Jump to content

Vizag Railway zone


sonykongara

Recommended Posts

బ్రేకింగ్‌.. విశాఖ రైల్వేజోన్‌పై ఎంపీకి లేఖ
4brk124-ram.jpg

దిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటుపై బిల్లు పెట్టేందుకు అంగీకరిస్తూ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు లేఖ అందింది. లోక్‌సభలో బిల్లు పెట్టేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గతంలో రామ్మోహన్‌ నాయుడు స్పీకర్‌కు లేఖ పంపారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయనకు తాజాగా సమాచారం పంపింది. ఏపీ విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. రైల్వేజోన్‌ చట్టం -2017 పేరుతో ప్రతిపాదించేందుకు లోక్‌సభ సచివాలయం అంగీకారం తెలిపింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, వాల్తేరు డివిజన్లను కలిపి జోన్‌ ఏర్పాటుకు బిల్లు పెట్టనున్నారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందితే మూడు నెలల్లో రైల్వే శాఖ చర్యలు చేపట్టనుంది.

Link to comment
Share on other sites

54 minutes ago, niceguy said:

Bill pass avuddi..work emi jaragadu..idhi kotha trend started by Pushpams..

Work emi undadhu incase vasthe .

Already kavalisina setup antha undhi manaki income perguthundhi train diversions anni thagguthai spl trains evari dhaya medha undalsina avsaram ledhu

Link to comment
Share on other sites

 

2 hours ago, sonykongara said:

లోక్‌సభలో బిల్లు పెట్టేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గతంలో రామ్మోహన్‌ నాయుడు స్పీకర్‌కు లేఖ పంపారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయనకు తాజాగా సమాచారం పంపింది.

 bill eeyna pettadam anti..railway minister kda pettalsindi..privtae bill na?

Link to comment
Share on other sites

Inni ibbandulu peduthunnaaru antoo intha loss pothunnaam antoo - akkadi railway zone lo kaaryakramaalu sthambhimpa cheyyakundaa adukkovadam yendi saami - shame on us for lack of fightin spirits - with these kind of issues state govt can also wash hands saying the ball is in center’s court - DO IT LIKE NOW OR NEVER. 

Link to comment
Share on other sites

1 minute ago, swarnandhra said:

waltair division vuntundi but main money earner in that division, Kirandul-Kotha valasa (KK line) would be taken out anukunta.

Oka saari TN/Andhra division lo Chennai ni vadulukoni tgappu chesaam - inko saari Hyd valana nasta poyyaam - eesaari Kotha valasa tho koodina division kosam vudyamam cheyyaali - political parties should have that determination. BJP is saying we will give - but not declaring what all it include as part of the zone - our leaders and agitators should demand for Kotha Valasa also to be part of the Zone otherwise massive agitation should stirr up

Link to comment
Share on other sites

10 minutes ago, DVSDev said:

Oka saari TN/Andhra division lo Chennai ni vadulukoni tgappu chesaam - inko saari Hyd valana nasta poyyaam - eesaari Kotha valasa tho koodina division kosam vudyamam cheyyaali - political parties should have that determination. BJP is saying we will give - but not declaring what all it include as part of the zone - our leaders and agitators should demand for Kotha Valasa also to be part of the Zone otherwise massive agitation should stirr up

KK line lo vacche revenue teeseste East Coast Division (Bhuwaneswar) would go bankrupt. I mean that zone would not be viable. Odisha oppukodu. raani daani kosam pattubatte kante, veelu vunna daanilo lo negotiate chesukovatam better emo bro.

on the other hand, even without KK line, a new zone headquartered in vizag would sustain/prosper. mind you we have two major ports and major junctions.

Link to comment
Share on other sites

34 minutes ago, swarnandhra said:

KK line lo vacche revenue teeseste East Coast Division (Bhuwaneswar) would go bankrupt. I mean that zone would not be viable. Odisha oppukodu. raani daani kosam pattubatte kante, veelu vunna daanilo lo negotiate chesukovatam better emo bro.

on the other hand, even without KK line, a new zone headquartered in vizag would sustain/prosper. mind you we have two major ports and major junctions.

Raajakeeya nirnayaalaki okallu voppukodam voppukokapovadam laantivi vundavu Ani chaalaa saarlu prove chesaaru kada bhayyaa - more over - if central govt wants to do it - just can say aaa state area lo vacchey income aaa state division Loki velthundi - you don’t have a say anocchu - but mana pushpams don’t do that-  Vacchina daanitho sarduku podaam- aney manasthathwam tho vuntey manalni vedhavalni chesthunnaaru bhayyaa - asaley Debba thinnaam - inkaa godava padithey nasta pothaam Ani ippatikey 4 years mosa poyyaam - 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

 రైల్వే జోన్‌‌పై లోక్‌సభలో ప్రైవేట్ బిల్లు 
29-12-2017 17:19:07

న్యూ ఢిల్లీ: ఏపీలోని విశాఖకు రైల్వే జోన్ కావాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్ సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. శుక్రవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రైల్వే జోన్ లేదు.. దీంతో ఏపీ ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోందని వివరించారు. జోన్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లాలంటే అటు ఒడిశా, లేదా ఇటు తెలంగాణ వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.
 
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనే రైల్వే జోన్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రైల్వే యాక్ట్ 1989 ను సవరించి విశాఖ హెడ్ క్వార్టర్స్‌గా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఆయన లోక్‌సభలో వివరించారు. వాల్టేర్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లను అందులో చేర్చాలని రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని కోరారు.

Link to comment
Share on other sites

రైల్వే జోన్‌ సాధించే వరకు పోరాటం 
ఎంపీ రామ్మోహన్‌ నాయుడు 

దిల్లీ: విశాఖ రైల్వే జోన్‌ సాధనకు తెదేపా ఎంపీలంతా పోరాడుతున్నారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. రైల్వే జోన్‌ అంశంపై శుక్రవారం లోక్‌సభలో ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు బిల్లు పెట్టే అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి సరైన స్పష్టత రాలేదన్నారు. అందుకే తమ ప్రయత్నంలో భాగంగా రైల్వే జోన్‌ అంశంపై చర్చ జరగాలని ప్రైవేటు బిల్లు పెట్టామన్నారు. అయితే, వెంటనే బిల్లు పెట్టేందుకు అవకాశం రావడం హర్షణీయమన్నారు. లాటరీ విధానంలో చర్చకు అనుమతిస్తారు కాబట్టీ .. త్వరలోనే బిల్లు సభముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చర్చకు వచ్చినప్పుడు మాత్రం ఈ డిమాండ్‌ సాధనకు తమ వాదనను గట్టిగా వినిపిస్తామన్నారు. రైల్వే జోన్‌ ఎందుకు కావాలి? విశాఖలోనే ఎందుకు అడుగుతున్నామో కేంద్రానికి స్పష్టంగా తెలియజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సెంటిమెంట్‌ను కేంద్రానికి స్పష్టం చేస్తామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, గతంలో రైల్వే మంత్రులుగా పనిచేసిన వారు, ప్రస్తుత రైల్వేమంత్రి దృష్టిలో ఈ అంశం ఉన్నప్పటికీ దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకోలేకపోతున్నారన్నారు.
విశాఖ రైల్వే జోన్‌ కోసం, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను సాధించేందుకు ఎంత గట్టిగా పోరాడుతున్నామో కేంద్రానికి ఈ బిల్లు ద్వారా వెల్లడిస్తామన్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెట్టారని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, రైల్వేజోన్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ జయదేవ్‌ బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం అన్ని విధాలుగా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. వీలైనంత త్వరలో ఈ బిల్లు చర్చకు వస్తే పాల్గొనేందుకు అన్ని విధాలా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...