Jump to content

Kadapa Airport


APDevFreak

Recommended Posts

చెన్నైకి ఎగిరిన విమానం 
ఇకపై నిత్యం ఆకాశయాణం 
తొలిరోజు 68 మంది ప్రయాణం 
kdp-brk1a.jpg

కడప క్రీడలు, న్యూస్‌టుడే: కడప నుంచి చెన్నైకి వెళ్లే ట్రూజెట్‌ విమానం మొదటిసారిగా గాల్లోకి ఎగిరింది. శుక్రవారం కడప విమానాశ్రయం డైరెక్టర్‌ పి.శివప్రసాద్‌రెడ్డి విమాన ప్రయాణికులకు టిక్కెట్లు అందజేశారు. విమాన సామర్థ్యం 72 మంది ప్రయాణికులు కాగా 68 మంది ప్రయాణికులు తొలిరోజు చెన్నైకి టికెట్‌ బుక్‌ చేసుకున్నారని తెలిపారు. ట్రూజెట్‌ విమానం ఏపీ మార్కెటింగ్‌ విభాగపు అధికారి శశికాంత్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం చెన్నైకు నడిచే ట్రూజెట్‌ విమానం మైసూరు వరకు వెళుతుందని తెలిపారు. మైసూరు నుంచి చెన్నైకు అక్కడి నుంచి కడప వస్తుందన్నారు. కడప ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. త్వరలోనే విజయవాడకు కూడా విమానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్పీఎఫ్‌ ఇన్‌ఛార్జి అశోక్‌రెడ్డి, విమానాశ్రయం టెర్మినల్‌ మేనేజరు కేపీ.ప్రకాశన్‌, కడప ట్రూజెటü మేనేజరు భవ్యన్‌కుమార్‌ తదితరులు పాల్నొన్నారు.

సగం రోజు కాదు గంటలో చెన్నైకి 
- ముత్తు సులోచన, భాకరాపేట 
మాది సిద్దవటం మండలం భాకరాపేట. మొదటిసారిగా చెన్నైకి విమానంలో ప్రయాణిస్తున్నాను. మా సొంతూరు చెన్నై. అంతకు ముందు చెన్నైకు వెళ్లాలంటే అర్ద రోజంతా ప్రయాణం చేయాల్సి వచ్చేది. పిల్లలతో ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఒక గంటలో చెన్నైకి విమానంలో ప్రయాణించవచ్చు.

రవాణా ఇబ్బందిగా ఉంది 
- పుష్ప, కడప 
మాది భాకరాపేట. కడప నుంచి విమానాశ్రయానికి రావాలంటే ఇబ్బందిగా ఉంది. కడప టౌన్‌ నుంచి ఆటోలుగాని, సిటీ బస్సులుగాని విమానాశ్రయానికి లేవు. అధికారులు గమనించి టౌన్‌ బస్సులు నడిపితే బాగుంటుంది. విమానయాణం ఎలాగున్నా కడప నుంచి విమానాశ్రయం రావడానికి ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది.

విజయవాడకు నడపాలి 
- విశ్వనాథ్‌ 
మాది చెన్నై. నేను వ్యాపారం నిమిత్తం నెలలో 15 సార్లు ముఖ్య నగరాలకు తిరుగుతుంటాను. ముఖ్యంగా విజయవాడకు విమానాన్ని నడిపితే బాగుంటుంది. ఇప్పటి వరకు నేను 400 సార్లు పైగానే విమానంలో ప్రయాణించాను. కడప నుంచి విజయవాడ, బెంగళూరుకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడికి నడిపితే బాగుంటుంది.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 1 month later...
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...
  • 4 weeks later...
  • 3 weeks later...
విచ్చుకున్న రెక్కలు.. ప్రగతి పరుగులు!
కడప  విమానాశ్రయం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
రూ.62  కోట్ల వ్యయంతో  శరవేగంగా   సాగుతున్న రన్‌వే   విస్తరణ
ఐదు నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ.. ‘నైట్‌ ల్యాండింగ్‌’కు సన్నద్ధం
డీజీసీఏ  ఆమోదం  అనంతరం అమలు.. ‘బోయింగ్‌’కూ అవకాశం
ఆప్రాన్ల  ఏర్పాటుకు టెండర్లు..  త్వరలోనే ప్రారంభం కానున్న పనులు
మారుతున్న ఎయిర్‌పోర్టు రూపురేఖలపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం
రూ.కోటి వ్యయంతో రెండో రహదారి..   సుందరీకరణపై కసరత్తు
kdp-top1a.jpg

రెక్కలు విచ్చుకుంటున్నాయి.. ప్రగతి పరుగులు కనిపిస్తున్నాయి.. ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరంగా, నిర్లక్ష్యానికి దగ్గరగా కొనసాగిన కడప విమానాశ్రయంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.. ఒక్కొక్కటిగా అదనపు హంగులు చేకూరుతుండటం, నిధుల విడుదల్లోనూ సానుకూలత నెలకొనడంతో దశాబ్దాల సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. రన్‌వే విస్తరణ నుంచి నైట్‌ల్యాండింగ్‌ వరకు ఆప్రాన్ల ఏర్పాటు నుంచి అదనపు రహదారులను ఏర్పాటు చేయడం వరకు అనేక రీతుల్లో పనులు ఊపందుకొన్నాయి.

ఈనాడు- కడప : కడప విమానాశ్రయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఏళ్ల తరబడి ఎలాంటి రాకపోకలు లేకపోవడంతో కేవలం బీడు భూములు, శిథిల భవనాలతో అధ్వానంగా దర్శనమిచ్చేది. వైఎస్‌ ముఖ్యమంత్రిగా అధికారపగ్గాలు చేపట్టాక ప్రత్యేక నిధులతో వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేసినా పూర్తిస్థాయి ఫలితాలు రాలేదు. అనంతరం కొలువుదీరిన ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధిని పట్టించుకోలేదు. కాగితాలకే ప్రణాళికలు పరిమితమయ్యాయి. తెదేపా అధికారంలోకి వచ్చాక తిరిగి కడప విమానాశ్రయం అభివృద్ధికి అడుగులు పడ్డాయి. అసంపూర్తి పనులు పూర్తిచేసి విమానాల రాకపోకలు ప్రారంభించారు. తొలుత 2-3 సర్వీసులు  నడిచినా అనంతరం నిలిచిపోయాయి. ప్రయాణికులు తక్కువై నిర్వహణకు సరిపడా నిధులకూ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఉడాన్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అందులో కడప విమానాశ్రయానికి చోటుకల్పించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అవకాశం దక్కించుకోగా.. అప్పటి నుంచి కడప విమానాశ్రయం దశ తిరిగింది. వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ ప్రభుత్వమే భరిస్తుండటంతో విమాన సర్వీసులు నడిపేందుకు విమాన సంస్థలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం ట్రూజెట్‌ ఆధ్వర్యంలో చెన్నై, హైదరాబాద్‌, అమరావతికి సర్వీసులు నడుపుతున్నారు. త్వరలోనే మరికొందరు సర్వీసులు నడిపేందుకు ముందుకొస్తున్నారు.  లక్ష మంది ప్రయాణికులతో గతేడాది రికార్డు సృష్టించిన విమానాశ్రయ వర్గాలు.. ఈసారి రెట్టింపు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దూసుకెళ్తోంది. ప్రస్తుతం విమానాశ్రయంలో అభివృద్ధి పనులు ముమ్మరం అయ్యాయి.

పెరుగుతున్న బలం
కడప విమానాశ్రయానికి 1619 మీటర్ల రన్‌వే ఉంది. పెరుగుతున్న అవసరాలు, ప్రయాణికుల మేరకు చూస్తే.. భవిష్యత్తు అవసరాలకు ఇది చాలదు. ఈ క్రమంలోనే పౌరవిమానయాన శాఖ  రన్‌వేను 2500 మీటర్లకు విస్తరించాలని ప్రతిపాదించి సుమారు రూ.62 కోట్లను ఇందుకోసం కేటాయించింది. ప్రస్తుతం ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 40 శాతం పైబడి పూర్తయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా రన్‌వే విస్తరణ ప్రక్రియ పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రాత్రిపూట విమానాలు ఇక్కడ ల్యాండ్‌ అయ్యేందుకు వీలుగా (నైట్‌ ల్యాండింగ్‌) కోసమూ కసరత్తు జరుగుతోంది. రన్‌వే విస్తరణ పూర్తయిన అనంతరం నైట్‌ల్యాండింగ్‌కూ అవకాశం ఏర్పడుతుంది. ఈ రెండు కార్యక్రమాలకు రూ.89 కోట్ల మేర వ్యయం చేస్తుండగా.. అనుకున్న మేరకు పనులు పూర్తయితే డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) పరిశీలిస్తుంది. నిబంధనల మేరకు పనులు పూర్తిచేసినట్లు ధ్రువీకరించి, అనుమతిస్తే నైట్‌ల్యాండింగ్‌కు అవకాశం ఉంటుంది. పెద్ద బోయింగ్‌ విమానాన్నీ దింపవచ్చు.

అదనపు హంగులు
కేవలం రన్‌వే విస్తరణ, నైట్‌ల్యాండింగ్‌ ఏర్పాట్ల పరంగానే కాదు.. పార్కింగ్‌పైనా దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం కడప విమానాశ్రయంలో కేవలం ఒక్క విమానాన్ని నిలుపుకోవడానికి మాత్రమే వెసులుబాటు ఉంది. వీవీఐపీ పర్యటనలు ఉన్నప్పుడు.. రెగ్యులర్‌గా వచ్చే విమానాలను నిలపడానికి ఇబ్బంది వస్తోంది. ఆ క్రమంలో తప్పనిసరై వాటిని తిరిగి వేరే విమానాశ్రయాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో 4 ఆప్రాన్లు కొత్తగా నిర్మించేందుకు పచ్చజెండా ఊపారు. ఈ పనులు పూర్తయితే ఒకేసారి నాలుగు విమానాలను నిలుపుకోవచ్చు. దీనికి సంబంధించి టెండర్లు పిలవగా.. ఫైనల్‌ అయ్యాక పనులు ప్రారంభమవుతాయి.

సుందరీకరణ ప్రయత్నం
కడప విమానాశ్రయానికి ప్రత్యేక హంగులు, సొబగులను సమకూర్చేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రధానంగా సుందర విమానాశ్రయం కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్‌ హరికిరణ ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ప్రస్తుతం కడప-కమలాపురం మార్గంలో ప్రధాన రహదారిపై ఉన్న విమానాశ్రయం గేటు నుంచి విమానాశ్రయం పరిపాలనా, టెర్మినల్‌ భవనాల వరకు రెండు వరుసల రోడ్డు నిర్మాణానికి పూనుకొన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అదనంగా మరో రోడ్డు ఏర్పాటు చేసి మధ్యలో మీడియన్‌ (ఉద్యాన విభాజకం) నిర్మించనున్నారు. రూ.కోటి వ్యయం చేస్తున్నారు. ఇదే రోడ్డుపై లోపల మరో గేటు ఏర్పాటవుతోంది. రోడ్డుకు ఇరువైపులా పాదచారుల మార్గాలను నిర్మించగా.. రెండు రోడ్లకు మధ్యలో వివిధ రకాల పూలమొక్కలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతుండగా.. ఉపాధిహామీ పథకం కింద రూ.50 లక్షల విలువైన నీటినిల్వ, పచ్చదనం పెంపు పనులకు డ్వామా వర్గాలు ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. సౌరవిద్యుత్తు ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటుకూ ఇప్పటికే పచ్చజెండా ఊగిన క్రమంలో ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మొత్తంగా భవిష్యత్తు భవ్యంగా మారనుంది.

పనులు జరుగుతున్నాయి
- పూసర్ల శివప్రసాద్‌, డైరెక్టర్‌, కడప ఎయిర్‌పోర్టు
కడప విమానాశ్రయంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. రన్‌వే విస్తరణ పనులు మొదలయ్యాయి. మార్చి నాటికి పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ప్రధాన రహదారి నుంచీ విమానాశ్రయం వరకు రహదారి విస్తరణ మొదలుపెట్టాం. చాలా వరకు అవి పూర్తయ్యాయి. ఇరువైపులా మొక్కల పెంపకం జరుగుతోంది. సుందర విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- హరికిరణ్‌, కలెక్టర్‌,   కడప ఏరోడ్రామ్‌ కమిటీ ఛైర్మన్‌
కడప విమానాశ్రయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అభివృద్ధి పనులు ఆరంభమయ్యాయి. ప్రస్తుతం సుందరీకరణపైనా దృష్టి పెట్టాం. విరివిగా మొక్కలు పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం. ఉపాధిహామీ పథకంలోనూ నీటినిల్వ పనులు చేపడుతున్నాం.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...