Jump to content

Pennsylvania State University in Amaravati


sonykongara

Recommended Posts

అమరావతిలో పెన్సిల్వేనియా వర్సిటీ!
636485023231662577.jpg
10-12-2017 అమరావతి: ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు కానుంది. ఈ నెల 14న పెన్సిల్వేనియా వర్సిటీ బృందం విజయవాడకు రానుంది. అమరావతిలో వర్సిటీని స్థాపించడంపై రాష్ట్ర ఆర్థిక మండలితో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ వర్సిటీలో లక్ష మంది రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసే పనికి పూనుకున్నట్టు ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

13 minutes ago, katti said:

Penn state or University of Penn? I think it is University of Penn and it is Ivy league university

yeah, University of Pennsylvania that includes Wharton school of Business ...etc schools is Ivy league - private university.

Penn state is public university.

I hope it is UPenn.

Link to comment
Share on other sites

పీలో పెన్సిల్వేనియా మెగా వర్సిటీ
15-12-2017 02:34:09
 
636489020541901347.jpg
  • లక్ష మంది విద్యార్థులకు లబ్ధి కలిగేలా చర్యలు
  • ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’లో సింగపూర్‌ వర్సిటీ సహకారం
  • ఏపీకి వస్తున్న ‘పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’
అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): విద్య, పరిపాలన విషయాల్లో రాష్ర్టానికి సహకరించేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. ఉన్నతవిద్యను ప్రోత్సహించి ఇక్కడి విశ్వవిద్యాలయాలకు సహకారం అందిస్తామని అమెరికాకు చెందిన ‘కామన్‌వెల్త్‌ ఆఫ్‌ పెన్సిల్వేనియా’ ప్రకటించింది. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ‘పెన్సిల్వేనియా స్టేట్‌ సిస్టమ్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ చొరవ తీసుకుంటుంది.
 
 
పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి బృందం గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. ‘పెన్సిల్వేనియా స్టేట్‌ సిస్టమ్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చాన్సెలర్‌ డాక్టర్‌ పీటర్‌ గార్లాండ్‌, ఇండియానా యూనివర్సిటీ అకడమిక్‌ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్‌ తిమోతి ఎస్‌ మోర్లాండ్‌, రుయా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుహాస్‌ పెడ్నేకర్‌ ఈ బృందంలో ఉన్నారు.
 
సీఎం సమక్షంలో పీఏఎస్ఎస్ హెచ్‌ఈతో ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు(ఏపీఈడీబీ) లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ తీసుకుంది.
 
ఉన్నతవిద్యను అభ్యసించే దాదాపు లక్ష మంది విద్యార్థులకు ఉపకరించేలా పెన్సిల్వేనియా వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుంది. మరోవైపు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌(ఎన్‌యూఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్ ’లో భాగంగా పరిపాలనా విధానాలను మరింత బలోపేతం చేయడం, పనితీరు సూచికలు, మాస్టర్‌ ప్లాన్‌ కోసం సచివాలయంలో ఈ ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేశ్‌కుమార్‌, లీకాన్‌ యూస్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ(ఎల్‌కేవైఎస్ పీపీ) డీన్‌ మహబూబాని, ఆ సంస్థకు చెందిన అసోషియేట్‌ ప్రొఫెసర్‌ టాన్‌ ఖీజియప్‌ దీనిపై సంతకాలు చేశారు.
 
 
ఇదిలావుండగా, రాష్ట్రంలో ‘అమరావతి పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ ఆవిర్భవించనుంది. ఈ చాప్టర్‌ను ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో జరిగే 39వ జాతీయ ప్రజాసంబంధాల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఈ చాప్టర్లు సెమినార్లు, కాన్ఫరెన్సులు, వర్క్‌షాప్ లను నిర్వహిస్తాయి. ప్రజా సంబంధాల శాఖలో పనిచేసే ఉద్యోగులు, జర్నలిజం విద్యార్థుల కోసం శిక్షణా కార్యక్రమాలు చేపడతాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న 25 చాప్టర్లకు అదనంగా ఇది సేవలందిస్తుంది.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...