Jump to content

ABN : కొత్త యుద్ధానికి సిద్ధమౌతోన్న జనసేనాని ??


KING007

Recommended Posts

కొత్త యుద్ధానికి సిద్ధమౌతోన్న జనసేనాని
24-11-2017 10:22:36
636471157581170751.jpg
 
హైదరాబాద్: హోదా సాధనపై జనసేన దృష్టిపెట్టిందా? స్పెషల్‌ స్టేటస్‌ను అస్త్రంగా మలచుకుని జనంలోకి వెళ్లాలని జనసేనాని భావిస్తున్నారా? దీని కోసం గ్రౌండ్‌వర్క్‌ సిద్ధం చేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. ఇప్పటికే పార్టీ పటిష్టతపై దృష్టిసారించిన జనసేన అధినేత...పాత అస్త్రంతో కొత్త యుద్ధానికి సిద్ధమౌతున్నారు. ప్రత్యేకహోదా సాధనే లక్ష్యంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్తయాత్రకు పవన్‌కళ్యాణ్‌ శ్రీకారం చుట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
 
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి హోదాలేదని స్పష్టం చేసింది. ఈ స్థానంలో ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఇది జరిగి చాలారోజులే అవుతున్నా... పవన్‌కళ్యాణ్‌ తాజాగా హోదా నినాదంతోనే జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హోదాతో పాటు రైల్వేజోన్‌పై కూడా పోరాడనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. విభజన చట్టంలోని హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని పవన్ మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. ఇదే లక్ష్యంతో 2014 ఎన్నికల్లో తెలగుదేశం, బీజేపీకి పవన్ మద్దతు ప్రకటించారు. అప్పటి బీజేపీ ప్రచారకమిటీ చైర్మన్ ..ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీతో కలసి సాధారణ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మోదీ పలుసభల్లో హామీ ఇచ్చారు. తర్వాత మోదీ అధికారంలోకి రావడం... నీతిఆయోగ్‌తో ప్రత్యేక హోదాకు చెక్‌పెట్టడం జరిగిపోయాయి. అప్పటి నుంచి పవన్‌ హోదాపై తన గళం వినిపిస్తూనే వచ్చారు. ఈమేరకు తిరుపతి, కాకినాడ, అనంతపురంలో భారీ సభలను ఏర్పాటు చేసి హోదాపై తన అంతరంగాన్ని వెల్లడించారు. 
 
తర్వాత కొంతకాలం సైలెంటైన పవన్‌ తాజాగా...హోదానే అస్త్రంగా మలచుకోవాలని భావిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఇదే అస్త్రాన్ని ఉపయోగించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే వచ్చే ఏడాది జనవరి నుంచే హోదాపై యుద్ధం ప్రకటించనున్నట్టు తెలిసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని... దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్రం చెబుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా దానినే సమర్థిస్తోంది. హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలే ప్యాకేజీలో ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే-పాత అస్త్రంతో కొత్త యుద్ధానికి సిద్ధమౌతున్న జనసేనానికి ఎలాంటి ఫలితాలు వస్తాయో కాలమే తేల్చాలి...
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...