Jump to content

దొంగ ఇంట్లో ఉండగానే పట్టివేత- కడప ఖాకీలు -రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌


Munna_NTR

Recommended Posts

[636479511899714164]

  • దొంగ ఇంట్లో ఉండగానే పట్టివేత
  • టెక్నాలజీలో సూపర్‌ పోలీస్‌
  • సాంకేతికత బాటలో కడప ఖాకీలు
  • విస్తృత వినియోగానికి డీజీపీ చొరవ
  • సీఎం ఆదేశాలకు అనుగుణంగా..పోలీస్‌శాఖలో ‘రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌’
అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘పోలీసులు కనిపించకూడదు...పోలీసింగ్‌ మాత్రమే కనిపించాలి...రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కావాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతన్న మాటలను ఏపీ పోలీసులు నిజం చేశారు. దొంగలుపడ్డ ఆర్నెల్లకు పోలీసులొస్తారు...అనే మాట నుంచి దొంగలుపడ్డ మూడు నిముషాల్లోనే వస్తాం అని నిరూపిస్తున్నారు. బీరువా తాళాలు బద్దలు కొడుతుండగా ఇంటిని చుట్టుముట్టి దొంగను పట్టుకున్న కడప పోలీసుల పనితీరు రాష్ట్ర పోలీసు వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
 
డీజీపీ సాంబశివరావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయించిన లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎల్‌హెచ్‌ఎంఎ్‌స) సాధించిన తొలివిజయం పట్ల ప్రజల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. ఏడాదిక్రితం అనంతపురంజిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు(ప్రస్తుతం చిత్తూరుజిల్లా ఎస్పీ) దొంగతనాల నివారణకు టెక్నాలజీని వినియోగించాలని చేసిన ఆలోచనతో ఎల్‌హెచ్‌ఎంఎ్‌స పుట్టుకొచ్చింది. ఎవరైనా ఇల్లు వదిలి బయటికి వెళ్లాల్సివస్తే ఎల్‌హెచ్‌ఎంఎ్‌స యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో వివరాలు నమోదు చేస్తే చాలు. జిల్లా ఎస్పీ, కంట్రోల్‌ రూమ్‌తోపాటు స్థానిక పోలీసులకు సమాచారం అందుతుంది. సంబంధిత పోలీసు స్టేషన్‌ నుంచి ఫోన్‌ వస్తుంది. ఇంటికి వచ్చి పోలీసులు ఎల్‌హెచ్‌ఎంఎ్‌స ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఇంట్లోకి ఎవరు ప్రవేశించినా పోలీసు కంట్రోల్‌రూమ్‌లో అలారం మోగుతుంది.
 
ఈ విధానం నచ్చిన ఎస్పీ రాజశేఖర్‌బాబు వేసవిలో ఎక్కువగా దొంగతనాలు జరిగే అనంతపురంలో బాగా ప్రచారం చేసి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలుసుకున్న డీజీపీ సాంబశివరావు రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్లలో ఎల్‌హెచ్‌ఎంఎ్‌స అమలు చేయాలని ఆదేశించారు. రెండునెలల క్రితం కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పోలీ్‌సబాస్‌ దీనిపై వివరించారు. పోలీసులు టెక్నాలజీ అందిపుచ్చుకొంటున్నారని, అయితే రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఘటన జరుగుతుండగా సకాలంలో చేరుకొని నివారించాలి) కావాలని సీఎం అన్నారు. సీసీ కెమెరాల్లో నేరం జరిగిన విధానం రికార్డయితే ఆ తర్వాత వెళ్లి బాధ్యులను అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించే స్థాయికి వచ్చారని, అలాకాకుండా ఘటన జరగకుండా నివారించే పరిస్థితి రావాలన్నారు.
 
అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పోలీసులు ఘటనా స్థలికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతోందని, ఇది సాధ్యమయ్యే పనేనా? అని కొందరు పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే సీఎం మాటలను సీరియ్‌సగా తీసుకున్న డీజీపీ సాంబశివరావు అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు. ప్రజలతో గౌరవంగా మాట్లాడి వారి సొమ్ము దొంగల పాలు కాకుండా చూస్తే పోలీసుశాఖ ప్రతిష్ట పెరుగుతుందని, సీఎం ఆకాంక్ష కూడా నెరవేరుతుందని చెబుతూ వచ్చారు. దీంతో అన్ని జిల్లాల ఎస్పీలు ఎల్‌హెచ్‌ఎంఎ్‌స గురించి బాగా ప్రచారం చేశారు.
 
ఇలా పట్టుకున్నారు!
నవంబర్‌ 14న కడపలో చిన్నచౌకు ప్రాంతానికి చెందిన మహేశ్‌ అనే వ్యక్తి కుటుంబంతో ఊరెళ్లాల్సి రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డిసెంబరు 8 వరకూ తన ఇంట్లో ఎల్‌హెచ్‌ఎంఎ్‌స ఏర్పాటు చేయాలని కోరాడు. శుక్రవారం రాత్రి 2.10 గంటలకు ఇంటి తాళాలు బద్దలు కొట్టి దొంగ లోపలికి ప్రవేశించాడు. సైరన్‌ మోగడంతో మూడు నిమిషాల్లోనే ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు లోపలఉన్న దొంగను పట్టుకున్నారు. టెక్నాలజీతో పట్టుకున్నారు.
Link to comment
Share on other sites

10 hours ago, surendra.g said:

How it works?

How it works

Three days before they plan to go out of station, they should open the app and click on “request to police watch”, enter their registration ID and enter the number of days, date and time from which they need police surveillance, the SP said.

On receiving the request, the police would install an LHMS CC camera free of charge and synchronise it with the police control room.

When any person enters the house, it will sound an alarm in the police control room, besides sending photographs and video to the control room

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...