 22 మంది విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించారు కాబట్టి వారికి ఈ ఏడాది మిగిలిన సీట్లు కేటాయించుకునే వెసులుబాటు కల్పించాలని, వచ్చే ఏడాది ఎంత మంది విద్యార్థులు నీట్‌లో క్వాలిఫై అవుతారో వారందరికీ తప్పనిసరిగా సీట్లు వచ్చేలా హామీ ఇవ్వాలని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే సోమవారం సమావేశంలోనూ ఈ అంశాలపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఈ విషయంపై న్యాయ సలహా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 
 
రాష్ట్రం నుంచి వెళ్లిన అధికారులు మంగళవారం కూడా ఢిల్లీలోనే బస చేసి, దీనిపై న్యాయనిపుణులతో చర్చల జరపాలని నిర్ణయించారు. దీనికి కేంద్ర అధికారులు కూడా సమ్మతించడంతో, మంగళవారం కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు, ఎంసీఐ అధికారులు న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు.
 
గత వారం ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆ శాఖ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వచ్చే ఏడాది నీట్‌ రాయదలచిన విద్యార్థులు సోమవారం(డిసెంబర్‌ 11) నుంచి నారాయణ కాలేజీకి వెళ్లాలని సూచించారు. అయితే, సోమవారం ఒక్క విద్యార్థి కూడా నారాయణ కాలేజీకి హాజరుకాలేదు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...