Jump to content

PADMAVATHI REAL STORY


sonykongara

Recommended Posts

పద్మావతి’ యథార్థ గాథ!
23-11-2017 00:45:26
 
636469947277067336.jpg
భన్సాలీ నిర్మించిన ‘పద్మావతి’ చిత్రంలో ఆయన అసలు కథకు ఒక అవాంఛనీయమైన మెలికపెట్టాడని, అది రాజపుత్ర జాతికే అవమానకరమని ఆ చిత్ర వ్యతిరేకుల వాదన. ఆ మెలికతోనే చిత్రం విడుదలకు ఎన్నో చిక్కులు వచ్చాయి. అల్లావుద్దీన్‌ పద్మావతికోసం కాకుండా పద్మావతి అల్లావుద్దీన్‌ పొందు కోసం కలలు కంటున్నదని, తన కలలో అల్లావుద్దీన్‌తో ఆమె సరస సల్లాపాలాడే ఒక సన్నివేశం చిత్రంలో వున్నదని ఆ చిత్ర వ్యతిరేకుల వాదన కాగా, అలాంటి సన్నివేశమే చిత్రంలో లేదని భన్సాలీ ప్రతివాదన!
 
‘పద్మావతి’ చలనచిత్రంపై వచ్చిన వాదోపవాదాలతో ఉత్తరభారత దేశం దద్దరిల్లిపోతున్నది! ఆ చిత్రాన్ని విడుదల చేస్తే, దాన్ని ప్రదర్శించే సినీ థియేటర్లను ధ్వంసం చేస్తామని రాజపుత్రుల కర్నిసేన అనే సంస్థ హెచ్చరిస్తున్నది!
 
ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించింది ప్రఖ్యాత దర్శక –నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ. ఆయన ఇలాంటి చిత్రాలను కొన్నింటిని లోగడ నిర్మించకపోలేదు. అయితే, వాటికి ‘పద్మావతి’ చిత్రానికి చాలా తేడా వున్నది. ‘పద్మావతి’ జగదేక సుందరి. ఆమె రాజస్థాన్‌లోని చిత్తూరు మహారాణి. చిత్తూరు మహారాజాను వివాహమాడింది. అయితే, ఢిల్లీ చక్రవర్తి అల్లావుద్దీన్‌ ఆ అందగత్తె పొందు కోసం ఎంతగానో ప్రయత్నించాడు. కానీ, పొసగలేదు.
 
భన్సాలీ నిర్మించిన ‘పద్మావతి’ చిత్రంలో ఆయన అసలు కథకు ఒక అవాంఛనీయమైన మెలిక పెట్టాడని, అది రాజపుత్ర జాతికే అవమానకరమని ఆ చిత్రవ్యతిరేకుల వాదన. ఆ మెలికతోనే చిత్రం విడుదలకు ఎన్నో చిక్కులు వచ్చాయి. చిత్రాన్ని విడుదల చేస్తే‍, దాన్ని ప్రదర్శించే సినీ థియేటర్లను భస్మీపటలం చేస్తామని రాజపుత్రుల కర్నిసేన హెచ్చరిస్తూ వచ్చింది.
 
ఇంతకూ ఏమిటా మెలిక? అల్లావుద్దీన్‌ పద్మావతి కోసం కాకుండా పద్మావతి అల్లావుద్దీన్‌ పొందుకోసం కలలు కంటున్నదని, తన కలలో అల్లావుద్దీన్‌తో ఆమె సరససల్లాపాలాడే ఒక సన్నివేశం చిత్రంలో వున్నదని ఆ చిత్రవ్యతిరేకుల వాదన కాగా, అలాంటి సన్నివేశమే చిత్రంలో లేదని భన్సాలీ ప్రతివాదన! చివరికి రేపు డిసెంబర్‌ 1వ తేదీన విడుదల కావలసిన ‘పద్మావతి’ విడుదలను భన్సాలీ నిరవధికంగా వాయిదా వేశాడు. అసలు ఆ చిత్రానికి ఇంతవరకు సెన్సార్‌ సర్టిఫికెట్టే రాలేదు! చిత్రం విడుదల కాలేదు కాబట్టి, ఆ చిత్రంలో ఏమున్నదో ఎవరికీ తెలియదు. ‘పద్మావతి’ చిత్రాన్ని భన్సాలీ దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించారు! చిత్రం విడుదల కాకపోతే, విడుదల ఆలస్యమైనా నిర్మాతకు ఎంతో నష్టం. విడుదల అయితే, ఉత్తర భారతం భస్మీపటలమౌతుందని కర్నిసేన హెచ్చరిక! కర్నిసేన ఆరోపిస్తున్నట్టు పద్మావతి కలలో అల్లా వుద్దీన్‌తో సయ్యాటలాడే సన్నివేశం వుంటే, భన్సాలీ పద్మావతి చరిత్రను వక్రీకరించినట్టే!
 
ఇంటర్మీడియెట్‌లో అప్పటిలో మా ఆప్షనల్‌ సబ్జెక్టు బ్రిటిష్‌, భారతీయ చరిత్రలు, తర్కశాస్త్రం. ‘ఇండియన్ హిస్టరీ’లో పద్మావతి చరిత్ర వుంది. ఆమె నిజనామం పద్మావతి కాదు–పద్మిని! ఇంతకు పూర్వమే పేర్కొన్నట్టు, ఆమె అతిలోక సుందరి. అందువల్ల, ఆమె కోసం అల్లావుద్దీన్‌ చేయని ప్రయత్నం లేదు. అతడు 1296–1316 మధ్య ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలించాడు. ధనరాసులు, ఢిల్లీ సింహాసనం, అందగత్తెలు– అతని అహోరాత్రుల ఆలోచన! అంతకు పూర్వం ఢిల్లీ చక్రవర్తి అయిన తన మామ జలాలుద్దీన్‌ను వధించి, ఆ సింహాసనాన్ని అథిష్ఠించాడు!
 
చిన్న చిన్న రాజ్యాలను జయించినప్పుడు ఆ రాణులను తన అంతఃపురానికి కానుకగా తీసుకురావాలని అల్లావుద్దీన్‌ తన సేనానులను ఆదేశించాడు. ఆ విధంగా గుజరాత్‌ రాణి కమాలాదేవిని అల్లావుద్దీన్‌ తన అంతఃపురానికి యుద్ధకానుకగా తీసుకురాగా, ఆమె కుమార్తె దేవల దేవి తప్పించుకు పోయింది. అయితే, అల్లావుద్దీన్‌ వెతికించి, ఆమెను తిరిగి తన అంతఃపురానికి రప్పించాడు. ఆ క్రమంలోనే అతడు ఒకసారి చిత్తూరు మహారాణి పద్మిని కోసం ఆ కోటను ముట్టడించాడు.
 
చాలా కాలం ఆ కోటను ముట్టడించినా, శౌర్య పరాక్రమాలకు పేరెన్నికగన్న రాజపుత్రుల నుంచి కోటను పట్టుకోలేకపోయాడు. ఇక, ముట్టడి వల్ల లాభం లేదని గ్రహించిన అల్లావుద్దీన్‌ కొత్త ఎత్తు వేశాడు. పద్మిని తన సోదరి వంటిదని, ఆమెను ఒక్కసారి కన్నులారా చూడగోరుతున్నానని రాజపుత్రులకు కబురంపాడు. కొన్నిరోజుల పాటు పద్మిని, ఆమె భర్త రత్న సింహుడు ఆలోచించి, పద్మినిని స్వయంగా చూడడం కాక, అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని అల్లావుద్దీన్‌ చూడవచ్చునని సమాధానం పంపారు. అంతవరకు సజావుగానే జరిగిపోయింది. పద్మిని ప్రతిబింబాన్ని అద్దంలో చూసిన అల్లావుద్దీన్‌ ఆమె సౌందర్యానికి మరింతగా, ఆకర్షితుడై ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలన్న పట్టుదల పెంచుకున్నాడు.
 
కాగా, అల్లావుద్దీన్‌ను సాగనంపడానికి వెలికివచ్చిన రత్నసింహుడు తన స్నేహపూర్వక హస్తాన్ని చాచగా, ఇదే అదను అనుకుని, ఖిల్జీ అతడిని బంధించి ఢిల్లీకి తీసుకువెళ్ళాడు. ఈ విషయం తెలియగానే రాజపుత్రుల రాజధాని నుంచి వారి సేనాని బాదల్‌ తానే పద్మిని వేషం ధరించి, కాకలు తీరిన 500 మంది సైనికులకు పద్మిని చెలికత్తెల వేషాలు వేయించి, ముస్లింల సేనలను ఆకస్మిక దాడిలో ఓడించి, రత్నసింహుని బంధ విముక్తుని చేసి, తనతో తీసుకువెళ్ళాడు.
 
ఈ ఆకస్మిక పరాజయంతో కోపోద్రిక్తుడైన అల్లావుద్దీన్‌ తన సైన్యంతో చిత్తూరు కోటను ముట్టడించాడు. ఈసారి ఖిల్జీ సైన్యమే గెలిచింది. కోటలో పద్మిని కోసం అల్లావుద్దీన్‌ వెతకగా, ఆమె అప్పటికే పదివేల మంది అంతఃపురకాంతలతో సహా ఆత్మాహుతి చేసుకున్నది! ఆ కామపిశాచి అల్లావుద్దీన్‌కు కాలిపోతున్న అంతఃపుర స్త్రీల శరీరాలే స్వాగతమిచ్చాయి! ఇదీ– చిత్తూరు మహారాణి పద్మిని యథార్థ చారిత్రక గాథ! ఇంతటి వీరగాథను వక్రీకరిస్తే ఎవరైనా ఎలా సహిస్తారు?
Link to comment
Share on other sites

To play with fire is a constant game for media and movie makers. Some people shall burn. Ade better..

Screeening kosam rajputs aduguthunnappudu , oppukovadaniki enti bongulo prestige.. 

valla kadhani evariki ishtam vachinattu vallu teeskuni navvukovadaniki, pettalsina peru barbarism, sadism, not freedom of expression or creative liberty

Link to comment
Share on other sites

8 hours ago, Nfdbno1 said:

To play with fire is a constant game for media and movie makers. Some people shall burn. Ade better..

Screeening kosam rajputs aduguthunnappudu , oppukovadaniki enti bongulo prestige.. 

valla kadhani evariki ishtam vachinattu vallu teeskuni navvukovadaniki, pettalsina peru barbarism, sadism, not freedom of expression or creative liberty

arnab gadu kuda creative liberty anta mondi vadana.. ishtam lekapothe choodaddu anta... 

 

rajput valor ante comedy aipoyindi okokkadiki... okadu creativity ani, inkodu freedom ani... vallu lekapothe ivala, india ki pakistan ki pedda theda undedi kadu! nijame appudu rendu kalise undevi... appudu dorikedi emo liberty and freedom!

director and actors needs to end this psychotic attitude and share the script and screening with that community and put a fullstop to this debate. inka ranveer gadu slient ga unnadu, deepika ki picha maatalu enduku.. 

 

if they did not hurt anybody's feelings in the movie, good share it with the concerned people and get a welcome signal, what's wrong!

Link to comment
Share on other sites

Mukesh Ambani producer akkada... So Arnab will bow down

"History is the lie commonly agreed upon" - Voltaire

Ntr meedha 3 movies vasthunaayee major part will be fiction only even though it happened in last century

Censor board is the legal authority to take care... Religious fanatics should behave by the law... 

Deepika and Bhansali  did great job by standing for their work

... This movie will hurt both communities, there is no way you can satisfy every one....

Movie is based on a fictional poem... Still it will hurt and lot of drama will happen even post release too... Padmavathi will be remembered for it's controversies 

But movies should be made irrespective of what people feel... 

Link to comment
Share on other sites

Oka sufi saint raasina fuctional poem meeda inta racha?? Ekkadiki potunnam? Appudeppudo davinci movie ki racha chesinattu emi leni dani meda ee soodi enti. How did padmavathi become a goddess ?? Godess ane word ki sanity undi....danini pogodatam anavasaram . Ita just bjp game play , dividing the country

Link to comment
Share on other sites

Guest Urban Legend
14 hours ago, Vinay NTR said:

 How did padmavathi become a goddess ?? Godess ane word ki sanity undi....danini pogodatam anavasaram . Ita just bjp game play , dividing the country

 

grama devathalu stories vinnattu leru meeru

india gurinchi inkoncham telusukovali meeru

Link to comment
Share on other sites

17 hours ago, GOLI SODA said:

Mukesh Ambani producer akkada... So Arnab will bow down

"History is the lie commonly agreed upon" - Voltaire

Ntr meedha 3 movies vasthunaayee major part will be fiction only even though it happened in last century

Censor board is the legal authority to take care... Religious fanatics should behave by the law... 

Deepika and Bhansali  did great job by standing for their work

... This movie will hurt both communities, there is no way you can satisfy every one....

Movie is based on a fictional poem... Still it will hurt and lot of drama will happen even post release too... Padmavathi will be remembered for it's controversies 

But movies should be made irrespective of what people feel... 

Censor board is a selected few, not even elected few. I’d say neither of them would reflect the community we are talking about..

 

Mari kancha iliah meeda mathram edavatam enduku.. adi creative liberty , history is just a glorified story of losers anukovachu ga

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...