Jump to content

Assembly seats to increase in AP and Telangana?


sonykongara

Recommended Posts

  • 1 month later...
సీట్ల పెంపుపై కదలిక!
11-01-2018 02:00:42
 
  • కేంద్ర కేబినెట్‌ నోట్‌ కూడా సిద్ధం
  • ఈ వారంలోనే ఢిల్లీలో రాజకీయ భేటీ
  • ఈసీ, హోం శాఖ అధికారుల మంతనాలు
  • 2001 జనాభా లెక్కలే పరిగణనలోకి
  • 6 నెలల్లో ప్రక్రియ పూర్తయ్యే అవకాశం
  • మోదీతో బాబు భేటీ తర్వాత స్పష్టత
  • 12 లేదా 13న ఆ ఇద్దరి సమావేశం!
అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక కనిపిస్తోంది. దీనిపై ఉన్నత స్ధాయి అధికారులు ఇప్పటికే కేబినెట్‌ నోట్‌ తయారుచేసి సిద్ధంగా ఉంచారు. కేంద్ర హోం శాఖ కూడా కొంత కసరత్తు చేపట్టింది. ప్రధానమంత్రి స్థాయిలో రాజకీయ నిర్ణయం జరిగితే రాబోయే పార్లమెంటు సమావే శాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోదీతో త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నందున ఆ తర్వాత దీనిపై స్పష్టత రావచ్చని అంటున్నారు. రాజకీయ సుస్థిరత కోసం విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఇది అమలైతే ప్రతి పార్లమెంటు స్థానానికి రెండు చొప్పున అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఈ లెక్కన నవ్యాంధ్ర శాసనసభలో 50 స్థానాలు(మొత్తం 225), తెలంగాణ అసెంబ్లీలో 34 సీట్లు(మొత్తం 153) పెరుగుతాయి. విభజన చట్టంలో ఉన్నా మోదీ ప్రభుత్వం ఇన్నాళ్లుగా పట్టించుకోలేదు. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నుంచి బాగా ఒత్తిడి పెరగడంతో ఇటీవల కేంద్రంలో కదలిక వచ్చింది. సీట్లు పెంచడానికి ముందుగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి ఆపై పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించాలి. మంత్రివర్గ సమావేశం ముందు ఉంచేందుకు అధికారుల స్థాయిలో కేబినెట్‌ నోట్‌ సిద్ధమైపోయింది. బిల్లుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధాని కార్యాలయం నుంచి హోం శాఖకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని హోం శాఖ కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీ)కు ఒక లేఖ రాసింది. 2001, 2011 జనాభా లెక్కల్లో దేనిని పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలో తెలియజేయాలని అందులో కోరారు. దేశమంతా 2001 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన జరిగినందువల్ల ఆ లెక్కలను ఈసారి కూడా పరిగణనలోకి తీసుకుంటే మంచిదని ఈసీ సూచించింది. కానీ పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల విభజన చట్టాన్ని ఆమోదించే నాటికి 2011 జనాభా లెక్కలు కూడా వచ్చినందున పాత లెక్కలు పరిగణనలోకి తీసుకోవడం సరైందా కాదా అన్న అనుమానం హోం శాఖ అధికారులకు వచ్చింది. అయితే ఈ అంశం కేబినెట్‌ ముందుకు వచ్చినప్పుడు చూద్దామని భావించారు. ఎన్నికల కమిషన్‌ అధికారులకు, హోం శాఖ అధికారులకు అనధికారికంగా చర్చలు కూడా జరిగాయి. నాలుగు నెలల నుంచి ఆరు నెలల సమయంలో పునర్విభజన కసరత్తు పూర్తి చేయగలమని ఈసీ అధికారులు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అంతర్గత కసరత్తు జరిగినా రాజకీయ నిర్ణయం తీసుకుంటేనే పునర్విభజన అంశం కేంద్ర మంత్రివర్గం ముందుకొస్తుందని ఉన్నత స్థాయి రాజకీయ వర్గాలు స్పష్ఠం చేస్తున్నాయి. ఈ రాజకీయ నిర్ణయాన్ని ప్రధాని మోదీ తీసుకోవలసి ఉంది. ఆయన అంగీకారం తెలిపితే వచ్చే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి.. ఆనక పార్లమెంటు ముందు ఉంచి ఆమోదం తీసుకుంటారు. చంద్రబాబు కొద్ది రోజుల్లో ప్రధానితో భేటీ కానున్నారు. ఆ సందర్భంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు జార్ఖండ్‌లో కూడా సీట్లు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే కేబినెట్‌ నోట్‌ను మళ్లీ మార్చాల్సి వస్తుంది. ‘కేంద్ర ంలో కొంత కదలిక వచ్చింది. ఈ వారంలో దీనికి సంబంధించి ఢిల్లీలో రాజకీయ సమావేశం కూడా జరుగనుంది. అంతిమంగా ప్రధాని స్థాయిలో జరిగే నిర్ణయమే కీలకం. దానికోసం ఎదురుచూస్తున్నాం’ అని టీడీపీ కీలక నేత ఒకరు వెల్లడించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
సీట్ల ఫైలు కదిలింది
24-01-2018 01:44:35
 
  • ఈసీకి పంపిన హోం శాఖ
  • రిజర్వుడు స్థానాలకు ప్రాతిపదికేంటి?
  • 2001 జనాభా లెక్కలా.. 2011వా?
  • ఎస్సీలు ఎక్కువున్న చోటే పెంచాలా?
  • ఈసీ అభిప్రాయం కోరిన కేంద్రం
  • ఒకట్రెండు రోజుల్లో జవాబు?
  • తర్వాత మరో 4 శాఖలకూ లేఖలు
  • పునర్విభజనపై ఊపందుకున్న కసరత్తు
  • రాజకీయ నిర్ణయం జరిగితేనే చాన్స్‌
అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి పురోగతి కనబడుతోంది. తాజాగా కేంద్ర హోం శాఖ కొంత సమాచారం కోరుతూ ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి ఫైలు పంపింది. నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో అభిప్రాయం చెప్పాలని అందులో కోరింది. ఈ రిజర్వేషన్లను 2001 జనగణన లేదా 2011 జనాభా లెక్కల్లో దేని ప్రాతిపదికన చేయాలన్న దానిపై కొంత వివాదం నెలకొంది.
 
 
2001 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని 2008లో నియోజకవర్గాలను పునర్‌వ్యవస్థీకరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తమ రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్‌ సీట్లు పెంచాలని కోరుతూ మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. 2008 పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2026 వరకూ నియోజకవర్గాల్లో ఎటువంటి మార్పుచేర్పులకు అవకాశం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
 
కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి మారింది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టాన్ని పార్లమెంటు ఆ తర్వాత ఆమోదించింది. ఈ రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు 2008 నాటి చట్టంలోని నిబంధనలే వర్తిస్తాయా లేక 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలా అన్నది కేంద్ర హోం శాఖ ముందున్న సమస్య. దీనిపైనే హోం శాఖ ఈసీ అభిప్రాయం కోరింది. మరో అంశం కూడా తేలాల్సి ఉంది. పోయినసారి నియోజకవర్గాలను పునర్విభజించినప్పుడు ఎస్సీ నియోజకవర్గాలను రాష్ట్రమంతా విస్తరింపజేశారు. వారి జనాభా ఎక్కువ ఉన్నచోట మాత్రమే ఇస్తే రిజర్వుడు నియోజకవర్గాలన్నీ ఒకేచోట వస్తున్నాయని.. అది సరికాదనే అభిప్రాయంతో ఇలా చేశారు.
 
 
అప్పటి చట్టం దానికి అనుమతించింది. ఇప్పుడు కూడా దానినే పరిగణనలోకి తీసుకోవాలా అన్నది మీమాంస. వీటిపై ఈసీ ఒకట్రెండు రోజుల్లోనే అభిప్రాయం చెప్తుందని హోం శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ తర్వాత మరో నాలుగు శాఖలకు కూడా హోం శాఖ ఇటువంటి లేఖలు రాయాల్సి ఉంది. వాటికి కూడా సమాధానాలు వచ్చాక అన్నిటినీ కలిపి తుది ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆమోదించాక దీనిని మంత్రివర్గ సమావేశం ముందు పెడతారు. కేబినెట్‌ ఆమోదిస్తే అప్పుడు అది పార్లమెంటు ముందుకు వెళ్తుంది. అంతిమంగా రాజకీయ నిర్ణయమే కీలకమని, అది జరిగితే అన్నీ వేగంగా ముందుకెళ్తాయని హోం శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
 

 

 

Link to comment
Share on other sites

So planned and unplanned expenditure perugutundaa ?

 

mla ki salary, office, house, gun man, police security(home guards) allowances etc., 

 

only positive I see is, now constituency size taggitundi kabatti, MLAs can focus more on local issues and developments

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...