Jump to content

AP Real Time Governance Center


sonykongara

Recommended Posts

‘రియల్‌’ గవర్నెన్స్‌!
26-11-2017 02:20:28
 
636472596304959397.jpg
  • రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ రాష్ట్ర కేంద్రం సిద్ధం
  • ఇకపై కీలక నిర్ణయాలన్నీ ఇక్కడి నుంచే
  • శాఖల పనితీరు, సమాచార విశ్లేషణ
  • ప్రతిరోజూ గంటసేపు గడపనున్న సీఎం
  • ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ తనిఖీలు
  • ఈ కేంద్రంతో 20 వేల సీసీ కెమెరాలు అనుసంధానం
  • నేడు ఆర్టీజీ రాష్ట్ర కేంద్రాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పాలనలో వేగాన్ని పెంచేందుకు.. ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు.. ఓ ప్రత్యేక కార్యస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ‘రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ రాష్ట్ర కేంద్రం’గా పేర్కొనే ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో కూర్చొని.. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించవచ్చు. రాష్ట్రంలో ఎవరితోనైనా వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా మాట్లాడవచ్చు.
 
 
రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి పనితీరును.. 1100కు వస్తున్న ఫిర్యాదులను.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను.. ఇలా ప్రతి సమాచారాన్ని విశ్లేషించే వెసులుబాటు ఇక్కడ ఉంది. కేవలం విశ్లేషణలతో సరిపెట్టకుండా దానికి అనుగుణంగా అవసరమైన నిర్ణయాలూ తీసుకుంటారు. స్వయం గా సీఎం చంద్రబాబు నిత్యం ఒక గంటసేపు ఈ కేంద్రంలో గడపనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం అత్యవసర సమయాల్లో 24 గంట లూ పనిచేస్తుంది. ఇక్కడ నిరంతరం పనిచేసేందుకు, వచ్చిన సమాచారాన్ని, అభిప్రాయాలను, సమస్యలను విశ్లేషించేందుకు 40 మంది సాంకేతిక నిపుణులు ఉంటారు.
 
 
ఆకస్మిక తనిఖీలూ ఆన్‌లైన్‌లోనే!
రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్టీజీ) రాష్ట్ర కేంద్రం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ కార్యాలయంలో కూర్చొనే రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించే వెసులుబాటు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 20 వేల సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా పెద్ద ఉత్సవాలు, భారీ ఊరేగింపులు, ఆందోళనలు ఏది జరిగినా అక్కడి ట్రాఫిక్‌ను, పరిస్థితిని ఇక్కడి నుంచి చూసి అంచనా వేసి నియంత్రించేలా ఏర్పాట్లు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత ఎలా ఉందన్న విషయాన్ని అక్కడ ఉన్న సీసీ కెమెరాల సాయంతో ఈ కేంద్రం నుంచి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వొచ్చు.
 
 
ఒక్క మాటలో చెప్పాలంటే ఆకస్మిక తనిఖీల నిర్వహించేందుకు ఇకపై సీఎం జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడి పరిస్థితిని అప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. ఒక జిల్లాకు, ఒక నగరానికి, కొన్ని గ్రామాలకు సంబంధించి ఒక అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే.. ఆయా ప్రాంతాలకు కాల్‌ సెంటర్‌ నుంచి తక్షణం ఫోన్‌ చేయించి వారి అభిప్రాయాలను తీసుకుని ఇక్కడ విశ్లేషిస్తారు. అత్యధికుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటారు. సీఎం ఇక్కడి నుంచే నేరుగా జిల్లా నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు అందరితో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించవచ్చు.
Edited by sonykongara
Link to comment
Share on other sites

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ కనిపించని పోలీస్‌: చంద్రబాబు
26-11-2017 12:37:18
 
636472966365941756.jpg
అమరావతి: కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ కనిపించని పోలీస్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను చంద్రబాబునాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... వర్షపాతం, భూసార పరీక్షల వంటి విషయాలు రియల్ టైంలో తెలుసుకోవచ్చని, జీఎస్టీపీకి సంబంధించి అన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని సీఎం అన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును కూడా పరిశీలించవచ్చన్నారు. అంతేగాక రాష్ట్రంలో ఎవరు ఎక్కడ క్రైమ్ చేసినా రియల్‌ టైం ద్వారా కనిపెట్టొచ్చని, ఆసియాలోనే ఇలాంటి వీడియో వాల్ లేదన్నారు. సీఎం డాష్ బోర్డు, సీఎం కోర్ బోర్డు అన్ని అనుసంధానం చేశామని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో పంచాయతీలను కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానం చేస్తామని సీఎం తెలిపారు.
Link to comment
Share on other sites

రియల్‌ టైం గవర్నెన్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం
26-11-2017 11:10:23
 
636472914217777512.jpg
అమరావతి: వెలగపూడి సచివాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... అధికారులు, ప్రజలతో ఎక్కడి నుంచైనా వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటుచేయడం జరిగిందని, విపత్తులు, ప్రమాదాల సమయంలో సెంటర్‌ నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.
Link to comment
Share on other sites

అమెరికాలో ఎఫ్.బి.ఐ ఆఫీస్ కాదు... ఇది, పవర్ అఫ్ ఆంధ్రా...

   
rtgs-26112017-1.jpg
share.png

క్షేత్రస్థాయిలో ఉన్న అధికారి అక్కడి నుంచే ముఖ్యమంత్రితో నేరుగా సంభాషించే అత్యాధునిక వ్యవస్థ అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో అందుబాటులోకి వచ్చింది. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ఏర్పాటు చేసిన ఈ కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో ఆసియాలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్‌ మందిరం(బార్కో)ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటుచేసిన దీని ద్వారా అధికారులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే ఇబ్బంది నుంచి ఉపశమనం కలగనుంది. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి పనితీరును.. 1100కు వస్తున్న ఫిర్యాదులను.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను.. ఇలా ప్రతి సమాచారాన్ని విశ్లేషించే వెసులుబాటు ఇక్కడ ఉంది.

 

rtgs 26112017 2

కేవలం విశ్లేషణలతో సరిపెట్టకుండా దానికి అనుగుణంగా అవసరమైన నిర్ణయాలూ తీసుకుంటారు. స్వయం గా సీఎం చంద్రబాబు నిత్యం ఒక గంటసేపు ఈ కేంద్రంలో గడపనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం అత్యవసర సమయాల్లో 24 గంట లూ పనిచేస్తుంది. ఇక్కడ నిరంతరం పనిచేసేందుకు, వచ్చిన సమాచారాన్ని, అభిప్రాయాలను, సమస్యలను విశ్లేషించేందుకు 40 మంది సాంకేతిక నిపుణులు ఉంటారు. అధికారి సెల్‌ఫోన్‌ ద్వారా ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడి నుంచే నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి సర్వే లెన్స్‌ కెమెరాల ద్వారా రాష్ట్రం మొత్తాన్ని ముఖ్యమంత్రి నేరుగా వీక్షించొచ్చు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5వేల కెమెరాలు ఏర్పాటుచేశారు. త్వరలో మరో 15వేల కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఇక్కడి నుంచే ఆదేశాలు జారీచేయొచ్చు. అవసరమైతే ఆయా ప్రాంతంలో డ్రోన్ల సాయంతో తాజా పరిస్థితిని తిలకిస్తూ ఆదేశాలిచ్చే వ్యవస్థ ఏర్పాటుచేశారు.

rtgs 26112017 3

రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్టీజీ) రాష్ట్ర కేంద్రం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ కార్యాలయంలో కూర్చొనే రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించే వెసులుబాటు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 15 వేల సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా పెద్ద ఉత్సవాలు, భారీ ఊరేగింపులు, ఆందోళనలు ఏది జరిగినా అక్కడి ట్రాఫిక్‌ను, పరిస్థితిని ఇక్కడి నుంచి చూసి అంచనా వేసి నియంత్రించేలా ఏర్పాట్లు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత ఎలా ఉందన్న విషయాన్ని అక్కడ ఉన్న సీసీ కెమెరాల సాయంతో ఈ కేంద్రం నుంచి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వొచ్చు.

Link to comment
Share on other sites

మస్యలకు రియల్ చెక్!
27-11-2017 02:16:04
 
636473457629582389.jpg
  • ఆర్‌టీజీ రాష్ట్ర కేంద్రానికి సీఎం శ్రీకారం
  • సామాన్యుడి కష్టాలకు పరిష్కార వేదిక
  • ట్రాకర్‌ పరిధిలో 88 వేల మంది ఉద్యోగులు
  • సమాచార విశ్లేషణతో కీలక నిర్ణయాలు
  • ప్రతిరోజూ ఉన్నతాధికారులతో భేటీ: సీఎం
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సామాన్యుడి సమస్యలను సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమం నూటికి నూరుశాతం ప్రజలకు చేరేలా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా, పాలనను పరిగెత్తించేలా చేసేందుకు దేశంలోనే తొలిసారిగా వినూత్న ఏర్పాటు చేశామన్నారు. సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ రాష్ట్ర కేంద్రాన్ని ఆదివారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పింఛన్ల నుంచి రేషన్‌ వరకు ప్రతిదీ సక్రమంగా ప్రజలకు చేరేలా పర్యవేక్షించేందుకు, పరిశుభ్రత నుంచి పోలవరం వరకు ప్రతి అంశాన్ని సమీక్షించేందుకు అత్యాధునిక ఏర్పాట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
 
ప్రభుత్వంలో జవాబుదారీతనం తెస్తాం
ప్రభుత్వంలో పూర్తి జవాబుదారీతనం తెస్తామని సీఎం స్పష్టం చేశారు. ‘ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనం ఉండాలి. చేయాల్సిన పని అంతా చేయాలి. పని చేయనంటే కుదరదు. ప్రతిరోజు గంటసేపు ఈ కేంద్రంలో ఉన్నతాధికారులతో కూర్చుంటా. అన్ని శాఖల పనితీరు, ప్రజల ఫిర్యాదులు, ఆదాయ-వ్యయాలు, శాంతిభద్రతలు అన్నింటిపైనా రియల్‌టైమ్‌లో వచ్చే సమాచారంపై రియల్‌టైమ్‌లో విశ్లేషిస్తా.’ అని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 20వేల సీసీ కెమెరాలు ఈ కేంద్రంతో అనుసంధానమై ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో కీలకమైన కూడళ్లలో, మండల కేంద్రాల్లో ఎక్కడేం జరుగుతుందో ఇక్కడి నుంచే చెప్పొచ్చన్నారు.
 
‘ఉదాహరణకు ఒక ప్రాంతంలో పెద్ద జన సమూహం ఉంది. ఒక రౌడీ అందులో ఉన్నాడు. అంత పెద్ద గుంపులో అతను ఎక్కడున్నాడో పట్టుకోవడం కష్టం. కానీ ఒక డ్రోన్‌ను పంపి పైనుంచి వీడియో తీస్తూ.. దాన్ని ఆర్‌టీజీ కేంద్రానికి అనుసంధానం చేయెచ్చు. డ్రోన్‌ కెమెరా ద్వారా రౌడీ ఎక్కడున్నాడో గుర్తించి.. అక్కడున్న పోలీసులను ఇక్కడి నుంచే అలర్ట్‌ చేసి అరెస్టు చేయొచ్చు. అదేవిధంగా ఫలానా చోట రోడ్డేశారు. కానీ ఇప్పటికీ గుంతలున్నాయి. ఫలానా చోట పరిశుభ్రత ఎలా ఉందో ఇక్కడినుంచే చూసి చెప్పొచ్చు. సంబంధిత సిబ్బందిని హెచ్చరించవచ్చు.’ అని సీఎం వివరించారు. ఈ ఆర్‌టీజీ రాష్ట్ర కేంద్రం ఏర్పాటుకు ముందు ప్రపంచంలో ఉన్న అత్యాధునిక కేంద్రాలను చూసిరావాలని అధికారులను పంపానని తెలిపారు. ‘అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐలో సాంకేతికత ఉన్నా...అది కేవలం శాంతిభద్రతల పరిస్థితి వరకే. ప్రజా సమస్యల పరిష్కారం, ఉద్యోగుల పనితీరు, విపత్తుల నిర్వహణ ఇవన్నీ సమీకృతం చేసి ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆర్‌టీజీ కేంద్రం ప్రపంచంలో ఇదే. మరోవైపు ఈ కేంద్రంలో ఉన్న వీడియో వాల్‌ ఆసియాలోనే అతి పెద్దది.’ అని సీఎం చెప్పారు.
 
అన్నీ అయిపోతాయని రాసేస్తారు!
‘అన్నీ అయిపోతాయని, ముఖ్యమంత్రి అన్ని సమస్యలు పరిష్కరించేస్తామన్నారని, ఎక్కడా నేరాలు జరగవన్నారని మీడియా రేపు రాసేస్తోంది. ఎక్కడన్నా ఏదన్నా జరిగితే సీఎం చెప్పినా జరిగింది అంటారు. అది సరికాదు. ఒక వ్యవస్థను నిర్మించే దిశలో ఇప్పుడో స్థాయికి వచ్చాం. ’ అని సీఎం వ్యాఖ్యానించారు. నేరాలు కొత్త పద్ధతిలో జరుగుతున్నాయని, వాటిని నియంత్రణకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుండాలని అన్నీ ఒక్క రోజులోనే అయిపోవన్నారు. అమెరికాలోనూ నేరాలు జరుగుతాయి,సమస్యలుంటాయని వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

ఇది సెక్రటేరియటా ? లేక ఐటి హెడ్ ఆఫీసా ? ఆశ్చర్యపోయిన హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌...

 

hcl-28112017-1.jpg
share.png

మంగళవారం అమరావతికి హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌ వచ్చారు... ఉదయం ఐటి మంత్రి లోకేష్ తో సమావేశమైన శివనాడార్‌, సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుని కలుసుకున్నారు. ఈ క్రమంలో కేసరపల్లిలో హెచ్‌సీఎల్‌ ఏం చేయబోతుందన్న దానిపై స్పష్టత ఇచ్చారు. ఏపీఐఐసీకి ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు కేసరపల్లిలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటు కానుందని తెలుస్తోంది. ఎంఓయూ ప్రకారం ప్రాజెక్టును అమలులోకి తీసుకొచ్చిన తర్వాతే పూర్తి గా రిజిస్ర్టేషన్‌ చేస్తారు.

 

hcl 28112017 2

ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ శివనాడార్‌ సమావేశమయ్యారు. రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ కు తీసుకువెళ్ళి, అక్కడ పనితీరును శివనాడార్‌కు మంత్రి లోకేష్‌ వివరించారు. ఈ సందర్భంలో శివనాడార్‌ ఆశ్చర్యపోయారు... ఒక ప్రభుత్వ సచివాలయంలో ఇలాంటి సెంటర్, మన దేశంలో ఉంది అంటే ఆశ్చర్యం వేస్తుంది.... ఇక్కడ వాడే టూల్స్, మా సాఫ్ట్ వేర్ కంపనీలలో కూడా వాడారేమో... రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ లుక్ కూడా చాలా బాగుంది.... ఎదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది... ఇది ఇది సెక్రటేరియటా ? లేక ఏదైనా ఐటి కంపెనీ హెడ్ ఆఫీసా ? అనేలా ఉంది అంటూ, శివనాడార్‌ కితాబు ఇచ్చారు... ఇలాంటి వాటి వల్ల ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలు అందించవచ్చు అన్నారు...

hcl 28112017 3

ఈ సమావేశంలో మంత్రి లోకేష్‌తో శివనాడార్ పలు అంశాలపై చర్చించారు. గన్నవరం దగ్గర కేసరపల్లిలో ఎల్‌అండ్‌టీ హై టెక్‌ సిటీ పక్కన 28.72 ఎకరాలను హెచ్‌సీఎల్‌కు ఇవ్వటానికి అధికారికంగా ఒప్పందం కుదిరింది. ఏపీఐఐసీ అధికారులు, హెచ్‌సీఎల్‌ ప్రతినిధులు సోమవారం సేల్‌ అగ్రిమెంట్‌ రాసుకుని గన్నవరం రిజిస్ర్టేషన్‌ కార్యాలయం లో రిజిస్టర్‌ చేయించారు. ఎకరం రూ.30 లక్షల చొప్పున రూ.8.61 కోట్లకు భూములు అప్పగించేలా ఒప్పందంలో నిబంధనలు పొందుపర్చారు. ఏపీఐఐసీతో కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం హెచ్‌సీఎల్‌ పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. మొత్తం 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామంది.

Edited by sonykongara
Link to comment
Share on other sites

నేటి నుంచి వెలగపూడిలో సచివాలయంలో సరి కొత్త పాలనకు శ్రీకారం...

   
cbn-29112017.jpg
share.png

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త తరహాలో అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టేందుకు సమాయత్తమయ్యారు. ఇందుకు సంబంధించి రంగం సిద్ధమైంది. గతంలో స్వయంగా క్షేత్రస్థాయిలో ఆకస్మి కంగా పర్యటించిన చంద్రబాబు తాజాగా మారిన సాంకేతిక హంగులకు పదును పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టెలి కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ కు భిన్నంగా సెల్ ఫోన్ లతోనే పాలనా యంత్రాంగాన్ని హడలగొట్టనున్నారు. ఈ మేరకు బుధవారం నుంచి నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో కొత్తగా రూపొందించిన రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో రొజూ రెండున్నర గంటలపాటు గడపాలని నిర్ణయించారు.

 

cbn 29112017 1

ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ వాల్ ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా క్షేత్ర స్థాయి సంఘటనలను అంచనా వేయనున్నారు. ఆర్టీజీ కేంద్రంలో ముఖ్యమంత్రి కూర్చుని రాష్ట్రంలోని ఏ అధికారి లేదా సిబ్బంది సెల్ ఫోన్ తో మాట్లాడేందుకు వెసులుబాటు ఏర్పడింది. ఫలితంగా సెల్ ద్వారా వీడియో సౌకర్యం కొత్త టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న డేటాతో కొత్త కార్యకరమానికి శ్రీకారం చుట్టాలని రంగం సిద్దం చేసిన ఆర్టిజి కేంద్రం నుంచి సెల్ ఫోన్ కాల్ వెళ్ళిందంటే సదరు సిబ్బంది ఫొటో దృశ్యాలు కనిపిస్తాయి. పైగా ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నదీ స్పష్టంగా కనిపిస్తుంది. వారితో ముఖ్యమంత్రి నేరుగా సచివాలయంలోని ఆర్టిజి కేంద్రంలో కూర్చుని మాట్లాడే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యూయి.

ఈ కేంద్రం నుంచి ముఖ్యమంత్రి ప్రయోగాత్మకంగా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ తో పాటు ఎంపిటిసి, వైద్య అధికారితో మాట్లాడి ఆశ్చర్యంలో ముంచెత్తారు. నేరుగా ముఖ్యమంత్రి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. దిశానిర్దేశం చేశారు. ఇదే ఒరవడిని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించినట్టు అధికారికంగా ప్రకటించారు. ఫలితంగా ముఖ్యమంత్రి తీరుతో ఎవరికి ఎప్పడు సచివాలయం నుంచి ఫోన్ వెళుతుందోననే గుబులు అధికార వర్గాలలో ప్రారంభమైంది. ఒక చోట తిరుగుతూ మరో చోట ఉన్నామంటూ సదరు సిబ్బంది అబద్దాలు చెప్పేందుకు తాజా టెక్నాలజీలో ఆస్కారం లేకుండా పోయింది.

గతంలో ఆకస్మిక పర్యటనల తరహాలోనే తాజా ప్రణాళిక ఉండటం విశేషం. ఒకవైపు అధికారులతో పాటుప్రజా ప్రతినిధులు, సాధారణ ప్రజలతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఒక వైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు, సామాన్యులతో నిరంతరం మాట్లాడుతూనే, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో సంభవించిన సమస్యకైనా అందుబాటులో ఉన్న డేటా ద్వారా విశ్లేషించి సత్వర పరిష్కారాన్ని సూచించడం జరగనుంది. ఏ ప్రదేశంలో అయితే సంఘటన జరుగుతుందో అక్కడ డ్రోన్లను, కెమెరాలను వినియోగించి పూర్తి స్థాయిలో విశ్లేషించేందుకు ఆర్టిజి కేంద్రంలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది...

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...