Jump to content

టీడీపీకి మోహన్ గుడ్‌బై బీజేపీ వైపు అడుగులు


koushik_k

Recommended Posts

ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌బాబు తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం కూడా సిద్ధమైంది. మంగళవారం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ కేంద్ర నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటు పురందేశ్వరితో భేటీ అయి చర్చలు కూడా జరిపారు. తదనంతరం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇటీవల సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌ పదవికి మోహన్‌ రాజీనామా చేసిన విషయం విదితమే. ఆ సందర్భంగా అధికార పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన మనస్తాపానికి గురయ్యారు.
 
టీడీపీలోని ఒక కీలక నాయకుడి మద్దతుతోనే డైరెక్టర్‌లు తనపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారన్న భావనలో మోహన్‌ ఉన్నారు. అంతకు ముందు తనకు మద్ద తుగా నిలిచిన డైరెక్టర్‌లు నెల వ్యవధిలోనే వ్యతిరేకంగా మారడానికి అదే బలమైన కారణంగా భావించిన మోహన్‌ తదనంతరం కూడా పరిస్థితులు చక్కదిద్దేందుకు టీడీపీ నాయకత్వం సరైన పంథాలో వ్యవహరించలేదన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ పరిస్థితిని చక్కదిద్దేందుకు ముందుకు వచ్చినప్పటికీ కొందరు నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిం చడం, తమ పరిధిలోని డైరెక్టర్‌లను అదుపాజ్ఞల్లో ఉంచకపోవడం వలన ఎదురైన సమస్యను గుర్తించే తాను రాజీనామా చేశానని మోహన్‌ అప్పుడే పలువురి వద్ద వ్యాఖ్యానించారు.
 
 
రాజీనామా అనంతరం కూడా పార్టీ వైపు నుంచి ఏమాత్రం స్పందన కూడా లేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవితవ్యంపై తర్జనభర్జన పడిన మోహన్‌ బీజేపీ వైపు అ డుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. పూర్వ కాలం నుంచి మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో ఉన్న అవినాభావ సంబంధాలు కూడా అందుకు తోడ్పడినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మోహన్‌ చైర్మన్‌ అయ్యేందుకు దోహదపడిన ఇద్దరు ముఖ్యుల్లో దగ్గుబాటి కూడా ఒకరు. అప్పట్లో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా మోహన్‌ రంగంలో నిలవగా, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి వద్దకు మోహన్‌ను తీసుకెళ్లి పరి స్థితిని చక్కదిద్దడంలో దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషించారు.
 
ప్రస్తుతం మోహన్‌ రాజీనామా అనంతరం దగ్గుబాటితో పాటు మరికొందరు సీనియర్‌ నాయకులు ఆయనకు ఫోన్‌ చేసి పరిస్థితిని తెలుసుకొన్నట్లు సమాచారం. అలా ఇటీవల కాలంలోనే ఒకటికి రెండు, మూడు పర్యాయాలు డాక్టర్‌ దగ్గుబా టితో మోహన్‌ భేటీ అయినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పురందేశ్వరిని కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో విజయవాడలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు సమక్షంలో మోహన్‌ బీజేపీలో చేరవచ్చని తెలుస్తోంది.
 
 
విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే మోహన్‌ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జిల్లా కార్యదర్శిగానూ పని చేశారు. 1994లో ఈదర హరిబాబు గెలుపులో కీలక పాత్ర పోషించిన మోహన్‌ ఆ తర్వాత టీడీపీకి దూరమై కాంగ్రెస్‌లో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలినేనికి మద్దతుగా పని చేశారు.
 
2013లో కాంగ్రెస్‌ నుంచి సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌ అయిన మోహన్‌ 2014 సాధారణ ఎన్నికల్లో ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌కు మద్దతుగా నిలిచి ఆయన గెలుపునకు కృషి చేశారు. ఆ తర్వాత చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో కలిసి టీడీపీలో చేరారు. నాగులుప్పలపాడు మండలంలోన అమ్మనబ్రోలుకు చెందిన మోహన్‌ను ఒంగోలులో అనుచర గణం, స్నేహితులు అపారంగా ఉన్నారు. 2013లో అమ్మనబ్రోలు సొసైటీకి జరిగిన ప్రతిష్ఠాత్మక పోటీలో ఘన విజయం సాధించారు. అనంతరం సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌ అయి ఇటీవల పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...