Jump to content

Galeru Nagari Project Water Released to Gandikota Reservoir


sonykongara

Recommended Posts

  • 1 month later...
కడపలో కృష్ణమ్మ ఊటలు!
27-01-2018 01:29:21
 
636526133653304898.jpg
కృష్ణానదినుంచి గండికోటకు విడుదల చేసిన జలాలు.. వామికొండ రిజర్వాయర్‌కు చేరుతుండటంతో, కడప జిల్లా ముద్దనూరు మండలం ఒంటిగారిపల్లె అంతా ఊటలు ఉబుకుతున్న దృశ్యమిది! 150 గడప ఉన్న ఒంటిగారిపల్లె నిజానికి ఎద్దడి గ్రామం. తాగునీటికే కటకటలాడిపోయేవారు. వంద అడుగులు తవ్వినా బోరు పడేది కాదు. అలాంటిది ఇప్పుడు రెండు అడుగుల్లోనే జల తగులుతోంది. పొలాలు, వీధులు, ఆవాసాలు.. ఇలా ఎక్కడబడితే అక్కడ ఊటలు కనిపిస్తున్నాయి.
 
స్వచ్ఛ భారత్‌లో భాగంగా మరుగుదొడ్ల కోసం గుంత తవ్వగానే, అక్కడంతా నీరు చేరుతోంది. దీంతో కొద్దిరోజులుగా ఆ పనులను పక్కనబెట్టారు. గాలేరు నగరి సుజలస్రవంతి కాలువ నీటితో ఎన్నడూలేనంతగా జలకళని సంతరించుకొన్న వామికొండ జలాశయానికి కూతవేటు దూరంలో ఒంటిగారిపల్లె ఉండటమే దీనికి కారణం. నిజానికి, ఈ జలాశయానికి వదిలింది అర టీఎంసీ నీరే. ఇదేగనుక మొత్తం ఒకటిన్నర టీఎంసీ నీరుచేరితే, ఊరి పరిస్థితి ఎలాగుండేదోనని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...