Jump to content

చంద్రబాబు చిత్తశుద్ధి చాటుకున్నారు కానీ..!


koushik_k

Recommended Posts

  • 9వ షెడ్యూల్‌లో పెట్టిన తర్వాతే..కాపులకు అసలైన దీపావళి
  • వచ్చే ఏడాది మార్చి వరకు గడువు: ముద్రగడ
జగ్గంపేట, డిసెంబరు 2: ‘సీఎం చంద్రబాబు కాపు రిజర్వేషన్‌ బిల్లును అసెంబ్లీలో ఆమోదింప చేయడం ద్వారా చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఆయన తలచుకుంటే బిల్లును 9వ షెడ్యూల్‌లో కచ్చితంగా చేర్చగలరు. ఆ ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుంది.’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్‌ బిల్లును 9వ షెడ్యూల్‌లో పొందుపరిచిన తర్వాతే కాపు ఉద్యమాన్ని విరమిస్తామని, అప్పుడే తమకు అసలైన దీపావళి అని అన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తూ వారికి ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ముద్రగడ కిర్లంపూడిలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలో ఒకడుగు ముందుకేసి కాపులకు రిజర్వేషన్‌ కల్పించే బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం ఆనందంగా ఉందన్నారు.
 
డిసెంబరు 6వ తేదీలోపే సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తమను ఉద్యమబాట పట్టకుండా చేశారన్నారు. ‘ఆకువేసి భోజనం పెడతారని ఆశిస్తే, టిఫిన్‌ మాత్రమే పెట్టారు’ అని ముద్రగడ వ్యాఖ్యానించారు. బిల్లును 9వ షెడ్యూల్‌లో పెట్టి కాపు జాతికిఇచ్చిన హామీని పూర్తిగా నిలబెట్టుకున్నప్పుడే చంద్రబాబు మంచి ముఖ్యమంత్రిగా కాపుజాతిలో దృష్టిలో నిలిచిపోతారన్నారు. అలాకాకుండా అరకొరగా చేస్తే మళ్లీ ఇబ్బందులు తలెత్తుతాయని ముద్రగడ వ్యాఖ్యానించారు. 2018 మార్చి 31వ తేదీలోపు బిల్లును 9వ షెడ్యూల్‌లో పెట్టాలని అంత వరకు ఉద్యమానికి విరామం ఇస్తున్నామే తప్ప ఆపేది లేదన్నారు. 13 జిల్లాల్లో ఉన్న కాపుల లెక్కలను పూర్తిస్థాయిలో మంజునాథ్‌ కమిటీ ద్వారా తెప్పించుకోలేదని, దీని వల్లే చంద్రబాబు ఐదు శాతం రిజర్వేషన్‌ మాత్రమే ప్రకటించారని, ఇది బాధాకరమన్నారు. పూర్తిస్థాయిలో లెక్కలు తెప్పించుకొని ఉంటే పది శాతమైనా రిజర్వేషన్‌ కల్పించాల్సి ఉంటుందని ముద్రగడ అన్నారు.
 
ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ ఒకరు చెబితే ఉద్యమం చేయలేదని ముద్రగడ స్పష్టం చేశారు. జగన్‌, మోదీ తన వెనుక ఉండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...