Jump to content

అమరావతికి రుణం ఇవ్వొద్దు!


KING007

Recommended Posts

అమరావతికి రుణం ఇవ్వొద్దు!
01-12-2017 00:24:57
 
  • తనిఖీ బృందం సిఫారసు పట్టించుకోరా?
  • జరగబోయే పరిణామాలకు మీదే బాధ్యత
  • ప్రపంచ బ్యాంకుకు సామాజికవేత్తల ‘హెచ్చరిక’
  • లేఖపై నేడు వాషింగ్టన్‌లో బ్యాంకు అధికారుల భేటీ
  • రుణం మంజూరుపై కీలక నిర్ణయం!
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వొదని పలువురు సామాజిక వేత్తలు ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. అంతేకాదు... ‘జరగబోయే విపరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. ‘అమరావతి సస్టెయినబుల్‌ క్యాపిటల్‌ సిటీ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్ట్‌’లో భాగంగా రహదారులు, వరద నివారణ పథకాలకు రూ.6,450 కోట్లు రుణం ఇవ్వాలన్నది ప్రపంచ బ్యాంకు ప్రతిపాదన. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... మేథా పాట్కర్‌, ప్రఫుల్ల సమంత్ర, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ ఈఏఎస్‌ శర్మతోపాటు 46 మంది సామాజిక కార్యకర్తలు ‘నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌’ పేరిట ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు ఇటీవల లేఖ రాశారు. ‘రాజధాని అమరావతి నిర్మాణంలో అనేక నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
 
 
దీనికి సంబంధించి వస్తున్న ఆరోపణల్లోని నిజానిజాలను తెలుసుకునేందుకు ఈ ఏడాది సెప్టెంబరులో ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. రుణ మంజూరుకు బ్యాంకు పాటిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమరావతిలో వ్యవహారాలు నడుస్తున్నందున వాటిపై సమగ్ర పరిశోధన జరపాల్సిందిగా సిఫారసు చేసింది. అయితే, ప్రపంచ బ్యాంకు బోర్డు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు చేసేందుకు సుముఖంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి.
 
 
నిబంధనల అతిక్రమణల కారణంగా అమరావతిలో భవిష్యత్తులో తలెత్తబోయే విపరిణామాలకు రుణమిచ్చిన సంస్థలుగా ప్రపంచ బ్యాంక్‌, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని సామాజిక వేత్తలు తమ లేఖలో హెచ్చరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ఉన్నతాధికారులు శుక్రవారం సమావేశమవుతున్నారు. ఆయా అంశాలపై లోతుగా చర్చించి... అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ భేటీపై ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.
Link to comment
Share on other sites

మేథా పాట్కర్‌, ప్రఫుల్ల సమంత్ర, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ ఈఏఎస్‌ శర్మతోపాటు 46 మంది సామాజిక కార్యకర్తలు ‘నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌’ పేరిట ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు ఇటీవల లేఖ రాశారు. ‘రాజధాని అమరావతి నిర్మాణంలో అనేక నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

Veella maata vini development works aapeste, we can go back to 40s and 50s and still be regarded as poor third world country :sleep:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...