Jump to content

Nimmakayala mass


NatuGadu

Recommended Posts

 ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు చినరాజప్ప, నారా లోకేష్ దూసుకుపోతున్నారు. చిన రాజప్ప తన దగ్గరకు వచ్చిన ఫైలును నాలుగు గంటల్లోనే పరిష్కరిస్తుండగా, లోకేష్ ఆరు గంటల్లోనే క్లియర్ చేసేస్తున్నారు. వివిధ శాఖల అధిపతులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫైళ్ల క్లియరెన్స్, ఈ-ఫైళ్ల విధానాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనతో సహా మంత్రుల ఫైళ్ల పరిష్కారం ఎలా ఉందన్నదానిపై చర్చించారు.
 
గంటా శ్రీనివాసరావు ఒక ఫైలు పరిష్కారానికి 66 రోజుల మూడు గంటలు తీసుకుంటున్నారు. మనిషి కనిపించరు. సమావేశాలకు రారు. ఫైళ్లు పెండింగ్‌లో పెట్టుకుంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి నారాయణ 21 రోజుల 10 గంటల్లో పరిష్కరిస్తున్నారని, యనమల 6 రోజుల 8 గంటల్లో పరిష్కరిస్తున్నారని, అఖిలప్రియకు 35 రోజుల 10 గంటలు పడుతోందని, అఖిలమ్మ ఎమైందంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ కూడా ఫైళ్ల పరిష్కారంలో ఆలస్యంగా ఉన్నారని అన్నారు. పలువురు మంత్రులు వివిధ స్థాయిలోని ఫైళ్ల పరిష్కార సమయాన్ని ముఖ్యమంత్రి చదివి వినిపించారు. ఫైళ్లు పెండింగ్‌లో పెట్టడం అవినీతికి ఆష్కారం ఇచ్చినట్టేనని హెచ్చరించారు. ఇకపై పారదర్శకమైన వ్యవస్థను అమలు చేస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ రెండు నెలల్లో పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...