Jump to content

Krishna District


Yaswanth526

Recommended Posts

  • 4 weeks later...
ఆర్థికం... సామాజికంలో... కృష్ణా ప్రథమం... 
వృద్ధి రేటు నమోదులో జిల్లా పరుగులు 
పున్నమి ఘాట్‌ నుంచి పవిత్ర సంగమం వరకు సైకిల్‌, వాకింగ్‌ ట్రాక్‌కు సర్వే 
ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం 
విలేకర్ల సమావేశంలో కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం 
ఈనాడు డిజిటల్‌, విజయవాడ 
kri-gen1a.jpg

గడిచిన ఐదేళ్లలో కృష్ణా జిల్లా ఆర్థిక, సామాజిక రంగాల వృద్ది రేటులో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉందని కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అగ్రస్థానంలో ఉండాలంటే ప్రాథమిక, పారిశ్రామిక, సేవల రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. 2011 నుంచి ఇప్పటివరకు కృష్ణా జిల్లా వృద్ధి రేటు పెరుగుతోందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల కంటే ఈ ఏడాది జీడీడీపీ రూ.85 కోట్లు, జీఏసీ 79,873 కోట్లు వచ్చిందన్నారు. అంటే దాదాపు రూ.15 కోట్లు పెరిగిందని వివరించారు. గతంలో తలసరి ఆదాయం రూ.1.25 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.1.61 లక్షలకు పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో కలిపి సుమారు 20 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. మత్స్యశాఖాభివృద్ధిలో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉందని, చేపలు, రొయ్యల ఉత్పత్తిలో మన లక్ష్యం 10.40 వేల టన్నులు కాగా.. డిసెంబరు నాటికి 9 లక్షల టన్నులు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఉద్యానశాఖలో కూడా పురోగతి మెరుగుపడిందన్నారు. గతంలో ఎకరాకు 28 బస్తాల దిగుబడి వచ్చే పొలాల్లో, పట్టిసీమ నీళ్లు సకాలంలో అందడం వల్ల 33 బస్తాలకు పెరిగిందన్నారు. సెరికల్చర్‌ కూడా 200 ఎకరాల నుంచి 400 ఎకరాలకు సాగవుతోందని చెప్పారు. పశు సంరక్షణలో భాగంగా మూడు వేల ఎకరాల్లో గడ్డి పెంచుతున్నామని పేర్కొన్నారు.

* పారిశ్రామిక రంగంలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు సుమారు 419 చిన్న పరిశ్రమలకు సింగిల్‌ విండో పద్ధతి ద్వారా అనుమతులు అందజేస్తామన్నారు. ఈనెల 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐదో విడత  ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో రూ.వేయి కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేస్తున్నామని ప్రస్తావించారు. అలాగే అభ్యున్నతి, చేయూత తదితర పథకాలను, వాటి పురోగతిని తెలిపారు. రూ.850 కోట్లతో 6.6 లక్షల కుటుంబాలకు వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇస్తామన్నారు.

* నగరాన్ని సుందరంగా మార్చడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి సాధించేందుకు కృష్ణా నదిలోని ఏడు ద్వీపాలు, గాంధీ హిల్‌, కాలువల సుందరీకరణ తదితర పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. 81 కి.మీ మేర కాలువలను సుందరీకరించేందుకు ఏడీసీకి బాధ్యతలు అప్పగించారని, దీనికి సంబంధించి రూ.61 కోట్లు విడుదల చేశారని తెలిపారు. విజయవాడ ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కల్పించేందుకు పున్నమిఘాట్‌ నుంచి పవిత్రసంగమం వరకు సైకిల్‌, వాకింగ్‌ ట్రాక్‌లను నిర్మించేందుకు సర్వే చేస్తున్నామని, రిఫర్‌ ఫ్రంట్‌ పేరుతో దీనిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే బెంజి సర్కిల్‌ పైవంతెనను రామవరప్పాడు రింగ్‌ వరకు కాకుండా నిడమానూరు వరకు పొడగించేందుకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.

* గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, జనవరిలో ముంబయి వెళ్లేందుకు ఎయిర్‌ఇండియా సర్వీసులను ప్రారంభిస్తుండగా.. ఫిబ్రవరి నుంచి దుబాయ్‌కి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. విశాఖపట్నం తరహాలో విజయవాడలోనూ హెలీ టూరిజాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా పంచారామాలను దర్శించవచ్చన్నారు. జనవరి 13, 14, 15 తేదీల్లో పడవల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే దానికి సమీపంలోనే గుర్తించిన నవ్యాంక ద్వీపంలో 13, 14 తేదీల్లో రాత్రి బస, సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి నిర్వహిస్తునామని చెప్పారు. ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో బుద్ధం శరణం గచ్ఛామి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనికి 2వేల మంది బౌద్ధబిక్షువులు వస్తున్నారన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...