Jump to content

AP DGP Issue.


Kiriti

Recommended Posts

 డిజిపి సాంబశివరావుని తప్పించటానికి, రంగంలోకి బీహార్ బ్యాచ్....

    Super User    
    22 November 2017 
    Hits: 531 

సమర్ధవంతమైన ముఖ్యమంత్రికి, సమర్ధవంతమైన అధికారి తోడైతే ? టెక్నాలజీతో పరిపాలన సాగించి, ప్రజలకు మరిన్ని సేవలు అందిచాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి, ప్రభుత్వ ఉద్యోగులు తోడైతే ? ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది ? మనల్ని పాలించే నాయకులు, అధికారులు, మనకోసమే వినూత్న ఆలోచనలతో, మన ముందుకు వస్తుంటే, అంతకంటే మనకు ఏమి కావలి... ఇలాంటి నాయకులు అరుదుగా ఉంటారు, ఇలాంటి అధికారులు, ఇంకా అరుదుగా దొరుకుతారు.... నవ్యాంధ్రకు అలాంటి ఒక సమర్ధవంతమైన అధికారే నండూరి సాంబశివరావు... ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (APS RTC) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా, తనదైన ముద్ర వేస్తూ, ప్రజలకు మరింత దగ్గరవతున్నారు... శేషాచల అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌, ఉత్తరాంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో నక్సలైట్ల బెడద, రాష్ట్రంలో, కొత్త రాజధానిలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలుగకుండా చూడటంలో ఆయన విజయం సాధిస్తున్నారు... ఇలాంటి అధికారిని మన రాష్ట్రం నుంచి తప్పించటానికి, బీహార్ బ్యాచ్ రాగంలోకి దిగింది...

dgp 22112017 2

అయితే సాంబశివరావు గారు ప్రస్తుతం ఇంచార్జి డిజిపిగా ఉన్నారు... పూర్తి స్థాయి డిజిపిగా ఆయన్ను కొనసాగించాలని అని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రెండు సార్లు ఫైల్ తిప్పి పంపింది... ఇవాళ (నవంబర్ 22న) డిజిపి ఎంపిక జరగాల్సి ఉన్నా, అది వాయిదా పడింది... సామాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవర్ని అయితే ప్రతిపాదిస్తుందో, వారని కేంద్రం ఏ అభ్యంతరం లేకుండా ఆమోదిస్తుంది... రాష్ట్ర ప్రభుత్వం ఒక సమర్ధవంతమైన అధికారిని కొనసాగించమంటే, కేంద్రానికి అభ్యంతరం ఏంటి ? ఎవరి ఒత్తిడిలకు లొంగుతున్నారు అనేది ప్రభుత్వం ఆరా తీస్తుంది... దీని వెనుకు బీహార్ లాబీ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి... మరొక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, వైఎస్ జగన్ సలహా దారుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్, ఈ లాబీ చేస్తున్నారు.... సాంబశివరావుని కొనసాగించకుండా, బీహార్ కి చెందిన ఐఏఎస్ ఠాకూర్ ని నియమించాలి అని, ప్రశాంత కిశోరే ఉత్తరాది నాయకులు ద్వారా లాబీ చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి...

dgp 22112017 3

ఇప్పుడు డిజిపి ఎంపిక జరిగితే, రెండేళ్ళ పాటు వారే ఉంటారు... అంటే, 2019 ఎలక్షన్స్ దాకా ఉంటారు... సాంబశివరావు గారు మళ్ళీ డిజిపి అయితే, జగన్ బ్యాచ్ చేసే ఆగడాలు వర్క్ అవ్వవు... డిజిపి సాంబశివరావు అంటే ఏంటో, ఇప్పటికే జగన్ కు తెలుసు... ఆటలు సాగవు అని తెలుసు... అందుకే ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దింపాడు... ప్రశాంత్ కిషోర్ 2014లో మోడీ సలహాదారుడిగా పని చేసాడు కాబట్టి, బీజేపి పెద్దలతో పరిచయాలు బాగా ఉన్నాయి... ఉత్తరాదిన చాలా మంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. అవి ఉపయోగించి, బీహార్ లాబీ ద్వారా, బీహార్ కి చెందిన ఐఏఎస్ ఠాకూర్ ని నియమించాలి అని ప్రశాంత్ కిషోర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు, ప్రభుత్వ వర్గాలు పసి గట్టాయి... ఒక పక్క మిత్ర పక్షంగా ఉంటూ, బీజేపి ఆడుతున్న గేమ్ పసిగట్టే రెండు సార్లు కేంద్రం ఫైల్ తిప్పి పంపినా, రాష్ట్ర ప్రభుత్వం, మా ఫైనల్ లిస్టు ఇదే అంటూ, మళ్ళీ అదే ఫైల్ తిప్పి కేంద్రానికి పంపింది... ఇది ఎక్కడవరకు వెళ్తుందో చూడాలి...

Link to comment
Share on other sites

Aaa YS gaadi time lo Oka Yadav vundevaadu(Name marchipoya). Vaadi son Ashok gajapathi daughter ni cheuskunnadu. Aaadu appatlo mamulu penta pettala manaki and ee Banwarlal gaadu kooda. I think PK team might be trying it again. Eee pushpams, when they lose their ground in this country, they will be battered much worse than congress. 

Link to comment
Share on other sites

44 minutes ago, ravikia said:

Aaa YS gaadi time lo Oka Yadav vundevaadu(Name marchipoya). Vaadi son Ashok gajapathi daughter ni cheuskunnadu. Aaadu appatlo mamulu penta pettala manaki and ee Banwarlal gaadu kooda. I think PK team might be trying it again. Eee pushpams, when they lose their ground in this country, they will be battered much worse than congress. 

SSP Yadav..vadoka panikimalina yedava

Link to comment
Share on other sites

Main issue is central said cant continue sambasivarao as he is retired and appoint someone else itseems, but babu is keen on sambasivarao. incase if it didnt materialize babu is going to other candidate ( i think Gawtham Sawang) i dont remember name but not tagore.

 

I also heard central has only powers to recommend candidates and CM can appoint who ever he likes irrespective on centers decision.

Link to comment
Share on other sites

2 minutes ago, uravis said:

Main issue is central said cant continue sambasivarao as he is retired and appoint someone else itseems, but babu is keen on sambasivarao. incase if it didnt materialize babu is going to other candidate i dont remember name but not tagore.

 

I also heard central has only powers to recommend candidates and CM can appoint who ever he likes irrespective on centers decision.

Mana babu gaariki aayana powers use chesi nachonodini appoint chesukotaniki kooda aa pushpaalu emanukuntaaro ani bhayam ufff

Link to comment
Share on other sites

1 minute ago, ravikia said:

Mana babu gaariki aayana powers use chesi nachonodini appoint chesukotaniki kooda aa pushpaalu emanukuntaaro ani bhayam ufff

Ha sambasiva rao almost confirm ee but against the rules ithe matram gawtham sawang ni select chestaru anta babu garu. Heard he is also very strict.

Link to comment
Share on other sites

ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా సాంబశివరావు
24-11-2017 17:23:53
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న నండూరి సాంబశివరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్‌చార్జ్‌ డీజీపీగా ఉన్న సాంబశివరావు మరో నెల రోజుల్లో రిటైర్ అవనున్నారు. అయితే ఇన్‌చార్జ్‌ డీజీపీగా రిటైర్ అవడం సమంజసం కాదని భావించిన ప్రభుత్వం.. ఆయనకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇదిలాఉండగా.. ఆయన పదవీ కాలాన్ని కూడా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

డీజీపీ నియామకం విషయంలో చంద్రబాబు దూకుడు... కేంద్రాన్ని ఎదిరించి మరీ డెసిషన్...

    Super User    
    24 November 2017 
    Hits: 275 

ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న నండూరి సాంబశివరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండు నెలల నుంచి కేంద్రాన్ని కోరుతూ వస్తుంది... కేంద్రం మాత్రం సాంకేతిక కారణాలు చూపించి, ఫైల్ తిప్పి పంపింది... అయినా చంద్రబాబు, మళ్ళీ అవే పేర్లు కేంద్రానికి పంపించారు, రెండో సారి కూడా కేంద్రం తిప్పి పంపింది... దీంతో చంద్రబాబు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు... మా రాష్ట్రంలో అధికారిని నియమించటానికి కూడా ఇంత రాద్దాంతం చెయ్యలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేంద్రానికి లేఖ రాశారు... అయినా సరే, ఈ నెల 22న డిజిపి ఎంపిక కోసం జరగాల్సిన కమిటీ సమావేశం కూడా కేంద్రం వాయిదా వేసింది...

Link to comment
Share on other sites

41 minutes ago, sonykongara said:

డీజీపీ నియామకం విషయంలో చంద్రబాబు దూకుడు... కేంద్రాన్ని ఎదిరించి మరీ డెసిషన్...

    Super User    
    24 November 2017 
    Hits: 275 

ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న నండూరి సాంబశివరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండు నెలల నుంచి కేంద్రాన్ని కోరుతూ వస్తుంది... కేంద్రం మాత్రం సాంకేతిక కారణాలు చూపించి, ఫైల్ తిప్పి పంపింది... అయినా చంద్రబాబు, మళ్ళీ అవే పేర్లు కేంద్రానికి పంపించారు, రెండో సారి కూడా కేంద్రం తిప్పి పంపింది... దీంతో చంద్రబాబు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు... మా రాష్ట్రంలో అధికారిని నియమించటానికి కూడా ఇంత రాద్దాంతం చెయ్యలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేంద్రానికి లేఖ రాశారు... అయినా సరే, ఈ నెల 22న డిజిపి ఎంపిక కోసం జరగాల్సిన కమిటీ సమావేశం కూడా కేంద్రం వాయిదా వేసింది...

Elections time daggara pade kodhi inka cheap ga behave chestharu. Need to wait and see

Link to comment
Share on other sites

8 hours ago, ravikia said:

Mana babu gaariki aayana powers use chesi nachonodini appoint chesukotaniki kooda aa pushpaalu emanukuntaaro ani bhayam ufff

Antha scene ledu le brother ... CBN NTR ke eduru thiriginavadu ... ee moodi/booodi entha ... 

Everytime I see a post questioning CBN's ability to act ... 

I only remember one thing ... despite what happened the past 10-15 years ... there is one reason TDP is in power ...

and that reason is CBN ... I never lose track of that fact ... 

Link to comment
Share on other sites

  • ప్యానల్‌ నియామకానికి బ్రేక్‌.
  • రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

రెగ్యులర్‌ డీజీపీగా నండూరి .

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ నియామకం విషయంలో ఏర్పడిన వివాదాన్ని ముగిస్తూ... ప్రస్తుతం ఇన్‌చార్జి డీజీపీగా ఉన్న నండూరి సాంబశివరావును రెగ్యులర్‌ డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్‌ డీజీపీని నియమించాలంటే యూపీఎస్సీ సెలక్షన్‌ కమిటీ ద్వారా నియామకం జరగాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాపై కేంద్ర హోంశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయగా... రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రహోంశాఖ కలిసి ఓ నిర్ణయానికి వస్తేనే సెలక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహించగలమని యూపీఎస్సీ కూడా చేతులెత్తేసింది.
 
 
దీంతో ఈ నెల 22న జరగాల్సిన భేటీ వారుదా పడింది. సెలక్షన్‌ కమిటీ ద్వారా రెగ్యులర్‌ డీజీపీ నియామకం ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. సాంబశివరావు డిసెంబరు 31న రిటైర్‌ కావాల్సి ఉంది. ఇన్‌చార్జిగా ఉంటూ రిటైర్‌ అయ్యే బదులు రెగ్యులర్‌ డీజీపీగానే రిటైర్‌మెంట్‌ ఇవ్వడం గౌరవప్రదంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇన్‌చార్జికి, రెగ్యులర్‌ డీజీపీకి అధికార విధుల నిర్వహణలో స్వల్ప తేడాలు కూడా ఉంటాయి.
 
 
దీంతో సాంబశివరావును పోలీస్‌ బాస్‌(హెచ్‌వోపీఎఫ్ )గా నియమించారు. యూపీఎస్సీ ద్వారా నియమితులైన డీజీపీలకు కనీసం రెండేళ్ల సర్వీసు ఉంటుంది. కానీ సాంబశివరావు యూపీఎస్సీ కమిటీ ద్వారా నియామకం కాకపోవడంతో రెగ్యులర్‌ సర్వీస్‌ నిబంధనల ప్రకారం డిసెంబరు 31నే రిటైర్‌ కావాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఏపీ స్టేట్‌ పోలీస్‌ యాక్టు సవరణల ప్రకారం డీజీపీ నియామకం యూపీఎస్సీ ప్యానల్‌ ద్వారానే జరగాలి. అయితే ఆ అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుంది.
Link to comment
Share on other sites

పూర్తిస్థాయి డీజీపీగా సాంబశివరావు.
సమన్వయ విభాగం నుంచి పోలీసు దళాల అధిపతిగా బదిలీ.
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

 

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పూర్తిస్థాయి డీజీపీగా నండూరి సాంబశివరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సమన్వయ విభాగం డీజీపీ పోస్టులో కొనసాగుతున్న ఆయనను డీజీపీ (పోలీసు దళాల అధిపతి)గా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 జులై 23న ప్రభుత్వం సాంబశివరావును ఇన్‌ఛార్జీ డీజీపీగా నియమించింది. అప్పటినుంచి ఆయన ఆ హోదాలోనే పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిసెంబరు నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన్నే పూర్తిస్థాయి డీజీపీగా నియమించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక ప్రక్రియ నిర్వహణ కోసం ఏడుగురు అధికారుల పేర్లతో కేంద్రానికి జాబితా పంపించడం, వారు దాన్ని తిరస్కరించి కొత్తది పంపించమన్న సంగతి విదితమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జాబితాపైన ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ నెల 22న జరగాల్సిన ఎంపిక కమిటీ సమావేశం కూడా వాయిదా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకూ ఇన్‌ఛార్జీ డీజీపీగా ఉన్న సాంబశివరావును పూర్తిస్థాయి డీజీపీగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...