Jump to content

Autograde steel plant


APDevFreak

Recommended Posts

నవ్యాంధ్రకు ఉక్కు వరం 
09-12-2017 02:01:33
 
636483816945218924.jpg
 
  • రాష్ట్రానికి ‘ఆటోగ్రేడ్‌ స్టీల్‌’ తయారీ ప్లాంటు
  • రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
  • సెయిల్‌, మిట్టల్‌ సంయుక్త భాగస్వామ్యం
  • ప్లాంటు కోసం గుజరాత్‌, ఏపీ పోటీ
  • నవ్యాంధ్రకు కలిసొచ్చిన ‘తూర్పు తీరం’
  • కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేందర్‌ సింగ్‌ ప్రకటన
హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు మరో భారీ పరిశ్రమ వస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ‘సెయిల్‌’, అంతర్జాయతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్‌ మిట్టల్‌ సంయుక్తంగా ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాయి. కార్లు, ఇతర వాహనాల తయారీలో ఉపయోగించే అత్యుత్తమ ఉక్కు (హై ఎండ్‌ ఆటోమోటివ్‌ స్టీల్‌)ను ఈ ప్లాంటులో ఉత్పత్తి చేస్తారు. రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఈ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. ఉక్కు శాఖ మంత్రి చౌదురి బీరేందర్‌ సింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో స్వయంగా ఈ విషయం ప్రకటించారు. ‘‘తమ రాష్ట్రాల్లోనే ఈ ప్లాంటు ఏర్పాటు చేయాల్సిందిగా గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ కోరాయి. అయితే... తూర్పు తీరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలోనే దీనిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం’’ అని బీరేందర్‌ సింగ్‌ తెలిపారు. దీనిపై సెయిల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ జాయింట్‌ వెంచర్‌ను 1birendra.jpgఏర్పాటవుతుందని, ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదురుతుందని ఆయన తెలిపారు. ‘‘ఆర్సెలార్‌ మిట్టల్‌ వద్ద ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. దీనిని సెయిల్‌తో కలిసి పంచుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. సంయుక్త భాగస్వామ్యంపై కసరత్తు 99 శాతం పూర్తయిపోయింది. ఒక వారం లేదా రెండు వారాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
 
కార్ల తయారీ హబ్‌గా భారత్‌..
వచ్చే నాలుగేళ్లలో భారత్‌ ప్రపంచ కార్ల తయారీ హబ్‌గా మారే అవకాశం ఉందని మంత్రి బీరేందర్‌ సింగ్‌ తెలిపారు. ప్రపంచంలోని కార్ల తయారీలో భారత్‌ వాటా 28 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వాహన తయారీకి ఉపయోగించే హైఎండ్‌ స్టీల్‌ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముందని చెప్పారు.
సెయిల్‌-ఆర్సెలార్‌ మిట్టల్‌ భాగస్వామ్యంలో ఏర్పాటు కానున్న ఈ ఆటోగ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15 లక్షల టన్నులుగా ఉండనుందని చెప్పారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తిని 25 లక్షల టన్నులకు పెంచుకునే వెసులుబాటు ఉందని అన్నారు. భారత్‌లో ఆటో గ్రేడ్‌ స్టీల్‌ తయారీలో చేతులు కలపడంపై అవకాశాలు పరిశీలించాలని 2015లో సెయిల్‌-ఆర్సెలార్‌ మిట్టల్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఇది మరో అడుగు ముందుకు పడింది. మరోవైపు... ఎన్‌ఎండీసీ ఉద్యోగుల కొత్త వేతన సవరణపై శనివారం ప్రకటన చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.
Link to comment
Share on other sites

37 minutes ago, Nfdbno1 said:

Kadapa steel plant emayyaindi, not feasible annattu unnaru..

15000c is very useful, they also have great opportunity with sricity auto industry 

atleast 9 mla seats and 2 mp seats TDP vallaki aa kadapa district vallu isthe appudu CBN alochisthadu emo. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...