Jump to content

CBN South Korea Tour


sonykongara

Recommended Posts

రిటెక్ కంపెనీ సీఈవో కిమ్ డెహోన్‌ను కలిసిన చంద్రబాబు 
04-12-2017 15:59:56
 
సియోల్‌: ఐరిటెక్ కంపెనీ సీఈవో కిమ్ డెహోన్‌ను సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో సెన్సర్లు, డ్రోన్లు, ఐవోటీ, క్లౌడ్ లాంటి.. సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టామని కిమ్‌కు చంద్రబాబు వివరించారు. భూములకు యునిక్ ఐడీని కేటాయించే విధానానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. ఈనెల 10 తరువాత ఏపీకి వస్తామని కిమ్ డెహోన్, చంద్రబాబుకు తెలిపారు.
Link to comment
Share on other sites

  • Replies 66
  • Created
  • Last Reply
తొలిరోజు చంద్రబాబు దక్షిణకొరియా పర్యటనలో ..
04-12-2017 19:25:30
 
636480123314866117.jpg
 
సియోల్‌: తొలిరోజు సీఎం చంద్రబాబు దక్షిణకొరియా పర్యటనలో కియా అనుబంధ పరిశ్రమల పెట్టుబడులు ఖరారు చేసుకున్నారు. ఏపీలో 4,995.20 కోట్ల పెట్టుబడులు కియా అనుబంధ సంస్థలు పెట్టనున్నారు. కియా అనుబంధ సంస్థల ద్వారా 7,171 ఉద్యోగాలు రానున్నాయి. 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక గ్రూపుతో.. లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకున్నారు. ఏపీ ఈడిబీ ఒప్పందం విలువ రూ.3000 కోట్లు.
Link to comment
Share on other sites

రాష్ట్రీయం

అదిరిందయ్యా చంద్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Published Tuesday, 5 December 2017
5s_9.jpg?itok=eyhVQsYL

అమరావతి, డిసెంబర్ 4: సీఎం చంద్రబాబు తొలిరోజు దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. కొరియా పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక బృందంతో ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ‘లెటర్ ఆఫ్ ఇండెంట్’ తీసుకుంది. ఒప్పందాల విలువ అక్షరాలా రూ. 3వేల కోట్లగా అంచనా. ఈ సంస్థల ద్వారా మొత్తం 7,171 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సోమవారం కియా మోటార్స్ అనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వ్యాపార, వాణిజ్య స్నేహపూర్వక విధానాలకు మద్దతు పలికారు. మరోవైపు కియా అనుబంధ సంస్థలు మొత్తం కలిపి రూ. 4,995.20 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
నీటి శుద్ధిపరిశ్రమలపై హేనోల్స్ కెమికల్స్ ఆసక్తి
చంద్రబాబుతో హేనోల్స్ కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్ట్ఫోని, జనరల్ మేనేజర్ గెనెబోక్ కిమ్ సమావేశమయ్యారు. భారత్ ఇప్పుడు శక్తిసామర్థ్యాలున్న తయారీ కేంద్రంగా రూపొందిందని, భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు చంద్రబాబుతో స్ట్ఫోని చెప్పారు. నీటి శుద్ధికి ఉపయోగపడే రసాయనాలు, స్మార్ట్ ఫోన్‌లో వాడే పెయింట్‌ను తయారు చేస్తామని స్ట్ఫోని వివరించారు. చంద్రబాబు స్పందిస్తూ ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని సూచించారు. అనంతరం గ్రాన్ సియోల్ (జీఎస్) ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రెసిడెంట్ ఫోరెస్ట్ లిమ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు టెజిన్ కిమ్, హూన్ హోంగ్ హూ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లిమ్ చాంగ్ మిన్‌లు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే స్టేడియాల నిర్మాణాల్లో అనుభవమున్న జీఎస్ కంపెనీని, అమరావతి క్రీడానగరంలో పాలుపంచుకోవచ్చని బాబు సూచించారు. బీటీఎన్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై కిమ్‌తో బాబు సమావేశమయ్యారు. దేశంలో మొదటి లోకల్ ఫ్రెండ్లీ, సస్టెయినబుల్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సిటీని అనంతపురంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. దక్షిణ కొరియా -ఇండియా మధ్య 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ ఓప్పందంలో భాగంగా ఆ సిటీ ఏర్పాటు కానుంది. పరిశ్రమల శాఖ, ఈడీబీలకు తగు ప్రతిపాదనలు అందించాలని చంద్రబాబు సూచించారు. అనంతరం సీఎంతో పోస్కో దేవూ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జుసీబో సమావేశమయ్యారు. భారత్‌లో ఎల్‌ఎన్‌జీ వాల్వ్ చెయిన్ బిజినెస్‌పై పోస్కో ఆసక్తి ప్రదర్శించింది. ఉక్కు, రసాయనాలు, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలతోపాటు కమోడిటీ ట్రేడింగ్‌లో పోస్కోకు అనుభవముంది. డౌన్ స్ట్రీమ్ పెట్రో కెమికల్స్ ఇండస్ట్రీపై సంస్థ ఆసక్తి చూపగా కాకినాడ పరిసర ప్రాంతాల్లోని పెట్రో కారిడార్‌లో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని సీఎం వివరించారు. అనంతరం హ్యూసంగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జె జుంగ్‌లీతో సీఎం భేటీ అయ్యారు. టెక్స్‌టైల్స్, గార్మెంట్ పరిశ్రమలపై ఆసక్తిగా ఉన్నామని, భారత్‌లో
తమ యూనిట్లు పెట్టేందుకు తగిన ప్రదేశం కోసం అనే్వషిస్తున్నామని హ్యూసింగ్, చంద్రబాబుకు తెలిపారు. ఏ రాష్ట్రం ఇవ్వలేనంత ఆకర్షణీయమైన ప్యాకేజ్ ఇస్తామని, ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భౌగోళిక సానుకూల అంశాలు అనేకం ఏపీలోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వాణిజ్యం, పరిశ్రమల, ఆహారశుద్ధి శాఖల మంత్రి అమరనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్, ఏసీఐఐసీ ఎండీ అహ్మద్ బాబు ఉన్నారు.

Link to comment
Share on other sites

దక్షిణకొరియాలో చంద్రబాబు బిజీబిజీ
5brk61a.jpg

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణ కొరియా పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ సందర్బంగా బూసన్‌ బిజినెస్‌ సెమినార్‌లో ఆంధ్రప్రదేశ్‌కు, మేకిన్‌ ఇండియా కొరియా సెంటర్‌కు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఎంఐసీ(మేకిన్‌ ఇండియా కొరియా సెంటర్‌) ఆంధ్రప్రదేశ్‌లో ఇండస్ట్రీయల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తుంది. అలాగే బూసన్‌లో ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు.

బిజినెస్‌ సెమినార్‌లో మధ్యాహ్న భోజన సమావేశంలో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఏపీకి, దక్షిణకొరియాలోని మత్స్య విశ్వవిద్యాలయం మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై బూసన్‌ వైస్‌ మేయర్‌, చంద్రబాబు మధ్య చర్చ జరిగింది. మత్స్య సంబంధిత రంగంలో ఏపీతో కలిసి పనిచేసేలా ఆ యూనివర్శిటీ ప్రెసిడెంట్‌తో సంప్రదింపులు జరుపుతామని బూసన్‌ వైస్‌ మేయర్‌, భారత రాయబారి, కొరియా కౌన్సిల్‌ జనరల్‌ చంద్రబాబు హామీ ఇచ్చారు.

Link to comment
Share on other sites

కియా మోటార్స్‌ను అడగండి...ఏపీ సమర్ధత ఏంటో చెబుతుంది : బాబు
05-12-2017 14:08:37
 
636480797188323211.jpg
బుసాన్‌: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుసాన్‌లో బిజినెస్ సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు 21 రోజుల్లో సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతులు ఇస్తున్నామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందున్నామని చెప్పారు. ఏపీలో ఎప్పుడూ పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, ఏపీకి సీఎన్‌బీసీ 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం వచ్చిందని బాబు తెలిపారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిందని, మూడేళ్లలో 26 పురస్కారాలను గెలుచుకున్నామని ఆయన పేర్కొన్నారు. ‘కియా మోటార్స్‌ను అడగండి...ఏపీ సమర్ధత ఏంటో చెబుతుంద’ని అన్నారు. ఏపీలో ఉత్తమ పారిశ్రామిక విధానం అమలులో ఉందని, పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అత్యుత్తమ ప్యాకేజీని ఇస్తున్నట్లు చెబుతూ... రాష్ట్రంలో కొలువుదీరుతున్న పరిశ్రమల గురించి చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు వివరించారు.
 
ఏపీలో 14 ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఏపీ రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసిందని, వ్యవసాయ రంగంలో 25.6 శాతం వృద్ధి సాధించామని, తాము స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2050 నాటికి అత్యున్నత ప్రమాణాలు గల ప్రపంచ గమ్యస్థానంగా ఏపీని అభివృద్ధి చేయాలని ముందుచూపుతో కృషి చేస్తున్నామని అన్నారు. 80 శాతం ప్రజా సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఏపీకి ఇసుజు, కియా, హీరో, భారత్ బెంజ్ పరిశ్రమలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయాధారిత, ఆహారశుద్ధి పరిశ్రమలు వస్తున్నాయని, గుడ్లు, పండ్లు, ఉద్యాన ఉత్పత్తులలో అగ్రగామిగా ఉన్నామని, వస్త్ర పరిశ్రమ, మొబైల్ పరిశ్రమలు కూడా పెద్దఎత్తున వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ఫాక్స్‌కాన్, ఎంఐ, జియోనీ తదితర సంస్థలు వచ్చాయని, సంక్షోభంలో తమ ప్రయాణాన్ని ఆరంభించామని, ఏపీలో గొప్ప వనరులు ఉన్నాయని, అనేక అంశాలలో సానుకూలతలు కొరియా కష్టాలను ఎదుర్కొందని, అనూహ్యంగా అభివృద్ధి సాధించిందని, నవ్యాంధ్ర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
Link to comment
Share on other sites

అనంతలో ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సిటీ!
05-12-2017 03:39:45
 
636480419864425833.jpg
బీటీఎన్‌ కంపెనీ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వైకిమ్‌తోనూ సీఎం సమావేశమయ్యారు. దేశంలో మొదటి లోకల్‌ ఫ్రెండ్లీ సస్టెయినబుల్‌ ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సిటీని అనంతపురంలో ఏర్పాటు చేయడంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. దక్షిణ కొరియా-ఇండియా మధ్య రూ.64405 కోట్ల(10 బిలియన్‌ డాలర్ల) ఆర్థిక సాయానికి జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ సిటీని నిర్మించనున్నారు. పరిశ్రమల శాఖ, ఈడీబీలకు స్మార్ట్‌సిటీపై ప్రతిపాదనలు అందించాలని బీటీఎన్‌ సంస్థకు సీఎం సూచించారు. అనంతరం పోస్కో దేవూ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జూ సీబీతో సీఎం సమావేశమయ్యారు. ఇండియాలో ఎల్‌ఎన్‌జీ వాల్వ్‌ చెయిన్‌ బిజినెస్‌ పట్ల పోస్కో ఆసక్తి కనబరిచింది. ఉక్కు, రసాయనాలు, ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగాలతోపాటు కమోడిటీ ట్రేడింగ్‌లో పోస్కోకు విశేషానుభవం ఉంది. ఆ తర్వాత హ్యోసంగ్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జెజూంగ్‌లీతో సీఎం భేటీ అయ్యారు.
Link to comment
Share on other sites

రండి.. చూడండి!
06-12-2017 02:16:12
 
636481233736722676.jpg
  • ఏపీలో అంతా సానుకూలం!
  • కియను అడిగితే మీకే తెలుస్తుంది
  • పరిశ్రమల స్థాపనకు ఓపెన్‌ డోర్‌ పాలసీ
  • రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కండి
  • అభివృద్ధిలో కొరియా మాకు స్ఫూర్తి
  • ద.కొరియా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
  • బిజినెస్‌ సెమినార్‌లో సీఎం ప్రసంగం
  • ఏపీలో కొరియా పారిశ్రామిక సముదాయం
  • ఎంఐసీతో కుదిరిన ఒప్పందం
  • రెండో రోజు బిజీబిజీగా సీఎం పర్యటన
అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘‘నవ్యాంధ్రకు రండి! మా రాష్ట్ర అభివృద్ధి, నిర్మాణంలో భాగస్వాములు కండి. ఏపీ సామర్థ్యం, పెట్టుబడులకు ఉన్న అనుకూలత గురించి... మీ దేశానికే చెందిన కియ కంపెనీ ప్రతినిధులను అడగండి’’ అని దక్షిణ కొరియా పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంగళవారం కొరియా రేవు నగరం బూసన్‌లో జరిగిన బిజినెస్‌ సెమినార్‌లో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొరియా పారిశ్రామిక సముదాయం ఏర్పాటుపై ఇదే కార్యక్రమంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ‘ఏపీ సర్కారు-మేకిన్‌ ఇండియా కొరియా సెంటర్‌(ఎంఐసీ)’ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
 
ఇందులో భాగంగా బూసన్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ను నెలకొల్పుతారు. పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి చర్చలు జరిపారు. కొరియాలోని మత్స్య విశ్వవిద్యాలయం, ఏపీ సర్కారు పరస్పరం సహకరించుకునేందుకు ఉన్న అవకాశాలపై బూసన్‌ వైస్‌ మేయర్‌ కిమ్‌ యాంగ్‌వాన్‌తో సీఎం చర్చించారు. మత్స్య రంగంలో ఏపీతో కలిసి పనిచేసేలా పుక్యంగ్‌ నేషనల్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌తో సంప్రదింపులు జరుపుతామని ముఖ్యమంత్రికి బూసన్‌ వైస్‌ మేయర్‌ హామీ ఇచ్చారు.
 
ఇదీ మా ప్రత్యేకత...
దక్షిణ భారత దేశంలో రహదారులు, రైలు మార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాలతో అన్ని ప్రాంతాలతో అనుసంధానం కలిగిన రాష్ట్రం ఏపీ ఒక్కటే అని బూసన్‌ బిజినెస్‌ సెమినార్‌లో చంద్రబాబు ఉద్ఘాటించారు. ‘‘ఇరవై ఏళ్లక్రితం నేను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాను. జంట నగరాలకు సైబరాబాద్‌ అన మరొక నగరాన్ని చేర్చాను. ఆనాటి ఫలాలను ఇప్పుడు హైదరాబాద్‌ అనుభవిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ జీరో నుంచి నాపని మొదలైంది’’ అని చంద్రబాబు తెలిపారు.
 
కొరి యా ఇలాంటి కష్టాలను దీటుగా ఎదుర్కొందని... దీని స్ఫూర్తితో తాము ముందడుగు వేస్తున్నామ ని చెప్పారు. నవ్యాంధ్ర నిర్మాణంలోనూ కొరియన్‌లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనలో దక్షిణ కొరియాకే అగ్రప్రాధాన్యమిస్తామని చంద్రబాబు పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా ఏపీకి నమ్మకమైన వ్యాపార భాగస్వామి అవుతుందనే నమ్మకం నాకుంది. ప్రతీ ఒక్కరూ ఒక్కో ప్రాజెక్టుతో మా దగ్గరకు రండి. పెట్టుబడులు పెట్టండి. ‘‘మేం ఎంత సమర్థులమో... మా రాష్ట్రంలో వ్యాపారం ఎంత సులభతరమో మీరే వచ్చి ప్రత్యక్షంగా చూడండి’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.
 
అంతా అనుకూలం...
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత జవాబుదారీగల పరిపాలన కొనసాగుతోందని, అంతర్జాతీయ పెట్టుబడు లు, పరిశ్రమల స్థాపనకోసం ఓపెన్‌ డోర్‌ పాలసీని అమలు చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఒక్క ఫోన్‌ కాల్‌, మెసేజ్‌కు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు వచ్చేవారికి 21 రోజుల్లో సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా అనుమతులు ఇస్తున్నామన్నారు.
 
ఈ ప్రక్రియ లో ఎక్కడా ఇబ్బందులు ఉండవని, ఇప్పటి వరకు 23,414 అనుమతులు ఇచ్చామన్నారు. ఏపీలో ఎప్పుడూ పెట్టుబడుల కు స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, అందుకు సీఎన్‌బీసీ తమ రాష్ట్రానికి ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం ఇచ్చిందని తెలిపారు. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో అగ్రస్థానం తమదేనన్నారు. విద్యుత్‌ రంగంలో ఏ అవార్డు ఉన్నా... అది ఏపీనే వరిస్తోందని, ఈ మూడేళ్లలో అలా 26 పురస్కారాలు అందుకున్నామన్నారు. పారదర్శక పరిపాల న, జవాబుదారీతనానికి భారత దేశానికి ఏపీ ఓ రోల్‌ మెడల్‌గా నిలిచిందని తెలిపారు. పౌరులు ప్రభుత్వంతో నేరుగా మాట్లాడే వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.
 
మీరు డైనమిక్‌: వైస్‌ మేయర్‌
బిజినెస్‌ సెమినార్‌లో బూసన్‌ వైస్‌ మేయర్‌ కిమ్‌ యంగ్‌వాన్‌ ప్రసంగిస్తూ... చంద్రబాబును డైనమిక్‌ లీడర్‌గా ప్రశంసించారు. కొరియా, ఏపీ మధ్య సారుప్యతలున్నాయని చెప్పా రు. ఓడరేవులు, నగరాల అభివృద్ధిలాంటి అనేక అంశాల్లో పరస్పర సహకారం అవసరమన్నారు. చంద్రబాబు పర్యటనపట్ల భారత రాయబారి దొరైస్వామి హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో వ్యాపారం చేయాలనుకుంటే ఏపీని మించిన మరోప్రాం తం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘కియకు ఇచ్చిన భూమి చదును చేయడానికే ఏడాది పడుతుందని భావించాం. కానీ... కేవలం 3 నెలల్లోనే ప్రభుత్వం దాన్ని సిద్ధం చేసింది’’ అని తెలిపారు.
 
అన్యోంగ్‌ హోసెయో!
బూసన్‌ బిజినెస్‌ సెమినార్‌లో పాల్గొన్న చంద్రబాబు... ‘అన్యోంగ్‌ హోసెయో!’ (శుభోదయం) అంటూ కొరియన్‌ భాషలో వారికి అభివాదం తెలిపారు. దీంతో ప్రతినిధులంతా హర్షధ్వానాలు చేశారు. మళ్లీ కొరియాకు వచ్చినప్పుడు కొరియన్‌ భాషలో ఇంతకంటే మెరుగ్గా మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పడంతో వారంతా చప్పట్లు కొట్టారు. నవ్యాంధ్ర విశేషాలతో కొరియన్‌ భాషలోనే ఒక ప్రజెంటేషన్‌ను కూడా రూపొందించి, ప్రదర్శించారు.
 
బూసన్‌ మేయర్‌తో చర్చలు...
లొట్టే హోటల్‌లో బూసన్‌ మేయర్‌ సుహ్‌బ్యూంగ్‌ సూ తో చంద్రబాబు సమావేశమయ్యారు. తాను గతంలో చైన్నై, ముంబయి నగరాలను సందర్శించానని, ఏపీకి రాకు న్నా ఆ రాష్ట్రం గురించి, చంద్రబాబు డైనమిక్‌ నాయకత్వం గురించి విన్నానని మేయర్‌ అన్నారు. అమరావతి, బూసన్‌ ల మధ్య కొత్త స్నేహం ఉభయ తారకంగా ఉంటుందన్నా రు. తమ పర్యటనకు చక్కటి ఏర్పాట్లు చేశారంటూ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకీ అతిథిగా రావాలని బూసన్‌ మేయర్‌ను ఆహ్వానించారు. సీఎం ప్రతిపాదన మేరకు సిస్టర్‌స్టేట్‌రిలేషన్‌ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని మేయ ర్‌ చెప్పారు. తమకు భారత్‌ అంటే ప్రత్యేకమైన అభిమానమని, ఏపీని సోదర రాష్ట్రంగా భావిస్తున్నామని మేయర్‌ చెప్పారు. ఫిబ్రవరిలో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ప్రత్యేక ప్రతినిధులను పంపిస్తామన్నారు.
 
బూసన్‌ న్యూపోర్టు సందర్శన...
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రతినిధులు బూసన్‌ న్యూపోర్టును సందర్శించారు. 2006లో ఈ రేవు ప్రారంభమైంది. పోర్టు అథారిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ కాంగ్‌ బూవో ఏపీ ముఖ్యమంత్రి బృందానికి స్వయంగా పోర్టును చూపించారు. ఏపీలోని ఓడరేవులతో కలిసి పనిచేయాలని చంద్రబాబు ఆయనను కోరారు.
 
రోడ్‌షో.. స్పీడ్‌ట్రైన్‌లో ప్రయాణం
దక్షిణ కొరియా పర్యటనలో రెండోరోజున సీఎం తెల్లవారుజామున 4.30కే కార్యకలాపాలు ప్రారంభించారు. సియోల్‌ నుంచి బూసన్‌కు స్పీడ్‌ ట్రైన్‌లో ప్రయాణించా రు. బూసన్‌లో భారత ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. భారత కాన్సులేట్‌ నిర్వహిస్తున్న సాంస్కృతిక కేంద్రాన్ని సందర్శించారు.
Link to comment
Share on other sites

రాష్ట్రంలో కొరియా పారిశ్రామిక మండలి
ఫోన్‌ చేస్తే చాలు పలుకుతా
ఈనాడు - అమరావతి
5ap-main5a.jpg
ఆన్‌ యోంగ్‌ హో సే (కొరియాలో అందరికీ నమస్కారం). ఇప్పటికింతే కొరియన్‌ భాష తెలుసు. మళ్లీ వచ్చినప్పుడు ఇంతకంటే మెరుగ్గా మాట్లాడతాను. మా సమర్థత ఏంటో తెలుసుకోవాలంటే కియా ప్రతినిధులను అడగండి. పౌరులు నేరుగా ప్రభుత్వంతో మాట్లాడే వ్యవస్థ ఏర్పాటు చేశాం. అవినీతికి తావు లేదు. మీకు ఒక్క ఫోన్‌ కాల్‌,  మెసేజ్‌ దూరంలోనే అందుబాటులో ఉంటా. ఆంధ్రాకు దక్షిణకొరియా నమ్మకమైన వ్యాపార భాగస్వామి అవుతుందని భావిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఒక్కో ప్రాజెక్టుతో మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి. ఏపీలో వ్యాపారం చేయడం ఎంత సులభతరమో ప్రత్యక్షంగా మీరే చూడండి.
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

రాష్ట్రంలో కొరియా పారిశ్రామికమండలి (ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌) ఏర్పాటు కానుంది. ఈ మేరకు ‘మేకిన్‌ ఇండియా కొరియా సెంటర్‌’ (ఎంఐసీ), ఏపీకి మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. పారిశ్రామిక మహానగరం బుసాన్‌లో ఏపీ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రెండోరోజు మంగళవారం ఇక్కడ రోడ్‌ షో నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో  ‘శుభోదయం... అందరికీ నమస్కారం’... అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొరియన్‌ భాషలో పలకరించడంతో పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు పులకించారు. పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ నగర మేయర్‌ సుహ్‌ బ్యూంగ్‌ సూతో భేటీ అయ్యారు. తాను గతంలో చెన్నై, ముంబయి నగరాలకు వచ్చానని, ఆంధ్రాకు రాలేదని, చంద్రబాబు నాయకత్వం గురించి తనకు తెలుసని మేయర్‌ పేర్కొన్నారు. ఏపీ, బుసాన్‌ల మధ్య కొత్త స్నేహం ఉభయతారకంగా ఉండగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. కొరియా మత్స్యవిశ్వవిద్యాలయం, ఏపీలు పరస్పర సహకారం అందించుకునే అవకాశాలపై వైస్‌ మేయర్‌ కిమ్‌ యంగ్‌వాన్‌తో చంద్రబాబు చర్చించారు. ఏపీతో కలిసి పనిచేసేలా తమ జాతీయవర్సిటీతో సంప్రదింపులు జరుపుతామని కిమ్‌ హామీ ఇచ్చారు. ‘‘పరిశ్రమలు నెలకొల్పడానికి వచ్చే వారికి 21 రోజుల్లో అన్ని అనుమతులు ఏకగవాక్ష విధానంలో ఇస్తున్నాం. 24 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. ఈ రంగంలో ఏ అవార్డు ఉన్నా అది ఏపీకే వస్తోంది. ప్రశాంత వాతావరణం ఉంది. కార్మికుల సమ్మెలు ఉండవు. పారదర్శకపాలన అందిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి పారిశ్రామికవేత్త ఒక్కో ప్రాజెక్టుతో మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి. మీకు కావాల్సిన సంపూర్ణ సహకారం అందిస్తాం...’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

5ap-main5b.jpg

కొరియా భాషలో దృశ్యరూప ప్రదర్శన
బుసాన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారుల బృందం దృశ్యరూప ప్రదర్శనలన్నీ కొరియన్‌ భాషలో ఇవ్వడం అక్కడ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. సీఎం సియోల్‌ నుంచి ఇక్కడకు స్పీడు ట్రైన్‌లో వచ్చారు. వైస్‌ మేయర్‌ కిమ్‌ యంగ్‌వాన్‌ ఘనస్వాగతం పలుకుతూ... ‘మీరు డైనమిక్‌ లీడర్‌, కొరియా, ఏపీ మధ్య అనేక సారూప్యతలున్నాయి, పలు రంగాల్లో పరస్పర సహకారం అందించుకుందాం..’ అని పేర్కొన్నారు. దక్షిణకొరియాలో భారత రాయబారి దొరైస్వామి మాట్లాడుతూ భారత్‌లో కొరియా సంస్థలు వ్యాపారం చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌ను మించిన ప్రాంతం మరొకటి లేదన్నారు. ఓడరేవును సీఎం, రాష్ట్ర ప్రతినిధుల బృందం సందర్శించింది. పోర్టు అథారిటీ ఉపాధ్యక్షులు కాంగ్‌ బూ వో దీని ప్రత్యేకతలను వివరించారు. తమ రాష్ట్రంలో 14 ఓడరేవులను అభివృది ్ధచేస్తున్నామని, సహకారం అందించాలని సీఎం కోరారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారుల బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

దక్షిణకొరియాలో మూడోరోజు చంద్రబాబు పర్యటన
06-12-2017 08:36:27
 
636481461886074144.jpg
సియోల్‌: దక్షిణకొరియాలో మూడోరోజు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఓసీఐ కంపెనీ సీఈవో హ్యూమ్‌లీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వివిధ దేశాల్లో తమ కార్యకలాపాలపై ఓసీఐ సీఈవో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ఓసీఐ వెల్లడించింది. గతేడాది విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు ఓసీఐ సీఈవో హాజరైన విషయం తెలిసిందే. సౌర విద్యుత్‌ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. అంతేకాకుండా ప్రసిద్ధ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఎల్‌జీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాలను చంద్రబాబుకు ఎల్‌జీ ప్రెసిడెంట్‌ సూన్‌ వివరించారు. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. దేశ సగటు వృద్ధిరేటు కంటే రెట్టింపు వృద్ధిరేటు సాధిస్తున్నామని బాబు వివరించారు. ఏపీలో పెట్టుబడులపై తమ బోర్డుతో సూన్‌ చర్చిస్తామన్నారు.
Link to comment
Share on other sites

డార్స్ల్ డైరెక్టర్ బెన్నీ కాంగ్‌తో చంద్రబాబు భేటీ
06-12-2017 08:45:49
 
636481467506672486.jpg
సియోల్‌: దక్షిణ కొరియాలోని అతిపెద్ద లాజిస్టిక్ సంస్థ డార్స్ల్ డైరెక్టర్ బెన్నీ కాంగ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న లాజిస్టిక్ యూనివర్సిటీలో...
భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు. ఆసక్తిగా ఉన్నామని చంద్రబాబుకు బెన్నీ తెలిపారు. కియా మోటార్స్, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్... సంయుక్తంగా నిర్వహించిన బిజినెస్ సెమినార్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. కియా పెట్టుబడుల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ సరైన స్థానంగా గుర్తించామని, ఏపీలో పరిశ్రమ స్థాపన తమకు మంచి అనుభవమని కియా ప్రెసిడెంట్ హాన్ వూ చెప్పారు. సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు... వనరులు, ప్రోత్సాహకాలపై ప్రజంటేషన్ చంద్రబాబు ఇచ్చారు.
Link to comment
Share on other sites

కొరియాలో మాట్లాడుతూ... కొరియాలో ప్రెజంటేషన్ ఇస్తూ..

   
korea-05122017-1.jpg
share.png

నవ్యాంధ్రలో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియా పర్యటన మంగళవారం రెండో రోజుకు చేరింది. దక్షిణ కొరియాలో ఏడున్నరకు ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. దక్షిణకొరియా పారిశ్రామిక నగరం బూసన్ సందర్శనకు సియోల్ నుంచి స్పీడు ట్రైనులో ముఖ్యమంత్రి బృందం బయల్దేరి వెళ్లింది. బూసన్‌లో ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన రోడ్ షో/బిజినెస్ సెమినార్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్ ప్రసంగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి ‘డైనమిక్ లీడర్’ అని ప్రశంసించారు. కొరియా, ఏపీ మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. వైద్య-ఆరోగ్య రంగం, వ్యవసాయం, పునరుత్పాదక విద్యుత్, ఓడరేవులు, నగరాల అభివృద్ధి లాంటి అనేక అంశాలలో పరస్పర సహకారం ఆవశ్యకతను వివరించారు.

 

korea 05122017 2

‘కియా’కు ఇచ్చిన ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేయడానికి కనీసం ఏడాదైనా పడుతుందని భావిస్తే, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం 3 నెలలలోనే ఆ పని పూర్తిచేయడ విశేషమని, ఆయన క్రియాశీలతకు, వేగవంతమైన పనివిధానానికి ఇదే నిదర్శనమని దక్షిణ కొరియాలో భారత రాయబారి ప్రశంసించారు. ‘కియా మోటార్స్’కు కేటాయించిన అభివృద్ధి పనుల విశేషాలపై బిజినెస్ సెమినార్‌లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల సంస్థ లఘుచిత్రాన్ని ప్రదర్శించింది.

korea 05122017 3

బిజినెస్ సెమినార్‌కు హాజరైన వారిని కొరియన్ భాషలో ‘ఆన్ యోంగ్ హో సే’ (Aan Yong ho sei) అంటూ పలకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలకరించడంతో వారు హర్షధ్వానాలు చేశారు. మళ్లీ కొరియా వచ్చేప్పుడు కొరియన్ భాషలో ఇంతకంటే మెరుగ్గా మాట్లాడుతానని ముఖ్యమంత్రి చెప్పడంతో కరతాళధ్వనులతో స్వాగతించారు. ఇదిలా ఉంటే తర్జుమా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెజెంటేషన్‌ను బిజినెస్ సెమినార్‌కు హాజరైన పారిశ్రామికవేత్తలకు కొరియన్ భాషలో అందజేయడం విశేషం. కొరియన్ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడానికి వారి భాషలోనే ఏపీ సానుకూలాంశాలను వివరించడం ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి తనదైన శైలిలో ప్రయత్నించారు.

Link to comment
Share on other sites

14 minutes ago, sonykongara said:

కొరియాలో మాట్లాడుతూ... కొరియాలో ప్రెజంటేషన్ ఇస్తూ..

   

korea-05122017-1.jpg
share.png

నవ్యాంధ్రలో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియా పర్యటన మంగళవారం రెండో రోజుకు చేరింది. దక్షిణ కొరియాలో ఏడున్నరకు ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. దక్షిణకొరియా పారిశ్రామిక నగరం బూసన్ సందర్శనకు సియోల్ నుంచి స్పీడు ట్రైనులో ముఖ్యమంత్రి బృందం బయల్దేరి వెళ్లింది. బూసన్‌లో ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన రోడ్ షో/బిజినెస్ సెమినార్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్ ప్రసంగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి ‘డైనమిక్ లీడర్’ అని ప్రశంసించారు. కొరియా, ఏపీ మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. వైద్య-ఆరోగ్య రంగం, వ్యవసాయం, పునరుత్పాదక విద్యుత్, ఓడరేవులు, నగరాల అభివృద్ధి లాంటి అనేక అంశాలలో పరస్పర సహకారం ఆవశ్యకతను వివరించారు.

 

korea 05122017 2

‘కియా’కు ఇచ్చిన ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేయడానికి కనీసం ఏడాదైనా పడుతుందని భావిస్తే, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం 3 నెలలలోనే ఆ పని పూర్తిచేయడ విశేషమని, ఆయన క్రియాశీలతకు, వేగవంతమైన పనివిధానానికి ఇదే నిదర్శనమని దక్షిణ కొరియాలో భారత రాయబారి ప్రశంసించారు. ‘కియా మోటార్స్’కు కేటాయించిన అభివృద్ధి పనుల విశేషాలపై బిజినెస్ సెమినార్‌లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల సంస్థ లఘుచిత్రాన్ని ప్రదర్శించింది.

korea 05122017 3

బిజినెస్ సెమినార్‌కు హాజరైన వారిని కొరియన్ భాషలో ‘ఆన్ యోంగ్ హో సే’ (Aan Yong ho sei) అంటూ పలకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలకరించడంతో వారు హర్షధ్వానాలు చేశారు. మళ్లీ కొరియా వచ్చేప్పుడు కొరియన్ భాషలో ఇంతకంటే మెరుగ్గా మాట్లాడుతానని ముఖ్యమంత్రి చెప్పడంతో కరతాళధ్వనులతో స్వాగతించారు. ఇదిలా ఉంటే తర్జుమా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెజెంటేషన్‌ను బిజినెస్ సెమినార్‌కు హాజరైన పారిశ్రామికవేత్తలకు కొరియన్ భాషలో అందజేయడం విశేషం. కొరియన్ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడానికి వారి భాషలోనే ఏపీ సానుకూలాంశాలను వివరించడం ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి తనదైన శైలిలో ప్రయత్నించారు.

:super:

Link to comment
Share on other sites

మన గురించి మనం చెప్పుకుంటే ఏముంటుంది... కొరియాలో మన రాష్ట్ర గొప్పదనం చెప్తున్నారు వినండి...

 

korea-06122017-1.jpg
share.png

నవ్యాంధ్రలో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియా పర్యటన కొనసాగుతూ ఉంది. బూసన్‌లో ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన రోడ్ షో/బిజినెస్ సెమినార్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్ ప్రసంగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి ‘డైనమిక్ లీడర్’ అని ప్రశంసించారు. కొరియా, ఏపీ మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. వైద్య-ఆరోగ్య రంగం, వ్యవసాయం, పునరుత్పాదక విద్యుత్, ఓడరేవులు, నగరాల అభివృద్ధి లాంటి అనేక అంశాలలో పరస్పర సహకారం ఆవశ్యకతను వివరించారు.

 

korea 06122017 2

అలాగే, దక్షిణ కొరియాలో భారత రాయబారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించారు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణకొరియాలోని క్రియాశీల నగరమైన బూసన్‌ను సందర్శించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. క్రియాశీలత, సాంకేతికత, బాహ్య ప్రపంచంతో సంబంధాలు, ఓడరేవుల అభివృద్ధి తదితర అంశాలలో బూసన్ సిటీకి, ఏపీకి సారూప్యత ఉన్నదని వివరించారు. భారత్‌లో వ్యాపారం చేయాలనుకుంటే ఏపీని మించిన ప్రాంతం మరొకటి లేదని కొరియన్ పారిశ్రామికవేత్తలకు దక్షిణ కొరియాలో భారత రాయబారి స్పష్టంచేశారు.

korea 06122017 3

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత బాగా పని చేస్తుందో ఒక ఉదాహరణ చెప్పారు... ‘కియా’కు ఇచ్చిన ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేయడానికి కనీసం ఏడాదైనా పడుతుందని భావిస్తే, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం 3 నెలలలోనే ఆ పని పూర్తిచేయడ విశేషమని, ఆయన క్రియాశీలతకు, వేగవంతమైన పనివిధానానికి ఇదే నిదర్శనమని ప్రశంసించారు. ఇక్కడ నుంచి మెషినరీ తీసుకువెళ్ళినా, మనకు సంవత్సరం పడుతుంది అని కియా ఇంజనీర్లు కూడా చెప్పారు అని, కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మూడు నెలల్లో పూర్తి చేసి ఆశ్చర్య పరిచింది అని అన్నారు... అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టమని సలహా ఇస్తున్నట్టు చెప్పారు...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...