Jump to content

Agriculture


sonykongara

Recommended Posts

సిరులు కురిపించే శ్రీగంధం
25-01-2018 23:26:24
 
636525195882108556.jpg
  • తిరుమల గిరుల్లో వంద హెక్టార్లలో సాగు
  • 20 ఏళ్ల తరువాత 27 కోట్లు ఆదాయం
తిరుమల శేషాచలం అడవుల్లో శ్రీగంధం పెంపకంపై టీటీడీ అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో 82 హెక్టార్లలో శ్రీగంధం మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. మరో 18 హెక్టార్లలో శ్రీగంధం మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతులు కూడా శ్రీగంధం సాగుపై దృష్టి సారించి, మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు అటవీ శాఖ అధికారులు.
 
 
శ్రీగంధం మొక్క తనంతట తాను ఆహారాన్ని సేకరించుకుని పెరగదు. పక్కన ఉన్న మొక్కల నుంచి ఆహారాన్ని సేకరించుకుని పెరగడం శ్రీగంధం మొక్క లక్షణం. అంటే శ్రీగంధం మొక్కను నాటాలంటే దాని పక్కన మరో మొక్కను కూడా నాటాల్సి ఉంటుంది. నర్సరీ వయస్సులో శ్రీగంధంకు పక్కనే పొనగంటి, ఇరాంటమ్‌ వంటి మొక్కలను పెంచాల్సి ఉంటుంది. సాగుచేసే సమయంలో ప్రతి శ్రీగంధం మొక్క పక్కన కంది మొక్కలను నాటాలి.
 
 
అదేవిధంగా ప్రతి 6 శ్రీగంధం మొక్కలకు ఒక ఎర్రచందనం మొక్కను నాటాలి. రెండు, మూడేళ్ల వరకు కంది మొక్కలు శ్రీగంధానికి ఆహారంగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఎర్రచందనం లేదా రోజ్‌వుడ్‌ వంటి మొక్కల వేర్ల నుంచి శ్రీగంధం మొక్కలు ఆహారాన్ని సేకరిస్తాయి. మూడు అడుగులులోపు ఉండే కలుపు మొక్కలను శ్రీగంధం మొక్కల పక్కన పెంచితే మరింత ఏపుగా పెరిగే అవకాశం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
 
 
ఔషధాలు..సుగంధ ద్రవ్యాల్లో..
పర్‌ఫ్యూమ్స్‌, సెంట్లు, సబ్బులు, అగరబత్తిల తయారీల్లో విరివిగా శ్రీగంధాన్ని వినియోగిస్తారు. అదేవిధంగా ఔషధగుణాలు ఉండడం వలన ఫార్మాస్యుటికుల్‌ కంపెనీల్లో కూడా శ్రీగంధం తైలాన్ని వాడతారు. ఇతర దేశాల శ్రీగంధం మొక్కలు కన్నా మనదేశంలోని శ్రీగంధం రకానికే మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువ ఉంది. మన గంధంలోనే నూనెల శాతం, పరిమళ శాతం ఎక్కువగా ఉంటుంది. ఒక హెక్టారు భూమిలో 1000 మొక్కలు నాటుతారు.
 
 
ఇందులో 600 మొక్కలు పక్వానికి వస్తాయి. శ్రీగంధం మొక్క పూర్తిస్థాయి వినియోగంలోకి రావాలంటే దాదాపు 20 ఏళ్లు పడుతుంది. బెరుడు (స్టెమ్‌) కేజీ విలువ మార్కెట్లో రూ.11 వేలు పలుకుతోంది. శ్రీగంధం వేరు ఒక కేజీ రూ.15 వేలుగా ఉంది. 20 సంవత్సరాల తరువాత కేజీ శ్రీగంధం ధర కిలో రూ. 40 వేలకు చేరుకుంటుంది. ఒక్కొ చెట్టు నుంచి 10 కేజీల శ్రీగంధం వస్తుంది. ఈ లెక్కన 600 చెట్ల నుంచి 6000 కేజీలు(6 టన్నులు) శ్రీగంధం కలప వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ధర రూ. 15వేలు. 20 ఏళ్ల తరువాత ఈ ధర రూ. 40వేలకు పెరుగుతుందని అంచనా. ఈ ధరతో లెక్కిస్తే ఒక హెక్టారుపై లభించే ఆరు టన్నుల శ్రీగంధం ద్వారా రూ. 27 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.
 
 
రైతులకు అనుకూలం
రైతులు కూడా శ్రీగంధాన్ని పెంచుకోవచ్చు. దీన్ని శాస్త్రీయంగా పెంచడంతో పాటు దొంగల నుంచి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే శ్రీగంధం రైతు ఇంట సిరులు కురిపిస్తుంది. 20 ఏళ్ల తరువాత ఒక హెక్టారుపై రూ. 27 కోట్ల మేరకు ఆదాయం పొందే వీలుంటుంది.
- శ్రీనివాసులు, టీటీడీ ఫారెస్ట్‌ ఇన్‌చార్జి డీఎఫ్‌ఓ
 
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, తిరుపతి 
Link to comment
Share on other sites

  • Replies 103
  • Created
  • Last Reply
సిరులిచ్చే వరి వంగడం
25-01-2018 23:18:59
 
636525192080399742.jpg
  • 20 శాతం అధిక దిగుబడి
  • సీసీఎంబీ శాస్త్రవేత్త సృష్టి
  • త్వరలో అందుబాటులోకి..
 
మనుషుల్లో మాదిరిగానే మొక్కల్లో కూడా జన్యువులు ఉంటాయి. వాటిని గుర్తించి మార్పులు చేయడం ద్వారా ఎక్కువ దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయాలనేది శాస్త్రవేత్తల ఆలోచన. మన దేశంలో మొక్కల జన్యువులపై పరిశోధనలు జరుపుతున్న సంస్థ సీసీఎంబీ ఒకటే!
 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంగడాలతో పోలిస్తే.. 20 శాతం అదనంగా దిగుబడినిచ్చే కొత్తరకం వరిని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ (సీసీఎంబీ) శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు. ఇది ఈ ఏడాది ఖరీఫ్ కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ వంగడం తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. వీటి కోసం మన దేశంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సీసీఎంబీ కూడా మేలు రకం వంగడాల్లోని పది వేల రకాల జన్యువులను సేకరించి వాటి ద్వారా అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కొత్తరకం వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. ‘ప్రతి వరి రకంలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది.
 
 
ఉదాహరణకు కొన్ని వరి రకాలు త్వరగా పండుతాయి. కొన్నింటికి రకరకాల చీడపీడలను తట్టుకొనే శక్తి ఉంటుంది. వీటన్నింటికీ కారణం వాటిలో ఉండే జన్యువులు. ఆయా వరి రకాల్లో ఉన్న మంచి లక్షణాలకు కారణమైన జన్యువులను వేరు చేసి వాటి ద్వారా కొత్త రకాన్ని అభివృద్ధి చేశాం. దీనిపై ప్రస్తుతం క్షేత్ర స్థాయి పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి దాదాపుగా పూర్తయినట్లే. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత దీనిని ఈ ఏడాది మధ్యలో రైతులకు అందిస్తాం’ అని ఈ వరి రకాన్ని అభివృద్ధి చేసిన డాక్టర్‌ హితేంద్ర పటేల్‌ ఆంధ్రజ్యోతికి వివరించారు. ఏదైనా కొత్తరకం వరిని విడుదల చేసే ముందు మూడేళ్ల పాటు పరీక్షలు జరుపుతారు.
 
 
ఈ పరీక్షల్లో పర్యావరణం, ఇతర పంటలు, ప్రాణులకు ఎటువంటి హాని ఉండదని తేలిన తర్వాత దానిని మార్కెట్‌లోకి విడుదల చేయటానికి అనుమతిస్తారు. సీసీఎంబీ ఇప్పటికే వివిధ రకాల చీడపీడలను తట్టుకొనే వరిని అభివృద్ధి చేసింది. ‘పంటల విషయంలో జన్యుస్థాయిలో పరిశోధనలు చాలా కష్టం. ఎందుకంటే.. కొన్ని వేల ఏళ్ల పరిణామక్రమం తర్వాత ఈ పంటలు ప్రస్తుత స్థితికి వచ్చాయి. అంటే వాటిలో ఉండే జన్యువుల కూడా అనేక రకాల మార్పులకు లోనయ్యాయి. మేము అలాంటి మార్పులు రావటానికి కారణమైన జన్యువులను ముందుగా గుర్తిస్తాం.
 
 
ఉదాహరణకు.. ఒక రకం వరి మిగిలిన వాటి కన్నా ముందే సిద్ధమవుతోందనుకుందాం. దీనికి కారణమైన జన్యువులను మేము గుర్తిస్తాం. ఈ జన్యువులను విడదీసి వేరే రకాల్లో ప్రవేశపెడతాం. ఆ తర్వాత ఈ జన్యువులు ప్రవేశపెట్టడం వల్ల వచ్చిన మార్పులను గమనిస్తాం. ఉదాహరణకు ఎక్కువ దిగుబడినిచ్చేందుకు కారణమైన ఒక జన్యువును ప్రవేశపెడితే దాని వల్ల మొక్కకు చీడలను తట్టుకొనే శక్తి తగ్గిపోవచ్చు.. ఇలాంటి రకరకాల చర్య - ప్రతిచర్యలను గమనించిన తర్వాత కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తా’ అని వివరించారు. గత ఏడాది సీసీఎంబీ సాంబమసూరిలో ఒక కొత్త రకాన్ని రైతుల కోసం విడుదల చేసింది. ‘దక్షిణ భారత దేశంలో సాంబమసూరిని ఎక్కువగా తింటారు. అందుకే మేము ఆ రకాన్ని ఎన్నుకున్నాం. కొత్తరకం వరికి కూడా ఇదే మూలం’ అని హితేంద్ర వివరించారు.
 
2PADDYF14.jpg 
 
 
 
 
- స్పెషల్‌ డెస్
Link to comment
Share on other sites

వేప కషాయంతో కాయ ఈగకు చెక్‌
25-01-2018 23:11:00
 
636525186651530178.jpg
వివిధ పంటల సంరక్షణకు రైతులు ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ రైతాంగానికి ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ దిగువ సూచనలు చేస్తున్నారు.
 
 
కంది పంటను శనగపచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఆశిస్తోంది. వీటి నివారణకు నొవాల్యురాన్‌ ఒక మి.లీ. లేదా ఇనూమెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రా. లేదా కోరాజన్‌ 0.3 మి.లీ. లేదా ఫ్లూబెంటామైడ్‌ 0.2 మి.లీ. లేదా స్పైనోసాడ్‌ 0.3 మి.లీ. లేదా ఇండాక్సికార్బ్‌ 0.75 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పురుగు మందులు మార్చి మార్చి పిచికారీ చేసి నివారించుకోవచ్చు.
 
 
పంటలో మారుకా మచ్చల పురుగు గూళ్లు గనుక ఎక్కువగా గమనించినట్లయితే పై మందులకు 1.0 మి.లీ. నువాన్‌ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. రెండు సంవత్సరాల నుండి పిందె, కాయ దశలో కాయ ఈగ ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. కాయ ఈగ ఆశించినపుడు నష్టం బయటకు కనిపించదు. కాబట్టి పిందె దశలో ఐదు శాతం వేపగింజల కషాయం పిచికారీ చేసినట్లయితే తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. పిందె దశలో థయాక్లోప్రిడ్‌ 0.7 మి.లీ. లేక డైమిథోయేట్‌ 2.0 మి.లీ. లేక ప్రొఫెనోఫాస్‌ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 
 
వరిలో కలుపు నివారణకు బ్యూటాక్లోర్‌ 50 శాతం ఇ.సి. 1 నుండి 1.5 మిల్లీలీటర్లు లేదా అక్సాడయార్టిల్‌ 35 గ్రాములు లేదా ప్రిటిలాక్లోర్‌ 50 శాతం ఇ.సి. 500 మి.లీ. లేదా పైరజో సల్ఫ్యూరాన్‌ 80 గ్రా. ఏదో ఒక దానిని ఎకరానికి 20 కిలోల పొడి ఇసుకతో కలిపి నాటిన మూడు నుండి ఐదు రోజులలో పలుచగా నీరు ఉంచి పొలంలో సమానంగా వెదజల్లాలి.
 
 
రైతులు మరిన్ని సలహాల కోసం కాల్‌ చేయాల్సిన నెంబరు 1800 425 0430
Link to comment
Share on other sites

మిద్దె తోట.. బతుకు బాట
25-01-2018 23:17:23
 
636525190480741181.jpg
ఏడేళ్లుగా మిద్దెతోట పెంచుతూ అద్భుతాలు చేస్తున్నారు ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి. అ అనుభవాలతో ఆయన రచించిన ‘మిద్దెతోట’ పుస్తకం ఇటీవల మార్కెట్‌లోకి వచ్చింది. తెలుగురాష్ట్రాల ప్రజల్లో మిద్దెతోటల పెంపకంపై ఆసక్తి నానాటికీ పెరుగుతున్నది. వారి తృష్ణ తీర్చేందుకు ‘మిద్దెతోట’ ఎంతో ఉపకరిస్తుంది.---కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కల మిద్దెతోట సేద్యం చేస్తూ 478 రోజుల పాటు తన ఫేస్‌బుక్‌పై ఏ రోజుకారోజు మిద్దెతోట సాగు, నిర్వహణల గురించి వివరంగా రాశారు రఘోత్తమ్‌. గత ఏడేళ్లలో వెయ్యి మందికి పైగా సందర్శకులు వచ్చి రఘోత్తమ్‌ మిద్దెతోటను చూసి ప్రేరణ పొందారు. ఆయన మిద్దెతోటను గురించిన దాదాపు 50 వీడియో ఫిల్మ్‌లు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.
 
 
ఇంత ఆసక్తికి ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, ఆరోగ్యకరమైన ఆహారం కోసం వెదుకులాటలే కారణం. 163 గజాల ఇంటి పైకప్పు పైన ఈ ఏడేళ్లలో 25 క్వింటాళ్లకు పైగా కూరగాయల ఉత్పత్తిని సాధించారు. అంటే సగటున రోజుకి కిలో కూరగాయలన్నమాట. ఈ దిగుబడిలో పండ్ల లెక్క కలపలేదు. అన్నింటినీ మించి ఏడేళ్లుగా ఆయన మార్కెట్‌లో కూరగాయలు కొనలేదు. ఇంటికి కావాల్సిన 75 శాతంకు పైగా పండ్ల అవసరాలను మిద్దెతోట సాగుతోనే ఆయన సాధిస్తున్నారు. మిద్దెతోట వల్ల శరీరానికి వచ్చే వ్యాయామం, ఇంటికి చల్లదనం, పురుగు మందులు లేని ఆహారం, ఇరుగుపొరుగుతో ఇచ్చిపుచ్చుకోవడం, మనుషుల్లో పెరిగే సృజనాత్మకత వంటి అనేక ప్రయోజనాలున్నాయన్నారు రఘోత్తమ్‌.
 
 
హైదరాబాద్‌లోనే సుమారు 40 వేల ఎకరాల మిద్దె ఉంది. హైదరాబాద్‌ మాత్రమే కాక ఇతర నగరాలు, టౌన్‌లలో మిద్దెలు వేల ఎకరాలు ఉంటాయి. గ్రామాలలోనే మిద్దెతోటలు చేపడుతున్నవారూ ఉన్నారు. మిద్దెలన్నీ పచ్చగా మారితే బోలెడు ఉత్పత్తితో పాటు నగర జీవితానికి సంబంధించిన అనేక సమస్యలను ఒత్తిళ్లను అధిగమించవచ్చు. ప్రతి ఒక్కరూ పూనుకోవాలే కానీ పెద్ద కష్టమేమీ కాదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాకో మోడల్‌ రూఫ్‌ గార్డెన్‌ నిర్మిస్తే ఆసక్తి ఉన్నవారికి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని ప్రతిపాదిస్తారు రఘోత్తమ్‌.
 
 
రైతును అన్నివిధాలా స్వయంపోషకం చేయడమే నిజమైన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానమని రఘోత్తమ్‌ అంటారు. బతుకునిండా విష రసాయనాలను నింపుకుంటే శరీరం నిండా పలు వ్యాధులు వచ్చి చేరతాయి. ఈ ప్రమాదాలను గుర్తించాలి. వీటికి వ్యతిరేకంగా పోరాడాలి. చిన్న సంస్కరణ చేయాలంటే పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. మనం పోరాటం ఆపినప్పుడు మన మరణం మొదలవుతుందని తన పుస్తకంలో హెచ్చరిస్తారు రఘోత్తమ్‌.
 
 
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన శాఖ మిద్దెతోటను ప్రోత్సహిస్తోంది. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మిద్దెతోటల పెంపకాన్ని ఒక యజ్ఞంగా చేపడితో భవిష్యత్తు అవసరాలు తీరడంతో పాటు పర్యావరణ, సామాజిక పరంగా మేలు జరుగుతుంది.
 
 
మిద్దెతోట, తుమ్మేటి రఘోత్తమ్‌ రెడ్డి
పేజీలు : 182, వెల : రూ. 349
రైతునేస్తం పబ్లికేషన్స్‌, 6-2-959,
దక్షిణ భారత హిందీ ప్రచాసభ కాంప్లెక్స్‌,
ఖైరతాబాద్‌, హైదరాబాద్‌-4,
96767 67777
 
డోర్‌ నెం. 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్ట్‌,
వట్టిచెరుకూరు మం., గుంటూరు - 522017, 97053 83666
- డి.వి.రామకృష్ణారావు, హైదరాబాద్‌
Link to comment
Share on other sites

సాగులో సంచలనం డ్రోన్‌ స్ర్పేయర్‌
25-01-2018 23:14:01
 
636525188459017779.jpg
పది నిముషాల్లో ఎకరం పంటపై మందులు స్ర్పే వ్యవసాయంలో సాంకేతికత నానాటికీ పెరుగుతోంది. కూలీల కొరతను అధిగమించడంతో దిగుబడి ఖర్చులు తగ్గించుకుని, అధిక దిగుబడి సాధించేందుకు తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో యంత్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా అగ్రికల్చర్‌ డ్రోన్‌ స్ర్పేయర్‌ రైతులను ఆకర్షిస్తున్నది.
 
 
పంటలకు అవసరమైన ఎరువులు, క్రిమిసంహారకాలను చల్లేందుకు డ్రోన్‌ స్ర్పేయర్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరికరాన్ని ఇప్పటివరకు యూరప్‌, అమెరికా దేశాల్లో వినియోగిస్తున్నారు. ఇటీవల మన దేశంలో కూడా డ్రోన్‌ల తయారీ మొదలైంది. పెళ్ళిళ్ళు, పెద్దపెద్ద ఫంక్షన్లు, ప్రముఖుల మీటింగ్‌లలో డ్రోన్‌ కెమెరా వినియోగిస్తున్నారు. అదే రీతిలో ఉండే అగ్రికల్చర్‌ డ్రోన్‌ స్ర్పేయర్‌తో రైతులు తమ పొలాల్లో సులభంగా మందులు చల్లుకునే వీలుంటుంది. సాధారణ స్ర్పేయర్ల ద్వారా పిచికారీ చేసిన దానికంటే డ్రోన్‌ స్ర్పేయింగ్‌ వల్ల పంటలకు అధిక ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
 
 
తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో క్రిమిసంహారక మందులు పిచికారి చేయడానికి డ్రోన్‌ స్పేయర్‌ ఉపయోగపడుతుంది. కేవలం పది నిమిషాల్లో ఎకరం పొలంలో డ్రోన్‌ స్ర్పేయింగ్‌ ద్వారా మందులు చల్లవచ్చు. పంటలకు మూడు అడుగుల ఎత్తులో ఎగురుతూ ఇది మందుల్ని సమానంగా చల్లుతుంది. చిన్న కమతాలు కాకుండా ఎకరం పైబడిన కమతాలలో దీని వినియోగం లాభదాయకంగా ఉం టుంది. మొబైల్‌ యాప్‌ ద్వారా ఇది పనిచేస్తుంది. దీన్ని వెబ్‌ ల్యాండ్‌ తో అనుసంధానం చేయడం వల్ల అది పని చేసే ప్రాంతాలలోని పొలం సర్వే నెంబర్లు, విస్తీర్ణం ఇట్టే తెలిసిపోతాయి. మెట్ట, మాగాణి పంటలకు దీనిని ఉపయోగించవచ్చు. డ్రోన్‌ స్ర్పేయింగ్‌ పై రైతులకు అవగాహన కోసం కృష్ణాజిల్లాలో పలు చోట్ల డెమో కార్యక్రమాలు జరిగినట్టు వ్యవసాయశాఖ ఇన్‌చార్జి జాయింట్‌ డైరెక్టర్‌ మోహనరావు తెలిపారు.
 
 
ఈ అగ్రికల్చర్‌ డ్రోన్‌ స్ర్పేయర్లను రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. 5 లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్‌ స్ర్పేయర్‌ను 80 శాతం సబ్సిడీపై రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిని ఒక్కొక్క రైతుకు అందించే కంటే బృందానికి ఒక డ్రోన్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఒక మండలం లేదా పది గ్రామాలకు కలిపి ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఆ కేంద్రంలో డ్రోన్‌ స్ర్పేయర్‌తో పాటు ముఖ్యమైన వ్యవసాయ పరికరాలన్నీ (మిషన్లు) అందుబాటులో ఉంచాలనే అభిప్రాయంతో ఉన్నారు.
 
ఈ పరికరాలన్నింటినీ కలిపి మొత్తంలో 80 శాతం సబ్సిడీ ఇచ్చి సంబంధిత కేంద్రం ద్వారా రైతులకు నిర్ణీత ధరకు అద్దెకు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఫలితంగా రైతుకు పెట్టుబడితో పనిలేకుండా తక్కువ రేటుకు అధునాతన పరికరాలతో వ్యవసాయం చేసుకునే సదుపాయం కలుగుతుంది.
 
డ్రోన్‌ పనితీరు భళా
పొలాలకు పురుగు మందులు చల్లే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. డ్రోన్‌ వినియోగం వల్ల రైతులకు ఎలాంటి హాని ఉండదు. తక్కువ సమయంలో పని పూర్తి అవడమే కాక విస్తీర్ణాన్ని బట్టి పురుగు మందును అందుకు అవసరమైన నీటిని కలుపుకునే టెక్నాలజీని డ్రోన్‌లో పొందుపరిచారు. మామూలు స్ర్పే వల్ల పురుగు మందులు వృథా అయ్యే అవకాశం ఉంటుంది. డ్రోన్‌లో అందుకు ఆస్కారం ఉండదు.
- మోహనరావు, కృష్ణాజిల్లా వ్యవసాయశాఖ ఇన్‌చార్జి జెడి
 
 
 17MTM15.jpg
 
 
 
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మచిలీపట్నం
Link to comment
Share on other sites

http://boltcoldbrew.com/#faqs

 

 

We source the highest grade 100% Arabica beans directly from plantation owners and farmers. Our beans are shade grown at high altitudes and have 100% traceability. Our Natural range of cold brew is made using green beans from plantations in Chikmagalur, Karnataka. Our Organic range is made using green beans from the Araku valley in Andhra Pradesh.

Link to comment
Share on other sites

కరవు నేలలో లాభాల సిరులు 
ఆపిల్‌బేర్‌ సాగుపై అన్నదాతల ఆసక్తి 
జిల్లాలో 600 ఎకరాల్లో సాగు 
kdp-sty3a.jpg
రేగుజాతి కాయ ఆపిల్‌బేర్‌. కరవు నేలకు అనుకూలమైన పంట. రేగిపండు కంటే రెట్టింపు పరిమాణంలో కనిపిస్తూ అధిక దిగుబడులు అందించే ఆపిల్‌బేర్‌ సాగుపై జిల్లా రైతాంగం దృష్టి సారించింది. అధిక విస్తీర్ణంలో సాగుచేసి లాభాలు ఆర్జిస్తున్నారు. నీటితడులు ఎక్కువగా అవసరం లేకపోవడం, అంతర్‌పంటగా సాగుచేసుకోవడానికి అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

మైదుకూరు, న్యూస్‌టుడే : జిల్లాలో మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, రైల్వేకోడూరు ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల్లో ఆపిల్‌బేర్‌ సాగు చేసినట్లు ఉద్యానశాఖ అధికారుల లెక్క. కాశినాయన మండలంలోనే 150 ఎకరాలు సాగైనట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఆపిల్‌బేర్‌ కాయలను తినేందుకు జిల్లావాసులు పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో మార్కెటింగ్‌ కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలపై ఆధారపడుతున్నారు. 
అధికారులు గుర్తించిన అంశాలు

తేమతో కూడిన వేడిప్రాంతాలు అనుకూలమైనవి 
* అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు 
* ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునే శక్తి 
* అంతర పంటగా సాగుకు అనుకూలం 
* కాయతోలు మందంగా ఉండడంతో ఎక్కువరోజులు నిల్వ సామర్థ్యం ఉంటుంది. 
* భూమిలో తేమ శాతం అధికమైతే దిగుబడి తగ్గి, మొక్క నశించిపోయే అవకాశం ఉంది.

అంతర పంటగా ఆపిల్‌బేర్‌ 
పురపాలిక పరిధిలోని పుల్లయ్యస్వామి సత్రం వద్ద ఎల్లంపల్లె గ్రామ రైతు హజరత్‌రెడ్డి నిమ్మలో అంతరపంటగా ఆపిల్‌బేర్‌ సాగు చేశారు. మూడు ఎకరాల్లో 370 నిమ్మ, ఆపిల్‌బేర్‌ మొక్కలు 370 నాటించారు. గతేడాది ఏప్రిల్‌లో మొక్కలు నాటగా ఇటీవలే దిగుబడులు చేతికందాయి. రెండు టన్నులు విక్రయించగా మరో రెండు టన్నుల దిగుబడి చేతికొచ్చే అవకాశం ఉంది. ఒకసారి సాగు చేస్తే మొక్క కత్తిరింపుతో 10నుంచి 15 ఏళ్లు దిగుబడులు వస్తాయని రైతులు అంటున్నారు. అధికారులు సూచిస్తున్న విధంగా మొదటి ఏడాది 6 నుంచి 10 కిలోల దిగుబడి వస్తుందని అంచనా. రెండో సంవత్సరం నుంచి రావాల్సిన దిగుబడి మొక్క నాటిన తొమ్మిది నెలలకే వచ్చిందని రైతు హజరత్‌రెడ్డి తెలిపారు.

ఇతర రాష్ట్రాలపై దృష్టిసారిస్తా 
మూడెకరాల్లో మొక్కలకు, సత్తువలు, పురుగు మందుల కోసం రూ.40 వేలు ఖర్చు చేశా. స్థానిక వ్యాపారులు కిలో రూ.12తో కొనుగోలు చేశారు. రెండు టన్నుల విక్రయంతో రూ.24వేలు ఆదాయం వచ్చింది. మరో రెండు టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో రూ.40తో విక్రయిస్తున్నారు. రైతు నుంచి వినియోగదారుడి వద్దకు వెళ్లేసరికి రూ.28 వ్యత్యాసం ఉంది. కర్ణాటక, తమిళనాడులో కిలో రూ.30 ధర పలుకుతున్నట్లు సమాచారం.

- హజరత్‌రెడ్డి, ఆపిల్‌బేర్‌ రైతు, ఎల్లంపల్లె

అంతర పంటకు అనుకూలం 
మొక్క పెద్దగా విస్తరించదు. అంతర పంటగా సాగు చేసుకునేందుకు అనుకూలం. ఎండలు.. నీటిఎద్దడని తట్టుకునే శక్తి మొక్కకు ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు ఆపిల్‌బేర్‌ సాగుకు అనుకూలంగా ఉన్నటు ్లతెలుస్తోంది. తక్కువపెట్టుబడి ఎక్కువ ఆదాయం తీసుకునే పంటగా చెప్పవచ్చు.

- జి.లక్ష్మణ్‌కుమార్‌, వ్యవసాయాధికారి, మైదుకూరు

సాగు విస్తీర్ణం ఊహించలేదు 
ఆపిల్‌బేర్‌ సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అనుకున్న దానికంటే సాగు విస్తీర్ణం పెరిగింది. బడ్జెట్‌ లేక పోవడంతో ఉద్యానశాఖ ద్వారా రాయితీ ఇవ్వకపోయినా రైతులు ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దిల్లీకి ఎగుమతి చేసే దోస పంటలాగా ఆపిల్‌బేర్‌ను పెట్టెల్లో నింపి ఎగుమతి చేసుకోగలిగితే మంచి లాభాలు వస్తాయి. పచ్చగా ఉండటం వల్ల తినేందుకు ఆసక్తి చూపడం లేదు. తిని చూస్తే రుచి తెలుస్తుంది. స్థానికంగా డిమాండు పెరుగుతుంది.

- ఇరగంరెడ్డి ఈశ్వరప్రసాద్‌రెడ్డి,  ఉద్యానశాఖ అధికారి
Link to comment
Share on other sites

టమాటా.. పారెయ్యక్కర్లేదు!
31-01-2018 02:55:22
 
636529641236308930.jpg
  • చిత్తూరు జిల్లాలో ప్రాసెసింగ్‌ పార్కు
  • ముందుకొచ్చిన జపాన్‌ సంస్థ
  • భాగస్వామ్య సదస్సులో ఒప్పందం
  • చిత్తూరు, అనంతపురం రైతులకు మేలు
అమరావతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): టమాటా రైతు కుదేలు!.. గిట్టుబాటు ధర రాక.. టమాటా రోడ్డుపాలు!.. కోత ఖర్చులూ రాక.. కోయకుండానే వదిలేసిన టమాటా!.. ఏటా ఇలాంటి పరిస్థితులను ప్రసార మాధ్యమాల్లో రావడం చూస్తూనే ఉన్నాం. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. అయితే.. ఇకపై టమాటా రైతుల కష్టాలకు తెరపడనుంది. ప్రభుత్వ చొరవతో.. చిత్తూరు జిల్లాలో జపాన్‌కు చెందిన ఖగోమి అనే కంపెనీ టమాటా ప్రాసెసింగ్‌ పార్కును స్థాపించేందుకు అంగీకరించింది. త్వరలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో దీనికి సంబంధించిన ఒప్పందం జరగనుంది. ఇది కార్యరూపం దాలిస్తే.. చిత్తూరు, అనంత రైతులకు మేలు జరిగినట్టే.
 
 
నాటుకు బదులు హైబ్రిడ్‌
రాష్ట్రంలో పండే టమాటా అంతా నాటురకం. ఇది కూరలు, పచ్చళ్లకు పనికొస్తుంది. కానీ ప్రాసెసింగ్‌ చేసేందుకు, కెచప్‌ చేసేందుకు పనికిరాదు. దీంతో పంట దిగుబడి ఎక్కువగా వచ్చినప్పుడు తగినంత డిమాండ్‌ లేక ధర పడిపోతోంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఏటా 11లక్షల టన్నుల నాటు టమాటా పండిస్తున్నారు. ఈ స్థానంలో అవసరమైన మేరకు హైబ్రిడ్‌ టమాటా సాగుచేసేందుకు, ప్రాసెసింగ్‌ పార్కు పెట్టేందుకు ప్రాథమిక అవగాహన కుదిరింది. తొలి దశలో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో పైలట్‌ ప్రాజెక్టుగా హైబ్రిడ్‌ టమాటా సీడ్‌ను వేయనున్నారు. అనంతపురం జిల్లాలోనూ సాగుచేయిస్తారు.
 
 
మామిడి తాండ్ర తయారీకీ కొత్తరూపు
డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో చాలా చోట్ల మామిడి తాండ్ర తయారవుతోంది. తాటిచాపల మీద మామిడి గుజ్జు వేసి ఆరుబయట ఆరుబెట్టడం వల్ల పరిశుభ్రత లోపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిశుభ్రంగా తయారీ చేసేలా యాంత్రీకరణను తీసుకురానున్నారు. విజయనగరం జిల్లాలో ఈ యంత్రాల పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
 
చైనీస్‌ హోటళ్లకు నాటు టమాటా
మరోవైపు ప్రస్తుతం పండిస్తున్న నాటు టమాటాను కూడా ప్రాసెస్‌ చేసేందుకు కృషి స్టార్‌ అనే కంపెనీతో ప్రభుత్వం చర్చలు జరిపింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో రైతు సంఘాలతో కలిసి ఈ కంపెనీ పనిచేస్తోంది. ముంబైలోని పలు చైనీస్‌ హోటళ్లకు నాటు టమాటాను కెచప్‌, ఇతర పదార్థాలను సరఫరా చేస్తోంది.
Link to comment
Share on other sites

మెట్టభూములకు జలసిరి 
రాళ్లు, గుట్టల్లో.. నేడు పండ్లతోటలు, ఇతర పంటలు 
ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉపాధి 
546 మంది అన్నదాతలకు లబ్ధి 
న్యూస్‌టుడే, తలుపుల 
atp-sty1a.jpg

చిన్నసన్నకారు ఎస్సీ, ఎస్టీ రైతుల్లో ఎన్టీఆర్‌ జలసిరి పథకం వెలుగులను నింపుతోంది. సాగుకు అనువుగాని రాళ్లు, ముళ్లకంపలతో నిండిన కొండగుట్టాల్లాంటి మెట్టభూముల్లో సైతం నేడు విస్తారంగా పండ్లతోటలను సాగుచేశారు. వాటిలో అంతర సాగుగా పలు రకాల పంటలను పండిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు రైతులకు కలిపి 10 ఎకరాలు పైబడిన పొలం ఉన్న రైతుకు ఒక బోరుబావిని ఉచితంగా తవ్వించారు. సాగునీరు పుష్కలంగా లభించిన బోరుబావికి విద్యుత్తు, మోటారు పైపులు ఉచితంగానే బిగించారు. ఆ తరువాత భూఅభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి సాగుకు పనికిరాని మెట్టభూములను సైతం పంటలకు అనువుగా తీర్చిదిద్దారు. తత్ఫలితంగా వందల ఎకరాల్లో పండ్లతోటల పెంపకం చేపట్టారు. కదిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 546 మంది రైతులకు 151 బోరుబావులను తవ్వించారు. వీటిలో 135 చోట్ల మోటార్లు బిగించారు. వాటి కింద 1510 ఎకరాల మెట్టభూములు పండ్లతోటలుగా మారాయి. మరో 16 బోరుబావులకు మోటర్లను బిగించాల్సి ఉంది. వీటిలో తలుపుల మండలంలో అత్యధికంగా 34 బోర్లు వేశారు. అత్యల్పంగా నల్లచెరువు మండలంలో 14  తవ్వి, 10 మోటార్లు అమర్చారు. మరో నాలుగింటికి చేతిపంపులు అమర్చేందుకు ప్రతిపాదనలు చేశారు. గాండ్లపెంటలో 19, కదిరిలో 29, నంబులపూలకుంటలో 20, తనకల్లులో 23 చొప్పున మోటార్లను బిగించారు. ఎస్సీ ఎస్టీ రైతులకే కాకుండా బీసీ రైతులకు కూడా ఎన్టీఆర్‌ జలసిరి పథకం కింద ఉచిత బోరుబావులను తవ్విస్తే మరిన్ని మెట్టభూములు సాగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు రైతులు కోరారు.

వందెకరాల్లో మామిడి సాగు 
తలుపుల మండలంలోని మడుగుతండాలో దాదాపు వందెకరాల్లో మామిడి తోటలు సాగుచేశారు. ఎన్టీఆర్‌ జలసిరి పథకం కింద బోరుబావులను తవ్వించినా, వాటికి మోటార్లు బిగించడం ఆలస్యం కావడంతో, ఉపాధి పథకం కింద రైతులు ఎక్కువగా మామిడి తోటలు సాగుచేశారు. ప్రస్తుతం అధికారులు విద్యుత్తు మోటార్లు బిగించడంతో సాగుకు అవసరమైనన్ని నీరు పుష్కలంగా వస్తుండడంతో పండ్లతోటలను కాపాడుకొంటూ వాటి మధ్యలో అంతరసాగుగా వేరుసెనగ, పొద్దుతిరుగుడు, కంది, మినుములు, టమోటా, వంకాయ తదితర పంటలను సాగుచేసుకొంటూ మంచి ఉపాధి పొందుతున్నారు. ఈ గ్రామంలో మరికొంతమంది రైతులకు విద్యుత్తు మోటార్లు ఇవ్వాల్సి ఉందని రైతులు చెబుతున్నారు.

నిరుపేద రైతుల్లో చిగురిస్తున్న ఆశ 
ఉపాధి అవకాశాలు లేక నిత్యం వలసబాట పట్టే ఎస్టీ, ఎస్టీ రైతుల జీవనోపాధికి ఎన్టీఆర్‌ జలసిరి భరోసాఇస్తోంది. పండ్లతోటలతోపాటు, అంతరసాగు పంటలు బాగా పండుతున్నాయి. నాటి కూలీలు నేడు చిన్న, సన్నకారు రైతులుగా రాణిస్తున్నారు. ఒక్క తలుపుల మండలంలోనే కాదు గాండ్లపెంట మండలం చామాలగొంది, నంబులపూలకుంట మండలం వెలిచెలమల, కదిరి మండలం ముత్యాలచెరువు, పట్నం తదితర ప్రాంతాల్లో వేసిన జలసిరి పథకం బోరుబావులతో మంచి ఉపాధిని పొందుతున్నారు.

అంతర సాగు బాగుంది 
ఎన్టీఆర్‌ జలసిరి పథకం ద్వారా వేసిన బోరుబావిలో సాగునీరు పుష్కలంగా వస్తున్నాయి. వాటితో మామిడి మొక్కలు సాగుచేశా. వాటిలో అంతర సాగుగా వేరుసెనగ వేశా. పంట ఆశాజనకంగా ఉంది. అధికారులు బోరుబావి తవ్వించారు కాని విద్యుత్తు మోటారు, పైపులు ఇవ్వలేదు. విద్యుత్తు నియంత్రికను బిగించారు. దీంతో సొంతంగా విద్యుత్తు మోటారు కొని, పెట్టుకుని పంటలు సాగుచేస్తున్నా. అధికారులు విద్యుత్తు మోటారు ఇస్తే మరింత ఉపయోగంగా ఉంటుంది.

                               -  పీరేనాయక్‌, మడుగుతండా

మామిడి తోటల సాగుతో పదోన్నతి 
ఈదులకుంట్లపల్లి పంచాయతీలో దాదాపు వందెకరాల్లో మామిడి తోటల సాగుకు శక్తివంచన లేకుండా కృషి చేసి, వందశాతం మొక్కల అభివృద్ధికి తోడ్పడ్డాం. దీంతో ఉపాధి క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సాంకేతిక సిబ్బందిగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వందెకరాల్లో మామిడి మొక్కలు సాగుచేసిన రైతుల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ రైతులే కావడం విశేషం, వారిలో ఎక్కువ మందికి ప్రభుత్వం ఎన్టీఆర్‌ జలసిరి పథకం కింద బోరుబావులను తవ్వించడంతో మరింత లాభదాయకంగా మారింది.

    - శ్రీరాములు, సాంకేతిక సిబ్బంది, తలుపుల

16 మందికి మోటార్లు ఇవ్వాల్సి ఉంది

కదిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ జలసిరి పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 151 బోరుబావులు తవ్వించాం. వీటిలో దాదాపు 135 బోరుబావులకు విద్యుత్తు మోటార్లను అమర్చాం. మరో 16 బిగించాల్సి ఉంది. ప్రస్తుతం వీటి ద్వారా 545 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. దాదాపు 1510 ఎకరాల్లో మామిడి తోటలు, వివిధ రకాల పంటల సాగులో ఉన్నాయి. ఈ పథకం కింద వేసిన బోరుబావులు నియోజకవర్గంలో మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి. వీటిని మరింత విస్తరించడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. 
-  లక్ష్మీనరసయ్య , ఏపీడీ కదిరి
Link to comment
Share on other sites

  • 2 weeks later...
యాపిల్‌ బేర్‌తో లాభాలసిరి
09-02-2018 00:19:53
 
636537323928198693.jpg
  • మామిడికి ప్రత్యామ్నాయంగా పెరుగుతున్న ఆదరణ
గ్రీన్‌ యాపిల్‌, గంగరేగి సంకరంగా రూపొందించిన కొత్త వంగడం యాపిల్‌ బేర్‌ పండు రైతులకు లాభాలు పండిస్తోంది. మెట్ట రైతుకు మామిడికి ప్రత్యామ్నాయ పంటగా ఇది మంచి ఆదరణ పొందుతోంది. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే వీలున్న యాపిల్‌బేర్‌ సాగు వేగంగా విస్తరిస్తున్నది.
 
కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలంలో యాపిల్‌ బేర్‌ సాగు క్రమంగా విస్తరిస్తున్నది. మామిడిరైతుకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా వుండటం, ఉద్యాన శాఖ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడంతో ఈ పంట సాగు వేగంగా విస్తరి స్తున్నది. ఈ పంటను అన్నిరకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. తెగుళ్ళను తట్టుకునే గుణం వుండటం, యాపిల్‌బేర్‌ కాయలు ఎక్కువ కాలం నిల్వ వుండే అవకాశం కూడా వుండటంతో రైతులు దీని సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
 
కొత్త రకం ఫలం కావడంతో వినియోగదారుల నుంచి కూడా దీనికి మంచి గిరాకీ ఉంది. ఎకరాకు 400 నుంచి 600 మొక్కల వరకు నాటుతున్నారు. ఈ మొక్కలు నాటిన ఆరు మాసాల్లో దిగుబడి ప్రారంభమవుతుంది. మార్చి, ఏప్రిల్‌, మే మాసాలు మినహా శీతాకాలం, వర్షాకాలాల్లో ఏడాదికి రెండు దిగుబడులను ఇస్తోంది. ఎకరాకు రూ.40 వేల పెట్టుబడి పెడితే 16 నుండి 24 టన్నుల దిగుబడి వస్తోంది.
 
 
యాపిల్‌బేర్‌ కాయలు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజి ధర రూ.50లు పలుకుతుండగా రైతులకు రూ.20లు చొప్పున గిట్టుబాటు అవుతోంది. దీన్నిబట్టి చూస్తే ఏళ్ళు గడిచేకొద్దీ దిగుబడి పెరగడంతో పాటు రైతులకు నికరలాభం పెరుగుతోంది. కేజీకి రూ.20లు ధర పలికితే ఎకరాకు ఏటా మూడు నుండి నాలుగు లక్షల రూపాయల వరకూ ఆదా యం లభిస్తోందని రైతులు చెప్తున్నారు. నాటిన మొక్కలు 20 ఏళ్ళ వరకు దిగుబడిని ఇస్తాయంటున్నారు. ఉద్యానవన శాఖ కూడా ఈ పంట సాగుకు హెక్టార్‌కు రూ.14వేల వరకు రాయితీ ఇవ్వడంతో పాటు డ్రిప్‌ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.
 
 
‘‘యాపిల్‌బేర్‌ వంగడాన్ని జంగారెడ్డిగూడెం నుంచి తెచ్చి ఆరుమాసాల కిందట సాగు చేపట్టా. ఇప్పటికి నెలరోజుల నుంచి కాపు వస్తోంది. చిన్నచెట్లకే 10 నుండి 30 కేజీల వరకు దిగుబడి వస్తోంది. ఎకరాకు 600 మొక్కలు సాగుచేశా. అందులో బంతి, వంగ వంటి ఆరుతడి పంటలు కూడా వేశాను. తోట ఐదేళ్లు పెరిగేసరికి ఎకరాకు 50 టన్నులు దిగుబడి వచ్చేలాగా ఉంద’’న్నారు కనసానపల్లి రైతు ఆలూరి సాంబశివరావు.
 
 
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఆగిరిపల్లి
Link to comment
Share on other sites

  • 3 weeks later...
చామంతి.. సిరుల పూబంతి 
రక్షక తెరల కింద పూల సాగు 
వృథా నీటిని ఒడిసిపట్టి అద్భుతాలు చేస్తున్న మహిళా రైతు 
atp-sty1a.jpg

పుష్పాలు సాగునీటి నేలల్లోనే పూస్తాయనడం ఒట్టి మాట.. అందమైన తీగకు పందిరి ఉంటేనే పుష్పిస్తాయనడం పాతమాట.. నీరు, నేలతో సంబంధం లేకుండా ఏప్రాంతంలో అయినా కుసుమాలు వికసిస్తాయనడం నేటి మాట.. రైతు శ్రమకు ఆధునిక సాంకేతికత తోడైతే బీడు భూముల్లో సైతం ఎలాంటి పంటలైనా సాగు చేసి సిరులు పండించవచ్చని నిరూపించారామె.  ఎకరం భూమిలో రక్షక తెరల కింద చామంతి సాగు చేపట్టి బంగారం పండిస్తున్నారు.

- న్యూస్‌టుడే, బెళుగుప్ప

వృథానీటిని ఒడిసి పట్టి.. 
ప్రభుత్వం పాలీహౌస్‌ ఏర్పాటుకు రాయితీ మంజూరు చేయగా నిర్మాణం చేపట్టి పంట సాగు మొదలు పెట్టారు. అయితే బోర్లలో నీరు పంట సాగుకు అనుకూలించలేదు. తన పొలం కింద వంక వెళుతుండటంతో వర్షాకాలంలో ఈ మార్గన అధిక నీరు వృథా అయ్యో విషయాన్ని ఆమె గుర్తించారు. వంకకు సమీపంలో సేద్యపు కుంటను తవ్వించి వృథాగా వెళ్లే వర్షపు నీటిని కుంటలోకి మళ్లించడంలో సఫలీకృతురాలయ్యారు. రైతు శ్రమకు ప్రతిఫలంగా పెద్దఎత్తున వర్షాలు కురవడంతో సేద్యపు కుంట జలకళను సంతరించుకుంది. ఈ నీటిని, ఇతర బోర్ల ద్వారా వస్తున్న నీటిని ఒకేసారి పంటకు వదలకుండా శుద్ధిజల యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని శుద్ధి అయిన నీటిని పంటలకు ఉపయోగిస్తున్నారు.

నూతన పంటలను సాగు చేయాలి 
సాధారణ పంటలు వేసి ఏటా నష్టపోయేవాళ్లం. కొత్త పంటలు సాగు చేయాలని తలంచి రక్షక తెరల కింద చేపడుతున్న పూల సాగు గురించి తెలుసుకున్నాము. ఉద్యాన అధికారుల ప్రోత్సాహంతో పాలీహౌస్‌ నిర్మాణం చేపట్టి ఉద్యానశాఖ ఇచ్చిన రాయితీతో జిల్లాలో ఎక్కడాలేని విధంగా హాలెండ్‌ రకానికి చెందిన చామంతి పూలను సాగు చేసి అధిక దిగుబడి సాధిస్తున్నాను. చక్కని లాభాలు వస్తున్నాయి. పది నెలల పాటు పూల దిగుబడి ఉంటుంది.

-రైతు, శ్యామలమ్మ, తగ్గుపర్తి

విడిపూలసాగుకు డిమాండు 
సాధారణ రకాలైన చామంతిని సాగు చేస్తే ఎగుమతి చేసేలోపు పూల నాణ్యత దెబ్బతింటుందని భావించిన రైతు ఉద్యాన అధికారి ధనుంజయ సూచనలతో కేవలం రక్షక తెరల కింద మాత్రమే (పాలిహౌస్‌లలో) సాగయ్యే అత్యంత ఖరీదైన, నాణ్యత కలిగిన టిష్యూ కల్చర్‌ హాలెండ్‌ రకాలైన డచ్‌వైట్, మోనాలిసా, న్యూవైట్, ఎల్లో మ్యారీ గోల్డ్‌ రకాలను సాగు చేశారు. ఈ పూలు మొక్కల నుంచి కోసిన నాటి నుంచి నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటాయి.

పూల రకాలు 
జిల్లాలో విడి పూల సాగు చాలా తక్కువగా ఉంది. రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అత్యంత ఖరీదైన టిష్యూ కల్చర్‌ చామంతి పూల సాగుకు కూడా రాయితీ ఇవ్వడం జరుగుతోంది. చామంతి, లిల్లీ పూలకు ఇతర రాష్ట్రల్లో డిమాండు ఎక్కువగా ఉంది. విడి పూల పంటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలి. అర్హులైన రైతులకు రాయితీలు కల్పించేందుకు ఉద్యానశాఖ ముందుంటుంది.

 - సుబ్బరాయుడు, ఉద్యానశాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు

ళుగుప్ప మండలంలో తగ్గుపర్తి గ్రామంలో శ్యామలమ్మ అనే మహిళా రైతు చామంతి పూలను ఆధునిక పద్ధతుల్లో సాగుచేస్తూ శాభాష్‌ అనిపించుకొంటున్నారు. తగ్గుపర్తి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పప్పుశనగ సాగు. ఏటా ఒకే పంటపై ఆధారాపడి.. సరైన వర్షాలు పడక రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట ఆరకొరకగా చేతికి వస్తుండటంతో తీవ్రంగా నష్టపోయారు. ఇతర పంటలను సాగు చేయాలని తలచినా నీటి వసతి లేకపోవడం, నల్లరేగడి భూముల్లో బోర్ల ద్వారా వచ్చే నీటితో పంటలు సాగు చేస్తే ఉప్పు పొరలు వచ్చి భూమి స్వభావం దెబ్బతింటుందని ఆమె గ్రహించారు. దీనికి విరుగుడుగా ఎర్ర మట్టిని ఏర్పాటు చేసుకొని పంట సాగుకు శ్రీకారం చుట్టారు.

సాగు విధానం ఇలా.. 
ఈ పూల సాగుకు ముందు వంద సెంటీమీటర్లు వెడల్పుతో బోదులను ఏర్పాటు చేసుకోవాలి. ఒక బోదుకు మరో బోదుకు మధ్యలో ముఫ్పై సెంటీమీటర్లు దారి వదలాలి. బోదులకు రెండు రోజులపాటు నీటి తడి ఇచ్చిన తర్వాత మొక్కలు నాటుకోవాలి. నాటిన దినం నుంచి 90వ రోజు నుంచి పూలు వికసించడం మొదలవుతాయి. హాలెండ్‌ రకపు పూల మొక్కలు ఒక ఎకరానికి లక్ష అరవై వేల మొక్కలు అవసరమవుతాయి. ఎకరాకు 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

మార్కెట్ సౌకర్యం... 
ఈ పూలు కోసిన నాటి నుంచి నాలుగైదు రోజుల వరకు వాటి అందం (నాణ్యత) దెబ్బతినదు. అంతేకాకుండా వీటిని పూల గుత్తిలలోకి ఉపయోగిస్తుండటంతో ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. దీంతో విజయవాడ, బెంగళూరు, బళ్లారి విఫణిలలో కిలో రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతోంది. అక్కడ వీటికి అధికంగా డిమాండ్‌ ఉండటంతో ఆయా విఫణులకే తరలిస్తున్నారు. ఇలా రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు రైతు తెలిపారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...

ఇది కోస్తా కాదు..

ఈస్ట్ గోదావరి అసలు కాదు..

ఏప్రిల్ నెలలో రాయలసీమ ..

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గ గుమ్మగట్ట మండలం..

#JaiTDP ✌️✌️

https://pbs.twimg.com/media/DbKSWNSUQAA6ngk.jpg

Link to comment
Share on other sites

  • 1 month later...
రాయితీల బహుమతి.. లాభాల దిగుమతి 
అన్నదాతకు అండగా ప్రభుత్వం 
ఉద్యాన రైతుకు బోలెడన్ని ప్రోత్సాహకాలు 
అందిపుచ్చుకుంటే అధిక దిగుబడి 
న్యూస్‌టుడే, పుట్టపర్తి గ్రామీణం 
atp-sty1a.jpg

జిల్లాను పండ్లతోటల కేంద్రంగా మారుస్తాం...అన్నదాతను ఆర్థిక ప్రగతివైపు నడిపిస్తాం, అనంత నుంచి కరవును తరిమికొడతాం, పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా పలుమార్లు చెప్పడం ఆ మేరకు హామీలను అమలు చేస్తూ అన్నదాతకు అండగా నిలుస్తోంది. సంప్రదాయ పంటలు సాగుచేసి నష్టపోతున్న రైతన్నలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు కొండంత అండగా నిలుస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగు ప్రోత్సహించడానికి ఆ శాఖ రాయితీపై పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. జిల్లాలో పండ్ల తోటల విస్తరణ, నిర్వహణ, పూలు, కూరగాయల సాగు, హరితగృహాలు, ప్యాక్‌హౌస్‌లు, శీతల గిడ్డంగులు, రవాణా వాహనాలు, నీటి నిల్వ కుంటలు, క్రేట్స్‌, బొప్పాయి, అరటి, దానిమ్మ తోటల సాగుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. అందుబాటులో ఉన్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

జిల్లాకు రూ.45.05 కోట్లు 
ప్రభుత్వ ప్రోత్సాహం ఉండటంతో జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో 8 లక్షల హెక్టార్లలో సాధించలేని దిగుబడి, లాభాలను కేవలం 1.71 లక్షల హెక్టార్లలో సాగయ్యే ఉద్యాన పంటల ద్వారా ఆర్జిస్తున్నారు. జిల్లాలో 1.71 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇదంతా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లనే సాధ్యమవుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఉద్యానశాఖ పరిధిలో వివిధÅ పథకాల అమలుకు 45.05కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో మూడు పథకాలు రాష్ట్ర సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌(ఎంఐడీహెచ్‌)కు రూ.32.30కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన(ఆర్‌కెవీవై) కింద రూ.4.69 కోట్లు, రాష్ట్ర ప్రణాళిక పథకం కింద రూ.12.06కోట్లు కేటాయించారు. ఇవన్నీ రాయితీపై అందిస్తారు. రైతుల నుంచి మీపేవా ద్వారా దరఖాస్తులు తీసుకోనున్నారు.

రవాణాకు అనువుగా క్రేట్లు 
రైతు తాను పండించిన ఉత్పత్తులు ఎక్కువ రోజులు దాచుకోవడానికి, రవాణాలో దెబ్బతినకుండా నాణ్యంగా మార్కెట్‌కు తరలించడానికి క్రేట్స్‌ బాగా ఉపయోగపడతాయి. వీటిని 50 శాతం రాయితీపై ఇస్తారు. ఇందులో పెద్దవి ఒకటి రాయితీపోను ధర రూ.125, చిన్నవి రూ.105. ఒక్కో రైతుకు ఎకరాకు 40 చొప్పున 100 క్రేట్లు ఇస్తారు.

బొప్పాయి దిగులే లేదోయ్‌ 
ఉద్యాన పంటల్లో ప్రస్తుతం రైతుకు కొంత ఊరటనిచ్చేది బొప్పాయి. ఆసక్తి ఉన్న రైతులు ఒక హెక్టారులో బొప్పాయి మొక్కల సాగుకు ఉద్యాన శాఖ రూ.24,700 రాయితీ సాయమందిస్తుంది. రాయితీ రెండేళ్లపాటు కొనసాగుతుంది. సద్వినియోగం చేసుకుంటే బొప్పాయి సాగుతో దిగులు లేకుండా లాభాలు గడించవచ్చు.

అరటితోటలకు 
ఉద్యానశాఖ అరటి తోటలు సాగు చేసే రైతులకు మంచి ప్రోత్సాహకాలను అందిస్తోంది. రాయితీ రెండేళ్లపాటు వర్తిస్తుంది. హెక్టారుకు రూ.40,985లు చెల్లిస్తుంది. ఒక రైతుకు ఒక హెక్టారు పరిమితం. దానిమ్మ పంటల సాగుకు మూడు సంవత్సరాల పాటు హెక్టారుకు రూ.21,868 వేలు ప్రోత్సాహకం 5 ఎకరాలకు అవకాశం.

హరిత గృహం..నాణ్యతకు అవకాశం 
హరిత గృహాలు వాణిజ్య పంటల సాగుకు ఎంతో అనుకూలం. పూల తోటలు మొదలు కాప్సికం, కుకుంబర్‌ వంటి తోటలు పెంచుకోవచ్చు. ఇక్కడ సాగు చేసిన పంటలను చీడపీడలు పెద్దగా ఆశించవు. ఈ ఏడాది జిల్లాకు 120 చదరపు మీటర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు రూ.4.84 కోట్లు కేటాయించారు. ఒక్కో రైతుకు ఎకరానికి మాత్రమే రాయితీ ఇస్తారు. రూ.17 లక్షల రాయితీ ఇస్తుంది..

నాణ్యతకు ప్యాక్‌హౌస్‌లు 
ప్యాక్‌హౌస్‌లు జిల్లాకు 160 యూనిట్లు మంజూరుకాగా రూ.3.20కోట్లు నిధులు కేటాయించారు. పండ్ల తోటల్లో యాంత్రీకరణ కింద 1196 యూనిట్లకు రూ.1.74 కోట్లు, వీటితోపాటు 2365 హెక్టార్లలో పండ్ల తోటల విస్తరణ పథకానికి రూ.4.88 కోట్లు, కూరగాయల సాగుకు 700 హెక్టార్లలో రూ.1.40 కోట్లతో సాగు చేపడతారు..

తోటల నిర్వహణకు తోడ్పాటు 
ఉద్యానశాఖ పండ్ల తోటల పెంపకం, నిర్వహణకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆరేళ్ల వయసు దాటిన మామిడి, చీనీ, దానిమ్మ తోటల శాఖీయ నియంత్రణ కింద ఒక హెక్టారుకు రూ.6 వేలు, 5 ఎకరాల వరకు, 20 ఏళ్లు పైబడిన మామిడి తోటల నిర్వహణకు హెక్టారుకు రూ.20వేలు, ఎరువులు, మొక్కలకు రూ.13,300, చీనీ తోటలకు రూ.16,800 రాయితీ ఇస్తోంది.

శీతల గిడ్డంగులకు సాయం 
ఉద్యాన పంటలను ఎక్కువ రోజులు దాచటానికి శీతల గిడ్డంగుల (కోల్డు స్టోరేజీ)నిర్మాణాలకు అవకాశం ఇస్తోంది. ఒక్కో యూనిట్‌ రూ.1.40 కోట్లు, రూ.20లక్షలతో 2 ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉల్లిపాయల నిల్వకు రూ.2లక్షలతో 2 యూనిట్లు, రూ.84 లక్షలతో నాలుగు రైపనింగ్‌ ఛాంబర్లు, ఫ్రీకూలింగ్‌ యూనిట్‌్్స 4 యూనిట్లు రూ.35 లక్షలు, 6 శీతల గదులకు రూ.32 లక్షలు, తొమ్మిది టన్నుల సామర్థ్యం ఉన్న 7 రిఫ్రిజిరేటర్‌ వ్యాన్లకు రూ.64లక్షలు నిధులు సిద్ధంగా ఉన్నాయి. 
 

* జిల్లాలో ఉద్యాన పంటల సాగు : 1.71 లక్షల హెక్టార్లు 
* పండ్ల తోటలు : 1.22,654 హెక్టార్లు 
* కూరగాయలు : 35,313 హెక్టార్లు 
* ఉద్యాన పంటలకు 2018-19 నిధులు : Rs.49.05 కోట్లు 
* రాష్ట్ర సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌(ఎంఐడీహెచ్‌) : Rs.32.30 కోట్లు 
* రాష్ట్ర ప్రణాళిక పథకం : Rs.12.06 కోట్లు 
* రాష్ట్రీయ కృషి వికాస యోజన : Rs.4.69 కోట్లు

ఊత కర్రల సాయంతో టమోటా సాగు: టమెటా మంచి దిగుబడి పొందడానికి, కాయలు దెబ్బతినకుండా ఉండటానికి ప్రభుత్వం ఊతకర్రల సాగును అందుబాటులోకి తెచ్చింది. హెక్టారుకు రూ.18,750 అందిస్తోంది. ఇలా ప్రతి రైతుకు రెండున్నర ఎకరాల వరకు ఊతకర్రలు పొండానికి పరిమితి ఉంది.

పూలతోటల విస్తరణ పథకం: ఈ పథకం కింద హెక్టారుకు రూ.16 వేల ప్రోత్సాహం ఇస్తోంది. కూరగాయలు సాగుచేసిన రైతులకు హెక్టారుకు రూ.3 వేలు రాయితీ కల్పించింది. జిల్లాకు మూడు పథకాల కింద 1750 హెక్టార్లలో సాగుకు రూ.2.44 కోట్లు కేటాయించింది. వీటితోపాటు ఉద్యానశాఖ పరిధిలో పిచికారి యంత్రాలను రాయితీపై పొందవచ్చు. 4 స్ట్రోక్‌ సామర్థ్యం ఉన్న పిచికారి యంత్రాలు రూ.8100కి ఇస్తోంది. 
నీటి నిల్వ కుంటలు: వర్షాభావం, విద్యుత్తు అంతరాయం అధిగమించేందుకు ప్రభుత్వం నీటి నిల్వ కుంటలకు ప్రాధాన్యం ఇస్తోంది. వీటి నిర్మాణాలకు రాయితీలు ఇస్తోంది. పంట కాలానికి సరిపడేలా కుంటను నిర్మించుకుంటే విద్యుత్‌ ఖర్చు ఉండదు. పొలానికి పై భాగంలో కుంట నిర్మిస్తే పైపుల ద్వారా నీటిని అందించవచ్చు. ఈ ఏడాది వివిధ పథకాల కింద జిల్లాకు 229 యూనిట్లు రూ.7.30 కోట్లు విడుదలయ్యాయి. 20×20×3కి రూ.75వేలు, 100×100×3కి రూ.

2లక్షల రాయితీ వర్తిస్తుంది. 
30లోగా దరఖాస్తు చేసుకోవాలి 
ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఆయా పథకాల విలువను బట్టి 50 శాతం రాయితీలు కల్పిస్తోంది. అందుబాటులో ఉన్న రాయితీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తగిన ఆధారాలతో వచ్చి జూన్‌ 30లోపు దరఖాస్తులు చేసుకోవాలి. నిబంధనలకు లోబడి రాయితీలు, పథకాలు వర్తిస్తాయి. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానశాఖ రాయితీలను ఉపయోగించుకుని లాభసాటి వ్యవసాయం.దిశగా అడుగులు వేయాలి.

- సుబ్బరాయుడు, డీడీ, ఉద్యానశాఖ
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...