Jump to content

Agriculture


sonykongara

Recommended Posts

  • Replies 103
  • Created
  • Last Reply
ఎర్రెర్రని జామ.. ఆదుకుందమ్మ! 
మామిడి తోటలో అంతర పంటగా సాగు 
తైవాన్‌ పింక్‌ రకంతో మంచి ఫలితాలు 
మాకవరపాలెం, న్యూస్‌టుడే 
vsp-sty1a.jpg

ఏడాదికి ఒకసారి కాసే మామిడి కాయల కోసం తోటను సంవత్సరమంతా కాపలా కాసుకోవాల్సి వస్తుంది. దాంతో రైతుకు సమయం వృథా అవుతుంది. మామిడి తోటల్లో అంతర పంటగా తైవాన్‌ పింక్‌ జామ మొక్కలు మంచి ఫలితాలను ఇస్తుందని రైతు కన్నూరు గంగరాజు నిరూపిస్తున్నారు.

మాకవరపాలెం మండలంలో జి.వెంకటాపురం పంచాయతీ సివారు సుభద్రయ్యపాలెంకు చెందిన కన్నూరు గంగరాజు తనకున్న ఎనిమిది ఎకరాల గరువులో నాలుగేళ్ల క్రితం మామిడి తోట వేసి ప్రభుత్వం రాయితీపై ఇచ్చే సోలారు పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మొక్కలకు నిరంతరం నీరు అందేలా గొట్టాలు ఏర్పాటు చేసుకుని బిందు సేద్యం చేపట్టారు. ఏడాది పొడవునా మామిడి తోటకు కాపలా ఉండాల్సి తప్పడం లేదని గ్రహించి, తోటలో నిత్యం రాబడి వచ్చే అంతర పంట వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యాన శాఖ అధికారుల సలహా మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో కడిం అద్దె అనే గ్రామంలో నర్సరీ నుంచి తైవాన్‌ పింక్‌ రకం జామ మొక్కలను తెచ్చారు. ఈ ఏడాది జనవరిలో మామిడి తోటలో జామ మొక్కలు నాటారు. అంతేకాకుండా పశువులపేడ, మట్టి, పచ్చిరొట్టతో సేంద్రియ ఎరువును సొంతంగా తయారు చేసుకుని మొక్కలకు వేస్తున్నారు. ఆయన కష్టం ఫలించి నెల రోజుల కిందట తొలిసారిగా జామ చెట్లు కాపునకు సిద్ధమయ్యాయి. మొదటి పంటలో 15 గంపలు కోసి మార్కెట్‌కు తీసుకెళ్లగా, రూ.3000కు విక్రయించారు. కాయలు అత్యంత రుచికరంగా ఉండడంతో పాటుగా కాయ లోపల భాగం ఎరుపు రంగులో ఉండడం కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. దీంతో పలువురు ఈ రకం కాయలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాయలు పక్వానికి వచ్చే సరికి కాయ 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు బరువు తూగుతోందని, గుజ్జు శాతం తక్కువగా ఉండి కండ ఎక్కువగా ఉంటుందని రైతు గంగరాజు తెలిపారు. ఇకపై నిరంతరం కాయలు కాస్తుందని హార్టీకల్చరల్‌ అధికారులు చెబుతున్నారని ఆయన తెలిపారు. అలాగే కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి, పునాస, బంగినపల్లి తదితర మేలు జాతికి చెందిన మామిడి విత్తనాలతో పాటుగా ఆవకాయ పచ్చళ్ల కోసం వివిధ రకాల మేలైన మామిడి చెట్లు కూడా వేశామని రైతు తెలిపారు. మామిడి తోటల్లో భూమి ఖాళీగా ఉంచకుండా ఇటువంటి జామ మొక్కలను నాటడం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం కలుగుతుందని గంగరాజు తెలియజేశారు.

Link to comment
Share on other sites

అన్నదాత సేవ కోసం...అమెరికా వీడి...! 
రూ.మూడు లక్షల జీతాన్ని వదిలేసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి 
సైలేజ్‌ గడ్డి తయారీ కేంద్రంతో పలువురికి ఉపాధి కల్పిస్తున్న యువకుడు 
న్యూస్‌టుడే, త్రిపురాంతకం 
pks-sty1a.jpg

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం... నెలకు రూ.3 లక్షల జీతం... ప్రతిష్టాత్మకమైన కంపెనీ... జీవితాంతం ఇబ్బందులు లేని సదుపాయాలు... అయితే ఆ రైతు బిడ్డ ఆలోచనలు మాత్రం చిన్నప్పుడు తాను తండ్రికి సాయం చేస్తూ చేసిన వ్యవసాయ పనుల చుట్టూనే తిరిగాయి. పరాయి దేశంలో పరుగులు పెట్టే జీవనం కంటే... సొంత ఊరిలో నా అన్న వాళ్లతో కలిసి పని చేసే జీవితానికే మొగ్గుచూపాడు ఆ యువకుడు. ఫలితంగా సైలేజ్‌ గడ్డి తయారీ పరిశ్రమ పెట్టి కరవు ప్రాంతంలో రైతులకు పశుగ్రాసం కొరత లేకుండా చేయగలిగాడు. యువకుడి స్ఫూర్తిపథంపై కథనం...

మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన గంటా చెన్నకేశవరెడ్డి అమెరికాలోని చికాగో పట్టణంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఒంగోలు క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్సు చదివిన అతను 2004లో చెన్నైలో టీసీఎస్‌లో చేరారు. అదే కంపెనీ తరఫున 2006లో అమెరికా వెళ్లారు. 2012 వరకు అక్కడే పని చేశారు. నెలకు రూ.మూడు లక్షల జీతంతో హాయిగా సాగిపోతున్న అతని జీవితంలో ఒక్కసారిగా ఆలోచనలు మారాయి. వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారం చేస్తూ సొంత గడ్డపై జీవించాలని ఆశించారు. స్నేహితుల మానసిక స్థైర్యాన్ని ఇవ్వడంతో 2015లో సైలేజ్‌ గడ్డి తయారీ పరిశ్రమను ప్రారంభించారు.

పాడి పరిశ్రమ అభివృద్ధి కోసమే... 
ఒకప్పుడు పాడికి పెట్టింది పేరుగా ఉన్న ప్రకాశం జిల్లాలో పాడి పరిశ్రమ కుదేలవుతోందని గుర్తించారు. ఒంగోలు తరువాత యర్రగొండపాలెం నియోజకవర్గంలోనే ఎక్కువగా పాల ఉత్పత్తి జరుగుతుంది. అలాంటిది పశుగ్రాసం కొరత కారణంగా రైతులు పశువులను అమ్మేస్తూ వలస వెళ్లిపోవడం అతడిని కలచివేసింది. మొక్కజొన్న సైలేజ్‌ మేత తయారీ ద్వారా అన్నదాతకు దన్నుగా నిలవాలని ఆలోచించారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో 2020 వరకు సైలేజ్‌ గడ్డి సరఫరా ఒప్పందం కుదుర్చుకొని రాజుపాలెం వద్ద పరిశ్రమను ఏర్పాటు చేశారు.

రైతన్నకు చేయూతనివ్వడమే లక్ష్యం 
అమెరికాలో ఆరేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను. కాని మనశ్శాంతి లేదు. రైతును బిడ్డను కనుక అన్నదాతలు పడే కష్టాలు తెలుసు. సాంకేతికతను ఉపయోగించి చేతనైనంత సాయం చేయాలనే ఆలోచనతో సొంత ఊరు వచ్చేశాను. స్థానిక పరిస్థితులకనుగుణంగా సైలేజ్‌ గడ్డి తయారీ పరిశ్రమ ఏర్పాటుచేసి ప్రభుత్వం ద్వారా రైతులకు అందేలా చేయగలుగుతున్నాను. రోజుకు 200 టన్నుల గడ్డి ఉత్పత్తి అవుతోంది. 90 శాతం ప్రభుత్వానికి 10 శాతం ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నాను.

- గంటా చెన్నకేశవరెడ్డి

రోజుకు 200 టన్నుల తయారీ... 
సీజన్‌ వారీగా ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు 1,500 టన్నులు మాగుడు గడ్డిని సరఫరా చేశారు. తయారీ సమయంలో రోజుకు 200 టన్నుల మాగుడు గడ్డిని తయారుచేస్తున్నారు. మొక్కజొన్న పంటను టన్ను రూ.2 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దీంతో ఎకరాకు రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంటంతో పాటు రైతులకు కరవు తీరుతోందని చెన్నకేశవ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

30 మందికి ఉపాధి... 
2015లో రూ.30 లక్షలతో సైలేజ్‌ గడ్డి తయారీని ప్రారంభించారు. బ్యాంకు ఆర్థిక సాయంతో రూ.5 కోట్ల విలువ కలిగిన యంత్రాలతో ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. మొక్కజొన్న కంకులు, గింజలు అమ్మేకంటే గడ్డి అమ్మడం ద్వారా నికర లాభం రావడంతో పంటను అమ్మేందుకు రైతులు ముందుకొస్తున్నారు. దీంతో చెన్నకేశవ రెడ్డి గడ్డి కొనుగోలుకు త్రిపురాంతకం, మేడపి, దర్శి, కర్నూలు జిల్లా ఆత్మకూరు, అనంతపురం జిల్లా తాడిపత్రి తదితర ప్రాంతాలకు కూడా వెళ్లి కొనుగోలు చేసి సైలేజ్‌ గడ్డి తయారు చేసి ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. నవంబరు నుంచి జూన్‌ వరకు ముమ్మరంగా మాగుడు గడ్డిని ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో 30 మందికి జీవనోపాధి లభిస్తోంది.

Link to comment
Share on other sites

 

వాణిజ్య పంటలు నష్టం వచ్చిన ఏడాది రైతును ఆర్థికంగా కుంగ దీస్తున్నాయి. అయినా రైతులు వాణిజ్యపంటల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ పెద్ద రైతుల్ని తలదన్నేలా ఆదాయం పొందుతున్నారు ఆదిలాబాద్‌ జిల్లా సాయిలింగి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు.
 
ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం సాయిలింగి గ్రామం కూరగాయల సాగుకు పెట్టింది పేరు. ఈ గ్రామానికి చెందిన సన్న, చిన్నకారు రైతులంతా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తారు. ఇదే గ్రామానికి చెందిన తోట గణపతి - లక్ష్మి దంపతులు పెరటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నారు. భార్యాభర్తలిద్దరూ కష్టపడి పనిచేసి పాలకూర, మెంతికూర, కొత్తిమీర, చిక్కుడు, తోటకూర, గోంగూర, పుల్లగూర లను సాగు చేస్తున్నారు. గణపతి పొలం పనులు చూసుకుంటే ఆయన భార్య లక్ష్మి పండించిన పంటను ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తుంది. నాణ్యమైన ఆకుకూరలు, కూరగాయలు నేరుగా విక్రయించడం వల్ల నిత్యం రెండు నుంచి మూడు వేల రూపాయలు ఆర్జిస్తున్నారు ఈ దంపతులు. ఆకు కూరలకు చీడపీడలు తక్కువ. ఫలితంగా సాగు ఖర్చులు తక్కువ. ఇద్దరూ కష్టపడి రోజంతా పనిచేస్తారు. దళారుల బెడద లేకుండా పండించిన పంటను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీంతో మిగిలిన వారి కంటే అధిక లాభాలు ఆర్జిస్తున్నామని చెబుతున్నారు ఆ దంపతులు.
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, తలమడుగు, ఆదిలాబాద్‌ జిల్లా
 
ఆకుకూరల సాగుతో భరోసా
ఆకు కూరల సాగులో నష్టం వస్తుందన్న భయం ఉండదు. తక్కువ నీటి వసతి ఉన్న రైతులు కూడా ఆకు కూరలను నిర్భయంగా సాగు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆకు కూరలు పండించే రైతులకు ప్రోత్సాహం అందించాలి. వాణిజ్య పంటలు సాగు చేసి నష్టపోతున్న రైతులకు ఆకుకూరల సాగు మంచి ప్రత్యామ్నాయం.
- తోట గణపతి, లక్ష్మి
Link to comment
Share on other sites

 

  • ఉద్యోగాలు వదిలి సాగుబాట
  • సేంద్రియం దిశగా అడుగులు
రైతులే వ్యవసాయం వదిలేసి పట్నాలకు తరలిపోతుంటే బెంగుళూరులో ఉద్యోగాలను, లక్షన్నర జీతాన్ని వదిలేసి స్వగ్రామంలో సేద్యం చేస్తున్నారు యువ దంపతులు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఉద్యోగాల కంటే సాగు ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తామంటున్న ఆ హైటెక్‌ రైతు దంపతుల స్ఫూర్తి గాథ ఇది.
 
 
అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మారుమూల ప్రాంతం. ఈ గ్రామంలో పుట్టిన అభిలాష్‌, సుష్మ ఉన్నత చదువులు చదివారు. ఇద్దరూ బెంగుళూరులో 14 ఏళ్ల పాటు ఉద్యోగాలు చేశారు. అభిలాష్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. సుష్మ ఫార్మసిస్టు. ఇద్దరూ నెలకు రెండు లక్షల జీతం పొందేవారు.
 
కానీ వారి మనసు అక్కడ లేదు. క్షణం తీరికలేని ఉద్యోగాలు వద్దనుకున్నారు. ప్రశాంత జీవనానికి స్వగ్రామానికి మించిన వేదిక లేదనుకున్నారు. ఉద్యోగాలు వదిలేసి వారి స్వగ్రామమైన గుడిబండకు చేరుకున్నారు. అభిలాష్‌ తండ్రి ఓ సామాన్య రైతు. వారికి 26 ఎకరాల పొలం ఉంది. ఇందులో 12 ఎకరాలకు నీటి వసతి వుంది.
 
 
14 ఎకరాలు మెట్ట భూమి. ఇందులో చాలా భాగం పంట సాగుచేయలేక బీడుగా వదిలేశారు. అభిలాష్‌, సుష్మ ఆ నేలలో సిరులు పండించాలని సంకల్పించుకున్నారు. రెండు బోర్లు వేయించారు. ఒక బోరుకు విద్యుత్‌ మోటారును అమర్చారు. మరో బోరుకు సబ్సిడీతో సోలార్‌ సిస్టంను ఏర్పాటుచేసుకున్నారు. అలా ఆధునిక పద్ధతుల ద్వారా విద్యుత్‌ సమస్యను అధిగమించారు. 15 ఎకరాలలో మామిడి, నిమ్మ, జామ, అంజురా, అల్ల నేరేడు మొక్కలు నాటారు. అందులో అంతర పంటలుగా కంది, వేరుశనగ, మునగ వంటివి సాగు చేశారు. రసాయన ఎరువుల వాడకం వల్ల నేలకు, ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని గమనించారు అభిలాష్‌. ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గు చూపారు.
 
 
వివిధ ప్రాంతాలలో పర్యటించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేశారు. సుభాష్‌ పాలేకర్‌ వ్యవసాయ విధానాన్ని పుస్తకాల ద్వారా చదివి లాభదాయక సాగు వైపు నడక ప్రారంభించారు. ఇంటర్నెట్‌లో ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అధ్యయనం చేస్తూ, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే పద్ధతులు తెలుసుకున్నారు. తుంపరసేద్యం చేపట్టారు. ఒకే పంట మీద ఆధారపడకుండా బహుళ పంటల సాగు చేపట్టారు. పండిన ఉత్పత్తులకు లాభసాటి ధరలు కల్పించే సంస్థల వివరాలను సేకరించారు. తొలుత అంజురా, మామిడి ద్వారా ప్రారంభంలో రూ.1.50 లక్షల ఆదాయం సంపాదించారు.
 
 
కుటుంబ ఆరోగ్యంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఆవుపేడ, గోమూత్రం మిశ్రమంగా చేసి ఎరువుగా వాడుతున్నారు. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. సేంద్రియంగా పండించే పండ్లు, కూరగాయలు రిటైల్‌ సంస్థలకు విక్రయిస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. తోట చుట్టూ రక్షణ కోసం కంచెను వేసుకున్నా వన్యమృగాలు, దొంగల బెడద లేకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.
 
పొలం వద్ద కావలి కోసం నెలకు ఒక మనిషికి రూ.5వేలు ఇచ్చినా ఏడాదికి రూ.60 వేలు అవుతుందన్నారు. రూ.60వేలతో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతో చాలా సౌకర్యంగా ఉందంటున్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించుకునేందుకు వీలుంటుందని చెబు తున్నారు. ఏ ఉద్యోగం చేసినా రానటువంటి తృప్తి వ్యవసాయంలో లభిస్తోందని ఆ యువ దంపతులు చెబుతున్నారు. 
mdk13.jpg 
 
సేద్యంతో సంతృప్తి
నగరంలో ఉద్యోగం చేస్తూ ఎంత సంపాదించినా రాని సంతృప్తి సేద్యం ద్వారా లభిస్తున్నది. అనంత రైతులు కేవలం వేరుశనగ మీదే ఆధారపడటం సరికాదు. బహుళ పంటల సాగు వల్ల రైతుల ఆదాయం ఎంతో పెరుగుతుంది. లాభసాటి అయితే నవతరం కూడా సేద్యం మీద దృష్టి సారిస్తుంది. బహుళ పంటల సాగు, బిందు సేద్యంలో సాటి రైతులకు సలహాలు ఇస్తున్నాం. సేంద్రియ సేద్యంతో మనతో పాటు ముందుతరాలు కూడా ఆరోగ్యంగా వుంటాయి.
- అభిలాష్‌, సుష్మ
 
 
Link to comment
Share on other sites

 

  • జింక్‌ పైపులతో ఎరువులు వేసే పరికరం
  • శాస్త్రవేత్తగా మారిన రైతుకూలీ
సాలు పంటల్లో పంట తదుపరి దశల్లో ఎరువు వేసేందుకు వీలుగా ఎదపెట్టే పరికరాన్ని రూపొందించారు ఒక రైతు కూలీ. సమయంతో పాటు డబ్బు ఆదా చేసే ఆ పరికరం విశేషాలు.
 
 
పొగాకు, మిరప తదితర సాలు పంటల్లో ఎరువులు దుక్కిలో వేస్తారు. తర్వాత వర్షాలు పడే అవకాశం ఉన్నపుడు, పంటలకు నీరు పెట్టే అవకాశం ఉన్నపుడు మొక్కలకు ఎరువు అందించాలంటే తిరిగి కూలీలతో మొక్కలు పాదుల వద్ద ఎరువు వేయిస్తారు. అలా చేయాలంటే కూలీల ఖర్చు అధికంగా వుంటున్నది.
 
కూలీలు ఎరువు వేసినప్పుడు అదంతా ఒకేచోట పడుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి మొక్క చనిపోయే ప్రమాదమూ వుంది. అయితే కూలీలతో పని లేకుండా ఎరువు మొక్కలకు దగ్గరగా పడే విధంగా ఒక పరికరాన్ని రూపొందించారు ఓ రైతు కూలీ. ఈ ప్రయోగం సక్సెస్‌ అయింది.
 
జింక్‌ పైపులు రెండింటిని తీసుకుని పైభాగంలో వెడల్పాటి రేకును వెల్డింగ్‌ చేశారు. పైపుల కింది భాగంలో గొర్రుకు ఉండే విధంగా పదునుగా (నేల తెగే విధంగా) కొనలు ఏర్పాటుచేశారు. పైభాగంలో ఎరువు పోస్తే గొట్టాల ద్వారా సాలులోని రెండు వైపులా ఉన్న మొక్కలకు దగ్గరగా ఎరువు పడుతుంది. ఆ తరువాత నీరు పెట్టినపుడు మొక్కలకు ఎరువు సమపాళ్లలో అందుతుంది.
 
 
గొర్రుతోలే సమయంలోనే...
మిరపలో, పొగాకులో గొర్రు తోలుతారు. ఎద్దుల గొర్రు తోలేందుకు ఒక మనిషి ఉంటారు. ఆ మనిషితోపాటు మరొకరు ముందరి గొర్రుకు రెండు వైపులా రెండు తాళ్లు కట్టి చివరలను ఎరువు ఎదబెట్టే పరికరానికి రెండు వైపులా కడతారు. ముందర వైపు గొర్రుతోలే వ్యక్తితోపాటు, వెనుకన ఎరువు ఎదబెట్టేందుకు మరొకరు ఉంటారు.
 
ఈ విధానంలో ఎరువును ఎదబెట్టడం ద్వారా సమయంతోపాటు దాదాపు వెయ్యి రూపాయల వరకు రైతుకు కూలి ఆదా అవుతుంది. ఎరువు అందించేందుకు ఒకరు, ఎదబెట్టేందుకు మరొకరు ఉంటే సరిపోతుంది. అదే కూలీలతో ఎకరాకు ఎరువు మొక్కల వద్ద మొదళ్లలో వేసి పైన మట్టి వేయాలంటే కనీసం రూ.పదిహేను వందలు ఖర్చు అవుతుంది. ఎరువు ఎదబెట్టేందుకు ఇద్దరు మహిళలైనా లేదా ఒక మగ, ఒక ఆడ కూలీ అయినా సరిపోతారు.
 
ong15.jpg 
 
ప్రయోగంతో ప్రయోజనం
గత ఏడాది మిరపలో కూలీలతో మొక్కల మొదళ్లలో సత్తువ మందు వేయించాం. కూలీలతో సమయం, డబ్బు వృధా అవుతోంది. రైతు శేషారెడ్డి, నేను ఈ ఏడాది ఈ పరికరం చేయించాం. ఎదబెట్టడానికి బాగానే ఉంది. తక్కువ ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతున్నది.
- ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, నెన్నూరుపాడు
 
 
Link to comment
Share on other sites

 

ఉద్యాన పంటల సాగులో రైతులు నీరు, ఎరువులు, పోషకాలు వృథా కాకుండా మల్చింగ్‌ పద్ధతిని పాటిస్తున్నారు. ఇప్పటివరకు మల్చింగ్‌ పద్ధతిని రైతులు స్వయంగా చేపట్టేవారు. ఆధునిక యంత్రం ద్వారా మల్చింగ్‌కు అవకాశం వుండటంతో రైతులు అటువైపు దృష్టి సారించారు.
 
 
ఇంతకాలం ఉద్యాన రైతులు ఓదెలు కట్టి ప్లాస్టిక్‌ ఫిలిం (అగ్రి ఫిలిం)ను ఉపయోగించి మల్చింగ్‌ చేసేవారు. దాంతో మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఈ ఫిలిం కప్పి ఉంచుతుంది. ఫలితంగా సాగునీరు ఆదా అవడమే కాకుండా కలుపు నివారణకు కూలీలను నియమించే ఖర్చు తగ్గుతుంది. గతంలో ఎరువులు కూడా మొక్క చుట్టూ ఉన్న వేరు వ్యవస్థకు సక్రమంగా అందేవి కావు. మల్చింగ్‌ పద్ధతి ద్వారా ఎరువులు మొక్కకు సక్రమంగా అందడంతో నాణ్యమైన ఉత్పత్తి, అధిక దిగుబడి వస్తున్నది. తెగుళ్లు, కీటకాలు ఆశించడం కూడా తక్కువ. దీంతో ఉద్యాన రైతులకు మల్చింగ్‌ వరంగా మారింది.
 
 
మల్చింగ్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆధునిక యంత్రం ఒకటి అందుబాటులోకి వచ్చింది. ట్రాక్టర్‌ ద్వారా ఈ మల్చింగ్‌ను చేపడుతున్నారు. ఈ యంత్రం ధర రూ.65,100 కాగా, ప్రభుత్వం రైతాంగానికి 50 శాతం రాయితీ ద్వారా రూ.32,550కు యంత్రాన్ని అందిస్తోంది. ఈ యంత్రం ఓదెలు కడుతుంది. మనుషులతో పోలిస్తే ఈ యంత్రం వేగంగా, తేడా లేకుండా ఓదెలు కడుతుంది. మనుషులతో ఓదెలు కట్టాలంటే నాలుగు వేలు ఖర్చయ్యేది.
 
ఈ యంత్రంతో రెండు వేలతోనే ఓదెలు సిద్ధం అవుతాయి. ప్రధానంగా టమోటా, మిరప, కర్బూజ, పూలతోటలు, కూరగాయల తోటలకు ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. మల్చింగ్‌ పద్ధతిలో పంట నేలను తాకదు. దాంతో పంట సురక్షితంగా వుంటుంది. ఈ తరహా పంటకు మార్కెట్‌లో మంచి ధర కూడా పలకడంతో రైతులు అధిక లాభాలు పొందవచ్చు.
 
103.jpg 
 
మంచి డిమాండ్‌
ఉద్యాన రైతులకు మల్చింగ్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మల్చింగ్‌ యంత్రం రైతుకు డబ్బు ఆదా చేయడంతో పాటు నాణ్యమైన దిగుబడులు అందించేందుకు తోడ్పడుతుంది. అందరికీ మల్చింగ్‌ యంత్రం పై సబ్సిడీ వుంది. రాయచోటి డివిజన్‌లో ఇప్పటివరకు 8 మల్చింగ్‌ యంత్రాలను అందించాం. 
- వనిత, ఉద్యాన అధికారి, రాయచోటి 
 
104.jpg 
రైతులకు ఎంతో మేలు
పేపర్‌ మల్చింగ్‌ యంత్రం వల్ల కలుపు మొక్కలు పెరగవు. చీడపీడల సమస్య కూడా ఉండదు. క్రిమిసంహారక మందులు కూడా కొంత ఆలస్యంగా కొట్టినా కూడా పెద్దగా సమస్య ఉండదు. నేను టామోటా, దోస పంటలను ఈ విధానంలోనే సాగు చేశాను. సాటి రైతుల్ని ఈ దిశగా ప్రోత్సహిస్తున్నాను.
- పెద్దిరెడ్డి, రైతు, చిన్నమండెం మండలం
 
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Agriculture ki ika chesindhi chaalu ..we need amaravati. Good agriculture can give comfort to farmers but real greatness to a people comes from cities, factories, mechanized production, high quality medical and educational services.

I am hoping for a time when we have bold leaders and undestanding population to make ti possible.

Link to comment
Share on other sites

పుట్టగొడుగులు.. ఆదాయ వనరులు 
బలమైన పౌష్టికాహారంగా గుర్తింపు 
కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ కార్యక్రమాల నిర్వహణ 
న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం, గ్రామీణం 
skl-sty1a.jpg
పుట్టగొడుగులంటే సాధారణంగా తెలియనివారు ఉండరు.. కేవలం రుచి కోసమే కాదు.. పుట్టగొడుగులు పూర్తిగా శాఖాహారం.. అంతే కాకుండా బలమైన పోషక విలువలెన్నో ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. మహిళలు, పిల్లలు, శాఖాహారులకు, ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే మాంసకృత్తులు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు ఉండటంతో పాటు తేలికగా జీర్ణమయ్యే బలమైన ఆహారం ఇది. అతి తక్కువ ప్రదేశంలో, తక్కువ కాలంలో సులభ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకంతో మహిళలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. దీనిపై ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ఇటీవల పుట్టగొడుగుల పెంపకంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో యాభై మంది మహిళలు, యువత పాల్గొని దీన్ని సద్వినియోగం చేసుకున్నారు.

పుట్టగొడుగులే ఉపాధినిచ్చాయి 
ఈయన పేరు సంతోష్‌కుమార్‌ పట్నాయక్‌. స్వస్థలం పాలకొండ పట్టణం కాగా వయసు 42 ఏళ్లు. స్వయం ఉపాధి లేక ఎంతో దీన స్థితిలో ఉంటూ, యోగా శిక్షకునిగా ఎంతో మందికి యోగా నేర్పిస్తుండేవారు. స్వయం ఉపాధి కోసం పాటుపడుతున్న సమయంలో పుట్టగొడుగుల శిక్షణ కోసం గత ఏడాది కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆశ్రయించడంతో ఉపాధికి మార్గం సుగమం అయ్యింది. ప్రస్తుతం ఈయన నెలకు రూ.15 వేలు ఆదాయం పుట్టగొడుగుల పెంపకం ద్వారా పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పేద కుటుంబానికి చెందిన ఈయన పాలకొండ ఆంధ్రా బ్యాంకులో రూ.50 వేలు రుణం పొంది, మరింత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే పుట్టగొడుగుల పెంపకం శిక్షణా కార్యక్రమాల్లో శాస్త్రవేత్తలు ఈయనను స్ఫూర్తిగా చూపుతున్నారు.

కేవీకేలో శిక్షణ పొందా 
ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్టగొడుగుల పెంపకంపై నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. నాకు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఎంతో ఆసక్తి. నేను కేవీకేలో శిక్షణ పొందాను. శాస్త్రవేత్తల సహాయంతో మా ప్రాంతంలో మహిళలందరిని దీనిపై చైతన్యవంతులను చేసి, వారికి కూడా స్వయం ఉపాధి మార్గం చూపేందుకు కృషి చేస్తున్నాను. పుట్టగొడుగుల పెంపకం యూనిట్‌ను ప్రారంభిస్తున్నాను.

-దూసి అన్నపూర్ణ, భైరి సింగుపురం, శ్రీకాకుళం మండలం
పెంపకంలో మెలకువలు నేర్పిస్తున్నాం 
కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన విభాగం ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకంపై మెలకువలు నేర్పిస్తున్నాం. ఆసక్తి ఉన్న మహిళలు, యువత శిక్షణ కోసం సంప్రదిస్తే వారికి పూర్తి స్థాయిలో శిక్షణను అందిస్తాం. పుట్టగొడుగుల వంటల్లో కూడా మెలకువలను నేర్పిస్తాం. పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే ఖనిజ లవణాలు, మాంసకృత్తులు, పీచు పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
     -కె.భాగ్యలక్ష్మి, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస
ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోండి 
కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్టగొడుగుల పెంపకంపై ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలను మహిళలు, యువత సద్వినియోగం చేసుకోవాలి. పుట్టగొడుగుల పెంపకం వల్ల అతి తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రదేశంలో మంచి ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది. వీటి పెంపకం కూడా ఎంతో సులభం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...