Jump to content

Agriculture


sonykongara

Recommended Posts

  • Replies 103
  • Created
  • Last Reply
తైవాన్‌ జామ... సిరుల వాన 
పది ఎకరాల్లో సాగు 
సాగు వ్యయం: రూ. 10 లక్షలు 
తొలి దిగుబడి: రూ. 25 లక్షలు 
ఎకరాకు ఉత్పత్తి : 5 టన్నులు 
kdp-sty1a.jpg
వర్షాభావం, కల్తీ విత్తనం, పంటలకు చీడపీడలు, ఆపై ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటుకాని ధరలతో చాలామంది రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాదనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఈనేపథ్యంలో కొందరు రైతులు మాత్రం పంటల సాగును లాభదాయకంగా మార్చుకుని లాభాలు గడిస్తున్నారు. అందుబాటులోని వనరులను చక్కగా సద్వినియోగం చేసుకుని తైవాన్‌ రకం జామను సాగుచేసిన ఒక యువ రైతు మొదటి కోతలోనే రూ. 15 లక్షల వరకు ఆదాయం గడించి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పోరుమామిళ్ల, న్యూస్‌టుడే:

కాశినాయన మండలంలోని సువిశాల భూములు ఔత్సాహిక రైతులను ఊరిస్తున్నాయి. ఈ మండలంలోని ఆకులనారాయణపల్లె వద్ద గుంటూరు ప్రాంతానికి చెందిన యువ రైతు గుర్రం శ్రీనివాసులు రాళ్ల కుప్పలతో నిండిన పది ఎకరాలను కొనుగోలు చేశారు. రాళ్లను తొలగించి పంట భూమిగా సిద్ధపరిచారు. ఈ సంవత్సరం జనవరిలో పది ఎకరాల్లో తైవాన్‌ పింక్‌ సూపర్‌ గోల్డ్‌ రకం జామను సాగు చేశారు. ఎకరాకు వేయి మొక్కలు నాటారు. పది ఎకరాల్లో పదివేల మొక్కలు నాటించాడు. గుంటూరు జిల్లా పెద్దలంక వద్ద ఈ జామ మొక్కలు కొనుగోలు చేసినట్లు రైతు తెలిపారు. జామ సాగుకు వీలుగా ఎకరాకు లక్ష చొప్పున పదిలక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం పంట మొదటి కోతలోనే అధిక దిగుబడి వచ్చింది. ఒక్కో జామ కాయ 800 గ్రాములు వరకు బరువుంది. ఈ జామ కాయలకు విపణిలో మంచి గిరాకీ ఉంది. హైదరాబాదు, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఈ జామకాయలను ఎగుమతి చేస్తున్నారు.

సేంద్రియ విధానం 
జామ తోటను నర్సరీ నుంచి సేంద్రియ పద్ధతులు సాగుచేశారు. పంట సాగు సమయంలో దుక్కిలో తెగుళ్లు సోకకుండా ఆవు పేడ, పంచకం, వేపపిండి అధిక మొత్తంలో చల్లారు. 80 శాతం సేంద్రియం, 20 శాతం రసాయనిక ఎరువులు వినియోగించారు. మొక్కలకు తెగుళ్లు సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లింగాక్షరణ బుట్టలు ఏర్పాటు చేశారు. దీంతో తెగుళ్లు నివారణ అయ్యాయి. వినియోగదారుడికి నాణ్యమైన జామకాయలను అందించేందుకు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పిచికారిని పూర్తిస్థాయిలో తగ్గించినట్లు రైతు వివరించారు. కోత సమయంలో 20 రోజుల ముందు నుంచే చెట్లపై ఎలాంటి క్రిమిసంహారక మందులు పిచికారి చేయకుండా ఆపేయటం సామాజిక స్పృహకు నిదర్శనం.

kdp-sty1b.jpg

వినియోగదారుడికీ మేలు 
ప్రస్తుతం రసాయనిక ఎరువుల వినియోగం వలన పండిన పంటలను వినియోగించాలంటే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సేంద్రియ విధానంలో సాగు చేసిన పండ్లు, కూరగాయలను వినియోగించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వినియోగదారుల కోసం రసాయనిక 20, సేంద్రియం 80 శాతంతో జామ పంటను సాగు చేశా. ఆశించిన మేర దిగుబడి వచ్చింది. పది ఎకరాలకు 50 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను రూ. 70,000 పలికింది. పెట్టుబడి పది లక్షలు పోనూ రూ. 15 లక్షలు మిగులుతోంది. ఈ జామ కాయలను బెంగళూరు, హైదరాబాదు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నా. దూరప్రాంతాలు వెళ్లే సమయంలో కాయలు దెబ్బతినకుండా ప్యాక్‌ చేయిస్తున్నాం.

- గుర్రం శ్రీనివాసులు, రైతు, ఆకులనారాయణపల్లె, కాశినాయన మండలం.

వివరాలు 
జామ సాగు : పది ఎకరాలు 
పది ఎకరాలకు : 50 టన్నులు 
టన్ను ధర రూ. : 50,000 
పది టన్నులకు : రూ. 25 లక్షలు. 
తొలి కాపు ఆదాయం : రూ. 15 లక్షలు

అధిక దిగుబడి : మొక్కలు నాటడం నుంచి అవి పంటకు వచ్చే దశ వరకు స్థానికంగా లభించే మేకలు, పేడ, సేంద్రియం ఎరువులతోపాటు వేప పిండిని అధికంగా  వినియోగించారు. ట్రైౖకోడెర్మాల్‌, ఆవుపంచకం అధికంగా వాడారు. ఈ విధానం వలన తోటకు తెగుళ్ల బెడద తగ్గింది. పది ఎకరాలకు 50 టన్నుల దిగుబడి వచ్చింది. రూ. 25 లక్షలు వచ్చింది. పంట సాగు, రవాణా ఖర్చులు రూ. 10 లక్షలు వ్యయం పోతే రూ. 15 లక్షలు మిగులుతోందని రైతు సంతోషం వ్యక్తం చేశారు. జనవరి చివర్లో రెండో కోత వస్తుందని తెలిపారు. రెండో కోత సమయానికి ప్రతి చెట్టుకు పది కిలోలు వచ్చే మేర పిందెలను ఉంచామని రైతు తెలిపారు.. వేయి మొక్కలకు పది టన్నులు మేర పది ఎకరాలకు వంద టన్నులను దిగుబడి తీసేందుకు ఆస్కారం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

kdp-sty1c.jpg

భూమి కొనుగోలు: గుంటూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు ఆకులనారాయణపల్లె వద్ద పది ఎకరాలను రూ. 36 లక్షలకు కొనుగోలు చేశారు. తనకు చెందిన రెండు ఎకరాలను అమ్మి వచ్చిన డబ్బులతో ఇక్కడ భూమిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తరువాత రెండు సంవత్సరాలు నిరుపయోగంగా ఉంది. యూట్యూబ్‌, ఈటీవీ ఛానల్స్‌లో తైవాన్‌ జామ నర్సరీల యజమానుల ఇంటర్య్వూలు చూసి జామ సాగు చేయాలని సంకల్పించినట్లు రైతు తెలిపారు. తెగుళ్ల నివారణలో బిందుపద్ధతి ఫలించిందని రైతు సంతోషం వ్యక్తం చేశారు.

మెలకువలు పాటిస్తే సాధ్యమే 
తైవాన్‌ జామ సాగులో మంచి దిగుబడులు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 80 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉంది. ఆకులనారాయణ పల్లె సమీపంలో సాగు చేసిన రైతుకు మంచి దిగుబడి వచ్చింది. కాశినాయన మండలంలో ఎర్రనేలలు అధికంగా ఉన్నాయి. పండ్లతోటలకు ఈ నేలలు అనుకూలం. పంటపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అప్పుడే మంచి దిగుబడులు వస్తాయి. నీటి సౌకర్యమున్న ఈ భూములు పండ్లతోటలకు అనుకూలంగా ఉన్నాయి. జామ మొక్కల మధ్య దూరం పాటించాలి. జామలో అధికంగా ఎర్ర ఈగల సమస్య ఉంటుంది. వీటిని అధిగమించేందుకు పంటను పర్యవేక్షించాలి. ఆధునిక పద్ధతులు వినియోగిస్తే మంచి దిగుబడిని సాధించేందుకు ఆస్కారం ఉంది.

- ఈశ్వర ప్రసాదురెడ్డి, ఉద్యావన పంటల అధికారి, పోరుమామిళ్ల
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...