Jump to content

AP AGRITECH HACKATHON SUMMIT 2017

sonykongara

Recommended Posts

విశాఖపట్నం: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కొద్దిసేపటి క్రితం విశాఖ నగరానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ‘ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ సాంకేతిక శిఖరాగ్ర సదస్సు-2017’ ముగింపు సభలో ఆయన పాల్గొని కీలకోపన్యాసం చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానున్నట్లు సమాచారం. బిల్‌గేట్స్‌ పర్యటన సందర్భంగా దాదాపు 2500 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Link to comment
Share on other sites

People told me 20 years back that there was a PERSON WHO BELIVED IN 'TECHNOLOGY FOR PEOPLE'  MORE THAN YOU DO.It was hard to believe. But when we met , he was ready with his digital equipment and thoughts for technology to be used in government. I was excited : Bill Gates

Link to comment
Share on other sites

విశాఖ: ఏపీ అగ్రిటెక్‌ సదస్సులో పాల్గొనేందుకు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ బృందం విశాఖకు చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అగ్రిటెక్‌ ప్రాంగణానికి సీఎం వారిని తీసుకొచ్చారు. బిల్‌గేట్స్‌ తొలిసారిగా విశాఖ నగరానికి రావడంతో ఆయనను చూసేందుకు పెద్దఎత్తున రైతులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు తరలివచ్చారు. దీంతో సదస్సు ప్రాంగణమంతా కిటకిటలాడింది. తొలుత సీఎం చంద్రబాబుతో కలిసి బిల్‌గేట్స్‌ వ్యవసాయ ప్రదర్శనను తిలకించారు. అనంతరం వారిద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
 
Link to comment
Share on other sites

5 minutes ago, MVS said:

People told me 20 years back that there was a PERSON WHO BELIVED IN 'TECHNOLOGY FOR PEOPLE'  MORE THAN YOU DO.It was hard to believe. But when we met , he was ready with his digital equipment and thoughts for technology to be used in government. I was excited : Bill Gates

Link to comment
Share on other sites

విశాఖ: అగ్రిటెక్‌ సదస్సు ముగింపు సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ముఖ్యఅతిథిగా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌-మిలిందాగేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌, ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నారా లోకేశ్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు రైతులపై ఆధారపడి ఉందని సీఎం చెప్పారు. వ్యసాయరంగంలో నూతన ఆవిష్కరణలు రావటం సంతోషంగా ఉంది. వ్యవసాయాన్ని వ్యాపారంగా చేసినప్పుడే వృద్ధి సాధ్యం అవుతుంది. వ్యవసాయ రంగంలో మరింత సాంకేతికతను వినియోగించాలి. భారత్‌లాంటి దేశంలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. భారత్‌లోనూ సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు రైతులకు చేరువ కావాలి. వ్యవసాయంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఏపీ ముందుకొచ్చింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, మార్కెట్‌ అనుసంధానంపై ఏపీతో కలిసి పనిచేస్తాం. ఇండోనేసియాలో శాస్త్రవేత్తల పరిశోధనలు రైతులకు చేరువయ్యాయి. భారత్‌లోనూ సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు రైతులకు చేరువ కావాలి. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపునకు మరిన్ని పరిశోధనలు జరగాలి. పశుగణాభివృద్ధి, డెయిరీ రంగంలోనూ సాంకేతికత వినియోగం అవసరం. మెగా సీడ్‌ పార్కుల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. విత్తన ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా మారబోతోంది. రైతులకు భూసార పరీక్ష పత్రాలు త్వరగా చేరాలి.ఆఫ్రికాలో ఉపగ్రహ చిత్రాల ద్వారా రైతులకు భూసార పరీక్ష పత్రాలు ఇస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల ధరల సమాచారం చిన్న రైతులకు సరిగా అందట్లేదు. చిన్న, సన్నకారు రైతుల నుంచి వ్యాపారులు నేరుగా పంటను కొనుగోలు చేయాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహించాలి. వ్యవసాయరంగంలో సాంకేతికత వినియోగం రెట్టింపు కావాలి’’ అని బిల్‌గేట్స్‌ వివరించారు.

అంతకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. బిల్‌గేట్స్‌తో తనకున్న అనుంబంధాన్ని గుర్తు చేశారు. ‘‘విశాఖలో బిల్‌గేట్స్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. విశాఖ అందమైన, స్వచ్ఛమైన నగరం. మొదటిసారిగా దిల్లీలో బిల్‌గేట్స్‌ను కలిసినప్పుడు నాకు పది నిమిషాలు సమయం ఇచ్చారు. 10 నిమిషాలు సమయం ఇచ్చినా .. నేను ఇచ్చిన ప్రజెంటేషన్‌ మెచ్చి 40 నిమిషాలకు పైగా సమయం కేటాయించారు. భారత్‌లో ల్యాప్‌టాప్‌ ద్వారా ప్రజెంటేషన్‌ ఇచ్చిన తొలి రాజకీయవేత్తను నేనే. ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదిస్తారు.. కొందరు మాత్రమే అర్ధవంతంగా ఖర్చు చేస్తారు. బిల్‌గేట్స్‌ తన సంపాదనలో ఎక్కువ భాగం సమాజం కోసం ఖర్చు చేస్తున్నారు. తన సంపాదనలో వారసులకు ఇచ్చింది చాలా తక్కువ భాగం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆధునిక సాంకేతికత ఉత్తమమైన మార్గం. రాష్ట్రంలో 60శాతానికి పైగా జనాభా వ్యవసాయం పై ఆధారపడుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. వ్యవసాయాన్ని ఐటీరంగంతో అనుసంధానం చేస్తున్నాం. సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఆక్వారంగం, పశువుల పెంపకంలో అగ్రస్థానంలో ఉన్నాం. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణానదులను అనుసంధానం చేశాం. కోటి ఎకరాల్లో ఉద్యానపంటలు వేయాలన్నది లక్ష్యం’’ అని చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌.. చంద్రబాబుతో కలిసి వ్యవసాయ ప్రదర్శనను తిలకించారు.

Link to comment
Share on other sites

సాగు.. లాభసాటికావాలి
సాంకేతికతతో వ్యవసాయం సుసంపన్నం
చిన్న కమతాలతో అధిక దిగుబడులు సాధ్యం
ఆ రైతులను మార్కెట్‌తో అనుసంధానించాలి
విపత్తులను తట్టుకునే వంగడాలను సృష్టించాలి
వ్యవసాయ సాంకేతిక సదస్సులో బిల్‌గేట్స్‌
విశాఖపట్నం నుంచి ఈనాడు ప్రతినిధి
‘‘మనమంతా రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. చిన్నకమతాల్లో ఉత్పత్తి పెంచాలి. ఆ రైతులను మార్కెట్‌తో అనుసంధానం చేయాలి. దానివల్ల వారుపడ్డ కష్టానికి ఫలితం దక్కించుకున్నట్లవుతుంది. (సో దే కెన్‌ ప్రాస్పర్‌ ఫ్రం దేర్‌ హార్డ్‌వర్క్‌). ఉత్పత్తి పెంచడం రెండు విధాలుగా ఉండాలి. దిగుబడులు పెంచే వంగడాలను సృష్టించడం. అలాగే వరదలు, కరవు తదితర విపత్తులు, వాతావరణ మార్పులను తట్టుకుని ఇవి నిలబడాలి. ఉదాహరణకు వరి పరిశోధన సంస్థ రూపొందించిన ‘స్వర్ణ’ రకం. ఇది వరద నీటిలో పూర్తిగా మునిగిపోయినప్పటికీ రెండు వారాల వరకు మనగలుగుతుంది.

ఈ ‘స్వర్ణ సబ్‌ 1’ రకం వరిని ఇక్కడ లక్షలాది మంది రైతులు ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో’’

‘‘పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద దేశం. అయితే ఈ విజయం అసంఖ్యాక ఆవులు, గేదెలె చిన్న మొత్తంలో ఇస్తున్న పాలవల్ల సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల చాలా అరుదైన పశుసంపద కలిగి ఉన్నప్పటికీ చాలా తక్కువ పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అయితే సంకర ఆవులతో వీరు సంప్రదాయ అరుదైన ఆవులకంటే రెండు రెట్లు ఎక్కువగా పాలను ఉత్పత్తి చేయగలరు. నేషనల్‌ డైరీకితో కలిసిన భారతదేశంలో ఏటా ఆరు మిలియన్‌ టన్నుల పాలను ఉత్పత్తి చేయడానికి మేం సహకారం అందిస్తున్నాం’’

‘‘ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే భారతీయ రైతు దిగుబడులు పది శాతం తగ్గిపోతాయి. గోదుమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇది లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులను నాశనం చేస్తుంది, దానివల్ల ఆర్థికంగా దేశానికి నష్టమే’’
‘‘ప్రస్తుతమిక్కడున్న ఎరువుల రాయితీ చాలా ఖరీదైన కార్యక్రమం. అది కేవలం రైతుల భూమికి ఏ మాత్రం సమంజసం కాని ఎరువుల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేలా ఉంది. దానివల్ల రైతులు తమ ఉత్పత్తుల ద్వారా పెద్ద లాభం గడించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ విషయంలో రాయితీలను డిజిటల్‌ చెల్లింపులు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి రైతులు ఆధార్‌ ద్వారా డిజిటల్‌ తనిఖీ జరిగితే దానివల్ల వారి పంటలకు కావాల్సిన సరైన ఎరువులు వాడే సిఫారసులు, సూచనలు అందుకోవడానికి వీలుంటుంది. రాయితీలు నేరుగా చెల్లించడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయగలుగుతుంది.’’

సాంకేతికతోనే సాగు సుసంపన్నం అవుతుందని, రైతులకున్న చిన్న కమతాల్లోనే ఎక్కువ దిగుబడులు వచ్చేలా, ఆ రైతులను మార్కెట్‌తో అనుసంధానం చేసేలా కృషి చేయాలని మైక్రోసాఫ్ట్‌ అధినేత, బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ కో ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌ అన్నారు. విశాఖపట్నంలో మూడు రోజులుగా జరుగుతన్న
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ సాంకేతిక శిఖరాగ్ర సదస్సు ముగింపు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. చిన్న, సన్నకారు రైతులు తమకున్న చిన్నపాటి కమతాల్లోనే ఎక్కువ దిగుబడులు సాధించేలా సాంకేతిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాంకేతిక అవసరం తదితర అంశాలపై బిల్‌గేట్స్‌ చేసిన ప్రసంగం వ్యవసాయ శాస్త్రవేత్తలు, పాలకులను ఆలోచింపజేసింది. ఆయన ప్రసంగపాఠం క్లుప్తంగా ఆయన మాటల్లోనే...

‘‘ఈ మందిరంలో ఉన్నవారంతా సంపన్న భారత్‌ (ప్రాస్పరస్‌ ఇండియా) గురించి ఆలోచనలు పంచుకున్నారు. ఈ సందర్భంలో మనం తప్పకుండా వ్యవసాయ పరివర్తన (అగ్రికల్చర్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌) గురించి కూడా మాట్లాడుకోవాలి. నేనేమంటున్నానంటే జీవనాధారంగా ఉన్న సాగును అటు ఉత్పత్తిదారులు, ఇటు వినియోగదారుల అవసరాలు తీర్చే ఒక ఉత్తమమైన, లాభసాటి వ్యాపారంగా మార్చాలి. భారత్‌లో సగానికిపైగా జనాభా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడొంతుల మంది మహిళలు వ్వవసాయంలోనే జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ సగానికిపైగా జనాభా పౌష్టికాహారలోపంతో ఇబ్బందులు పడుతున్నారు. 300 మిలియన్ల మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ఈ గణాంకాలను ఒక సారి పరిశీలిస్తే చిన్న కమతాలు కలిగిన రైతులే పేదిరికంలో ఉంటున్నారు. మహిళా రైతులు కూడా సాగునే జీవనాధారంగా సాగించే పరిస్థితి కల్పిస్తున్నాం. వీటన్నిటినీ పరిశీలిస్తే వ్యవసాయ పరివర్తన అనేది భవిష్యత్తులోఎంత పెద్ద భారీ పెట్టుబడి అవుతుందనేది అర్థం అవుతుంది. మనం చిన్న కమతాలున్న రైతులను ఎక్కువ దిగుబడులు సాదింది బాగా బతికేలా చేయాలి. అలా చేస్తే దేశంలో అతిపెద్ద ఆర్థిక రంగంగా ఉన్న వ్యవసాయాన్ని ఈ దేశ ఆర్థికాభివృద్ధికి ఒక పెద్ద వనరులా మార్చవచ్చు, రెండోది ఈ వృద్ధి కూడా సమ్మిళితంగా మార్చాలి, దానివల్ల అత్యధిక దేశీయ స్థూలోత్పత్తి సాధించవచ్చు, మూడోది దేశంలో కావాల్సినంత పౌష్టికాహారాన్ని ఉత్పత్తి చేసిన భవిష్యత్తులో ఆరోగ్యకరమైన విద్యావంతదులైన శ్రామిక శక్తిని తయారు చేకగలం. ఇలా ఒకేదెబ్బకు మనం మూడు లక్ష్యాలను సాధించగలం. చైనా, దక్షిణ కొరియా, జపాన్‌లో ఇప్పటికే వ్యవసాయ పరివర్థన ఫలాలు (రిసైప్‌) రుచి చూస్తున్నాం. భారతేదేశ ఆర్థికాభివృద్ధికి ఈ పరివర్తన దోహదం చేస్తుంది.

ఇక్కడ మనమంతా రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. చిన్నకమతాల్లో ఉత్పత్తి పెంచాలి. ఆ రైతులను మార్కెట్‌తో అనుసంధానం చేయాలి. దానివల్ల వారుపడ్డ కష్టానికి ఫలితం దక్కించుకున్నట్లవుతుంది. (సో దే కెన్‌ ప్రాస్పర్‌ ఫ్రం దేర్‌ హార్డ్‌వర్క్‌). ఉత్పత్తి పెంచడం రెండు విధాలుగా ఉండాలి. దిగుబడులు పెంచే వంగడాలను సృష్టించడం. అలాగే వరదలు, కరవు తదితర విపత్తులు, వాతావరణ మార్పులను తట్టుకుని ఇవి నిలబడాలి. ఉదాహరణకు వరి పరిశోధన సంస్థ రూపొందించిన ‘స్వర్ణ’ రకం. ఇది వరద నీటిలో పూర్తిగా మునిగిపోయినప్పటికీ రెండు వారాల వరకు మనగలుగుతుంది.

ఈ ‘స్వర్ణ సబ్‌ 1’ రకం వరిని ఇక్కడ లక్షలాది మంది రైతులు ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే చాలా మంది చిన్నకారు రైతులు దశాబ్దాల కాలం నాటి పాతతరం విత్తనాలు, వంగడాలనే ఉపయోగిస్తున్నారు. కొత్త వంగడాలు, విత్తనాల వల్ల కలిగే లాభాల గురించి వారు తెలుసుకోలేకపోతున్నారు. ఆధునిక విత్తనాభివృద్ధి సాంకేతికత, డీఎన్‌ఏ విశ్లేషణ లాంటివి పంట దిగుబడులను రెండు, మూడు రెట్లు పెంచగలవు. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, బంగ్లాదేశ్‌ వరి పరిశోధన సంస్థలు ఇప్పటికే ఈ ప్రభావాన్ని నిరూపించాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే భారత్‌కు, దక్షిణాసియాకు ఒక పెద్ద విత్తన ఉత్పత్తిదారు. విత్తన పరిశోధనలు, ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా మారడానికి పుష్కలమైన అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ ఎంతోదూరం ఎదురు చూడాల్సిన పనిలేదు. జీఐఎస్‌, ప్రపంచశ్రేణి ఐటీ సదుపాయాలు, తక్కువ ధర వాణిజ్య సాఫ్ట్‌వేర్‌, డీఎన్‌ఏ పరీక్షలు, స్థానిక సాంకేతిక నైపుణ్యం మేళవింపుతో అత్యంత త్వరగా ఉత్తమ వంగడాలను సృష్టించగలదు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే మెగా సీడ్‌ పార్కు విత్తన పరిశోధనలకు ఊతమిచ్చేదే కాకుండా ఈ ప్రాంతంలో ప్రాముఖ్యతున్న వంగడాలను, ఎక్కువ దిగుబడులు ఇచ్చే వంగడాలను సృష్టించడానికి వీలవుతుంది. దీనివల్ల ఇక్కడున్న స్థానిక విత్తన కంపెనీలు రైతులు మంచి నాణ్యమైన విత్తనాలు మాత్రమే కొంటారనే నమ్మకానికి వస్తాయి.

ఇక రెండో విషయం ఉత్పత్తి పెంచడం, రైతులు ముందుగా ఏ రకం పంట సాగు చేస్తే తమ పొలంలో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు అనేది తెలుసుకోవాలి. అమెరికాలో మొక్కజొన్నకు సంబంధించి రైతులు ఏ రకం మొక్క జొన్న సాగు చేయాలనేది నిర్ణయించడానికి ముందు విత్తన కంపెనీలు పలు రకాల పరిశోధనలు చేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాసియాలో పలు ప్రాంతాల్లో ఇది లోపించింది. ఇక్కడ చిన్న చిన్న విత్తన కంపెనీలన్నీ కేవలం ఈ పాత విత్తనాలను ‘ప్రయత్నించాం, నిజం’ అనే పాత విధానంలోనే విక్రయించేస్తున్నారు.

ఒక్కసారి ఊహించుకోండి, ఏపీలో ఉన్న ప్రతి రైతు కొత్త వంగడాలను నేడున్న ఆహార అవసరాలు, ఉత్పత్తి వ్యవస్థకు తగ్గట్టు కొత్త పంటను సాగు చేస్తే ఎలా ఉంటుంది. సరికొత్త ఆవిష్కరణ విత్తనాలు, సంప్రదాయబద్ధమైన విత్తన ఉత్పత్తికి మధ్య వ్యత్యాసాన్ని ఒక సమగ్ర గణాంక విశ్లేషణ భర్తీ చేస్తుంది.
దాదాపు ఏపీలో సగమందికి పాడి సంపద ఉంది. (లైవ్‌స్టాక్‌), దీన్నుంచి మనం ఎలా ఉత్పత్తి పెంచాలనేది ఆలోచించాలి.

పాల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే ఒక పెద్ద దేశం. ఈ విజయం కేవలం చిన్నకారు రైతుల వద్ద ఉండే అసంఖ్యాకమైన పాడి ఆవులు, గేదెల నుంచి ఉత్పత్తి చేస్తున్న తక్కువ మొత్తం పాలవల్లే సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లో చిన్నకారు రైతులు అరుదైన పశు సంపదను కలిగి ఉన్నారు. అయితే వాటి నుంచి వారు కేవలం తక్కువ మొత్తంలోనే పాలను ఉత్పత్తి చేస్తున్నారు. సంకర ఆవుల ద్వారా ప్రస్తుతం వారు ఉత్పత్తి చేస్తున్న పాలకంటే రెండింతలు ఎక్కువ ఉత్పత్తి చేయగలరు.

భారత్‌లో ఏటా ఆరు మిలియన్‌ టన్నుల పాలను ఉత్పత్తి చేయడానికి ఇక్కడ జాతీయ డైరీతో మేం కలసి పనిచేస్తున్నాము. ఇందులో భాగంగా సెక్స్‌-సార్టెడ్‌ సీమెన్‌ టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువ పాలను ఇచ్చే ఆవులను ఉత్పత్తి చేయడంలో భాగస్వామ్యం అవుతున్నాం. అయితే ఈ ప్రయోగాలన్నీ పశుగణ శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో చేస్తుంటారు. అదే సందర్భంలో ఈ ప్రయోగ ఫలితాలను రైతుల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి భారత్‌లోని డిజిటల్‌ ఆర్థిక సేవలు చాలా కీలకంగా పనిచేయబోతున్నాయి. చిన్న రైతులు డబ్బును ఆదా చేయాల్సి ఉంఉటుంది, విత్తనాలు కొనడానికి అప్పులు చేయాల్సి ఉంటుంది. పాత నగదు విధానంలో వారి డబ్బు, పొదుపు అంతా అభద్రతగా ఉండేది, అలాగే అప్పులు చేయడం కూడా ఖరీదైన వ్యవహారంగా ఉండేది. అయితే ఇప్పుడు భారత్‌ డిజిటల్‌ ఆర్థిక సేవల్లో లీడర్‌గా ఎదుగుతోంది. ఏకీకృత చెల్లింపుల విధానం, ప్రపంచశ్రేణి బయోమెట్రిక్‌ గుర్తింపు వ్యవస్థ, ఇటీవలే ఆరంభించిన పేమెంట్‌ బ్యాంకులు, ప్రభుత్వానికున్న లోతైన నిబద్ధత చాలా మార్పులు తీసుకొస్తోంది. అవి కొన్నేళ్ల క్రితం మనం ఊహించనవి.

ఇవన్నీ చిన్న రైతులు సవాళ్లను అధిగమించేలా చేస్తున్నాయి. ఉదాహరణకు ప్రస్తుతమున్న ఎరువుల రాయితీ కార్యక్రమం చాలా ఖరీదైన కార్యక్రమం. ఇది రైతుల పొలాలకు ఏమాత్రం సమంజసం కాని ఎరువులు అందజేస్తున్న ఎరువు ఉత్పత్తిదారులను ప్రోత్సహించేలా ఉంది. దానివల్ల రైతులు పెద్దగా లాభాలను చూడటం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌ ఈ సమస్యను అధిగమించడానికి మొట్టమొదటగా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎరువుల రాయితీనీ డిజిటల్‌ బదలీ చేస్తున్నారు. ఒక్కసారి రైతు ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌లో తనిఖీ చేయబడితే, వారు సాగు చేస్తున్న నేలను బట్టి, పంటను బట్టి వారు ఎలాంటి ఎరువు ఉపయోగించాలో వారికి నేరుగా సిఫారసు, సూచనలు చేసే వీలు కలుగుతుంది. అంతిమంగా అది అత్యధిక దిగుబడులు సాధించడానికి దోహదం చేస్తుంది.

ఎరువుల రాయితీలను నేరుగా బదిలీ చేయడమనేది అ్యతం పారదర్శకమైందని భావిస్తున్నాను. అది ప్రభుత్వంలో అక్రమాలను తగ్గించడానికి కూడా దోహదం చేస్తుంది. ఒక్కసారి రైతులు డిజిటల్‌ ఆర్థిక సేవలతో అనుసంధానమైతే వారు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, రాయితీ చెల్లింపులను నేరుగా పొందుతారు. దానివల్ల వారి సాగు సమయం ఆదావడంతో పాటు మంచి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి వీలవుతుంది. వారు ఆర్జించిన సొమ్మును చాలా సులభంగా ఆదా చేయగలుగుతారు, భద్రపరచుకోగలుగుతారు.

రైతులు తమ పొలాల నిర్వహణకు సంబంధించి సరైన వ్యూహ రచన కూడా అవసరం. చాలా మంది రైతులకు వారి పొలాన్ని ఎలా నిర్వహించుకోవాలో  తెలీదు. తమ పొలంలో అత్యధిక లాభాలు గడించేలా ఏఏ పంటలు పెరుగుతాయి, ఏఏ ఎరువులు వేయాలి అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తున్న ‘భూసారా ఆరోగ్య పత్రం’ (సాయిల్‌ హెల్త్‌ కార్డ్‌ సిస్టమ్‌) రైతులకు ఎంతో మేలు చేస్తోంది. అయితే ఇది రైతులందరికీ చేరడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈ సమస్యను నేల మ్యాపింగ్‌ (సాయిల్‌మ్యాపింగ్‌) అధిగమించవచ్చని ముఖ్యమంత్రికి బాగా తెలుసు. ఆఫ్రికా సాయిల్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ శాటిలైట్‌ చిత్రాలతో మొట్టమొదటి సారిగా ఆఫ్రికా డిజిటల్‌ భూసార హెల్త్‌ మ్యాప్‌ మొబైల్‌ అప్లికేషన్స్‌గా రూపొందించారు. దాంతో భూసార పరీక్షల ఖరీదు ఏకంగా 97 డాలర్ల నుంచి రెండు డాలర్లకు పడిపోయింది. ఇలా కొత్త ఆవిష్కరణలతో రైతులకు మెరుగైన సలహాలు ఇచ్చే వీలుంటుంది. ‘ఎం-సేద్యం’ అనేది అలాంటిదే. ఇక్కడ రైతులకు వారి స్థానిక భాషలో వ్యవసాయానికి సంబంధించి సమాచారం అందజేయగలుగుతున్నారు.

ప్రస్తుతం చిన్న రైతులు సరైన సమాచార లేమి, ధరలు, అప్పులు, తదితర అనేక అవరోధాలను ఎదుర్కొంటున్నారు. అయితే సాంకేతికతో వీటిని అధిగమించే వీలును రైతులకు కల్పించాలి. అదే సందర్భంలో ఒక్క చిన్న రైతు కొనుగోలుదారు అవసరాలకు తగ్గట్టు పండిచలేడు. రైతులు రైతు ఉత్పత్తిదారు సంస్థలుగా ఏర్పడితే అధిక లాభాలు గడించవచ్చు. భారత్‌లో ఇప్పుడు అలాంటి ఆర్గనైజేషన్స్‌ వెయ్యి వరకు ఉన్నాయి. మహిళా వ్యవసాయదారులను మరింత ప్రోత్సహించాలి. మామూలు రైతులు సాగుచేస్తే వస్తే ఫలితాలకంటే మహిళా రైతులు సాగు ద్వారా సాధిస్తున్న దిగుబడులు 30 శాతం ఎక్కువ ఉన్నాయి. బీహార్‌ ప్రపంచ బ్యాంకుతో కలిసి మేం ప్రారంభిచిన ‘జీవిక’ కార్యక్రమం ఇదే తెలియజేసింది. గత ఆర్ద శతాబద్దంలో భారత్‌ వ్యవసాయంలో అద్భుతమైన ఉత్పత్తులు సాధించింది. అయితే అదే సందర్భంలో పెరుగుతున్న జనాభా, పౌష్టికాహార లోపం, వాతావరణ మార్పులు లాంటి పలు సమస్యలను కూడా అది ఎదుర్కొంటోంది.

ఒక శాతం ఉష్ణోగ్రత పెరిగితే వరి ఉత్పత్తి 10 శాతం క్షీణిస్తుందని అంచనా వేశారు. ఇగ గోధుమ పరిస్థితి మరింత దారుణం. అది అంతమంగా లక్షలాది మంది చిన్నకారు రైతులను నాశనం చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఈ సవాళ్లను అధిగమించి, 2022కు రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యం సాధించాలంటే ఆధునిక సాంకేతి ఆవిష్కరణలు అవసరం. ‘ఇందులో నాకేమీ ఆశ్చర్యంగా లేదు. ఎందుకంటే నేను సాంకేతికత శక్తిపై ఆపారమైన నమ్మకం కలిగిన వాణ్ణి కాబట్టి’.

ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మీకు స్మార్ట్‌ పద్దతుల్లో సాంకేతిక ఉపయోగించే ప్రభుత్వం ఉంది. ఉదాహరణకు డిజిటల్‌ డ్యాష్‌బోర్డులు తీసుకోండి. గణాంకాలను ఇంటిగ్రేట్‌ చేయడం వల్ల వ్యవసాయానికి సంబంధించి ఒక సమగ్ర చిత్రం వస్తుంది. అది ఆ రంగంలో సమగ్ర విధానాలు తీసుకురావడానికి దోహదం చేస్తుంది. అది చంద్రబాబు నాయుడు దార్శనికతలో ఒక భాగం మాత్రమే. అయితే అదే సందర్భంలో దానికి తగ్గ మౌలిక సదుపాయాలు కూడా కల్పించడానికి ప్రభుత్వం వెచ్చించాల్సిన అవసరాన్ని ఆయన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. అది అంత సులభమని ఎవరూ అనడం లేదు. అయితే ఒక ప్రభావవంతమైన రాజకీయ నాయకత్వం, సరైన సాధనాలతో ఈ రాష్ట్రంలోని 1.40 కోట్ల చిన్న కారు రైతులను వ్యవసాయ పరివర్తన చెందేలా చేయవచ్చు. అలా చేయడం వల్ల ఈ రాష్ట్రం దేశానికి, ప్రపంచానికి ఒక ఆదర్శం అవుతుంది.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...