Jump to content

బాలయ్యకి హ్యాట్సాఫ్: ఉదయభాను.


Kiriti

Recommended Posts

బాలయ్యకి హ్యాట్సాఫ్: ఉదయభాను.
 
 
బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఓ డ్యాన్స్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఉదయభాను, తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని విషయాలను ఈ షోలో షేర్ చేసుకుంది. బాలకృష్ణ నటించిన చిత్రంలోని పాటపై స్పెషల్‌గా జరిగిన డ్యాన్స్ అనంతరం ఆమె, బాలకృష్ణ గొప్పతనం గురించి చెబుతూ కంటతడి పెట్టుకుంది. ఇండస్ట్రీలో బాలయ్య బాబులాంటి వ్యక్తులు అసలు లేనే లేరని ఈ సందర్భంగా తెలియజేసింది.
 
ఇక విషయంలోకి వస్తే.. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను.. వెండితెర, బుల్లితెరలపై చాలా కాలం కనిపించలేదు. తాజాగా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తన కవల పిల్లల పుట్టినరోజు కార్యక్రమాన్ని గ్రాండ్‌గా చేయాలని ప్లాన్ చేసుకుని అందరికి ఫోన్‌లు చేస్తే, కొంతమంది అసలు ఫోన్లే రిసీవ్ చేయలేదంట. ఇక బాలయ్య బాబుకి తన కుమార్తెల పుట్టినరోజు వేడుకకు రావాల్సిందిగా చిన్న మెసేజ్ పెట్టిందట. ఆ మెసేజ్ పెట్టిన 15 నిమిషాలకు బాలయ్య నుండి ఫోన్ రావడంతో ఆశ్చర్యపోయిందట ఉదయభాను.
 
బర్త్‌డే మరుసటి రోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అయినా కూడా ఈ వేడుకకి వస్తాను. వేడుక అనంతరం నైట్ జర్నీ చేస్తాను అని చెప్పి, కరెక్ట్‌గా చెప్పిన టైమ్‌కి ఈ వేడుకకి బాలయ్య వచ్చారంట. అందరూ సెలబ్రిటీలలాగా వచ్చి ముఖం చూపించి వెళ్లకుండా సుమారు 45 నిమిషాలు ఈ వేడుక కోసం కేటాయించి, చాలా ఓపికగా అందరితో ఫొటోలు దిగి, వెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్లిన బాలయ్య బాబు గురించి చెబుతూ ఉదయభాను స్టేజ్‌పై కంటతడి పెట్టుకుంది. అనంతరం హ్యాట్సాఫ్ బాలయ్య హ్యాట్సాఫ్ అంటూ జేజేలు కొట్టింది ఉదయభాను.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...