Jump to content

AP ki HONDA?


sonykongara

Recommended Posts

రాష్ట్రానికి హోండా? 
తయారీ యూనిట్‌పై ఆసక్తి 
పరిశీలనలో చిత్తూరు, అనంత, కర్నూలు 
ఈనాడు - అమరావతి 
15ap-main5a.jpg

అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ‘హోండా’ మోటార్‌ సైకిళ్లు మన రాష్ట్రం నుంచే తయారయ్యే అవకాశాలున్నాయి. జపాన్‌కు చెందిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రస్తుతం జపాన్‌లో ఉండటంతో ఆయన తిరిగి రాగానే చర్చలు జరపనున్నారు. కర్నాటకలోని యూనిట్‌లో రోజుకు 6,600 మోటార్‌ సైకిళ్లను తయారు చేస్తోంది. ఆంధ్రాలో అంతకంటే పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ఆ సంస్థ యోచనగా ఉంది. ఇక్కడ పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలు అనుకూలమైనవిగా భావిస్తున్నారు. కావాల్సిన భూమి ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నందున హోండా ప్రాజెక్టుపై వివరాలను అధికారులు బయటకు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. 
నేడు టయోటాతో ఎంఓయూ: జపాన్‌కు చెందిన టయోటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక అవగాహన, భాగస్వామ్యం కోసం గురువారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. సచివాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ పాల్గొంటున్నారు. ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విద్యుత్తు కార్లను బహుకరించనుంది. దాంతో పాటు మౌలికంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏయే అంశాల్లో కలిసి పనిచేయాలనే దానిపైన కూడా చర్చించి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...