Jump to content

Kadapa steel plant


sonykongara

Recommended Posts

  • Replies 60
  • Created
  • Last Reply

Top Posters In This Topic

కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ సానుకూల నివేదిక
28-03-2018 14:36:19
 
636578445798409014.jpg
ఢిల్లీ/కడప: కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ సానుకూల నివేదిక ఇచ్చింది. ఈమేరకు నివేదికను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌కు టాస్క్‌ఫోర్స్ అందించింది. అయితే... ఆ నివేదికపై కేంద్రమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో వేచి చూస్తున్నామని, భూమి, విద్యుత్, రవాణా సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని టాస్క్‌ఫోర్స్ సభ్యులతో కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

sankusthapana chestaru for keeping elections in mind and that's when Modi will visit anukunta. Vizag reailway zone kuda announce chestaranukunta...

Point yemtante....elections ayipogane sankusthapana and announcements tho STOP chestaru...meaning Funds ivvaru. THAT'S ALL

Link to comment
Share on other sites

కడప ఉక్కుపై కేంద్రానిదే ఆలస్యం
రెండునెలల క్రితమే అన్నీ చెప్పేశాం
కేంద్రమంత్రి బీరేంద్ర వ్యాఖ్యలపై  ఏపీఎండీసీ స్పష్టీకరణ
ఈనాడు - దిల్లీ
28ap-main16a.jpg

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి రెండు నెలల క్రితమే సంపూర్ణ సమాచారం ఇచ్చేశామని, కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఒక్కటే మిగిలిందని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు వెల్లడించారు. కర్మాగారం ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో వేచి చూస్తున్నట్లు బుధవారం పార్లమెంటు ఆవరణలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ విలేకర్లతో వ్యాఖ్యానించారు. ‘ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ నివేదిక వచ్చింది. రాష్ట్రం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో వేచిచూస్తున్నాం. భూమి, విద్యుత్తు, నీరు, రవాణా సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వంతో మా మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతోంది. కడప సమీపంలో ఉక్కు నిక్షేపాలు తక్కువ ఉన్నా బళ్లారి నుంచి ముడి ఖనిజం తీసుకొనేందుకు అవకాశం ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ నివేదిక చెప్పింది. కర్మాగారం ఏర్పాటుకు రూ.10వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా’ అని మంత్రి తెలిపారు.

నిర్ణయించాల్సింది కేంద్రమే: ఏపీఎండీసీ
దీనిపై ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సీఎండీ వెంకయ్య చౌదరి స్పందించారు. ‘జమ్మలమడుగు వద్ద 3000 ఎకరాల భూమి, కర్మాగారానికి అవసరమైన ఒక టీఎంసీ నీరు, పవర్‌ గ్రిడ్‌ చూపించాం. రైలు అనుసంధానంపై స్పష్టత ఇచ్చాం. హెమటైట్‌- 62గ్రేడ్‌ ఉన్నతశ్రేణి ఇనుప ఖనిజాన్ని అనంతపురం జిల్లా డి.హిరేహాల్‌ మండలంలో చూపించాం. అక్కడ 150 మిలియన్‌ టన్నుల ఖనిజం ఉన్నట్లు అంచనా. భారీ ప్రాజెక్టులకు వచ్చే రాయితీలన్నీ ఇస్తామని హామీ ఇచ్చాం. ఉక్కు ఉత్పత్తిలో 60% ఖర్చు ఇనుప ఖనిజానిదే. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తున్నందున లాభదాయకత సమస్యే ఉత్పన్నం కాదు. జాతీయ ఉక్కు విధానం ప్రకారం 3 మిలియన్‌ టన్నుల కర్మాగారం పెడితేనే లాభదాయకంగా ఉంటుంది. అందుకు    4.6 మిలియన్‌ టన్నుల ముడి ఖనిజం కావాలి. డి.హిరేహాల్‌ మండలంలో చూపిన ముడిసరుకు ఉన్నత శ్రేణిది కాబట్టి పూర్తి అనుకూలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచీ అన్నిరకాల అనుమానాలు నివృత్తి చేసినందువల్ల కర్మాగారాన్ని సొంతంగా పెట్టాలా? పీపీపీ విధానంలో చేపట్టాలా? అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సింది వారే’నని వెంకయ్యచౌదరి స్పష్టంచేశారు.

Link to comment
Share on other sites

  • 5 months later...
  • 1 month later...
  • 2 weeks later...
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రంలో కదలిక
18-10-2018 18:49:49
 
636754854400166770.jpg
ఢిల్లీ: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రంలో కదలిక వచ్చింది. సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఉక్కుశాఖ సమీక్ష నిర్వహించింది. త్వరగా నివేదిక ఇవ్వాలని మెకాన్ సంస్థకు ఆదేశించింది. ఇప్పటికే అధికారులు డ్రాఫ్ట్ రిపోర్ట్‌‌ను ఉక్కుశాఖకు అందించారు. ఏపీ నుంచి రెండు అంశాలపై సమాధానం రావాల్సిఉందని మెకాన్‌ సంస్థ తెలిపింది. ముడి ఇనుప ఖనిజం నిల్వలకు సంబంధించిన సమాచారం.. రాష్ట్రం నుంచి రావాల్సి ఉందని మెకాన్ సంస్థ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ సమాచారం తీసుకోవాలని మెకాన్ సంస్థకు కేంద్ర ఉక్కుశాఖ సూచించింది.
 
 
ఉక్కు ఫ్యాక్టరీని ఏ సంస్థ ఏర్పాటు చేయాలో కూడా మెకాన్ నివేదిక ఆధారంగా టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాభివృద్ధికి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఎంతో కీలకం అని వెల్లడించింది. దీనిపై త్వరితగతిన నిర్ణయం వెలువరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ఉక్కుశాఖ వెల్లడించింది
Link to comment
Share on other sites

డప ఉక్కు’పై కదలిక!
20-10-2018 02:20:42
 
636755988432624717.jpg
  • అక్కడ స్టీల్‌ప్లాంటు ఏర్పాటు అవశ్యం
  • రాయలసీమకు మేలు చేకూరుతుంది
  • త్వరగా టాస్క్‌ఫోర్స్‌కు తుది నివేదిక
  • మెకాన్‌ సంస్థకు కేంద్ర మంత్రి ఆదేశం
  • అధికారులతో బీరేంద్రసింగ్‌ సమీక్ష
  • ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ముందడుగు?
అమరావతి/న్యూఢిల్లీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): నాలుగున్నరేళ్లుగా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంలో తొలిసారి సానుకూల కదలిక కనిపించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దాని ఏర్పాటు దిశగా ముందడుగు వేసిందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకపోవడం వల్ల రాజకీయంగా వచ్చే ముప్పును గ్రహించినట్లు కనబడుతోంది. కొద్దినెలల క్రితం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రమేశ్‌ ఆమరణ దీక్ష చేపట్టడం, కొన్ని రోజుల కింద టీడీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ను కలసి వినతి పత్రం సమర్పించిన అనంతరం కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. వారంలోగా సానుకూల ప్రకటన వెలువడుతుందని వారికి మంత్రి హామీ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో తన శాఖ అధికారులతో, మెకాన్‌ ప్రతినిధులతో సమీక్ష జరిపారు. స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుపై మెకాన్‌ ఇప్పటికే ముసాయిదా నివేదిక సమర్పించిన విషయం చర్చకు వచ్చింది.
 
రాష్ట్రంలో ఎంత ఇనుప ఖనిజం లభ్యత ఉందో.. ఉక్కు ప్లాంటుకు అనువైన గ్రేడ్‌ ముడిఇనుము ఎంత లభిస్తుందో రాష్ట్రప్రభుత్వం సమాచారం ఇవ్వాల్సి ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నియమించిన టాస్క్‌ఫోర్స్‌ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తోందని చెప్పారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇతర సమాచారం కోసం వేచి ఉండకుండా.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అఽథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) సొంతంగా గానీ, ప్రైవేటు రంగంలో గానీ.. రెండింటి భాగస్వామ్యంతో గానీ స్థాపించడం సాధ్యమో కాదో త్వరితగతిన నివేదికను సమర్పించాలని మెకాన్‌ను ఆదేశించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపిస్తే.. రాయలసీమ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. మెకాన్‌ సంస్థ నిరంతం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ మైనింగ్‌ లీజులు, ఇనుప ఖనిజం లభ్యతపై త్వరగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. ఈ సాంకేతిక నివేదికను టాస్క్‌ఫోర్స్‌ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
 
స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎంత పెట్టుబడులు పెట్టాలన్న విషయమై సూచనలు అందిస్తుందన్నారు. కాగా.. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు ఆ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని, కనుక సాధ్యమైనంత మేరకు ఈ ప్రాజెక్టు ఏర్పాటుపై ఒక నిర్ధారణకు రావాలని మంత్రి చర్చల సందర్భంగా అధికారులను ఆదేశించినట్లు ఉక్కు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సాంకేతిక నివేదికను రూపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సెయిల్‌, ఆర్‌ఐఎన్‌ ఎల్‌, ఎన్‌ఎండీసీ, ఎంఎ్‌సటీసీ, మెకాన్‌ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తోంది. మెకాన్‌ ముసాయిదా నివేదికను సమర్పించింది. సాంకేతిక నివేదికను పూర్తి స్థాయిలో సమర్పించేందుకు అవసరమైన సమాచారాన్ని కూడా ఆ సంస్థ సేకరించింది’ అని తెలిపింది. సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించేందుకు అత్యవసరమైన ఇనుప ఖనిజం లభ్యతకు సంబంధించి సమాచారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసి ఉందని పేర్కొంది.
 
ముసాయిదా నివేదికను తొక్కిపెట్టి..
నిజానికి ఇనుప ఖనిజం లభ్యత, ముడిఇనుము వివరాలను రాష్ట్రప్రభుత్వం ఎప్పటికప్పుడు అందజేస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో సభ్యులుగా ఉన్న ఏపీఎండీసీ వైస్‌ చైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌, రాష్ట్ర గనుల కార్యదర్శి మెకాన్‌ సంస్థకు సమాచారం అందిస్తూ వస్తున్నారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో లభ్యమయ్యే ముడి ఇనుము వివరాలను మెకాన్‌కు ఏపీఎండీసీ సవివరంగా అందజేసింది. మెకాన్‌ ప్రతినిధులతో కలసి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించింది. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనువైన భూమిని కూడా చూపించింది. దీని ఆధారంగానే మెకాన్‌ సంస్థ ముసాయిదా నివేదికను కేంద్ర ఉక్కు శాఖకు అందజేసింది. ఈ ముసాయిదా బయటకు రాకుండా కేంద్రం కొంతకాలం తొక్కిపెట్టింది.
 
కడపలో స్థాపించి.. బయ్యారంలో ఏర్పాటు చేయకపోతే తెలంగాణలో రాజకీయంగా ఎదురుదెబ్బ తగులుతుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావించింది. దీంతో.. కడప స్టీల్‌ ప్లాంటు ప్రతిపాదనను ఇంతకాలం కేంద్రం అటకెక్కించింది. తన చేతుల్లో ఏదీ లేదని.. ప్రధాని రాజకీయ నిర్ణయం తీసుకోవాలని బీరేంద్రసింగ్‌ టీడీపీ ఎంపీలతో కూడా చెప్పారు. కేంద్రం స్పందించకుంటే.. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఏపీఎండీసీ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ దిశగా కార్యాచరణ మొదలుకావడంతో.. ఇంతకాలం మెకాన్‌ నివేదిక రాలేదంటూ దాటవేస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు కూడా రాష్ట్రప్రభుత్వం నుంచి సమాచారం రావడం లేదని బుకాయిస్తుండడం గమనార్హం.
Link to comment
Share on other sites

నివేదికను కొలిక్కి తీసుకురండి
మెకాన్‌కు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఆదేశం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై తుది నివేదికను ఓ కొలిక్కి తీసుకురావాలని ప్రభుత్వ రంగ సంస్థ మెటలర్జికల్‌, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ (మెకాన్‌)ను కేంద్రం ఆదేశించింది. ఉక్కు రంగంలో కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఈ నెల 12న కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సమాచారం కోసం ఎదురు చూడకుండా టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి సాంకేతిక నివేదిక ఇవ్వాలని మెకాన్‌ను కేంద్రమంత్రి ఆదేశించారు. మైనింగ్‌ లీజులు, ఇనుప ఖనిజం లభ్యత తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు, ఉమ్మడి భాగస్వామ్యంతో పరిశ్రమ ఏర్పాటుపైనా చర్చించినట్లు మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పరిశ్రమ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ముఖ్యమని, తద్వారా రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి పెరుగుతుందని తెలిపింది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Because of Centre’s inaction, the Andhra Pradesh cabinet cleared the major proposal to set up a steel plant in the state's Kadapa district. The plant will be set up as a govt-owned entity with private participation and a special purpose vehicle called Rayalaseema Steel Corporation will be formed. Rashtriya Ispat Nigam Limited former CMD P. Madhusudhan has been appointed managing director of the SPV. The SPV which will have an initial corpus of ₹.2 crore and the total project cost has been estimated to be ₹.12,000 crore. A.P. Mineral Development Corporation Limited has been mandated to extend financial assistance for it.

https://pbs.twimg.com/media/DrYxbxBU4AAsj-Z.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...